Showing posts with label కరోనా వైరస్. Show all posts
Showing posts with label కరోనా వైరస్. Show all posts

Sunday, September 13, 2020

కరోనా దుమారం

Sept 11, 2020
_!"హలో , ,హలో _!
ఎవరూ మాట్లాడేది ?
ఓహో నీవా _?, నరేష్_! బావున్నా వా ? మీరు, మీ భార్యా పిల్లలు  బావున్నారా _?
ఏమిటీ విషయం ,? నాకు ఎందుకు ఫోన్ చేశావు ?
ఏమిటీ ,? ,మన  దగ్గర బంధువు లక్ష్మన్ __ ఆయన !.  మొన్నటివరకు మనమంతా  కలిసి ఉన్నాం.  కదా _?
పాపం ,,ఆయనకు వచ్చిందా కరోనా ? నిజమా  ?  అయ్యో ,పెద్దాయన __!  కాస్తా కనిపెట్టాలి మనం వారిని _!
_! నాకు  ఇపుడు నీవు చెప్పే దాకా  ఆ విషయం తెలియదు సుమా _!
  మేము  అతడితో ఎక్కడికి వెళ్ళాం _?
మేము  వెళ్ళలేదు   _! నాకు ఈ ఉద్యోగం తో నే బిజీ _!
అసలు ,,ఒక ఆదివారం తప్ప తీరిక ఉండదు కదా_ ఎక్కడికైనా పోవడానికి _!""
ఇవి అసలే కరోనా రోజులు _!""
సరే ఇంతకూ అసలు విషయం చెప్ప నే లేదు నీవు _! ఎందుకు ఫోన్ చేస్తున్నావో _?
ఏమిటీ,? నాకు వచ్చిందా కరోనా ? అని ఎవరు చెప్పారు _?
నీ కు 
  _తెలిసిందా  ,ఎవరో అనుకుంటే _??
__మా బంధువు ఎవరికో   __ కరోనా సోకితే , వాడికి సంబంధించిన చుట్టాలు అయినందుకు మాకు  అందరికీ వచ్చినట్టే ,అనుకున్నావా _?
భలే చిత్రంగా ఉంది ,__నీవు ఈ మాట చెబుతూ ఉంటే _!
ఆ ఫంక్షన్ కు వెళ్ళిన వారికందరకు వచ్చింది ,అంటావా _?
__వస్తే రావచ్చు _!కానీ ,మేము వెళ్ళలేదు కదా _! అయినా వస్తుంది అంటావా _? _?
ఎందుకురా బాబూ నీకు, ??
, మా సంగతి మేము చూసు కోమా _?
_అయినా నాకు ఎందుకు ప్రత్యేకంగా ఫోన్ చేసి  చెబుతూ ఉన్నావు ,_? ఎందుకింత ప్రేమ మా మీద పుట్టింది నీకు _??
_ నీవు చేసే ఫంక్షన్ కు రావద్దు అని చెప్పడానికే ఫోన్ చేస్తున్నావా ,_? మంచిదే _!
, నీ జాగ్రత్తలో నీవు ఉండడం  ,బావుంది _!;
కానీ నాకు కరోనా వ్యాధి వచ్చిందని  నీకు  చెప్పింది ఎవడు ?
__ఇపుడు ఇదంతా ఈ విషయం చాటింపు చేసి పది మందికీ  చెబుతున్నా వు  కదూ _!
__ఇందువల్ల   నీకు ఒరిగిం ది ఏమిటీ చెప్పు _?
ఓ సాడిస్టూ _!
ఇలా  ఫోన్ చే యడం వల్ల మేము బాధ పడుతామని  _ తెలియనంత  అమాయకుడ వు కాదు కదా నీవు ?
  ఇది మా ఆఫీస్ టైం _! ఈ  టైమ్ లో నీవు చేసిన ఫోన్ కాల్ విని __ మా స్టాఫ్ అందరూ నాకు కరోనా వ్యాధి సోకిందని __భయంతో నన్ను  బయటకు  తరిమి వేస్తారు అని నీకు  తెలియదా _?
నా భార్య కూడా నన్ను  ఇంటిలోకి   రానీయ దు __ అని నీకు  తెలియదా _?
__హాస్పిటల్ లో కూడా ఉండనీయ ని  దిక్కుమాలిన రోజు వచ్చిందని తెలియదా ?__
__ గతంలో  ఎవరైనా ,తమవారు  బాధపడ టం  తెలిస్తే  తనవారు వచ్చి  ఆదరించి,, కష్ట సుఖాలు తెలుసుకొని  వెళ్ళేవారు _!"
, ఇప్పుడు కాకికూడా, ఒక ఇంటినుండి మరో ఇంటి పైకి వాలని దుస్థితి దాపురించింది అని నీకు  తెలియ కుండా ఉందా  ,చెప్పు ,?""
నిజం తెలియకుండా , ,నీకు సంబంధం లేకున్నా ,ఇలా   తప్పుడు ప్రచారం చేస్తూ ,సమాజం నుండి   నన్ను ఇలా దూరం చేయడం,మనిషి బ్రతికి ఉండగా నే   మానసిక హింసకు గురి చేస్తూ నిలువునా   చంపేయడం  ,_ నీ లాంటి దగ్గరి  బంధువు_, మనిషి అయినవాడు  చేసే పనేనా చెప్పు  _!?
అసలు
నీ మెదడు   సరిగా పని చేస్తోందా ,లేదా _? అన్నది నా అనుమానం _!
వాస్తవం తెలుసుకోకుండా ,అనవసరం గా ఫోన్ చేసి ఇలా  బాధ పెట్టడం
తప్పు అని   తెలియడం  లేదా  నీకు _?
__ఫోన్ ఖర్చు  ఎలాగూ తగ్గిందని ,ఎదో ఒకటి ,ఎవరో ఒకరితో  ,నాన్ స్టాప్ గా మాట్లాడుతూ ఉండడం , ఎదో ఒకటి వాగుతూ ఉండడం ,  కరోనా వ్యాధి లక్షణం లో ఒకటి గా   మారి పోయింది,,_ ఏ పనీ బాధ్యతా లేని  నీ లాంటి   వెదవ లకి _!
__""హలో _! నీవు చెప్పింది నేను  విన్నాను పూర్తిగా_!!"
ఇపుడు నేను చెప్పేది కూడా నీవు విను ఓపికగా  _!
నాకు కరొ నా వచ్చిందని, ఏ గాడిద అన్నాడో ,,నీవు పుట్టించావో నాకు   తెలియదు కానీ ,,
__ ఇపుడు ఉల్టా ప్రచారం గా ,, నీవు నాకు  చెప్పినట్టే ,నేను కూడా నీకు  అదే కరోనా వ్యాధి ఉందని  నీ వాళ్ళకి చెబితే నీ పరిస్తితి ఎలా  అవుతుం దో  కాస్తా  గమనించు _!
ఏదైనా తన దాకా వస్తె గానీ,,ఇలాంటి సీరియస్ విషయాలు  తెలిసి రావు కదా _!
__ హలో ,చేసిందంతా చేసి,   నాకు "సారీ " అని ఒక్కమాట చెబితే సరిపోదు _!  దేవుని ఫోటో ముందర నిలబడి ,గట్టిగా రెండు
చెంపలు వేసుకోవాలి _ ,నీవు ,,ఇకముందు ,ఇలాంటి పిచ్చి మాటలు ఎవరితో కూడా  మాట్లాడ కూడదు అని _!
__ బంధువు  అంటే అర్థం  ఆత్మీయుడు _!
పరిస్థితిని అర్థం చేసుకునే వాడు _!
కానీ నీలాంటి వాడు బంధువు కాదు ,రాబందువులు ,
బ్రతికి ఉండగా పీక్కు తినేవాడు _!
చీ చీ  రోత పుడుతోంది ,,నీతో మాట్లాడుతూ ఉంటే _!_;  బంధువు అన్నవాడు  ,సహాయం చేయాలి ,_! వచ్చిన ఆపద ను  తొలగించే ప్రయత్నం చేయాలి _!,  బాధ్యత తో  తగిన జాగ్రత్తలు చెప్పాలి __!
కానీ   ఏ మాత్రం సామాజిక స్పృహ లేకుండా,, మూర్ఖంగా ఇలా ప్రవర్తిస్తారా చెప్పు _??".
ఎవరితో కూడా  ఇలా  ఫోన్ చేసి ఆటలాడు తూ తమాషా చేయవద్దు, సుమా _!
జాగ్రత్త _!
నిజానికి
నీ మీద పోలీస్ కేస్  పెట్టాలి
కానీ  నీ  భార్యాపిల్లలను. దృష్టిలో ఉంచుకొని  నిన్ను ,క్షమించి వదిలేస్తూ ఉన్నాను _!
__ మళ్లీ నాకు నీ మొహం చూపించకు _!
ఇక ముందు  పొరబాటున కూడా
నాకు ఫోన్ చేయకు
తెలిసిందా _!
ఇక
పెట్టేయ్ ఫోన్   _!
బద్మాష్ _!
    భగవంతుడా ,,ఈ రోజున నన్ను ఈ కరోనా దుమారం లో చిక్కుకొనకుండా  బ్రతికించావు ,
పెద్ద  ప్రమాదం తొలగించి  ,
రక్షించావు కదా _!
స్వామీ,పుకార్లు వింటేనే ఇంత భయం అనిపిస్తూ ఉంది
ఇక నిజంగా జరిగితే?
అమ్మో _!
అది తలచుకుంటే నే వణకు పుడుతోంది _!
  ""హే  పరమాత్మా   _! ఇంకా ఎన్నాళ్ళు  మాకు ఈ అగ్ని పరీక్ష _?
ప్రభూ _!!
ఈ దుష్ట  కరోనా మహమ్మారి బారిన పడకుండా,,నన్నే కాదు, అన్ని దేశాల్లో ని ప్రజలను ,,  అందరినీ కాపాడు _ తండ్రీ _!
ప్రపంచంలో మానవాళిని పట్టి పీడిస్తూ __ చంపుతూ ఉన్న__ ఈ కరోనా వ్యాధిని_ భూమిపై నుండి ,, శాశ్వతంగా తొలగిం చు పరమేశ్వరా _!
పాహిమాం , రక్ష మాం _!
శరణు శరణు శరణు_!
   స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!""

Corona Katha

Sept 9, 2020
" హలో అన్నయ్యా __!"
"హలో తమ్ముడూ  , గిరీ బావున్నావా _?
బావున్నాను అన్నయ్యా _!
ఎలా ఉన్నారు  మరదలు లక్ష్మీ ,పిల్లలు   మధు ,సుధ లు _?
"  అంతా బావున్నా రు  అన్నయ్యా _!" మీరు వదిన  జ్ఞాపకం వస్తున్నారు _!
మేము అందరం చక్కగా ఆరోగ్యంగా ఉన్నాం రా తమ్ముడూ ,_! కానీ తమ్ముడూ _! నీవు ఏదో ,బాధ పడుతున్నట్టు  గా అనిపిస్తోంది ,రా గిరీ _!
అన్నయ్యా _!,,__ "
""అరే , ఏమైందిరా ,,? ఏడుస్తూ ఉన్నావా ,_? తమ్ముడూ _!,ఎందుకు _?
""ఏమీ కాలేదు అన్నయ్యా_!, అంత  కంగారు పడకండి ,మీరు _!""
""తమ్ముడూ ,నా ముందర దాపరికమా  నీకు ?
నాకు చెప్పు కొలెని  ఆపద  ఏమీ వచ్చింది రా _!
_ మమ్మల్ని రమ్మంటావా ,_?ఇప్పుడే  కారు తీసుకొని వస్తున్నాము _!""
""అదే ,వద్దు _! అన్నయ్యా,_! , మీరే కాదు , ఎవరూ కూడా రావద్దు అన్నయ్యా _!"
అం టే  తమ్ముడూ_! ,మీలో  కరోనా వచ్చిందా ఎవరికైనా ,?_
  ""_____-___ __!"
భయపడకు రా గిరీ,_! ఇప్పుడు _ఇది మామూలు విషయం అయిపోయింది _!, డాక్టర్ కు చెప్పావా , లేదా _?_నన్ను చెప్పమన్నావా _?
చెప్పాను  అన్నయ్యా  _!"
ఏమన్నాడు ఆయన _?
  ఇంట్లోనే వేరు వేరు గ,జాగ్రత్తగా  ఉండమని   చెప్పాడు _!
టాబ్లెట్స్  సూచనలు అన్నీ చెప్పాడు , డాక్టర్ _!"
మీరు వెళ్ళారా హాస్పిటల్ కి _?
వెళ్ళాము పరీక్షలు చేశాడు కూడా _!"
  ""ఒరేయ్  గిరీ, _!జరిగింది అంతా వివరంగా చెప్పరా ,_!నాకు  చాలా టెన్షన్ గా ఉంది _!"
""_అదే అన్నయ్యా ,_!అందుకే ఫోన్ చేస్తున్నాను ,మా బాధ మీకు తప్ప ఎవరికి చెప్పుకుంటాం చెప్పు _?"
"" ,అది సరేరా,తమ్ముడూ , నస పెట్టక  తొందరగా చెప్పరా బాబూ _!""
""అన్నయ్యా,_! మేము నలుగురం  ఎక్కడికి వెళ్ళినా కారులో
వెళ్ళి వస్తుంటాము కదా ,!
ఆ డ్రైవర్ , తనకు. కరోనా సోకిందని తెలియక  మన ఇంటికి , వస్తూ పోతూ ఉన్నాడు _! ఆ విషయం తర్వాత చెప్పాడు మాకు ఫోన్ చేసి _;_! వెంటనే ,  మేము భయపడుతూ ,, హాస్పిటల్ కు
,వెళ్ళి అందరం కరోనా పరీక్ష  లు చేసుకున్నాం  _!"" అన్నయ్యా _!
"" అలాగా _!  టెస్ట్ లు చేయించుకుని చాలా మంచి  తెలివి గల పని చేశారు , మీరు __! తర్వాత ఏమయింది రా గిరీ ?"
   "" లక్ష్మికి , సుధ కు ,, నాకూ నెగెటివ్ అని వచ్చింది అన్నయ్యా _!""
""  సంతోషం _!  మరి   మధు కు  _?
  ""మధుకు పాజిటివ్ ""అని చెప్పారు అన్నయ్యా ,_!"
అందుకే ,,ఏమీ తోచక ,,నీకు ఫోన్ చేస్తున్నాం  అన్నయ్యా _!""
  ""ఏమిటీ,నాలుగేళ్ల పిల్లాడికి కరోనా  వచ్చిందా _?" అయ్యో _!ఎలారా ,? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు ?
ఎలా ఉంటున్నారు _? ఇద్దరు
చంటి పిల్లల తో ,_!??""
  మీ ఇంట్లోనే మీరే ""హోమ్ క్వారంటెన్ లో   ఉండాలి _!" అని డాక్టర్  మాతో అన్నాడు  అన్నయ్యా _!""
"" ఎలా రా _? అంతా కలిసి ఒక ఇంట్లో ఉండలేరు_! ,చిన్న పిల్లాడిని ఒకే ఇంటిలో  వేరుగా ఉంచలేరు , _!వాడు ఒక్క డిని ఉంచడం కష్టమే _! వాడితో  కలిసి  ఉండడం కూడా  కష్టమే , _! ఈ విషయాలు ఏమీ తెలియని ,అమాయకపు  చంటి పిల్లా డి ని   విడిచి ఉండలేక  పట్టుకొని ఉండలేక ,మీరు ఎంత బాధ పడుతున్నా రో కదా __! తమ్ముడూ __!ఎంత కష్టం వచ్చిందిరా   మీకు ? ,
ఈ దిక్కుమాలిన కరోనా రోగం , ఇంత చిన్న పిల్లలకే రావాలా _?""
" అన్నయ్యా ,నీవు  అలా బాధ పడకు _! మీరు దైర్యం గా ఉం టెనే కదా __ మాకు దైర్యం __! _ వదిన ఉందా అక్కడ _? కాస్త పిలువు అన్నయ్యా _!""
ఉన్నా నయ్యా _! ఇక్కడే _,అంతా వింటున్నాం_! ,  ఈ కరోనా అంత ప్రాణాంతకమేం కాదులే ,,_! అంత బెదిరి పోకు _!"  కాకపోతే __మీరు ఇద్దరూ,,కొన్ని రోజులు,,  కొంచెం జాగ్రత్తగా ఉండాలి _!, అంతే  _!టైమ్ కు మందులు వేయాలి ,_!పరిశుభ్రంగా ఉండాలి_!. , చేతులూ మొహం కడుగుతూ ఉండాలి ,_! కరోనా ఉన్నా లేకపోయినా, మీ  ఇంట్లో  మీరు ఉంటున్నా కూడా  మాస్క్ వేసుకోడం  మాత్రం మరచి పోకు సుమా _!"
""వదినా , _!చిన్న పిల్లాడిని ఎలా చూడాలో_ వీడికి ఎలా చెప్పాలో  మాకు అర్థం కావడం లేదు _! ,మెదడు పని చేయడం లేదు వదినా _!""
_"" మరేం ఫర్వాలే దయ్యా_! కాస్తా ,నేను చెప్పినట్టు చేయండి మీరు, _ నీ ప్రక్కన లక్ష్మీ ఉందా , _?"
ఉన్నా ను అక్కయ్యా ,_! _"ఇప్పుడే వచ్చాం హాస్పిటల్ నుండి ,,_! వస్తూనే మీకు ఫోన్ చేస్తున్నాం ,_;!  మధు గాడిని చూస్తుంటే  దుఖం ఆగడం లేదు అక్కా _!"  __వీడికి కరోనా రావడం ఏమిటి_!? అదేదో ,నాకు వచ్చినా బావుండేది _!!""
__""ఆగాగు _! చిన్న పిల్లలా ఏడవద్దు అలా _!
ఎందుకు ఏ డవడం చెప్పు _?? _!? , ""లక్ష్మీ__! ఇప్పుడు ఏమైందని _?  ఒక పని చేయండి,మీరు _!""
__""చెప్పు అక్కా _! ఏం చేయాలో _?
"" లక్ష్మీ ,_!,నీవు  చంటిదాన్ని సుధను తీసుకొని  ,మీ ఇంట్లోనే క్రింద పోర్షన్ లోనే ఉండండి_! సరేనా _! ఇక _! మీ ఇంట్లోనే , లోనుండి  పై పోర్షన్ కి మెట్లు ఉన్నాయి కదా _! ,పైన మీ ఆయన  , మధు తో కలిసి ఉండాలి ,  ఖచ్చితంగా 14 రోజులూ _!
   _"ఆయనకు  కరోనా అంట దా , అక్కా ,_?
"" అంట దు లే _! తన జాగ్రత్త లో తాను ఉంటాడు _! అతడికి రోగ నిరోధక శక్తి కూడా  ఉంది,,_!
పిల్లలు వేరు _! తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది కదా _! అయినా  కొడుకు కోసం మీరు వేరుగా ఉండక తప్పదు,_! ఈ 14 రోజులూ బాధ పడక తప్పదు లక్ష్మీ _!"
""వాడిని చూడకుండా అన్ని రోజులు నేను ఉండగలనా అక్కా _?
   ""చూడటానికి భయ మెందుకు లక్ష్మీ ?   వారు సగం  మెట్ల వరకూ వచ్చి కూర్చో వచ్చు కదా_! ,చక్కగా అన్నం , పండ్లూ నీళ్ళు అన్నీ తయారు చేసిర్ వారిని ముట్టకుండా అక్కడ పెట్టవచ్చు  కదా _!, దూరం నుండి చూస్తూ హాయిగా మాట్లాడు కోవచ్చు కదా _!"
_"" అవును అక్కయ్యా _!  ఈ ఆలోచన చాలా  బావుంది _!'"
""లక్ష్మీ,,_!ఒకే ఇంట్లో అందరూ ఉంటారు , ఎప్పుడూ కావాల్సి వస్తె,అప్పుడు,,దూరంగా ఉంటూ  చూసుకోవచ్చు,కబుర్లు చెప్పుకోవచ్చు కూడా _!
   "తమ్ముడూ _గిరీ_! వింటున్నావా __ వదిన చెప్పింది ,,_?? ఉండగలవా  మధుతో   నీవు  ?",,ఇప్పుడు నీవు తండ్రి వి మాత్రమే కాదు రా _! డాక్టర్ వి కూడా కావాలి  _! అంటే  జాగ్రత్తగా సూచనలు పాటిస్తూ ఉండాలి సుమా _!,  నీవు సంతోషంగా ఉండాలి , _! కొడుకు మధుకు మందులు వేస్తూ , మాస్క్ వేస్తూ  వాడిని కూడా సంతోషంగా  సరదాగా ఉంచాలి ,_! ఫోన్, టాబ్   వాడికి     చూపిస్తూ,_ అమ్మను చెల్లిని మరపించాలి నీవు, ఈ నాలుగు రోజులు _!; మీరు వేసుకునే బట్టలు, తిండీ శుభ్రంగా ఉంచాలి రా , తమ్ముడూ ,_!
"సరే అన్నయ్యా _!
"భయ పడకండి , మీరు _; ఈ మహమ్మారిని ఎదుర్కోవాలి అంటే దైర్యం,జాగ్రత్తలు  ముఖ్యం , అంతే _!"
""సరే అన్నయ్యా ,,వదినా_!" _!
  మీరు చెప్పినట్టే ,మేము అలాగే వేరు వేరు గా ఉంటాం _!
మాకు ఫోన్ చేస్తూ ఉండండి సుమా _!"
""అలాగే వదినా_! ,కొండంత అండగా  మీరు ఉండగా మాకు  ఏ కష్టం రాదు వచ్చినా భయం లేదు  _!
ఇక ఉంటాం అన్నయ్యా_!
    ఇటువంటి కష్టాలు వచ్చినపుడు ,జై శ్రీ రామ్ , అనుకో _
ఎందుకంటే ,  పది నెలల వరకు సీతా రాములు  వియోగంతో   ఘోరారణ్యం లో గడిపారు , అంత దుఃఖంలో ,కష్టాల్లో కూడా  ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకుండా  దుర్భర పరిస్తితులను ఎదుర్కొన్నారు కదా _!
"ఆ సీతా రాముల  కష్టాలు"" ఎవరికీ రావద్దు_!" అంటూ  ఇన్నాళ్ళు  మనం  అనుకున్నాం _!
కానీ , తమ్ముడూ,,_!ఇపుడు భార్యా భర్తల ను , తండ్రీ బిడ్డలను  బంధువులను,ఇలా  ఘోరంగా , బ్రతికి ఉండగా నే ,దూరం చేస్తూ ,_ ,,ఒకరినొకరు చూసుకోకుండా , విడదీస్తున్న ,ఈ ""  పాడు కరోనా కష్టాలు "" మాత్రం శత్రువుకు కూడా రానీయకు భగవంతుడా_!""
అని   పరమాత్ముని ప్రార్టించు కునే  దరిద్రపు రోజులు  ,,ఇపుడు దాపురించాయి , ప్రపంచ మంతటా _!  ఈ కష్టాలు మనకు భగవంతుడు పెడుతున్న  పరీక్ష  అనుకోవాలి, తమ్ముడూ _!
వీటిని చాలెంజ్ చేస్తూ, మీరు నలుగురూ కలిసి, ఒక్కటై  కరోనా ను మీ ఇంటి నుండి  తరిమేయాలి _!అందుకు మొదట
మీ భార్యా భర్తలు ఇద్ద రూ,  గుండె నిబ్బరం చేసుకోవాలి ,_! దైర్యంగ ,అప్రమత్తంగా ఉండాలి ,,,_!  ఇకముందు ,, దుష్ట కరోనా  ,,మీ   దరిదాపులకు  రాకుండా  చూడాలి తమ్ముడూ ,_!
జై శ్రీ రామ్ _!"
   తమ్ముడూ _!ఇక నీవు  పైకి వెళ్లి పో,, కొడుకు ను తీసుకొని _!  ఈ 14 రోజులు . నీవు కిందకు రాకు _! వాడిని రానీయ కు _! వాడు ఎంత అల్లరి చేసినా ,,  అక్కడే ఉండాలి _!నాకు తెలుసు ,వాడికి నాన అంటే ఎంత ప్రేమ నో _! బుద్ది మంతుడు మధు _! చెప్పినట్టు వుంటాడు బంగారు కొండ __!   బుజ్జి తండ్రి _!
సుధ ను పైకి పోకుండా జాగ్రత్తగా చూస్తు ఉండాలి సుమా _!
""_ సరే అన్నయ్యా ! దారి చూపుతూ మాకు  దైర్యం ఇచ్చే _; నీవే ,,రామన్నయ్య వు,, నాకు _!
దయ గల   మనసుతో ,మమ్మల్ని ప్రేమతో సంరక్షించే  సీతమ్మ యే  మా వదిన మ్మ _!
మీకు మా దంపతుల నమస్కారం _! ఆశీస్సులే మాకు శ్రీ రామ రక్ష ,_అన్నయ్యా ,_!!
జై జై  శ్రీ రామ్ ,_!"
ఉంటాను అన్నయ్యా, ""ఉంటాను  అక్కయ్యా _!"
"సరే లక్ష్మీ _!"
_జయం _ శుభం ,_!
    "  స్వస్తి _!"
హరే కృష్ణ హరే కృష్ణా _!"

Thursday, August 13, 2020

కరోనా   ప్రబోధం

Aug 4, 2020
కరోనా   ప్రబోధం
_____&&&&____
     "తిమ్మి ని బమ్మి_" చేయడం అనే ది   ఒక సామెత ,_!
కొందరు చేశారు అలా _ , అది కొన్ని ప్రాంతాల లో నే_!
  కానీ_
ప్రపంచం అంతటా క్షణాల్లో  చేసి చూపాను నేను ,_!
"ఏది అసాధ్యం_!" అని అనుకున్నారో ,
అది సాధ్యం చేశాను_!
ఎక్కడా _ఎవరూ_ కలలో కూడా ఊహించలేదు,కదా _!
నేను వస్తాను అనీ_!
ఇలా మీ ఖర్మ కాలుస్తూ ఉంటానని __!
ఎన్నడూ లేనివిధంగా__
తర తరాలు మరచి పోకుండా__
ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే రీతిలో__
"ఇలా చేస్తాను_" అనీ__
కలలో కూడా  మీరు అనుకోలేదు  కదా _!
నా పేరు  ను  దశ దిశలా __
,మరణ మృదంగం వాయిస్తూ చాటాను ,_!
మృత్యు గంటలు మోగిస్తూ_
  స్మశాన   దమన కాండ సాగిస్తూ __
పైశాచిక నృత్యాలు చేయిస్తూ __
నేను వచ్చానని  
మీ చరిత్ర పుటల్లో
మీరే  రాసు కుంటారులే ,_!
నా _ ఈ అరి భయంకర మైన  విశ్వరూపం _తో _
కనిపించని  నా కబంధ హస్తాలతో __
ఎన్ని హత్యలు చేశానో__!
ఎన్ని చేస్తూ ఉన్నానో_!
ఇంకా ఎన్ని చూస్తారో_!
మీరు  చెప్పలేరు __!
  చెప్పడానికి
గొంతు పెకల దు కదా _!
గుండెల్లో భయం _!ఇంట్లో భయం _!
బయట  భయం _!
__రక్త పాతం లేకుండా ,నిశబ్దంగా ,__ చప్పుడు చేయకుండా __
చావు కేకలు లేకుండా ,__
ఏడ్పులు పెడ బొబ్బలు చేయకుండా __ ఆపకుండా
చంపుతూ పోవడం __
నేను  ఇపుడు చేస్తున్న   మహా పాపపు పని _! అని నాకు తెలుసు ,_!
    దేశాల్లో ఇంకా మూర్ఖంగా సాగే  ఇన్ని యుద్ధాలు _
బాంబుల దాడులు _
అన్వస్త్రాల ప్రయోగాలు __
నా దాడి ముందు దండగే కదా __!
కత్తి ,బల్లెం ,బాణం , తుపాకీ ,,మల్ల యుద్ద పోరాటాల లో
నాలాంటి " స్పైడర్" యోధున్ని చూశారా _?
అది మచ్చుకు  చెపుతున్న నా చెడు పనులు _!
ఇంకా మీరు చూడలేని
మీకు తెలియని ,
మీ దృష్టికి రాని
మరణాలు  నా చేతుల్లో జరుగుతున్నాయి _!
నా ప్రతాపం దర్శించండి __
   బస్సులు , ట్రెయిన్, విమానాలు, నౌకా ప్రయాణాలు ,ఆపాను నేను__!
   ఎప్పుడూ రద్దీ గా ఉండే లండన్  అమెరికా , జపాన్ లాంటి ధనిక దేశాల లోని బజార్లు
ఇపుడు  ఒక్క మనిషినీ  కనిపించకుండా చేశాను , నేను _!
పెద్ద పెద్ద స్టార్ హోటల్స్,
సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాల్స్ లో ఒక్క మనిషి కూడా పోకుండా చేశాను,నేను _!!
షాపింగ్ మాల్స్, బీరు వైన్ షాపులు. బంద్ చేశాను_!
  ఆర్థిక లావాదేవీలు మంద గింప జేశాను_!
ఎన్నని చెప్పేది _ స్వామీ _?!!
ఒకటా రెండా
లెక్కలేనన్ని,,  ఘోరాలు చేస్తున్నా కూడా
మీరు ,,బొమ్మల్లా  చూస్తూ  ఉన్నారు_ కదా _!
ఇంకా __
, మనిషి _మనిషికీ కాకుండా చేశాను__!
నా కారణంగా _భర్త పోయిన కూడా _కనీసం  చూడటానికి
భార్యను రాకుండా చేశాను _!
ఎంత ధనికుడు అయినా , లీడర్స్ అయినా__
ఫిల్మ్ స్టార్ అయిన__
నా దెబ్బ రుచి చూశారంటే
ఒక్కరూ దగ్గరికి రాకుండా
అటునుండి అటే పారిపోయెలా చేశాను _!
   నా వాడూ _నీ వాడూ అనుకోకుండా  అందరినీ నోరు కుట్టేశాను_!
"నేను పట్టేశాను _"అని వింటే చాలు
భయంతో గుండె ఆగి చచ్చిన వాళ్ళు _వేల మంది ఉన్నారు _!
నా   వికృత రూపం చూడలేకున్నా _  కరోనా అన్న నా ఒక్క  పేరూ వింటేనే  దెయ్యం పట్టిన వారిలా గజ గజ వణకీ పోతున్నారు కదా _!
కరోనా సోకింది అంటెనే__
ఎవరూ__ పొరబాటున కూడా
వాడి మొహం చూడకుండా   రాకుండా చేశాను__!
ప్రాణ భయం అనేది_ ఎవరికైనా  తనదా కా వస్తేనే తెలుస్తుంది కదా ___!
మసీదు, చర్చి టెంపుల్ అన్నీ బంద్ పెట్టించాను ,__;
తెల్లారితే పిచ్చి వారిలా
కాలు కాలిన కుక్కల్లా బజార్లు తిరిగే జనాలు ఏమయ్యారు?  ఎటు పోయారు _?
వందల రకాల రోగాలతో ,_ డాక్టర్ ల ఇండ్లల్లో_ దవాఖానా లలో__  రాత్రి ఆనక _పగలు ఆనక_ పడిగాపులు పడుతూ _ తిరిగే జనాలు_ రోగులు _ __ఒక్కసారిగా ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు
ఎందుకనీ?
ఎటు పోయాయి వారి రోగాలు ,బాధలు ,వ్యాధులు _?
నేనే పెద్ద రోగాన్ని  ,, నా ముందు
సాగేనా __వాటి
కుప్పి గంతులు ,__!!"
నాకు మొహం చూపే దమ్ముందా వాటికి _!
చాలామంది బడాయిలు చెబుతుంటారు _!
నేను  ఇది పీకాను _ అది పీకాను __అని __!
కానీ  నా వలె వారు చేసే చెడు పనులు చెప్పే సాహసం చేస్తారా _?_"
కానీ  నేను  చెబుతాను _!నా పాపపు పనులు _!
చేసిన పాపం చెబితే పోతుం దేమో _??"
దేశాలన్నీ తిరిగి ,జనాలను మడత పెట్టీ __ లక్షలాది  ప్రాణాలు  బలి తీసుకుంటూ , ఉన్నాను __!
  ప్రపంచములో  అందరూ  చావు భయం తో _ అనుక్షణం ,అను నిత్యం వణకి పోయేలా హడల గొడుతూ  నే ఉన్నాను _!!
  మీలో ,,మునుపటి దైర్యం ,ఉత్సాహం ,సంతోషం , కరువై నాయి కదా __!వినోదాలు ,జల్సాలు ,పండుగలు ,వేడుకలు ,  పెండ్లి సందడి ,లాంటి ఉత్సవాలు   ఎక్కడా ఎవ్వరూ చేయకుండా  మిమ్మల్ని నేను  కట్టడి చేశాను _!
ఒక్క మాటలో చెప్పాలంటే
ప్రస్తుతం మీరంతా
నాకు బందీలు _!
  ఎక్కడి వారిని అక్కడే వారి ఇళ్లలోనే బందీ లను చేశాను _!
భర్తకు భార్యను ,భార్యకు భర్తను దూరం చేశాను _!
గ్రామాలు_ నగరాలు_ రాజధానులు _ దేశాలు ,అన్నిటినీ చైనా గోడలతో వేరు చేశాను  __!
విమానాల రాక పోకలు బంద్ చేశాను _;
ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలకుండా  __చేశాను _!
బంధువులు స్నేహితులు , ఆత్మీయులు అనుకున్నవారిని   తమ ఇంటి గడప  దాటకుండా ,
ప్రక్క ఇంటి తలుపు తట్టకుండా చేశాను,,_!
రెక్కల కష్టం మీద బ్రతికే వలస కార్మికులు_ ఉద్యోగులు __కూలీల
ఉద్యోగాలు   జీవనాధారం ఊడగొట్టి ,, వారు ఆకలికి అలమటిస్తూ  ఉన్నా కూడా ఎవరికీ తమ బాధను  చెప్పుకునే  దిక్కు లేకుండా చేశాను,_!
నా విషపు కాటుకు బలి అయిన వారి చావు__ ఘోరంగా ,విషాదంగా మహా భయంకరంగా , అనాథ శవంలా , ఎవరూ ముట్టకుండా , చూడ నీ కుండా, శవ దహనానికి   కూడా నోచుకోకుండా     ,బ్రతుకులు  నరకంచేశాను _!
అబ్బో __! ఇలా
లెక్కలేని దారుణాలు చేస్తూనే ఉన్నాను _!
_ మనుషుల్లో  ని మానవత్వం నైతిక విలువలు మంట గలిపాను __!
దేవుళ్ళు దేవాలయాలు  చర్చి మసీదు లు ,వీధులు వాడలు రహదారులు అన్నీ నిర్మానుష్యం చేశాను _!
మిమ్మల్ని కాపాడే ఆ
దైవాన్ని కూడా దూరం  చేశాను  _!
కనీస అవసరాలకు కూడా బయటకు వెళ్ళే దారి లేకుండా చేశాను __!
అంతటా _అందరూ _అన్ని వేళలా  భయొత్పాతం తో గజ గజ వణకి పోయేలా చేస్తూ నే  ఉన్నాను __!
ఎన్నని చెప్పను ?
ఏమని చెప్పను _??
ఎవరూ ఎన్నడూ  చేయలేని. అకృత్యాలు చేస్తూ  పోతూ ఉన్నాను _!
  పని మనుషులు రాకుండా చేసి అమెరికా కు అదిలాబాదు కు తేడా లేకుండా చేశాను __!
హాహా కారాల తో గగ్గోలు పెడుతూ ఉన్న మీ ఆర్తనాదాలు నేను రోజూ వింటు ఉంటే గుండె తరుక్కు పోతోంది
బాధతో పశ్చాత్తాపం తో  కుమిలి పోతూ  కూడా చేస్తూ  ,ఉన్న
నా పాపాలు ఆగేదేపుడో__?
ఆ దేవుడు ఎప్పుడు దిగి వచ్చి తన విష్ణు చక్రం అడ్డం పెడతాడో , కదా _!
నాకు నిష్కృతి ఎక్కడో _?
నాకే తెలియదు _,!
దయచేసి  మీరు  నేను అంతా కలిసి _నాకు  ఈ లంపటాల నుండి
శాశ్వతంగా
విముక్తి ని ప్రసాదించ డానికి ఆ  పరమేశ్వరు ని  కటాక్షించమని    వేడుకుందాం_!
రండి _!
నా వేదనను అర్థం చేసుకొని నన్ను దూరం చేయ డానికి పరమాత్ముని ప్రార్థించండి __!
ఇక నేను చేస్తున్న మంచి పనులు కూడా కొన్ని ఉన్నాయి _ ఓపికగా వినండి _! చెబుతాను ,  చూడండి _!
    (ఇంకా ఉంది )
   స్వస్తి _!
  హరే కృష్ణ హరే కృష్ణా _!

