May 17, 2020
భూమిపై గల ,,,లక్షలాది అమాయక ప్రాణాలను,అన్యాయంగా తన పొట్టన బెట్టుకున్న ఈ మహమ్మారి కరోనా దెబ్బకు,తట్టుకోలేక ఎవరూ కూడా ఇల్లు కదలడం లేదు ,!
వదలడం లేదు !
అయినా , బ్రతుకు దెరువు కోసం ఇంటిని వదలక తప్పదు కదా !
కూర్చుని తింటూ ఉంటే గుట్టలు కూడా తరిగి పోతా యి అంటారు,,
అందుకే , ఇంటి పై , ఇంతి పై ,దేనిపై కూడా
అతిగా దేనిపై వ్యామోహం పెంచుకో వద్దు !
మమకారం తగ్గించాలి ,,
ఎందుకంటే అవి నీకు దూరం కాక తప్పదు ,!
దానికోసం విలవిలా కొట్టుకుంటూ,, ఏడవకా తప్పదు !
ఎందుకొచ్చిన బాధ ??
,, ,పెద్ద తనం వచ్చాక ,ఇక తమ పిల్లల పై ఉన్న" వ్యా మోహం " తగ్గించు కోవాలి , కన్నవారు !!"
"" కరోనా రోగం" అంటుకుంటు ఉందని ,
""ఎక్కడి దొంగలు అక్కడనే గప్ చుప్ !""అంటూ ఎవరి ఇళ్ళల్లో వాళ్ళను బంధించి వేస్తోంది ,!" మన " ప్రభుత్వం !
మార్కెట్ లో తిరిగే పదిమందిలో"" ఈ కరోనా బూచి గాడు ""ఎవ్వరో మనకు ఎలా తెలుస్తుంది ??"" చెప్పండి ??
వాడి మొహం మీద రాసి ఉండదు కదా !""
అందుకే ""లోగుట్టు పెరుమాళ్ ల కు ఎరక""!"" ""అంటూ , ఉంటారు పెద్దలు !
ఇప్పుడు అందరూ కరోనా ఘరానా "" దొంగలే!!"."
అందరం చిన్న పిల్లల వలె , ఆడుతున్నాం hide and seek ,game !!""
ఆ దొంగకు చేతికి దొరికింది తీసుకెళ్తాడు ,జాగ్రత్తగా !
ఈ కరోనా దొంగ మాత్రం ,అందరికీ , "మా వాడు,, నీ వాడు"" అనకుండా , అమాంతంగా మనిషి నే మాయం చేస్తూ ఉన్నాడు !!
ఏ మాత్రం పక్షపాత బుద్ధి లేకుండా ,సమానంగా పంచి పెడుతూ ,ఉంటాడు ",కరోనా రోగం ""అనే తన ప్రసాదాన్ని !!"
ఇపుడు రెండు వర్గాలు ఏర్పడ్డాయి
. 1__చేతకాని వాళ్ళు
2_ ,,చేతనైన వాళ్ళు __
అంటే పిల్లలు పెద్దలు ఒక తెగ !
పడుచు వాళ్ళు మరొక తెగ !! అలా
రెండు తెగలు గా
ఏర్పాటు అయినాయి !
అయినా
ఎన్నడో ",మేము "" మీ నుండి వేరు పడి పోయాము ,!
,ఇపుడు ప్రత్యేకంగా ""మీరు దూరంగా ఉండండి ,!" అని మమ్మల్ని అనే అవసరం మీకు లేదు !
మా వల్ల మీరు ఇబ్బంది పడుతూ , మాట జారే అవకాశం మీకు ఇవ్వకుండా ,మా జాగ్రత్త లో మేము ఉండటం పెద్దరికం నిలబెట్టు కోవడం , మాకు మంచి సంస్కార లక్షణం కదా !
ఇది మనవారు అనుకున్న ఆత్మీయులు ప్రేమతో మనకు ఇచ్చిన తీర్పు !""
____ఇక కరోనా ఇస్తున్న తీర్పు చూడండి !
""మా ఇంట్లోకి ఎవరూ రాకండి ,,!
మేము కూడా రాము !
మీరు కూడా మా ఇంటికి రావాల్సిన పని లేదు ,!""
ఉన్నాయిగా ఫోన్ లు !,
ఎంతసేపు మాట్లాడినా ఫర్వాలేదు ,!
, అంతే గాని ,,రావడం ,పోవడం కుదరని పని !
మీరు ఎప్పుడు ఫోన్ చేయమంటే అప్పుడు చేస్తాం ,!
సరేనా !!
ప్రస్తుతం ,ఇది కరోనా మహమ్మారి ఇస్తున్న తీర్పు !
ఎవర్ని ఎవరు ఎంత దూరంలో ఉంచినా , ఈ కరోనా ను మాత్రం దూరంగా ఉంచే దమ్ము ఎవరికి ఉండడం లేదు కదా !
ఇష్టం ఉన్నా ,లేకున్నా , కొన్నాళ్ళు ,
చచ్చినట్టు దానితో మనం కలిసి బ్రతకాల్సిందే కదా !
,మా పిల్లలు, వారు పెద్దవాళ్ళు అవుతూ నే మా ఇద్దరినీ , తమకి దూరంగా ఉంచేశారు ,!!
లేదు !లేదు !;
మేమే వారికి దూరంగా,, వేరుగా ఉంటున్నాం !"
అందుకే ,ఇపుడు ఏ ఊరిలో , ఏ నగరంలో ,చూసినా , మారుమూల గా, ,ఒక ఇంటిలో తల దాచుకుంటూ ఉన్న ,ఒక ముసలాయన ,,ఒక ముసలావిడ దంపతులు నవ్వుతూ దర్శనం ఇస్తూ ఉంటారు ,, అది దంపతుల లాగా !
,పెళ్లి అయ్యాక ఎలా ఉన్నారో ,వృద్దాప్యం లో కూడా అలాగే ఇద్దరు ,,ఒకరికొకరు తోడుగా ఉంటూ ,కష్టాలు ,నిష్ఠురాలు భరిస్తూ ,జీవిత చరమాంకం లో ,ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ,కష్టాలను ఇష్టాలుగా భరిస్తూ,, బ్రతుకు ఈడుస్తూ ఉన్నారు ,!
ఈ దశ జీవితంలోఎవరికైనా తప్పదు కదా !!
నిజానికి ,,మనిషిలో ఉన్న ప్రతిభ బయట పడేది , ఈ ఒంటరి పోరాటం వల్లనే !
ప్రతి వాడిలో ప్రజ్ఞ ,దైర్యం ,ఆత్మ విశ్వాసం దాగి ఉంటాయి ,!అవి బయట పడటానికి అవకాశం రావాలి !
పుట్టుకతో ఎవ్వరూ భీరువు కాదు ,!
అందరూ అద్భుతమైన తెలివితేటలు కలవారే !
కష్టాల్లో , మునిగి పోతూ ,,ఇబ్బందులు ఎదురైనపుడు ,జీవితంలో అనుకున్నది జరగనప్పుడు ,ఆత్మీయులు పోయినపుడు ,ఇలా మానసిక క్షోభ కు గురి అయినప్పుడు ,వివేకం శూన్యం అయ్యి "",నేను ""చేతకాని వాడిని!"" అనుకుంటాడు ,!
__మనసు గట్టి చేసుకుని దైర్యంగా ,,పరిస్తితులకు ఎదురొడ్డి నిలిచే వారికి ,ఈ సమస్యలు ఉండవు !
అలాంటి ధృఢ సంకల్పం కలవారి ముందు నిలబడలేక అవి భయపడి , దూరంగా పారి పోతాయి ,!!
ముఖ్యంగా ,పెద్దతనంలో తమ కొడుకుల ,,కూతుళ్ళ కుటుంబాలకు దూరంగా ఉండడం అనేది ,,తలిదండ్రులు చేయవలసిన తెలివైన పని ,!""
అలా ఎవరి నెత్తి మీద వారి చేతులు పెట్టుకునే పని అప్పగిస్తే ,,,,, వారికి బాధ్యత తెలిసి వస్తుంది !
,జ్ఞానోదయం ,,అవుతుంది !!క్రమంగా తమ కుటుంబ ఆదాయం పెంచుకుంటూ , వారు ,,తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రయత్నించే చక్కని అవకా శాన్ని వారికి ఇచ్చినట్టు అవుతుంది !
,,ఇక పెద్దవారు ,పెద్ద మనసుతో , రామా కృష్ణా అంటూ
__తమ ఆధ్యాత్మిక చింతనతో , దైవ భజన ,, భగవద్గీత లాంటి పుస్తకాల అధ్యయనం తో,, ప్రశాంత జీవనాన్ని. పొందే అద్భుతమైన అవకాశం కూడా ఉంటుంది !! శక్తి,ఓపిక , తీరికా ,ఆసక్తి ఉన్నవారు ,చక్కగాసమాజసేవ లో ,,సత్సంగం లో స్వచ్చందంగా పాల్గొంటూ , ఆనందాన్ని పంచుకొన వచ్చును !!
పెరిగిన వయసుతో బాటు గా, పెరిగిన తమ జ్ఞానాన్ని సమాజానికి చేతనైనంత గా అందిస్తూ,తమ ,సేవా దృక్పతాన్ని పెంచుకునే గొప్ప అవకాశం,,, ఈ వృద్దాప్యం లో లభిస్తూ ఉంటుంది ,!
ఈ కరోనా ధర్మమా అని, ప్రభుత్వం ,తాను ఆర్థికంగా నష్టపో తూ ,,ఇన్నాళ్లూ , పౌరులను భద్రంగా ఇళ్లలో కూర్చోబెట్టి ,వారు రోగం బారిన పడకుండా కాపాడింది ,!
ఈ, కరోనా వ్యాధి బారిన. పడకుండా ,తమను తాము ఎలా కాపాడు కోవా లో ,, అనుభవం ద్వారా అందరికీ తెలుస్తోంది !""
,తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముఖాలకు మాస్క్ లు తగిలిస్తూ , ఇతరులకు అంటకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ , , ఇళ్ళ నుండి బయటకు వస్తూ ఉన్నారు ,!
స్వేచ్ఛగా బజారులో తిరుగుతు,",, ఆ కరోనా తమ జోలికి మాత్రం రాదు!""
అనే" వెర్రిభ్రమ ""తో ఎప్పటివలె, మొండిగా,జాగ్రత్తలు పాటించకుండా , వస్తూ వెళ్తూ ఉన్నారు !!"
ఇపుడు వీరు ప్రభుత్వాన్ని ఆర్థికంగా నష్టపడకుండ కాపాడే , ప్రయత్నంలో ఉన్నారు!!" ,,, వీధుల్లో అదుపు లేకుండా తిరుగుతూ !""!!
__ వాస్తవానికి మనలో ""వివేకం ,విజ్ఞానం , విచక్షణా జ్ఞానం ,!" ఉన్నాయని !!"" ఇప్పుడు చూపాలి ,
((ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా!"
Tuesday, May 19, 2020
కరోనా తో కంపెనీ ! 1
కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా
May 8, 2020
పగలే వెన్నెలా....
పల్లవి !"
____&___
"కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !!
కరుణ లేక మన వారిని చంపు చుండే రా!!"
చరణం _1
_________
"" క్షణము లోన జగమంతా పాకుచుం డేరా!
ఏ బలము తొను దీని __నిపుడు గెలువలేము రా !
ఇంటిలోనే ఉండు ట యూ,
దూరము గ నిలుచుట యూ,
ఈ రెండు దారులే తప్ప ,వేరే దారి లేదయా ,,!""
!కరోనా వచ్చే రా!!
చరణం _2
_________
"దేశాలన్నీ కలయ చుట్టి దీనదశల పాల్జేసేరా !
_బాధను చెప్పుకొనే దిక్కు లేని స్థితి చేసేరా ,!
మందు మాకు లేని ,వేరే గత్యంతర మూ కానరాని,
,ఈ
మహమ్మారి నంతు జేసే ,, మందు ను కనిపెట్టాలి రా !
!! కరోనా !!
చరణం _3
_________
లక్షలాది ప్రజల మారణ_ హోమం ,ఆపి తీరాలి,!
దైర్యం తో ,దాని ఆట
__కట్టే దారే వెదకాలి ,!
ఎక్కడో ధర్మానికి చేటు
వా టిల్లింది ,!
క్షమించమని దైవాన్ని , వేడుకొనక తప్పదు గా !"
!! కరోనా !!
చరణం _4
_________
రోజు రోజుకూ పెరిగే చావులింక చాలురా ,!
నగరాలన్నీ స్మశానాలను తలపిస్తూ, ఉన్నాయిరా!
కన్నీటికథలకు ,ఇక
ముగింపు పలక తప్పదు గ ప్రాణ రక్షణ ,కు మించిన
ధర్మం వేరే ఉండదు గా !!
!! ""కరోనా ""!!
Tuesday, April 28, 2020
భగవంతుడా ! ఏది దిక్కు ? 3
Apr 23, 2020
""హే కైలాస వాసా !,పరమేశా !
, భూమిపై గల మూగజీవా ల పై దయ నాకుంటే చాలదు ,పరమాత్మా ,, మీకు వుండాలి !
"" అందుకే మీ వద్దకు వచ్చాను ,ప్రభో!""
""ఈ మనిషి ఎంత స్వార్థ జీ వో అంటే మాటల్లో చెప్పలేము జగదీశ్వర !"
మహా క్రూరుడు !
ఇపుడు తన టైమ్ బాగా లేక , కోరలు తీసిన త్రాచు పాము వలె తన ఇంట్లో బుద్దిగా ఉంటున్నాడు ,
కానీ ,,వీడిది కుక్క బుద్ది ! నేనైతే బయటకు రానీ ,, ఈ వన్య ప్రాణుల సంగతి చూస్తాను ,,అని కసితో ,జైలు లో ఖైదీ లా ,ప్రకృతిపై పగతో ఊగి పోవడం , పళ్ళు నూరుతూ ఉండడం మీరు కూడా చూస్తున్నారు కదా. !""
"""పవిత్రమైన ,పరమ పావనమైన , ఆ గంగ, యమున ,సరస్వతి వంటి అనేక జీవ నదులను , తన తమ మల మూత్ర విసర్జన , మరియు ప్లాస్టిక్ ,అనేక చెత్త కుళ్లు పదార్థాలను అందులో వదులుతూ త్రాగడానికి వీలు లేకుండా ఘోరంగా కలుషితం చేస్తున్నాడు ,కదా ఈ నికృష్ట మానవుడు !!"
""తండ్రీ !""ఏమనాలి వీడి మితిమీరిన,,క్షమించరాని అకృత్యాలను ?""
,అంతేకాదు ! అటు చూడండి ,శంకరా !
ఆ పెద్ద పెద్ద ,కర్మాగారాల్లో వెలువడే పలు రసాయనిక విష పదార్థాల ను కూడా ఈ గంగా కృష్ణా గోదావరి లాంటి పవిత్ర నదుల్లో వదులుతూ ,,పశువులు పక్షులు జంతువులు చివరకు మనుషులు కూడా త్రాగే వీలు లేకుండా ,అపరిశుభ్రంగా చేస్తూ, ఉన్నాడు
ఒకవేళ విధి లేక ,,గతి లేక తాగితే అనారోగ్యం కారణంగా హాస్పిటల్ ,లో పడి అనేక రోగాల బారిన పడి అమాయక ప్రజలు మరణిస్తూ ఉన్నారు ,
జంతువులు హతమౌతూ ,, వున్నాయి !!"
,,""నాయనా ! నీవు ; ,ఎన్ని చెప్పినా ,మనిషి అన్యాయ అక్రమ కేసుల జాబితా పూర్తి కాదుకదా !""
ఎందుకు నీకీ కంటశోష ? చెప్పు ,
భూమి పై తిరుగుతూ , ఉండగా అతడికి కళ్ళారా చూసి ,చెవులతో విన్న ఆ జీవాల ఆర్తనాదాలు కింకరు ని కి . పట్టరాని ఆవేశాన్ని తెప్పిస్తు ఉన్నాయి ,,
""మహాదేవ మహాదేవా !! నన్ను ఆపకం డి,,మహాదేవా! నన్ను ,పూర్తిగా చెప్పనీయం డి,,!""
హే నీలకంఠ , !
ఆనాడు నీవు లోక రక్షణ కోసం , ఆ గరళాన్ని మింగి నీ కంఠం లో దాచుకున్నా వు గదా !"
ఇప్పుడు నీవిచ్చిన అద్భుత జ్ఞానం శరీరం అవకాశం తో మనిషి చేస్తున్న వాడి క్రూరమైన , పరమ నీచమైన విషచర్య లు కూడా విని గుండెల్లో దాచుకో వాలి స్వామీ !!"
""దేశానికి ,,దేశానికి , మద్య పెంచుకున్న
, శత్రుత్వం భావనతో ఏళ్ల పాటు కొనసాగుతూ వస్తున్న యుద్దాలు ,అందుకు ఉపయోగిస్తున్న ఆధునిక మారణాయుధాలు అందులో బలి అయిపోతున్న సాటి మానవుల ను కూడా లెక్క చేయకుండా ,,వేలల్లో అణు ఆయుధాలను ప్రయోగిస్తూ ,పశువుల్లా ఒకరినొకరు చంపుకుం టూ ,, తాము చస్తూ ఉన్న ఈ మనిషి దుండగాలకు ఇక అంతు లేదా ఈశ్వర ,!""
ఆ బాంబుల తాకిడికి మనుషులే కాదు , స్వచ్చమైన వాతావరణం కూడా విషతుల్యం అయ్యింది ,
ఆ ప్రాంతంలో బ్రతికే మూగ జీవాల , మనుగడ కోసం కనీసం గడ్డి కూడా మొలవడానికి వీలు లేకుండా చేస్తున్నారు !!,, ___కేవలం తమ ఆధిపత్యం కోసం మాత్రమే ,యుద్దాలు సాగిస్తూ ఉంటున్న ఈ రాబందుల ను ఎలా చూడాలి ,??" దేవా !""
"" వీరు మనుషులు !""అని పిలవడానికి సిగ్గుగా ఉంది నాకు ,!!
కనీసం ఏ జంతువు పేరు పెట్టి తిడదామని ఉన్నా , ఆ జంతువుకు కూడా అవమానం ,!
వ్యవస్థ ను ఇలా భ్రష్టు పట్టిస్తూ ,,పరమ దౌర్భాగ్యం గా , జీవిస్తూ కూడా ఏ మాత్రం అపరాధ భావన లేని ,,పశ్చాత్తాపం లేని, ఈ మనిషి జీవితం నాకు అసహ్యంగా తోస్తోంది ,ప్రభో!!""
మోసం ,,ఈర్ష్య ,,ద్వేషం , పగలు ,ప్రతీకారాలు , మద మాత్సర్యాల తాకిడికి నిబ్బరంగా ఉండాల్సిన మానవతా విలువలు ,న్యాయం ధర్మం అన్నీ మంట కల్సి పోయాయి కదా, హే పరమపితా !!
ఎన్నని చెప్పను??"
ఏది చెప్పిన ,ఎంత చెప్పినా , భరింపలేని వేదన ,బాధామయం శోకమయం , !"
అనాధలు ,వృద్దులు రోగస్తులు ,పిల్లలు ,,నాగరికత కు నోచుకోక వెనక పడిన వారు ,ఇలా ఎందరో నిర్భాగులు ఆత్మహత్యలు చేసుకోవడం ,, ఆడవారిపై అత్యాచారాలు మానభంగాలు జరగడం ,,, , , పట్ట పగటి రాజకీయ హత్యలు , , కుట్రలు ,కుతంత్రాలు , అబ్బో ఎన్నో ఎన్నో ,!!
చిత్రగుప్తుని చిట్టా కు కూడా అందని మనిషి మాయ లు ఎన్నో ఉంటున్నాయి ఈ భూమిపై , పరమేశ్వరా ,!
ఏ పేపర్లో ఏ రోజూ ఏ ప్రాంతం ఏ దేశం లో చూసినా ,అంత మనిషి సాగిస్తూ ఉంటున్న దారుణ మారణ కాండ రోజు రోజుకు పెరుగుతోంది !!"
పైకి ఏమెరుగని అమాయకం,, అజ్ఞానం నటిస్తూ , చాటుకు మాత్రం గుండెలు తీసిన బంటు లా , ఏ సమయానికి ఏం చేస్తా డో, , బొత్తిగా ఒకరిని మరొకరు నమ్మడానికి వీలు లేకుండా సమస్యల వలయంలో చిక్కుకుని,ఉన్నతమైన విలువలు గల బంగారు జీవితాన్ని ఈ మనిషి తన చేజేతులా రా దుర్భర నరకంగా మార్చుకుంటూ,, నటిస్తూ ,, బ్రతుకు తూ ఉన్నాడు. !
పాపం , ఈ మనుషులు చేస్తున్న ఘోర పాప భారం , ఆ ధరణీ మాతా ఎంత దుఖిస్తూ భరిస్తూ ఉందో కదా ,మహాదేవ ,!"
కింకరు ని కంఠం గద్గద మయ్యింది !
స్వస్తి!"
హరే కృష్ణ హరే కృష్ణా!""
( ఇంకా ఉంది )
భగవంతుడా ! ఏది దిక్కు ? 2
Apr 20, 2020
కరోనా కు కోపం వచ్చింది ,!""
"కరుణ లేని కరోనా" ""అంటూ జనం తనని నిష్టారాలు ,శాపనార్థాలు పెడుతూ ఉండడం చూసి భరించలేక కైలాస హిమాలయ వెండి కొండపై, గౌరీ దేవితో ప్రమథ గణాలతో కొలువుతీరిన భోలాశంకరుని సన్నిధి కి చేరి తన గొడునంతా వెళ్లబోసుకున్నాడు ,
""హే సదాశివ !,పరమేశ్వరా ,5!శరణు దేవదేవా !
ప్రభూ ,!""
"" శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కదలదు !""
అంటారు గదా !
భూలోకంలో ని మానవులు ,,తమ ప్రవృత్తిలో దానవులను కూడా మరిపిస్తున్నారు !
ఆకారం మనిషి !
కానీ వాడు చేయని అరాచకం , అకృత్యం లేదు ,!!
ఆ నాడు రాక్షస జాతి తమ అజ్ఞానంతో ,,అవిద్య , అనాగరికంతో చేసిన దారుణాలు ,,
ఇప్పుడు ఈ మానవులు , చేస్తున్నారు !!
, దేవా,,!మీరు మనిషికి దయతో ,ఇచ్చిన అపార జ్ఞానం ,చదువు ,,వనరులు , ఆయువు , బంధు బలహాలు సుఖ భోగాలు అనుభవిస్తూ ,, మానవత్వం మరచి ,పాపభీతి ,,లేకుండా పరమ నీచంగా పశువుల కంటే హీనంగా , భూమిపై ,,,ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నా డు !""
"" హే ,స్వామీ !!,, ఈ మనుషులు ,దేశాలు ,ప్రాంతాలు శత్రుత్వం పెట్టుకొని నిరంతరం తగాదా పడుతూ , దాడులు చేస్తూ,, పరస్పరం చంపుకుంటూ ,,ఉన్నారు !!"
"వావి వరుసలు లేవు !,బంధుత్వం లేదు! ,స్నేహం అని లేదు ,!పెద్దవారు ,కన్నవారు ,అన్నది లేదు !
బాలలు ,చిన్నపిల్లలు వృద్దులు అన్న కనికరం లేకుండా హింసిస్తూ ఉన్నారు !
అనుబంధాలు , ప్రేమలు మరచిపోతున్నారు !""
ఏం చెప్పను స్వామీ ,??""
చంపడం , లేదా చావడం మామూలు విషయం అయిపోయింది వీరికి !""
అన్నను తమ్ముడూ ,తల్లిని కొడుకు ,భార్యను భర్త ,సంబంధాలు ,బంధువులు ,అని చూడకుండా అస్తి కోసం , మాట పట్టింపు కోసం దూరం అవుతున్నారు !""
,బంగారం లాంటి తమ మానవజీవితాన్ని మట్టి పాలు చేస్కుం టూ వున్నారు !!
, ఇలా బాధతో చెబుతూఉన్న కరోనా ను చూసి ,, ఈశ్వరుడు అన్నాడు
,"" నాయనా !,ఇది కలియుగ ధర్మం!
,బుద్దిని సక్రమంగా ఉపయోగించు కొకపో తే,, వారికే నష్టం,, కష్టం కూడా ,,!"
,ఇందులో నువ్వైనా ,,నేనైనా ఎం చేస్తాం చెప్పు??
ఎవరు చేసిన ఖర్మ వారే అనుభవించాలి,,మరి !""
కింకరునికి బాధ అనచుకొలేకుండ పోతున్నాడు !!"
""హే దయానిధి ,!
నీకు తెలియని విషయమా ,,ఈశ్వరా,!?
ఆ నాడు దక్షుడు నీతి నియమాలు ఉల్లంఘించి ,నిరీశ్వర యాగం తలపెట్టి ,అహంకరించి నీ ఆగ్రహానికి గురయ్యాడు ,! చివరకు తన కూతురు ,,మీ అర్ధాంగి అయిన సతీ దేవి తన యోగాగ్నిలో మీకు ఆత్మ సమర్పణ చేసుకుంటూ హతమైంది కదా !""
మీ కోపాగ్నికి గురియై , వాడికి ,,వాడికి వంత పాడిన వారంద రికీ ,,తగిన గుణ పాఠం చెప్పడానికి మీరు వీర భద్రుని సృజించారు కదా , స్వామీ,!""
""అవును ,! నిజమే ,కానీ ,ఇపుడు ఆ కథ చెప్పే అవసరం ఏమిటి , ,??""
కరోనా చెప్పుకు పోతూ ఉంది ,
""ఉంది మహాప్రభూ!,
అంతటి దారుణాలు అకృత్యాలు :ఇప్పుడు మానవులు చేస్తున్నారు !!
భూమిపై మీరు దయతో సృజించిన సమస్త ప్రాణికోటికి ఈ మానవుడు ముప్పు తీసుకొస్తూ ఉన్నాడు ,,దేవరా ,!"
స్వస్తి!"
హరే కృష్ణ హరే కృష్ణా !"
