నిజమే -- సినిమా హీరోలు మాత్రమే నిజమైన వీరులుగా అందరూ అనుకుంటారు - వారంతా మనంతయారు చేసిన - మన పొగడ్తల మీద ఆధారపడిన వెండి తెర బొమ్మలు - డబ్బులున్న దొర బాబులు -బయట మాత్రం జీరోలు నిజమైన హీరోలు ఎంతమాత్రం కాదు --మనం అనుకుంటున్న గొప్పతనం వారిలో లేదు - -' పేరు సంపాదన' తప్ప-- ఎవరికీ ఆ సినిమాలవల్ల ఏమీ ఒరిగింది లేదు '-సినిమాపిచ్చి ' అంటగట్టడం తప్ప
- మనలను పెంచి పోషించిన తలి దండ్రుల ప్రేమ-కష్టం దీక్ష అంకిత భావం ముందు - ఈ సినిమా హీరోలు దిగ దుడుపులే --మన అమ్మా నాన్నలే మన నిజమైన హీరో హీరోయిన్ లు -
మాతండ్రి గురించి చెప్పదలచు కుంటే నిజంగా అది అతిశయోక్తి అవుతుంది - నమ్మలేని నిజం ఆయన '-అపర ధర్మ రాజు-- పరమధార్మికుడు '-రెండు చేతులతో "ఆణిముత్యాల" వంటి అక్షరాలూ రాయ గలిగిన " సవ్య సాచి -చక్కని సంగీత కారుడు"ఆనందరామాయణం లాంటి కావ్యం కీర్తనలతో భక్తి భావం - తో రచించిన కవి -కళాకారుడు కూడా - అప్పట్లో తొక్కుడు హార్మోనియం ఉండేది - దానితో అణు నిత్యం ప్రాతఃకాలంలో రాగయుక్తముగా తన్మయత్వంతో భక్తిభావంతో" కీర్తనలు -మేలు కొలుపులు పాడుకొంటూ జీవితం ధన్యంచేసుకున్న పరమ భక్తుడు --
అద్భుతమైన తెలివి తేటలు గలవాడు -తాశిల్దారులాంటివారుకూడా ఆశ్చర్యపడేవిధంగా భూములు సర్వేలు వ్యవసాయ వ్యవహార విషయాలలో ప్రజ్ఞ కనబరచినవాడు-- -మేధావి- ప్రతిభాశాలి -
అలాగే మా అమ్మ తన ప్రేమ- అనురాగం- దైవభక్తి -లతో జీవితాంతం పండించుకోవడమే కాకుండా - మాచిన్నతనంలోనే తండ్రినిపోగొట్టుకొనిన మా ఐదుగురిని- ఎంతో కష్టపడి శ్రమకోర్చి- తానే తల్లి తండ్రియై మా జీవితాలను చక్కదిద్దిన ఆ మాతృమూర్తికి ఏమిఛ్చి రుణంతీర్చుకోనగలం - సాగిలపడి ప్రణామాలు సమర్పించు కోవడం తప్ప -1 "మరో జన్మ" అంటూ ఉంటే "ఓ భగవంతుడా 1 ఇదే అమ్మా నాన్నలను అనుగ్రహించ"మని కోరుకుంటాను ----1
ఈ రకంగా మన తలిదండ్రుల గౌరవ సూచకంగా ఎంత చెప్పినా తనివి తీరదు - భాష చాలదు -
జన్మనిఛ్చి -ప్రేమతోపెంచి పోషించి పెద్ద్దచేసిన ఆ " ప్రత్యక్ష దైవాల "గురించి చెప్పడం కాదు సేవించుకోవడంవల్లనే మనజన్మసార్ధకం అవుతుంది --
తల్లిప్రేమకు నోచుకోని వారు తండ్రి పోషణ కరువైనవారు -ఎంతమందో ! - హీరో హీరోయిన్ లు లేని సినిమా వంటిది వారి నిజ జీవితం - ఎంత దుర్భరమో - ఎంత దయనీయమో --
" మాతృ దెవొ భవ - పితృ దెవొ భవ -1 " అంటూ దేవుడిచ్చిన అపురూపవరాలు మన ఈ "అమ్మా నాన్న"లు - మన నిజజీవితం లో నిజమైన అసలైన సిసలైన హీరో హీరోయిన్ లు - సినిమా పాత్రలు కల్పితాలు కృత్రిమాలు భ్రమలు -మాత్రమే - అమాయక జీవితాలను తప్పు దోవ పట్టించే మాధ్యమాలు -- - దేవుని ప్రతి రూపాలైన మన తాళి దండ్రులను ప్రేమతో గౌఉరవన్తో ఆదరించు కుందాం సేవించు కుందాం పూజించుకుందాం - ఈ గుర్తింపు మనకు" శ్రీరామ రక్ష "!
Sunday, July 24, 2016
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment