Wednesday, March 22, 2017

Maya

" ఎందుకు పుట్టామొ " -కారణం ఎవరు చెప్పగలరు ?-- ఎక్కడినుండి వచ్చామో -ఎక్కడికీ పోతామో" తెలీదు - -- జీవిత పరమార్థం అంతా " నేను దేనికీ కర్తనుకాను " ఈశరీరంతోచేసే ఏ పనితో కూడా నాకు సంబంధంలేదు "అని అనుకోడంలోనే మూలంఉంది -"మనిషిభయం "అంతా ఈ "ఆశ" మరియు " మోహం " లోనేఉంది.

చంచలమైన మనసు దేవునిమూర్తిపై నిలువదు నిజమే ! -- కానీ ఆ మనసు ఎక్కడికి పరుగులు తీసినా అక్కడ పరమాత్మ ఉంటాడు - అందుకే దైవాన్ని తప్పించుకు పోలేదు -అయన అంతర్యామి -కనుక-- ముక్తిసాధనకు మొదట దేవతా స్థూలరూపాలు అవసరం-- పూర్వకాలంలో ఇంటిలోని గోడలకు దేవతా చిత్రాలు తగిలించేవారు --పిల్లలకు దేవుళ్ళపేర్లు పెట్టుకునేవారు- ఆ రకంగా "భగవన్నామ సంకీర్తనం" చేసుకునే భాగ్యం కలిగేది .

అప్పటి ఉపాధ్యాయులకు దేవుళ్ళపేర్లుపెట్టుకున్న విద్యార్థులపేర్లురోజూ పిలవడంతో ఎంతో పుణ్యం కలిగింది - ఇప్పుడేమో "పరమశివ సారాయిదుకాణమ్ " అంటూ దైవాన్నిచులకన భావంతో పిలుస్తూ తమకుతామే అధోగతి పాలౌతున్నారు -దేవతా మూర్తుల -విగ్రహాలు -ఫోటోలు హృదయాకాశంలో చింతించాలి అనునిత్యం స్మరించాలి -అది పరమపద వైష్ణవ మార్గం -- సద్యోముక్తి అంటే అహం బ్రహ్మోస్మి" --క్రమ ముక్తి అంటే విగ్రహారాధన --కొందరు "శాలిగ్రామా"లను నిత్యము పురుషసూక్తంతో పూజిస్తారు -అందుకు విశేషమైన పరాపరఫలాన్ని పొందుతారు--నిజానికి " నాదికాదు" అనే భావనలో అనంతమైన స్వేచ్ఛ ఉంది --- కానీ దానికి నిరంతర సాధన చేయవలసి ఉంటుంది --కదా !

కోటీశ్వరుడు ఒకడు -తన దగ్గర ఉన్న ఆస్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలీక ఒక సన్యాసికి ఇవ్వచూపాడు -- దానికి ఆ సన్యాసి -- " ఆస్తి నీది " అని అనుకోడంలోనే నీ అజ్ఞానం తెలుస్తోంది -- నీది కానీ ఆస్తికి నీవు జీతం తీసుకుంటూ కాపాడు !"-- అది ఎవరికి ఎప్పుడు ఎలా చెందుతుందో ఆలోచించకు -" - అన్నాడు .


ఎన్నాళ్ళు బ్రతికామో ముఖ్యంకాదు - అంతిమ ఘడియల్లో" నారాయణ స్మృతి "కలగడం ముఖ్యము -- - అలాంటి సౌఖ్యం కలగాలంటే సాధన కావాలి - "నార" చూపిస్తే "పీచు" అంటాడు - "అణా " చూపిస్తే "డబ్బులు" అంటాడు --కానీ ఆ రెండింటినిచూసి "నారాయణ "అని భావించడు ---- మనిషిని దైవంనుండి దూరం చేసేది -మాత్సర్యము -- దానితో అతనిలో ఉన్న "సత్వమ్ "పూర్తిగా హరించుకొని పోతుంది -- విలువైనసంపద ఎంతఉన్నా పొందలేకపోవడం నిజంగా మందభాగ్యము - పవిత్రమైన భావన కలగాలంటే తినేఆహారం శుద్దమైనదిగా ఉండాలీ -- భగవన్నామస్మరణతో వండినదిగా ఉండాలి -- ఎలాంటి భావాలతో ఆహారం తయారుచేస్తే మనసులో అలాంటి బుద్ధులే పుడతాయి -- దొంగతనంచేసిన పదార్తాలతో వండిన ఆహారంతింటే దొంగబుద్ధులే పుడతాయి -సంసారం అంటే అదేదో లోతులేని సముద్రం అని కాదు - " 

స్థిరత్వం నుండి మనసు దిగజారి పోవడం "-- సమభావన అంటూ వచ్ఛేది కేవలం స్మశానం లోనే - అక్కడ అంతా ఒకటే - అందరు సమానమే - ఉఛ్చానీచాలు లేవు - తరతమ బేధాలు లేవు - నిద్రలో తిన్నట్లుగా కలవస్తే - తెలివోచ్చ్చాక - కలలో తిన్నాం కదా అని మానివేస్తామా - అలాగే ఈ మిథ్యాప్రపంచ అనుభవాలు -- నిజానికి మనం నిద్రలో పరిపూర్ణ ఆత్మానందాన్ని అనుభవిస్తాము -- బాహ్య జగత్తులోకి కళ్ళు తెరిచి చూశాక - కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు బుధ్ది చిత్థము అహంకారము - 

ఇలాంటి 24 వికారాలతో వాస్తవమని భ్రమిస్తూ ఈ మాయాజగత్త్తులో మునిగి -- ఈ అన్నింటికీ మూలకారణమైన పరమాత్మఉనికిని మన అజ్ఞానం - సంచిత కర్మల ప్రభావం వలన వాస్తవాన్ని గుర్తించ లేకపోతున్నాము -

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...