Saturday, July 25, 2020

కరోనా భయం

Jul 23, 2020
        " నాకు భయం లేదు_"  అంటూ ఇన్నాళ్లూ  డాంబికాలు పలికిన  ప్రతీ వాడికి  ,ఇపుడు పుట్టింది  కరోనా భయం _;!
   ""నేను నీ తాత కు_తండ్రికి ఆఖరికి 
ఆ దేవుడికి కూడా భయ పడను _! అన్న వాడికే వణకు పుట్టించిన భయం _!
నన్ను చూస్తే భయాని కే భయం _!"
ఇదంతా మొన్నటి మాట _!"
ఇపుడు  అంతా భయం మయమే_!
నిన్ను చూస్తే భయం _!
నన్ను నేను చూసుకుం టే భయం _!
మనిషిని  మనిషి నమ్మలేని భయం _!
భర్తను భార్యను విడదీస్తున్న భయం _!
  అనుమానం పెనుభూతం కాదు 
అనుమానం   మహమ్మారి  కరోనా అన్న భయం _! _!

అందరికీ భయమే _;
     ఏ వస్తువును  ముట్టుకున్నా  భయం _!
,లేదా పట్టుకుంటే భయం _! అసలు
వస్తువు ను చూస్తేనే భయం_!
వస్తువు ను బజారు నుండి తేవా లన్నా భయం _!
దాన్ని తాకాలన్నా భయం_!
  బజార్ లో ఎవరిని చూసినా భయం _!
ఎక్కడికి వెళ్ళినా భయం _! ఏది కొన్నా, భయం _!"
ఇంటికి ఎవరు వచ్చినా భయం  _!
  దైర్యం చేసి మాస్క్ తీసి చూడాలంటే భయం _!
మాట్లాడితే భయం _!
మాస్క్ వేయక పోతే భయం _;
మాస్క్ తీయాలంటే భయం_!
గట్టిగా ఊపిరి పీల్చడం భయం _!
   కూతురి పెండ్లి నిశ్చయం అయితే భయం _!
సంబంధం కోసం తిరగాలంటే భయం _!
రాత్రి మోషన్ అయితే భయం _!
డాక్టర్ వద్దకు వెళ్తే భయం
వెళ్లకుంటే భయం _;
టెస్ట్ లు చేసు కోవాలంటే భయం _!
చేసుకోకుం టే భయం _;
టీవీ లు చూస్తే భయం _!
డైలీ పేపర్ చూడ భయం _!
పెండ్లికి  బంధువులను పిలవడం భయం _!
వారిలో ఎవరికి పాజిటివ్ ఉందో అని భయం _!
వచ్చిన వారిని పలకరించడం భయం _;
వారు పని అయ్యాక వెళ్లకపోతే భయం _!
  పాపం అని  పక్కిం టీకి వెళ్తే భయం _!
  మామూలు  జ్వరం వస్తె  కూడా భయం _!
దగ్గు వస్తె  భయం _!
ఎవరు దగ్గినా ,తుమ్మినా ,, వాంతి అయినా భయం _;
చేత కాక పోతే భయం _;
తల నొప్పి వస్తె కూడా భయం _;

