Thursday, May 19, 2016

దేవీ భాగవతకథా శ్రవణం

NOV 14, 2014
కరీంనగర్ లో -ఈ రోజు - రెండవ రోజున ఉదయం భారత కథ లో భీష్మ ప్రతిజ్ఞా -ద్రౌపది శీలరక్షణ - జూదం -భారత యుద్ధం -పరీక్షిత్తు జననం- శృంగి శాపం -భాగవతకథా శ్రవణం - జనమేజేయుని సర్పయాగం -ఆస్తీక ముని -ఆగమనం తో ఆపడం --వ్యాసభగవానుని ప్రోక్తం అయిన శ్రీమద్దేవీ భాగవతాన్ని బ్రహ్మశ్రీ -పురాణం మహేశ్వర శేర్మ గారు అద్భుతంగా వివరించి -శ్రావ్యంగా వినిపించారు 
సాయంత్రం -కథలో -ఒక లక్ష ఇరవై వేల శ్లోకాలు గల భారతాన్ని రచించినా కూడా - వైశంపాయనునికి తృప్తి కలుగక -దేవీ భాగవతాన్ని రచింఛి తానే స్వయంగా -వినిపించాడు -మొదటి వక్త ఆయనే 1 - శ్రోత ఈ జనమేజయుడు !- దేవీ యాగాన్ని మొదట చేసిన వాడు నారాయణుడు - అమ్మ అందుకు అతనికి విశేషమైన వరాల జల్లు కురిపించినది - త్రిమూర్తులు కలిసి జగదంబ వద్దకు స్త్రీ రూపాల్లో వెళ్ళడం- అమ్మ కరుణించడం వారు -బహు విధాలా అమ్మను స్తుతించడం -అలా సమస్త పాపాలు పోగొట్టు కున్నఎందరో మహాను భావుల గురించి చెప్పారు
విత్తనంలోఉన్న శక్తి వాళ్ళ మొలకెత్తడం చెట్టుగా అవడం -ఎలానో -- మనలో ఉన్న శక్తి వల్ల చేతనులమై జీవించ గలుగుతున్నాము -- "శివ శ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః -న ప్రభవితుం --!" శక్తి స్వరూపమైన అమ్మ సహాయం లేకుండా శివుడు కూడా ఏమీ చేయలేడు కదా ! -- అని జగద్గురు శంకరాచార్యులు సౌందర్యలహరిలో విశదీకరించినట్లు అందరిలో అమ్మ వారి శక్తి ఉంది -అమ్మ త్రిగుణాత్మక రూపమే --కాని అమ్మ దానికి అతీతురాలు -మానవులలో మాత్రం ఇవి సమ పాళ్ళలో ఉండవు -కనుక సుఖ దుఖాలు అనుభవిస్తుంటారు
వ్యాసుడు చెప్పాడు - అమ్మవారి భజన చేయడం వలననే అమ్మ దయకు పాత్రులం కావచ్చును అని !-
జగదంబ యాగం చేయడం ఒక నారాయణునికి మాత్రమే సాధ్యం అయింది - ద్రవ్య -కర్మ -మంత్ర శుద్దులు మూడు ఉంటేనే యజ్ఞం యాగం ఫలిస్తుంది అని వేదాలు చెప్పాయి -
ద్రవ్య శుద్ది లేనందు వలననే పాండవులు రాజసూయ యాగం చేసిన ఫలం దక్కక - నెల రోజుల లోనే - వనవాసం "చేయ వలసి వచ్చింది -అట !
సత్యం పలుకడమే తన వ్రతంగా చేసుకున్న సత్య వ్రతుడు "-ఐం " అన్నఅమ్మవారి మహా మహిమాన్విత మైన దివ్య మంత్ర బీజాన్ని ఉచ్చరించి అమ్మదయకు పాత్రుడైనాడు -
లలితనామాలు చదివే వారు చక్కగా చక్కని ఉచ్చారణ తో పలుకుతూ - అర్థం తెలిసి కొని- చదవడం వాళ్ళ సంపూర్ణ ఫలితాన్ని పొంద గలరు.


