Tuesday, May 19, 2020

కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా

May 8, 2020
పగలే వెన్నెలా....
పల్లవి !"
____&___
"కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !!
కరుణ లేక  మన వారిని చంపు చుండే రా!!"
చరణం _1
_________
"" క్షణము లోన  జగమంతా పాకుచుం డేరా!
ఏ బలము తొను దీని __నిపుడు గెలువలేము రా !
ఇంటిలోనే ఉండు ట యూ,
దూరము గ నిలుచుట యూ,
ఈ రెండు దారులే తప్ప ,వేరే దారి  లేదయా ,,!""
     !కరోనా వచ్చే రా!!
చరణం _2
_________
"దేశాలన్నీ కలయ చుట్టి   దీనదశల  పాల్జేసేరా !
_బాధను చెప్పుకొనే  దిక్కు లేని  స్థితి చేసేరా ,!
మందు మాకు లేని ,వేరే గత్యంతర మూ కానరాని,
,ఈ
మహమ్మారి నంతు జేసే ,, మందు ను కనిపెట్టాలి రా !
   !!  కరోనా !!
చరణం _3
_________
లక్షలాది ప్రజల మారణ_ హోమం  ,ఆపి తీరాలి,!
దైర్యం తో ,దాని ఆట
__కట్టే దారే వెదకాలి ,!
ఎక్కడో ధర్మానికి  చేటు
వా  టిల్లింది ,!
క్షమించమని  దైవాన్ని , వేడుకొనక తప్పదు గా !"
  !! కరోనా !!
చరణం _4
_________
రోజు రోజుకూ పెరిగే చావులింక  చాలురా ,!
నగరాలన్నీ స్మశానాలను  తలపిస్తూ, ఉన్నాయిరా!
  కన్నీటికథలకు ,ఇక
ముగింపు  పలక తప్పదు గ  ప్రాణ రక్షణ ,కు మించిన
ధర్మం వేరే ఉండదు గా !!
!!   ""కరోనా ""!!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...