Friday, September 14, 2018

కృష్ణలీలలు

కృష్ణలీలలు తలచినకొలదీ మధురం.! అద్భుతం.! 
మొదట వెన్న ,పిదప వస్త్రాలు, తదుపరి గోపికల చిత్తములు దొంగిలించిన బాలకృష్ణుని వన్నెలు చిన్నెలు అపురూపం, ఆనందకరం..! 

పుట్టిన శిశు రూపం నుండి తాను "సామాన్య బాలుడు కాదంటూ "అడుగడుగునా తన అసాధారణ అద్వితీయమైన దైవాంశను ప్రదర్శిస్తూ, ప్రేమానురాగాల ఆరాధనా తత్వాన్ని గోపికల ద్వారా చాటిన కన్నయ్య ను "వెన్నదొంగ " అనడం లో అమాయకం ,అజ్ఞానం ఉందని గ్రహించాలి. 

కృష్ణయ్య నడవడిని అనుసరించడం తప్పు,!అలాగే రామయ్య చరితను అనుకరించడం ఒప్పు ! 

కృష్ణ ప్రేమతత్వాన్ని,. అర్థం చేసుకొని ఆరాధించి, సాయుజ్యాన్ని పొందిన భక్త మీరాబాయి కీ కృష్ణయ్య పైన కలిగిన గాడానురాగం వలన ఎటు చూసినా , ఏది కనిపించినా ,నందగోపాలుని "దివ్యమైన మోహనరూపమే " అగుపించింది..! నీలాకాశంలో ని నల్లని మేఘం తన "కృష్ణయ్య నల్లని శరీర కాంతులను " తలపించింది.!..

 పారుతున్న యమునా తరంగాల సవ్వడి. "గోపికాలోలుని వేణుగానాన్ని "వినిపించింది. నదీతీరంలో, పచ్చన బయళ్లు ,చెట్ల పొదల్లో,,చల్లని గాలిలో, వెన్నెల కాంతుల్లో "నందనందనుని అందమైన లీలలను" తలపించాయి...! "ఇందుగలదందు లేడను సందేహము వలదు , మనసే అందాల బృందావనం ! "",అన్నట్టుగా కృష్ణ ప్రేమలో, కృష్ణుని ధ్యాసలో, ఆరాధనలో తనను తాను మరిచి, అనిర్వచనీయమైన ఆనందంతో, బాహ్యప్రపంచముతో సంబంధం తో ప్రమేయం లేకుండా ఆడుతూ పాడుతూ, గడిపింది. 

శ్రీకృష్ణభక్తితరంగాలు ఎదలో, మదిలో, హృదిలో, పొంగిపోగా, జీవించి, జన్మను ధన్యం చేసుకున్న మహా భాగ్యశాలి మీరాబాయి.!. ఆమె పాడిన ఒక్కొక్కగీతం ఆమెలో అణువణువునా నిండిన కృష్ణ ప్రేమను సూచిస్తోంది.. !ఆమె కళ్ళల్లో ,కదళికలో, కృష్ణుని పరిపూర్ణ అనుగ్రహం ఉంది. !. అందుకే తాను "నమ్మిన దైవం " పై తనకు ఎంత విశ్వాసం ఉంటుందో, అంతగా ఫలితం ఉంటుందని గీతాచార్యుడు శ్రీకృష్ణభగవాను డు ,భగవద్గీత ద్వారా అందించిన అమృత వాణి మీరాబాయి జీవితసార ము .. అది అమరము, 
 అనుభవైకవేద్యము,పరమానందకరము .

అలా శ్రీకృష్ణలీలాధ్యానామృతపానంతో ,,కృష్ణా.. సరసీరుహాక్షా, అనవరతం ,మా జీవితాలను పావనం చేయ్యి,,! గోపాలా,! నందబాలా !మురళిలో లా, !👌 ప్రకృతిలోని ప్రతికదలికలో నిండిన నీ చైతన్యాన్ని అనుభవించి, ఆనందించే యోగ్యతను, పాత్రతను ప్రసాదించు. ! యశోదా నందనా !,నీకివే శతకోటి ప్రణామాలు..!


No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...