NOV 15 2014


ఈ రోజు మూడవ రోజు- బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారు దేవీ భాగవత సప్తాహకార్య క్రమంలో చెప్పిన అంశాలు భక్త ప్రహ్లాదుడు త్రిగునాత్మక ప్రభావం తో అహంకార యుతుడై - నర నారాయనులతో యుద్ధం చేయడం - ఉర్వశి పుట్టుక - కోపం స్వభావం -కోపం వల్ల అనర్థాలు అనేకం - నూరు అశ్వ మేధా యాగాలు చేసిన ఫలితాన్ని కోల్పోతారు -కోపం తో అనారోగ్యం -అహంకార మమకారాల సంయుతం - ఎదుటి వానికి తన పుణ్యం సగం ధార పోసిన వాడు అవుతున్నాడు ఆహారం అంటే ఏమిటి ?కేవలం పొట్ట నింపడానికే ఆహారం అనుకుంటాము కాని - -ఆహార స్వభావం మారుతూ ఉంటుంది - కళ్ళకు ఆహారం రూపం -నాలికకి రుచి -ముక్కుకు వాసన -చెవులకు వినడం -ఇలా పంచేంద్రియాలు శబ్ద స్పర్శ రస రూప గందాలకు లోబడటం వల్ల అహంకార పూరితుడై -ఇంద్రియాల కు లోబడి మనిషి జన్మ పరమార్థాన్ని గుర్తించ లేక పోతున్నాడు -
నారాయణుడు శరణాగత వత్సలుడై -చేసిన పనుల వల్ల కలిగిన పాపాలకు -అనేక శాపాలకు గురి అయ్యి క్షుద్ర యోనులందు అవతరించడం జరిగింది - ఎవరు జేసిన కర్మ వారు అనుభవింపక తప్పదు అన్నట్లుగా దేవతల కోసం రాక్షస సంహారం కోసం నానా బాధలు పడ్డాడు -
మనుజులేకాడు దేవతలు సైతం ఇంద్రియాలకు వశుడై తనను తాను తెలుసు కోలేక పోతున్నాడు - కొంత మంది యాత్రల వల్ల మనసు శుద్ది అవుతుందని అనుకుంటారు కాని -
యాత్రలు చేసే వారు మొదట మనశ్శుద్ది చేసుకోవాలి - లేకపోతే ఎన్ని యాత్రలు చేసినా లాభం ఉండదు - కళ్ళు కుండను గంగ నీటిలో ఉంచినా కూడా మాలిన్యాలు పోనట్టుగా యాత్రా ప్రభావం ఉండదు -కదా1
కాశీ క్షేత్రం అంటోంది- రారా నావద్దకు -నీ పాపాల రాశిని భస్మం చేస్తాను అని !
నైమిశారణ్యం పిలుస్తోంది --నీ మనస్సును నెఉ ఇక్కడ ప్రశాంతంగా ఉంచుతాను అని !
గంగా నది చూస్తుంది -గత జన్మ పాపాలను తన పవిత్ర జలాలతో కడిగి వేయాలని -!
కాని కూపస్తమండూకంలా ఇల్లే స్వర్గమని --పంజరం లోని చిలుకలా -అదే లోకమని భావిస్తాడు !
భారత దేశం లో ఎనో క్షేత్రాలు మానవులకు సాధక ధామాలుగా మోక్ష ప్రదాతలు గా ఉంటున్నాయి - కాని అహంకార మమకారాలకు ఇంద్రియ నిగ్రహం లేక దాసుడై -వశుడై -సంసార బంధాల్లో చిక్కి విల విల లాడుతున్న్నాడు -బుద్ది హీనుడై పరమాత్మ ను గుర్తించ లేక పోతున్నాడు - అందుకే ఎవరికైనా -ఎప్పుడైనా -"అన్యధా శరణం నాస్తి -త్వమేవ శరణం మమ"
జగదంబ ను ఆశ్రయించడం వల్ల మాత్రమే సాత్విక స్వభావం అలవడి -మోక్షాన్ని పొందడానికి అర్హత కలుగుతుంది -