( ఇంకా ఉంది)
భగవంతుడా ఏది దిక్కు ?
Apr 20, 2020
మహాదేవా,,!
ఇక ఆ దేశంలో ,, అయితే ,, స్వామీ !
""దేవా !,ఏమని చెప్పను,, వారి తిండి విధానం ??"
వారు తినని జంతువులు లేవు!,ఘోరం! ఘోరాతి ఘోరం !"
. ఏమిటంటే ప్రాణులను ,మృగాలను ,జల చరాలను , ఆవి ,బ్రతికి ఉండగా నే ,,రాబందుల్లా పీక్కుతిం టూ ఉంటారు ,!
వాళ్ళు తినని జంతువు లేదు, ప్రభో,!
ఒక్క మనిషిని తప్ప !""
భూమి పై ఉన్న
కుక్కా, నక్కా, పంది, పాములు, ఎలుకలు ,,పశువులు ,, క్రూర మృగాలను, బల్లి , కప్పా ,లాంటి ప్రాణులను క్రమం తప్పకుండా నిత్యం ఆరగిస్తు ,అందులో పరమానందం పొందుతూ ఉన్నారు !!""
""ఈశ్వరా !
ఇక కనీసం నీళ్లలో బ్రతికే ఏ ప్రాణిని కూడా,, విడిచిపెట్టకుండా తింటారు!
""స్వామీ !,,
నీవు పుట్టించిన ప్రతీ ప్రాణులను , వారి కంటికి కనబడితే చాలు ,!
అదే తినడమే పనిగా పెట్టుకొని, మారణ కాండను సాగిస్తూ ఉన్న వారిని చూస్తుంటే , నా కోపాన్ని ఆవేశాన్ని ఆపుకోలేకపోతున్నాను !"" వారికి తగిన శాస్తి చేయాలని ,, మీ అనుమతి కోరకుండా ఈ కింకరు డు చేసిన ఈ చిన్న తప్పిదానికి ,,నన్ను క్షమించమని ప్రార్థిస్తున్నాను,
మహాదేవ, దేవాది దేవా!"
సదాశివుడు మందహాసం చేస్తూ ,,
అయితే ,నీ ఈ అవతార క్రమానికి,,, ఆ మానవులు "కరోనా "అని బిరుదు తగిలించారు!"" అవునా??""
కింకరుడు తన తప్పు ఒప్పుకుంటున్నా ట్టుగా ,,తల వంచుకున్నాడు ,,
"" అవును ,శివ శంకరా! అభయంకరా ,!
ఈ విశ్వంలో ,,నీకు తెలియని విషయం ఉంటుందా , శివా?"
అయితే
ఇంతకూ ,, నీ ఈ దెబ్బకు వారికి బుద్ది వస్తుంది అంటావా ?
కింకరు డు ,తల అడ్డంగా ఊపు తూ ,సాష్టాంగ ప్రణామం చేశాడు ,,
""హే పరమేశ్వరా ,!
ఆ మానవుడు అంత తొందరగా మారే వాడు కాదు ,, స్వామీ,!
వాడికి వెనకచూపు లేదు !
పశ్చాత్తాపం లేదు !
పాపభీతి కానరాదు !
తాను పుట్టిస్తున్న ఆధునిక సాంకేతికత తో మితిమీరిన అహంకారం ,మదం ,ఈర్ష్య ,లతో రోజు రోజుకూ మృగంలా తయారవుతున్నాడు ,!!
వాడిని ఎన్నడూ నమ్మరాదు !!
తేనె పూసిన కత్తి!""
మేక వన్నె పులి !!
మోసం ద్వేషం పగ ,, ఇవన్నీ వాడి రక్తంలో జీర్ణిం చి ఉన్నాయి !
పులి ,సింహం ,ఏనుగు లాంటి ఏ క్రూర మృగాలను అయినా నమ్మవచ్చు నేమో గానీ ,,
ఈ నర రూప రాక్షసుని నమ్మలేం శంకరా ?""
శివయ్య కు జాలి కలిగింది ,తన కింకరు ని దీనా వస్తను చూసి,,
,,నాయనా !ఇంకా నీ మనసులో ఏదో చెప్పాలని ఉంది , సందేహించకుండా చెప్పు !!""
కింకరు డు కైలాస నాథుని పాదా లకు తన నుదురు తాకించాడు !
, చేతులు మోడ్చి నమస్కారం చేస్తూ ,,అన్నాడు
""హే శంభో శంకరా ,! మానవుడు అధర్మ మార్గాన్ని అనుసరించడం ,వల్ల సంభవించే దుష్పరిణామాలు చూసి ,,పరమాత్ముడు, కృష్ణుడుగా స్వయంగా అవతరించి ,, పాపాత్ము డైన ఆ దుర్యోధనునికి ,, ఆ దుష్ట చతుష్టయం కు,,వారికి సహకరించిన పద్దెనిమిది వేల అక్షౌహిణుల ను ,నిలబడి అర్జునుడి చే హతమార్చాడు !!""
తాను మాత్రం కేవలం రాక్షస జాతి అంతానికి పరిమితం అయినాడు !!""
ఎంత అధర్మం చేసినా
మనుషులను చంపే సాహసం చేయలేదు కృష్ణుడు !""
ఏనాటికైనా బుద్ది రాకపోతుందా అని అవకాశం ఇచ్చాడు గోవిందుడు !"
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా!"
("ఇంకా ఉంది )
Sunday, April 19, 2020
మానవ మృగాలు
Apr 19, 2020
ప్రస్తుతం మనల్ని నీడలా వెంటాడుతూ ,వేటాడుతూ ,వేటు వేస్తూ ,, దినదినము ,,తన బలగాన్ని పెంచుకుంటూ , ,దొరికిన వారిని దొరికినట్టు గా హతమారుస్తూ , లక్ష నర మందిని అన్యాయంగా పొట్టన నెట్టుకుంటూ ఉంటున్నా ,ఈ విపరీత పరిస్థితుల కుకారణము ""ఇది "!
అని ఎవరూ ఖచ్చితంగా తెలపడం లేదు ,!;""
ఎవరికి దోచి నట్టుగా వారు అనుకోడం తప్ప,,ఎలా వచ్చింది ?ఎలా వ్యాప్తి చెందుతోంది ??""అనే విషయం ఎవరికీ ,,తెలియడం లేదు !;""
ఎక్కడైనా " దారుణ మారణ కాండ "" జరిగితే "",దీనికి కారణం మేమే!"" అంటూ ఉగ్రవాద సంస్థలు ఒక ప్రకటన చేస్తూ ఉండేవి ,!;""
కానీ ఈ కరోనా ఉత్పాతానికి ,,""మేము కారకులం!""
అని ఏ దేశం , ఏ తీవ్రవాద సంస్థ కూడా ముందుకు రావడం గానీ ,ఒప్పుకోవడం గానీ లేదు ,!"""
కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తికి ,, కారణం ఏదైనా ,కారకులు ఎవరైనా ,""మనిషి యొక్క ఆకతాయి తనం ""అని తెలుస్తోంది ,,అందరకూ !!""
__అతడు విచ్చల విడి తనం , పిచ్చి రాక్షస తత్వం ,హద్దులు లేని హింసా ప్రవృత్తి నేడు ఈ అంతుపట్టని వ్యాధి ద్వారా ,మనకు బయట పడుతోం ది ,!!""
మనిషి చేస్తున్న ఈ అకృత్యాలకు
ప్రకృతి మాత అసహనం ,,ఇలా బయటపడుతోంది !!""" గుండెల్లోంచి పొంగుతూ ,కట్టలు తెంచుకుని వస్తున్న ఆమె ఆవేశం ,,ఆక్రోశం ఉగ్ర రూపంలో ఇలా వెలువడు తూ ఉందనీ,,,
మనకు అర్థం అవుతుంది !!""
అది ఈ కరోనా రూపంలో ఉదృతంగా ప్రచండ స్వభావంతో చెలరేగు తూ ఉందనీ మనకు తెలుపుతూ ఉంది !""
పరమ శివుని ఆధ్వర్యం లో స్మశానం ,అంటే రుద్రుని ఆనంద నిలయం ,,లో ,,కోట్లాది ప్రమథ గణాలు భూత ప్రేత పిశాచ శాకిని డాకిని లాంటి శక్తులు నియంత్రణ జరుగుతూ ఉంటుంది ,!!""
నేటి మానవుడు భూమిపై చేస్తున్న ఘోరాలు చూస్తూ ఉంటున్న పరమశివుని ప్రమథ గణం లోనీ ఒక కింకరు ని శక్తి , యొక్క ప్రళయ తాండవ నృత్యం ఈ కరోనా మహమ్మారి ""అకాల ఆగమనం """
అని అనుకోవ చ్చు ను !!,
స్మశానం లో రుద్రుడు ఇలాంటి కనిపించని శక్తులను నియంత్రిస్తూ ,అవి భూమిపై కి రాకుండా ,మానవుల పై దాడి చేయకుండా ,చేయడం వలన ,శివునికి ,భూత నాథుడు అనే పేరు వచ్చింది ,
ఎక్కడో ,ఎప్పుడో ఎన్నడో ఎవరికో అన్యాయం , ఈశ్వరుడు కూడా భరించలేని ,, క్షమించరాని ,,ఘోర అపరాధం ఈ మనిషి వలన జరిగింది !!!"" అనిపిస్తూ ఉంది !!""
,తప్పులు అపరాధాలు , ఏ జాతి మూగ ప్రాణులు కూడా చేయలేవు కదా !!""
పులి సింహం ,లాంటి ఏ క్రూర మృగాలు కూడా చేయలేని దారుణాలు , ఈ మనిషి వల్ల జరుగుతున్నాయి !!జరిగాయి కూడా !!"""
నోరు ఉంది కదా అని,ఇష్టం వచ్చినట్టు గా మాట్లాడుతు శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాడు అందరితో !!""
,,తన
తెలివి తో ,,అద్భుతమైన జ్ఞానం తో ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్లగలిగే పరిజ్ఞానం తో ,మానవత్వ సుగంధ సౌరభాలను వెదజల్లే బదులు , ద్వేషం ఈర్ష్య ,కోపం ,పగ ప్రతీకారాలు విష జ్వాలల రూపాల్లో తోటివారి ప్రతిభ ఓర్వజాలక ,,విలయ తాండవం చేస్తూ , ధరణి మాతకు కోపం తెప్పిస్తు. ,, ప్రకృతి మాతకు సంయమనం కోల్పోయేలా ,చేస్తున్నాడు , సాంకేతికత ,ఆధునికత సంతరించుకున్న నేటి మనిషి , !;"""
రుద్రునికి కోపం వస్థే ,మూడవకన్ను తెరిస్తే , సర్వం కాలి భస్మం అవుతూ ఉంది
ఇక అలాంటి రుద్రుని ప్రతిరూపాలు ప్రమథ గణం లో ఒక ప్రేత కరోనా రూపంలో ,స్మశానం నుండి బయటకు వచ్చి, , చేస్తున్న కరాళ నృత్యం ,,,,,అదుపు చేయలేని ,,నేటి కరోనా వైరల్ ప్రభావం ఇది ,,అని అనిపిస్తూ వుంటుంది !"""
ప్రకృతి కి సహజంగా ఉండాల్సిన నియమాలలో సంతులనం కొరవడింది !"
ఆ తప్పు ఈ మానవాధముడు తోనే జరిగింది ,నేరస్తుడు వీడే !"",,
__ఒక దేశం మరో దేశాన్ని ,ఒక మతం మరో మతం వారిని ,,మత వ్యాప్తి కొరకు ,సామ్రాజ్య విస్తరణకు ,దురాపెక్షతో చంపడం అనేది ,పశువుల వలె ,ఒక వృత్తిగా కొనసాగిస్తూ ఎవరికి ,శాంతి లేకుండా ,,అంతటా హింసాకాండ కొన సాగిస్తూ ఉన్నా డు ,,మనిషి !""
,ఇలా ఏదో ఒక వంకతో సాగిస్తున్న మనిషి పశు ప్రవృత్తి కి చరమగీతం పాడేందుకు అవతరించిన ప్రళయకాల ,""వీరభద్ర స్వామి """రూపమేమో ఈ కరోనా అనిపిస్తూ వుంటుంది , ఒక్కొక్కసారి !""
మనుషులు ఇప్పుడు రోడ్లపై కి రావడం లేదు ,!!
పాపం , ఇన్నాళ్ళు ఈ మానవ మృగా లకు భయపడుతూ ఎక్కడో నక్కి నక్కి నివసిస్తూ ఉన్న మూగజీవాలు పక్షులు ,ఇప్పుడు స్వేచ్చగా బయటకు వస్తున్నాయి ,!!
ఆనందంగా ఊపిరిని పీల్చుకుంటూ తిరుగుతూ ఉన్నాయి , !!""
తన కంటికి కనబడితే చాలు , చంపి ,రక్తం పీల్చి,,దాని పచ్చి మాంసం మృగం వలె తింటూ , మృగ జాతి లేకుండా చేస్తూ ఉన్న ఈ మనుషులు,,
ఇప్పుడు , ఈ కరోనా దయవల్ల ఖైదీలు గా ,తమ తమ గృహాల్లో స్వచ్చందంగా నిర్బంధించ బడ్డారు ,!!""
ఇన్నేళ్లు తమ జీవనంలో కనీ వినీ ఎరగని స్వేచ్ఛను ప్రసాదించి , ఈ మానవ మృగం బారినుండి విముక్తి ని అందించిన ఆ కరోనాకు అవి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా యేమో కదా !""
అనిపిస్తూ ఉంది ,!!"
వాతావరణం కాలుష్యం తగ్గి , ఓజోన్ పొర మందంగా ఉండటంతో ,ప్రకృతి మాత తన హర్శాన్ని అనందాన్ని ప్రకటిస్తూ , స్వచ్చమైన ప్రాణవాయువు తో సమతుల్యాన్ని పొందుతూ ఆనందంగా ఉంది , అనిపిస్తూ ఉంది !!""
ఒకరికి వినోదం ,మరొకరికి ప్రమాదం ,!
ఇది విధి ,,తన లీలగా ఆడించే నాటకం , !""
స్నేహం తో ,ప్రేమతో , హస్తాన్ని అందించే మానవుడు ,,,, అణువు లను ఆయుధాలుగా మారుస్తూ ,నర హంతకులు గా మారితే ,,కరోనా కే కాదు ,గదిలో వేసి కొడితే చిన్న పిల్లికైనా కోపం వస్తుంది కదా !""
పులి పులిని చంప దు,,
కానీ , ఈ మనిషి మరొక మనిషిని చంపుతూ ఉంటాడు ,
కాలాలు ,మారినా ,యుగాలు ,తరాలు మారినా ఈ మనిషికి ఉన్న ఓర్వలేని తనం మాత్రం పోవడం లేదు కదా !
ఎంత విజ్ఞానం ,వనరులు ,మాట్లాడే శక్తి ,యుక్తులు ఎన్ని ఇస్తే మాత్రం ఏం లాభం !""
మనిషి కంటే పశువు నయం ,,అంటే ,మనిషికి కోపం రాకపోవచ్చు
కానీ పశువుల ఆత్మాభిమానం దెబ్బ తింటుంది కదా !
ఈ వెధవ కూ , మాకు పోలికా ,, చీ,, చీ చీ c,అని ఈస డించు కోవూ ?"""
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""
A Drama that became Real!
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
May 8, 2020 పగలే వెన్నెలా.... పల్లవి !" ____&___ "కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !! కరుణ లేక మన వారిని చంపు చుండే రా!!...
-
May 27, 2020 ఈ గోపికా స్త్రీలకు శ్రీకృష్ణుని పట్ల గల ఆ ఆరాధనా భావం ఎలా కలుగు తోంది? భర్తా పిల్లలు అత్తా మామలు బంధువులు,సంసార బాధ్యతలు , ఇ...