May 27, 2020
ఈ గోపికా స్త్రీలకు శ్రీకృష్ణుని పట్ల గల ఆ ఆరాధనా భావం ఎలా కలుగు తోంది?
భర్తా పిల్లలు అత్తా మామలు బంధువులు,సంసార బాధ్యతలు , ఇన్నింటి మధ్య వారికి కృష్ణుని గురించి ఆలోచించే సమయం ఓపిక జ్ఞానం , ఎలా దొరుకుతున్నాయి ,??
__,, వారి అమోఘమైన కృష్ణ ప్రేమగురించిన వ్యవహారం భావిస్తూ ఉంటే ,,నాకు అంతా అయోమయంగా ఉంటోంది ,!!
"" రోజూ విధిగా ఈ కర్మ లు చేయడం ,దేనికీ ,?
తెల్లారి లేస్తే అందరికీ చేతి నిండా పని !
ఉరుకులు ,పరుగులు !!
ఏమిటి ఈ అంతులేని సంసారం లక్ష్యం ?
దీనికి
ఆది ,అంతము ఎక్కడ ?? పరమావధి లేకుండా ఏమిటీ ఈ మానవ జీవనం ,?
దేనికోసం ఈ ఆరాటం ,తాపత్రయం ?
ఇలాంటి ప్రశ్నలు నన్ను వేదిస్తు ఉన్నాయి ,!!
గోలోకంలో ఉన్న నాకు __ఈ భూలోక వ్యవస్థ తెలియవు కదా !
అందుకే దీనిని,గురించిన ధర్మ సందేహాలు ,నిత్యం అనేకం కలుగుతువున్నాయి నాకు !!
భార్యా భర్తా సంతానం ,సంసార సౌఖ్యాలు ఈ బంధాలు ,అనుబంధాలు ఇవన్నీ నాకు తెలియదు కదా ,!!
గత జన్మలో , అలాంటి అనుభవాలు కూడా నాకు లేవు ,!!
ఇపుడు కూడా లేవు,!!
శ్రీకృష్ణుని తో నాకు గల అపురూప అనుబంధం గమనించి ,,_నా తలిదండ్రులు నాకు ఎలాంటి వివాహ ప్రయత్నాలు చేయలేదు కూడా !
పైగా ,,నేను జన్మించింది మొదలు ,కృష్ణ రూప నామ స్మరణ భావాలతో అనుక్షణం ధ్యానిస్తూ,, అదే ధ్యేయంగా జీవిస్తూ ఉంటున్న నన్ను ,చూసి ,
నాకు వేరే సంబంధాల ప్రయత్నం మానుకున్నారు
పైగా ,వారు కూడా కృష్ణభక్తులై పోయారు ,!
ఇక కృష్ణుని తో నాకు జరిగిన రహస్య వివాహం విషయం తెలిశాక ,వారు నా జీవితాన్ని ,నా నిర్ణయం మేరకే వదిలారు !!
""కృష్ణ భావన ,కృష్ణ చింతన కృష్ణ జీవన చిత్తం"" తో నిరంతరం కృష్ణుని దర్శనం కోసం ,కృష్ణుని వేణు గాన శ్రవణం కోసం తాపత్రయం పడుతూ ఉన్న నన్ను చూసి వారు,, ఎంతో ఆనందించారు !
రేపల్లె లో వెలసిన భగవంతుడు గా తెలియ బడే అల్లరి కృష్ణయ్య నటనకు అందరూ ముగ్ధులై భక్తులు గా మారారు కూడా !!
కృష్ణుని వద్ద ,,నాకు గల ప్రత్యేకమైన స్థానం ,అందరకూ ఆనందాన్ని కలిగించింది !!
ఎందుకంటే శ్రీకృష్ణుని అందమైన బాల్య లీలలు సమస్త గోకులాన్ని సమ్మోహన పరుస్తూ , తన్మయత్వం కలిగిస్తూ ఉన్నాయి ,!!
అయితే నాలో ఉన్న దైవిక శక్తితో ,గత మధురా నుభవాలతో కృష్ణునితో అనుబంధం మరింత గా ,గాఢంగా పెనవేసుకు పోతోంది ,!
కానీ , ఈ గోపికల మాటేమిటి ?
__సామాన్య పల్లె మానవ కాంతలకు ఇంత ఆత్మబలం ,ఆరాధనా శక్తి ఎలా సంక్రమిస్తుంది ??
గోపాలకృష్ణ సుందర రూపాన్ని తిలకిస్తూ ఆనంద పారవశ్యం తో , ఈ గోపికలు , తమను తాము మరచిపోతున్నారు,!!
వారి , అంకిత భావం ,శరణాగత తత్వం చూస్తుంటే ,నాకు విస్మయం కలుగుతోంది ,!!
నా ఊహకు అంతుపట్టని రహస్యం ఏదో ఇందులో దాగి ఉంది !
ఇక ఉండబట్ట లేక , ఒకసారి ఏకాంతంలో చల్లని యమునాతీ రంలో , పచ్చని పూల పొదల్లో , మలయ సుగంధ సౌరభాల పరిమళాల వీచికల సోయగాల లో ,,ఈ గోపాల చూడామణి యొక్క అమోఘమైన బాహు బంధాలలో నేను ఇమిడి పోతూ,,, స్వామి కౌగిలి లో కరిగిపోతూ , మైమరచి పోతున్నాను !!
