Mar 28, 2020
"తీరని ఆపద ,ఘోర విపత్తు ""కరోనా వ్యాధి రూపంలో ప్రపంచం అంతటా ఒకేసారి వచ్చి పడింది!
ఒకరికి మరొకరు సహాయం చేసుకునే పరిస్తితి కూడా లేదు
మన మధ్య ఉన్న బేధాలు అన్నీ మరచి ,,
అందరం ఒక్కటీ కావాలి !!
మీరు బయటికి వస్తె ,కరోనా దయ్యం ,భూతం లా మీ ఇంటికి ఏదో రూపంలో ప్రవేశిస్తుంది !
మానవజాతిని పీల్చి పిప్పి చేస్తూ ఉంది !!
అందుకు మనం ,
మనలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి !
సంత్రా ,బత్తాయి ,water million ,nimma ఇలాంటి విటమిన్ సి ఉన్న పండ్లను ,,కోడి గుడ్లను , కూరగాయలతో బాటు తింటూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి !
కరోనా వ్యాధిని వ్యాప్తి కాకుండా చేయడమే మన వద్ద ఉన్న ,,ఒకే ఒక ""మందు "!!
విదేశాల నుండి ఈ వ్యాది ,మన దేశానికి ,మన నగరానికి వచ్చింది
వారు ,కరోనా లక్షణాలు ఉన్న వారు ,,ఇక్కడే ,,మన మధ్యనే ఉంటున్నారు !!
రోజూ మనం వాడే నిత్యావసర వస్తువులను ,,వారు ముడుతూనే ఉన్నారు !!
పాపం ,ఆ ప్రమాదం తమ ఇంట్లో జరుగుతున్న విషయం ,, వారికి తెలియకుండానే జరుగుతు ఉంది !!
ప్రభుత్వం ,,పౌరులు బజారులో కి రాకుండా ,వారి ఇండ్ల కే కావాల్సిన పదార్ధాలు అందజేస్తే ,,, మరింత తొందరగా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కట్టడి చేసుకున్న వారం అవుతాం !!
అందుకే ,,ప్రతీ వ్యక్తి వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటూ ,తాను ఒక్కడే కాకుండా ,,,తన ఇంటి చుట్టూ రా ఉన్నవారికీ దూరంగా ఉంటూ,,, వారు కూడా ,దూరంగా ఉండాలని గుర్తు చేస్తూ, ఉండాలి !!
కంటికి కనబడకుండా ,
ఏ మందు కూ లొంగకుండా
రోజూ రోజుకు తన వ్యాధి గ్రస్తుల సంఖ్యను పెంచుకుంటూ ఉన్న ఈ మహమ్మారి ప్రభావం మనలోనే మన ఇంటిలోనే మన వారి లోనే ఉంది అన్న భావనతో ప్రతీ ఒక్కరూ,, అప్రమత్తత తో ఉండాలి !!
ఇంత ఘోరం తమ చుట్టూ చూస్తూ కూడా
ప్రజలు బజార్ లలో ఇంకా తిరుగుతూనే ఉన్నారు
అంటే సిగ్గు పడాలి
వారు ,అలా ,మన దేశాన్ని తల దించుకునే లా ఏది పట్టనట్టుగా , బాధ్యతా రహితంగా , విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే బాధగా ఉంటోంది !!"
వారు ఆరోగ్యంగానే ఉండవచ్చు ,!!
ఊరూ,నగరం రాష్ట్రం దేశం ,ప్రపంచం మొత్తం కర్ఫ్యూ విధించారు అంటే పరిస్తితి ఎంత దారుణంగా ఉందో వారు ,,కాస్త అర్థం చేసుకోవాలి
మాకేమైత ది ?? అనే పిచ్చి ఆలోచన రానీయకుండా
మన వంతు కర్తవ్యం గా
Physical distancing కేవలం బయట నే కాదు ,
,అదే
Physical distance ఇంటిలో కూడా పాటించు దాము ,!!
బయట గుంపులు గుంపులుగా వెళ్ళవద్దు !!
బయటకు వెళ్లిన వ్యక్తి తనకు తెలియకుండానే కరోనా వైరస్ ను మోసుకొస్తూ ఒక రోజులో వందల వేల రోగుల సంఖ్యను పెంచేస్తాడు !
ఆ దెబ్బకు ,,పెద్ద పెద్ద దేశాలే గడ గడ వణకిపోతున్నాయి !
ఇక మనమెంత ?
అధిక జనాభా ఉన్న మన దేశంలో మనం అజాగ్రత్తగా ఉంటే
,నిర్లక్ష్యం చేస్తే ,ఘోరంగా ప్రాణ నష్టం ,,కష్టం , చేచేతులారా తెచ్చుకున్న వాళ్ళం అవుతాం !
ఇంతకంటే మూర్ఖత్వం ఉండదు కదా !
జ్ఞానం ,వివేకం ఉన్న మనిషిలో,,
ఇలాంటి అజ్ఞానం ,అహంకారం దేవుడు కూడా క్షమించ డు !!
అందుకే ,
దయచేసి ఎవరూ ,అనవసరంగా బయట తిరగకుండా ,ఈ మూడు వారాలు ,,ఎవరి ఇంట్లో వాళ్ళే గడుపుదామని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను !
మానసికంగా ,శారీరకంగా దృఢంగా ఉండాలి !
పిల్లలను అలా ఉంచాలి కూడా !!
దొరికిన ఈ విరామం లో
1_వ్యాయామము online చూస్తూ చేయాలి !
2_ఆటా, పాటా,సంగీతం , క్విజ్ ,లాంటివి నేర్చుకోవాలి
3_యోగా ,మెడిటేషన్ ,లాంటివి సాధన చేస్తూ ఉండాలి
4_ డబ్బు ఉంటే బజారులో ఉండే పేదలు , కార్యకర్తల కు ,సంస్థలకు ఉదారంగా విరాళాలు అందజేయాలి
5_తక్కువ తినాలి ఎక్కువగా రసాలు నీరు త్రాగుతూ వుండాలి
ఏ విధమైన అనారోగ్యం రాకుండా జాగ్రత్తగా ఉండాలి
ఎందుకంటే బయట ఉన్న ప్రతి హాస్పిటల్ ,కరోనా పేషంట్ల తో నిండి పోయింది
అందుకే ఎవరికి భారం కాకుండా ఉండాలి
ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు !
6_, కరోనా ను నివారించే నిరోధించే సలహాలు ,సూచనలు ,కవిత ,జాగ్రత్తలు ,పష్టలువ్,పద్యాలు ,,నాటకాలు , పుష్టి కోసం శక్తి కోసం ,తినాల్సిన ఆహార పదార్థాలు , భగవద్గీత శ్లోకాలు online భజన ,,భక్తి గీతాలు గానం చేయడం ,,కథలు చెప్పడం ,
YouTube తో చక్కని సంగీతం ,drawing , painting ,,skipping ,chess , లాంటి వి indoor games ,, తో, ఈ సెలవుల్లో , తమ పిల్లలలో
""క్రియేటివిటీ"" వారిలో ఉన్న ప్రతిభను , కళలను , పెంచే ప్రయత్నం తలిదండ్రులు చేస్తూ ఉండాలి
ఇతరుల కు కూడా వాటిని wattsup మాధ్యమం ద్వారా తెలియ జేయాలి !!
ఇంట్లో పిల్లల కోసం వాటిని ఉపయోగిస్తూ , సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఉండాలి !!
ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం లా భావించాలి !!
1__మనకు మనమే స్వీయ నిర్భంధం చేసుకోవడం ,
2__సామాజిక దూరం పాటించడం
ఇవి రెండు మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటే ,
కరోనా నిర్మూలన అవుతుంది !!
ఇదే మానవసేవ !
ఇదే దేశసేవ !
ఇదే మాధవసేవ !
ఇదే మానవత్వం !
ఇదే మనిషికి ఉండాల్సిన
ఇంగిత జ్ఞానం !
ఇదే మన జీవిత లక్ష్యం !
ఇదే ఆదర్శం !
ఇదే దైవత్వం !
నాది ,మీది మన అందరిదీ ,,ఒకటే కోరిక !
మనం ఇంట్లో నే ఉండాలి !!
గడప తలుపు పెట్టీ ఉండాలి ,!
ఆ కరోనా బయట ఎండల్లో మాడి చావాలి !!
మనల్ని చంపడానికి వస్తున్న ఆ శత్రువు పట్ల అప్రమత్తంగా ఉండాలి !
అది ఇంటి దొంగగా. మారింది!!
అది బయటనే చావాలి !
చిత్తశుద్దితో అనునిత్యం ,,అనుదినం ,,అనుక్షణం ,, జాగ్రత్తగా ఉందాం !!
గరళాన్ని మింగి, లోకాలను రక్షించిన ఆ పరమేశ్వరుడు ఈ కరోనా వ్యాధి బారి నుండి ప్రపంచాన్ని రక్షించమని
అందరం భగవంతుని కోరుకుందాం !!
""హే భగవాన్ !,
మమ్మల్ని ఈ విపత్తు నుండి గట్టెక్కిం చే మార్గాన్ని అనుగ్రహించు,,,తండ్రీ !!
నీవు తప్ప మాకు వేరే దిక్కు లేదు !
ప్రభూ!, దీనంగా విలపిస్తూ నీ కరుణ కోసం,,కన్నులు కాయలు కాసే లా , ఎదురుచూస్తూ ఉన్న మా మొర ఆలించు !
ఎన్నడూ , కనీ వినీ ఎరుగని ఈ దుష్ట రాక్షసి "కరోనా "ను తు ద ముట్టించు !!
నారాయణా ! మాకు నీవే గతి !
కృప ఉంచి సత్వరంగా మాకు ఈ విపత్తు నుండి విముక్తిని ప్రసాదించు !
స్వామీ!శరణు !
గోవిందా !శరణు !
ఈశ్వరా !శరణు !;
అంటూ శరణాగతి భావంతో ప్రార్థించుదాం !""
స్వస్తి !""
హరే కృష్ణ హరే కృష్ణా !!
Sunday, March 29, 2020
మన కర్తవ్యం !
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment