Jan 30, 2017
శతమానం భవతు సినిమా చూశాం సంతోషంగా, బావుంది. ముఖ్యన్గా కథ, పాత్రలు చక్కగా కుదిరాయి.
ఇద్దరు కొడుకులు, ఒక కూతురు - ఎందరు ఉన్నా చివరకు మిగిలింది తలిదండ్రులకు వేదన, ఆవేదన. ఎప్పుడు వస్తారో, వస్తారో రారో , ఎదురుచూపులు.
ఈ సినిమా కేవలం విదేశాలకు వెళ్లిన బిడ్డల గురించి మాత్రమె తీశారు, నిజమే, వాస్తవానికి దగ్గరగా ఉంది మొత్తం సినిమా.
చివరకు విషాదంగా కాకుండా వినోదంగా ముగించడానికి ప్రేమతో ముడిపెట్టి ఇండియా లో ఉండిపోయే హీరో ని పెళ్ళాడి ఇక్కడే ఉండి పోయే హీరోయిన్ ని కథ లో మాత్రం చూడగలం.
డైలాగు లు, పల్లెటూరి సన్నివేశాలు, పాటలు, హాస్యం, నటన, చక్కగా ఉన్నాయి.
డైరెక్షన్ excellent.ప్రకాష్ రాజ్,జయసుధలు గొప్పగా జీవించారు. సీతమ్మ వాకిట్లో, అ ఆ, మిధునం సినిమా ల కంటే బావుంది.
అమెరికా కి తమ పిల్లలను తమకంటే పైకి ఎదగాలని పంపిన తల్లిదండ్రుల కన్నీటి గాథ.
ఈ కథ - వినోదంగా చూడటానికి సరే. కాని అనుభవానికి వస్తే మటుకు భరించలేం .
కంట నీరు పెట్టకుండా ఉండలేక పోయాను. సినిమా అని తెలుసు, ప్రక్కవాడు వింతగా గమనిస్తున్నాడు అని తెలుసు.
కాని కొన్ని సన్నివేశాల్లో జల జలా రాలే కన్నీరు ఆపుకోలేక పోయాను నేను.
మనవలు, మనవరాళ్ళ తో బాటు కూతురు. కొడుకులు తల్లి చేత అన్నం ముద్దలు తింటుంటే...
భార్య బిడ్డల కోసం పడే బాధ , ఆమెను ఒదులు కోడానికయిన సిద్ధ పడి న తండ్రి...
అందరు బాగుండాలని, తన ప్రేమను చంపుకుని బంధుత్వాన్ని పిలుపుతో కలుపుకొంటూ...
బావుండడం అంటే అందరితో కలిసి ఉండడం అంటూ, అందరినీ కలిపే ప్రయత్నం చేసే హీరోలు నిజ జీవితంలో ఉంటారా...ఉన్నారు. ఆనిపించింది..
రౌడీతో కూడా మంచి పని చేయించే మలుపు...లాంటి సన్నివేశం చాలా నచ్చింది. వాడిని మార్చ ఎంచుకున్నే విధానం బావుంది.
అన్నిటి కన్నా నాకు ఇష్టం... గ్రామ దృశ్యాలు, అందమైన దృశ్యాలు, చేనులు, కాలవ గట్లు, పొలాలు అద్భుతమ్.మళ్ళి చూడాలనిపించే సందడి!
శ్రీనివాస కళ్యాణం అందరిని కలిపింది. అన్ని సమస్యలను తొలగించి, కొడుకు కూతురి మనస్సులను మార్చింది. స్వామివారి పల్లకీ సేవ, సామూహికంగా గుడికి వెళ్ళడం, స్వామివారి దివ్య భవ్య మూర్తిని దర్శించుకోడం నిజంగా అద్భుతం!
రెండు చేతులు అప్రయత్నంగా జోడించి నమస్కరించి ఆనంద భాష్పాలు రాల్చాను. ఒళ్ళు పులకరించింది. దేవాలయం, సంక్రాంతి పండుగ, ముగ్గులు ఉత్సవాలు, సంబరాలు మనసును కదిలించాయి
సాలరీ కాదని, ఉన్న ఊరు విడిచి వెళ్ళే సమస్యే లేదనీ డబ్బుల కోసం నాలుగు గంటలు ఎక్కువ నైనా పనిచేస్తారు కాని మీ కోసం ఎదురు చూస్తున్న తలిదండ్రుల చూడడానికి సమయం ఉండదు. farming is not labor, A profession - A way of life అని నేర్పరా. economics కాదు emotions నేర్పాలిరా. పిల్లలకు పిలుపుతో బంధుత్వాలు పెంచుకోడం లాంటి మంచి అలవాట్లు నేర్పిస్తుంది ఈ సినిమా..
నిజంగా అందరు అలా ఒకే చోట కలసి సరదాగా అమ్మమ్మ చేతి ముద్దలు తినే రోజు ఎప్పుడు వస్తుందో కదా !
ఇలా నిట్టూరుస్తూ సినిమా చూసి బయటకు వస్తుంటారు విదేశాల పిల్లల తలిదండ్రులు... సినిమా కథ సుఖాంతమే..కానీ ప్రేక్షకుల పరిస్థితి గమనిస్తే మాత్రం........!"