నాకు కలిగిన సందేహాలను - ఈ నీలమేఘశ్యామ సుందరు ని దరహాస వదన సౌందర్యాన్ని కళ్ళారా గ్రోలుతూ అడిగాను ,,
""కృష్ణా ! ఏమిటి నీ ,,ఈ జగన్నాటక రచనా రహస్యం ?""
నల్లనయ్య చిన్నగా నవ్వాడు ,
""రాధే !,నీవు నా అర్ధాంగి వి ,!
నీ సహచర్యం తో , నీవు ఇస్తున్న ఈ శక్తి తో నే , ఈ సృష్టి నిర్వహణ చేయ గలుగుతు ఉన్నాను సుమా !
నీవు లేకుండా నేను లేను కదా !!
నీకు తెలియని రహస్యాలు. ఇంకా నా వద్ద ఉంటాయా , ప్రియ సఖీ చారు ముఖీ !" అన్నాడు గోపాలుడు
""కృష్ణా !,, నీ తీయనిమాట ల తో నన్ను మభ్య పెట్టకు !!
నీవు నా సందేహాలకు వివరణ ఇచ్చి తీరాలి ,సుమా !""
అంటుంటే ,,
"రాధే,!నీవే నేను! ,,నేనే నీవు !, ఇక నీవు నన్ను అడిగే ప్రశ్నలు ,
నన్ను నేనే అడుగుతూ ఉన్నట్టు ఉంటుంది , సుమా !!
సరే !, హే రాధారాణి !
,హే రాధా దేవీ!
,హే ,గోలోక పర దేవతా!! ,హే కృష్ణప్రియ!! , హే బృందావన సంచారిని ,హే శ్రీకృష్ణ హృదయ మనోహారిని!! , హే ఆది శక్తీ, !! అఙ్ఞాపిం చు దేవీ !!ఈ దాసుడు ఏమీ చేయాలో ,??""
అంటూ రెండు చేతులూ కట్టుకొని దరహస వదనం తో నమస్కరిస్తూ నా ముందు మోకరిల్లి ,ఉన్న శ్రీకృష్ణ భగవానుని ఔదార్యం ,లాలిత్యం ,అనురాగం , అపార కరుణా కటాక్షాలు వైభవం గురించి,, మాటల్లో ఏమని చెప్పేది ?
""కృష్ణా , అలా చూడకు సుమా!!
నీ చల్లని చూపుల పరిమళం లో నా అస్తిత్వాన్ని ,, నా ఈ చేతనా వస్ట ను ,కోల్పోయి ,ప్రాణం లేని బొమ్మనై పోతాను !;
""కృష్ణా !నీ అలౌకిక అద్వితీయమైన ఈ చూపులకు అమోఘమైన సమ్మోహన శక్తి ఉంది ,!
ఎంతటివారైనా నీ చూపుల కరుణామృత రసధారలో తడిస్తే చాలు ,,, నీలో లీనమై తరిస్తారు !!
కృష్ణా,,నన్ను అలా చూడకు !
తమను పొగడుతూ ఉండే భర్తలకు ,,,స్త్రీలు భావావేశం లో తమను తాము మరచి ,ఎదుటివారికి ఆత్మ సమర్పణ చేసుకుంటూ ఉంటారు !
""కృష్ణా ! వచ్చి ఇలా నా ప్రక్కన బుద్దిగా కూర్చో ,!నేను చెప్పేది విను , స్వామీ,!!
నన్ను చెప్పనివ్వు శ్యామాసుందరా !
నా ప్రాణమా !
కాస్తా,,,నా పెదాలను విప్ప నివ్వు ,, మోహన కృష్ణా ! నటనా గ్రేసర చక్రవర్తి , !
అంటూ నా ఈ
రెండు చేతులూ,,నంద నంద నుని పాద కమలాల పై ఉంచి ,కళ్ళనుండి ఉబికి వస్తున్న ఆనంద భాష్పాలతో వాటిని అభిషేకిస్తూ ఉంటే ,,అప్పుడు , వెన్న దొంగ పద్మాసనం వేసుకుని
, ""దేవీ! నీ ఆనతి నేను శిరసా వహిస్తూ ఉన్నాను !
అంటూ
మందస్మిత వదనార విందుడై , మృదువుగా నాతో సంభాషించా డు ,,చతురుడు ఆ దేవకీ సుతుడు ,శ్రీకృష్ణుడు !"
ఆ చల్లని పున్నమి చందమామ కాంతుల వెన్నెల లో !
ఆ శరద్రాత్రి , సమయంలో , ఆ నింగిలో, దివ్యమైన గగన సౌధాంగణ ములో దేవతా స్త్రీలు తీర్చి పెట్టిన నక్షత్రాలు అనే దివ్యమైన దీపాల స్వయం ప్రకాశం లో , పుష్ప సుగంధ సుమధుర పరిమళ భరితమైన మలయ పవన లాలన లో , గలగలా ప్రవహిస్తున్న యమునా వాహినీ తరంగాల సవ్వడుల మద్య ," కృష్ణ ఇష్ట సఖి
రాధ"" గా పిలువబడుతున్న నేను , నా ప్రాణ సఖుని తో ఇలా సంభాషించా ను
(ఇంకా ఉంది )
స్వస్తి !
హరే కృష్ణ హరే కృష్ణా !""
No comments:
Post a Comment