Monday, May 20, 2013

శ్రీ వేముగంటి హనుమంత రావు Vemuganti Hanumantha Rao


యలబాక  కీర్తి శేషులు శ్రీ వేముగంటి హనుమంత రావు  గారి స్మృతి గా--
లక్షెట్టి పేట సాంబ శివ రావు తాత గారు  రాసిన  కవిత  -

కరమున  బంగారు గడియారమును  దాల్చు - అతడే మా హన్మంత రావు బావ
నుదుటను  ఉర్ద్వ పుండ్ర ములను  ధరి యించు  --ఆతడే మా హన్మంతరావు  బావ -
ఖద్దరు ధోవతి   లాల్చి  ధరియించు నతడే --మా బావ  హన్మంత రావు ------------౧
   పీట మీదట జూచిన వ్యక్తీ యు  నితండే-- చెల్లె నిచ్చెను ముద్దు మురిపెముల -
పంచె చెవుల నెల్ల గాప్పించు కొనియె --మరపు  రాదోయ్ -మదిలో   నీ మధుర  స్మృతులు ---------౨
హన్మంత రాయుడా ! అని పిలువా --అమ్మా -!అని పలుకు గొంతు  బొంగురు పోయే  నేడు
':  ::::::        :::      :::    ::   :   అన్నయ్యా -!అని పలుకు దాగి పోయే
:::::       ::::       :::       :::   ::::అక్కయ్యా ! అని పలుకు గొంతు  ఆగిపోయే
బుచ్చి అన్నయ్యా !అని  చెల్లెల  మాటకు మారు  మాతాదవేమి నేడు !
 ఇంట  మందిలో ఇందులో నీవు లేవు --ఇందరున్దియు  ఇందులో  ఇంత లోటు
కలత  చెందెను  డెందమ్ము  వెతల నొందె-- మరపు  రాదోయి మదిలో నీ  మదుర  స్మృ తులు ---------౩
విష్ణు  భక్తుడు  -విమల చారిత్రు డితడు --సత్ప్రవర్తను  డితడు   సం శీలు డితడు
బందు  జన ప్రియు డితడు  సత్బందు వితడు -----------------------------------------౪
ప్రిథ్వి  ప్రిథ్వి లో  జలము  జలము నను గలిపె--అగ్ని  అగ్నిలో  వాయు  వాయు వనగే
ఆకసము  ఆకసము నందు -అనగే ఆత్మా  ఆత్మలోన --మదిని  మదిలోన నిండే నే  మధుర  స్మృ తులు
                                        మిక్కిలి  ప్రేమతో  అర్పణ
                                        ----------------------------
గుడురి సాంబ శివ రావు  లక్షెట్టి పేట --
బహు ధాన్య నమ సం :: మాఘ శుద్ధ  తదియ -బుధ వారము -౨౦-౦౧-౧౯౯౯

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...