NOV 16, 2014
నేడు నాలుగవ రోజు- బ్రహ్మశ్రీ పురాణం మేహేశ్వర శర్మ గారు -దేవీ భాగవత ప్రవచనాలలో - రాక్షస రాజైన భక్త ప్రహ్లాదుడు -జగదంబ ను స్తుతించడం -దేవతలకు రాక్షసులకు జరిగే యుద్ధం లో అమ్మ దేవతల పక్షాన రావడం -చూసీ -"-అమ్మా! మేము కూడా నీ బిడ్డలమే - మా రాక్షసులకు చాలా అన్యాయం జరిగింది -అమృతం ఇవ్వకపోవడం - కపటం తో బలిని అణచి వేయడం - హిరణ్యాక్ష -సోదరులను వంచించి చంపడం - ఇదేమిన్యాయం-? తల్లీ!" అంటూ స్తుతించడం -అమ్మ కరుణించి దయ తలచడం చెప్పారు
రాక్షస గురువైన శుక్రాచార్యుని తల్లిని హరి తన చక్రాయుధం తో నరకడం -కశ్యపుడు హరిని -తన భార్యను తనకు దూరం చేసిన హరి కూడా తన లాగే భార్యను కోల్పోయి కష్టాలు పడుగాక -! క్షుద్ర ప్రాణుల యోనులలో జన్మించేదవు గాక ! అని శపించడం -చేసిన పాపానికి హరి సీతను పోగొట్టుకొని బాధ పడటం - పంది -తాబేలు- సింహం ప్రాణుల లాంటి అవతారాలు ఎత్తడం చేశాడు
సాయంత్రం కృష్ణావతారం గురించి చెబుతూ -- కృష్ణుడు నానా కష్టాలు పడ్డాడు పుట్టిన నాటినుండి అవతార సమాప్తి వరకూ ! అతన్ని అడుగడుగునా శంకరుడు రక్షించాడు -రుక్మిణి కోరిక మేరకు 6 నెలలు ఘోరమైన తపస్సు చేసి ఈశుని మెప్పించి వరములు పొందాడు - ఈశుడు ఉమాసహితుడై కనికరించాడు -సంతానం ఇప్పించి "-గృహస్థ ప్రవర" అన్న బిరుదును అనుగ్రహించాడు
కృష్ణుని కష్టాలకు కారణం అతడు మానవ జన్మ ఎత్తడమే - ఎల్ల శరీర దారులకు -భార్యా పిల్లలు సంసారం -అనే అగచాట్లు తప్పవు- రాముడు కృష్ణుడు మానవ జన్మ ఎత్తినందుకు -అందరిలాగే సామాన్యుని వలె- తిండీ - నిద్రా- సుఖ దుఖాలకు గురి అయ్యాడు -- కృష్ణుడు తన ఇష్ట దైవ మైన శంకరుని గూర్చి తపస్సు చేసి శక్తి మంతుడై రాక్షసుల సంహరించి -శిష్ట రక్షణ చేశాడు -
మనలో ఉన్న ఆరువురు శత్రువుల తో బాటు అహంకార మమకారాల ప్రభావం వల్ల - మనం కూడా దైవానుగ్రహానికి నోచుకోకుండా పతన మౌతున్నాం - అమ్మను శరణు వేడాలి -సర్వం అమ్మ ప్రసాదంగా భావించాలి -
లలితా సహస్ర నామాలు చదివే సమయంలో -- అమ్మ గురించిన ధ్యాన శ్లోకం - --
" అరుణా కరుణా తరంగి తాక్షం !ధృత పాశాంకుశ ------ " చివరలో" అహమిత్య విభావయే భవానీం -"
అనగా నీవే అమ్మ వై పోతున్నావు - జగదంబ ఎంత సమర్తురాలో అంతగా నీవు లలిత సహస్ర నామాలను చదవడం వలన అద్భుతమైన అమ్మవారి స్వరూపాన్ని దరించ గలుగు తున్నావు -ఈతి బాధలకు అతీతంగా ఉంటున్నావు - జగదంబ పాదాలకు భక్తి తో మోకరిల్లిన దేవతలకు - దానవులకు -మానవులకు అమ్మ దయ ఉంటుంది -నీలోని వికారాలు నిన్ను బాధించవు - ఆపిల్ పండును నీవు ఆస్వాదించడం వలన నీవు ఆ పండు గా మారి పోతావు - అలాగే భువనేశ్వరీ మాత ను మనసా వాచా కర్మణా ఆరాధించడం వలన నీవు జన్మ రాహిత్య మైన మోక్షాన్ని పొంద గలుగుతున్నావు 

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...