బీపీ షుగర్ టెస్ట్ కోసం_ హాస్పిటల్ వెళ్తే భయం _;
కి రాణం కొనడం _భయం _!
కూరగాయలు తేవడం
భయం_;
   పక్కింటి వాడు మాములుగా   వృద్దాప్యం తో  చనిపోయినా కూడా భయం _!
కరోనా తో చస్తే , ప్రేతాత్మ లకు కూడా భయమే _!
దగ్గరకు రావు ,రానీయవు కదా _!
శవాన్ని కాల్చాలంటే భయం ,_!
స్మశానం తీసుకెళ్లాలి అంటే భయం _!
దగ్గరి వారు దూరం ,
దూరం వారు దగ్గర అవుతుంటే భయం _!
   శవం దగ్గరకు పోను భయం _!
చూడ భయం _!
మనసారా ఏడవడం కూడా భయమే _;
ఆత్మీయు లైనా_
కన్న వారైనా __
ఎవరైనా _
కరోనా సోకిందని తెలిస్తే చాలు __!
  తిన భయం _;తాగ భయం _!
నిద్రపో ను భయం _!
  తద్దినాలు పెట్టడం కూడా  భయం_!
  ఏ శుభ కార్యం తలపెట్టినా భయం _!
    పట్ట పగలు,తన ఇంటి  తలుపులు బిగించుకొని , ఎవరికి కనపడకుండా , దాక్కుంటూ , బిక్కు బిక్కు మంటూ , వెఱ్ఱి గా , గోడల వంక చూస్తూ బ్రతికే  బతుకు చూస్తుంటే భయం  _!
బాధ చెప్పుకునే దిక్కు లేదని భయం ,_!
ఫోన్ లు టాబ్ లు చూస్తుంటే భయం _!
చూడకుంటే భయం _!
   అంతం లేని  కరోనా చావులు చూస్తుంటే భయం_!
  ఎక్కడో కాకుండా నీ ఊరిలో నీ నగరంలో నీ దేశంలో  వేలల్లో చస్తున్న కరోనా వార్తలు వింటూ ఉంటే భయం _!
   బ్రహ్మ వద్ద వరం అడిగి తెచ్చుకున్న దేమో  _ఈ కరోనా __ దేనితో చావు లేకుండా _!
మందు లేకుండా _!
అన్న వార్తవింటుంటే భయం _!
ఏ ఛానల్ చూసినా , ఎవరి నోట విన్నా,, ఏ పేపర్ చూసినా ,  దేవుడి స్మరణ కాకుండా దిక్కుమాలిన కరోనా చావుల గురించిన నిజాల గురించి న భయం _;
కరోనా చావులకు దేశాలు ,పట్టణాలు పోటీ పడుతూ ఉంటే _ ఒంట్లో వణకు పుట్టించే ,భయం _!
, ఇండ్లు భవనాలు కట్టడం భయం _!
  రెక్కాడితే డొక్కాడని పేద కూలీలను చూస్తుంటే భయం _!
ఏ పోలీస్ ను చూసినా_
ము న్సి పాలిటి పారిశుధ్య  కార్మికులను చూసినా__
డాక్టర్ లను __సిస్టర్ లను చూసినా __భయం  భయం _;
బస్సు ఎక్కడం భయం _!,ఆటో ఎక్కడం  ఇంకా భయం _!
ఉన్న ఊరు విడిచి వెళ్ళడం భయం .._;
ఇంటి గడప దాటడం భయం _!
పిల్లలను బయట తింపడం భయం _;
శ్రావణ మాసంలో నోముల భయం _!
  వ్రతాలు చేయటం భయం _;
   పితృదేవతల ముక్తి కోసం తద్దినాలు పెట్టడం భయం_;
చచ్చిన వారికి కర్మలు చేయడం భయం _;
  కరోనా తో చచ్చిన వాడి అంత్య క్రియలు చేయడం_ అమ్మో చాలా  భయం_!
శ్రాద్ధ కర్మలు చేయడం భయం_!
      ఒంటరిగా ఇంట్లో  ఉంటే భయం _!
నాలుగు గోడల మధ్య వాటిని చూస్తు   ఇలా ఇంకా ఎన్ని  రోజులు  , రోజులు గడపాలో కదా _! అని  భయం _!
చిన్న పిల్లలు బయట కెళ్లకుండ ఇంటిలోనే బంజేరు దొడ్డి లో నెలల తరబడి , బందీలుగా ఉంచాలంటే భయం _!
వారిని అదుపు చేయాలంటే భయం _;
వారి ప్రశ్నలకు  జవాబు చెప్పాలంటే భయం _;
వారి తిండి భయం _!
వారి ఆరోగ్యం భయం_!
పెద్దవాళ్ళు ఉంటే చాలా  భయం _!
వారి ఆరోగ్యం భయం_;
వారి సంరక్షణ ఇంకా భయం _;
కన్న పిల్లలు దూరం ఉంటే భయం _;
భార్య లేని భర్తకు  భయం _!
భర్త లేని భార్యకు భయం _! ఒంటరి జీవితం భయం _!
బయట కు వెళ్లి సామాన్లు తెచ్చే దిక్కు లేకుండా పోతే ముసలి ప్రాణాలు బయటకు వెళ్లాలంటే భయం _!
వెళ్ళకుం డా ఉండాలంటే భయం _!
అందరూ ఉండి , ఎవరూ అక్కరకు రాకుండా పోతూ ఉన్న కరోనా మహమ్మారి విలయ తాండవం చూస్తుంటే  భయం _!
అన్నీ ఉండి  ఆదరణ మాటకు నోచని అనాథలకు భయం _!
  ఇలా చెపుతూ పోతూ ఉంటే ,  రాయడానికి కాగితాలు చాలవేమో అని భయం _;
  ప్రేమ కు ఆప్యాయతలకు  ఆత్మీయతకు నోచుకోకుండా , దూరంగా విదేశాల్లో తల దాచుకుని__ ఉంటున్న తమ వారిని_ తల్చుకుం టూ ఉంటే దుఖం _ భయం _!
దిన దిన గండం
నూరేళ్ళ ఆయుస్సు వలె ,
రోజూ చస్తూ బ్రతుకుతూ గడుపుతూ ఉన్న ఈ యాంత్రిక జీవితా న్ని చూస్తే భయం _!
_"ఓ దేవుడా ,_; బ్రతికి ఉండగా నే   మా బ్రతుకు ను  భయంకరంగా  మారుస్తూ ఉంటున్న నీవు_ ఎందుకు కరోనా ను  పంపించావు  మా పైకి _??""
, మా భయాన్ని పోగొట్టి
భయం నుండి విముక్తిని ప్రసాదించ లేవా _?
పరమాత్మా _!
జంతువులకు లేని  ప్రాణ భయం ___!
మాకెందుకు కలిగించావూ
తండ్రి_??""
దయచేసి ఈ కరోనా పీ డ ను  తొలగించి __  మా భయాన్ని  పోగొట్టు ప్రభూ_!!'"
మా చేత కాదు స్వామీ_ కరోనా ఆగడాలు ఆపడం _!""
నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు _లేదు_ లేదు_!
అందుకే __
నీకు సాష్టాంగ ప్రణామం చేస్తూ వేడుకుంటూ ఉన్నాం_!""
   హే పరాత్పర _!
దీన బాందవా ,_!"
తప్పులుంటే మన్నించి రక్షించు _!""
ఈ దీనులను __
నీ బిడ్డలను __
ఆర్తులను __
కాపాడు _ తండ్రి ,_!""
శరణు _!
హే భగవాన్ _!""
శరణు _!"
     స్వస్తి_!"
హరే కృష్ణ హరే కృష్ణా _;""

,

A Drama that became Real!

The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...