Friday, September 14, 2018

శివోహం

శివోహం.. శివోహం.. శివోహం ...!" ప్రాణం ఉన్నంతవరకూ అందరూ బంధువులే.. స్మశానం వరకు వచ్చి. వెళ్తారు . చివరగా నిప్పుపెట్టాక కొడుకు వెళ్తాడు..కపాలచేదనం తో జీవుడు .బయటికొస్తాడు.. తనకు నివాసంగా ఉన్న శరీరం అనే ఇల్లు చితి మంటలలో కాలిపోతుండటం చూసి వ్యథ పడుతుండటం చూసి.. నేను ప్రేమతో అక్కున చేర్చుకుని ఓదారుస్తాను..... బ్రతుకు పై మమకారం పెంచుకొని. కోరికలు తీరక.. ఆశలు చావక.. భార్యా పుత్రులు ఇళ్ళు ఆస్తులపై మోహం వదలక చచ్చాక కూడా ..సద్గతులు పుట్టక ఇదే స్మశానంలో భూత ప్రేత పిశాచాలయి .ఉన్మాదం తో. పిచ్చిగా బ్రతికిఉన్న వారిని పీక్కుతినే కక్ష ద్వేషంతో ఉన్న గణాలను నా ప్రళయ తాండవ నృత్యంతో. నియంత్రిస్తూ ..వాటిని పాలిస్తూ ఉంటాను.....2...ఇలా సకల ప్రాణికోటి సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహించడానికి....ఉన్న నాకు బట్టకట్టుకోడానికి తీరిక ఉండదు.. అందుకే దిగంబరిని. సుగంద ద్రవ్యాలు పూసుకునే ఓపిక ఉండదు.. అందుకే భస్మాంబరధారిని. ..తిండితో పని లేదు... బిక్షాన్ దేహి..!అని లోకమాత మాతృమూర్తి వద్ద.. కపాలం తో భిక్షాటన చేస్తాను. అనగా ఓ మానవా. .మీరు మీ కపాలాలలో జ్ఞానంకోసం రాజరాజేశ్వరిని భిక్ష యాచించండి. మీ ధర్మపత్ని సహాయ సహకారంతో..". అన్న సూచనగా నేను ఆది భిక్షువును అయ్యాను.. !" అలా నేను "యోగి " ని అయ్యాను మీ కోసం..------------------------------------. అలాగే నేను అనగా శివుణ్ణి నీలో ఉన్న అంతర్యామి ని "భోగి " ని కూడా....! "జగమంత కుటుంబం నాది..! " ఇందరు కొడుకులు కూతుళ్లు.. చక్కగా నా లో సగభాగం అయిన ధర్మపత్ని రాజరాజేశ్వరి.. భార్యగా ఉండగా.. ధర్మ అర్థ కామ మోక్ష సాధనాల కై శ్రమించే మీరు ఉండగా. నేను సుఖంగా ప్రశాంతంగా . భోగిని కాకుండా. ఉంటానా . ? " నేను అనంతమైన వాణ్ని అయినా. మీకోసం ఇంత చిన్న లింగకారంలో మీకు అందుబాటులో ఉంటున్నాను .నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలతో పైన ఈశాన స్వరూపం తో వ్యక్తం అవుతూ.. నాకు మీరు ఎటువైపునుండి పూజలు చేసినా సంతోష పడుతుంటాను.. నేనేం మిమ్మల్ని సుగంధ ద్రవ్యాలు పట్టు పీతాంబరాలు .లక్షల డబ్బులు .వెండి బంగారాలు అడిగానా. .. .? ఇన్ని నీళ్లు పాలు పోస్తే చాలు ఇంత.భస్మం..పూసి నాలుగు ఆకులూ వేస్తే చాలు. ...!" అయితే ఎదో మొక్కుబడిగా కాకుండా మీ హృదయపూర్వక సమర్పణ.. తో ఆంటే ..శివ శివా అంటూ మీరు పోసే జలాధార లో మీ మనసు అనే పుష్పం వేసి.. సమర్పణా భావం తో చేయండి. అది నాకు ప్రియం.. మీ తలిదండ్రుల వద్దకు వెళ్తున్నప్పుడు .మీకు ఎంత ఆనందం ఉంటుందో. అలా నా వద్దకు రావాలి... అదే యజ్ఞం అదే నిజమైన భక్తి ప్రేమ శరణాగతి... జీవునికి దేవునికి అనుసంధానం ఈ మీ కైంకర్య శ్రద్దా భక్తి భావన. .ఇందులో ఆడంబరం లేదు. ఖర్చు లేదు.. బంధు జన పరివారంతో. పనిలేదు.. చదువు నమక చమకాలతో .నియమ నిష్టలతో పనిలేదు.. నిర్మల చిత్తం..పై గురి !. ఇష్టదైవం పై నమ్మకం ! " ౼౼౼౼౼౼౼౼౼౼౼౼ఓ మానవా !" నీకు నా తత్వం అదే శివం ఆంటే శివ చైతన్యం ఆంటే. శివ పూజ ఆంటే నీకూ నాకూ ఉన్న అనుబంధం ఏమిటో ..అర్థమైంది అనుకుంటాను..ఇక నీ ఇష్టం ! --- దూరంగాహిమాలయ పర్వతాలలో ఉంచుతావో.. లేదా శివోహం శివోహం అనుకుంటూ..నీ హృదయ కమలంలో నిలుపుకుంటావో....!" ... వేములవాడ .శ్రీ రాజ రాజేశ్వర స్వామికి జై... శ్రీ రాజ రాజేశ్వరి మాతాకి జై..!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...