Friday, February 1, 2013

Anasuya Vemuganti

ఆమె  చాలా భాగ్య వంతురాలు -గొప్ప కుటుంబలో  పుట్టి - గొప్ప కుటుంబంలో  మెట్టి -గొప్ప వ్యక్తిత్వాన్ని - సంస్కారాన్ని  సంపాదించుకుంది -!పదకొండు  మందిని కన్నది - కడుపారా ! ఇద్దరు  పోయినా - మిగిలిన తోమ్మండుగురి  లాలనా పోషణా  -చూసింది -తన భర్త  సహవాసంలో  -తన ముగ్గురు ఆడపడుచుల  పిల్లలను కూడా తామే  తలి దండ్రులవలె  ప్రేమతో చూసింది   --! తోబుట్టువులను  - వారి పిల్లలను అంత గా  గారవించి  - పెళ్ళిళ్ళు చేసి-వారిని  కన్నతల్లి తండ్రులు  లేని కొరత  దీర్చి - అందరిని సమానంగా ఆదరించి  ఆప్యాయతను పంచిన ఘనత--  ఆ  దంపతులకే  చెల్లింది --!
                ముఖ్యంగా ఎ పూర్వ జన్మ పుణ్యమో -ఆమెకు సనాతన  సాంప్రదాయం ఒంటవట్టింది -! మడీ  -ఆచారం- అంటూ -ముట్టు-స్నానం దేవుని పూజా - ఇవన్నీ  తనకి పెళ్లయింది మొదలుకొని  అక్షరాల  అమలు చేసింది -అత్తవారింటిలో ! ఎనిమిదవ  ఏట  పెళ్ళయితే - 86 సంవత్సరాల వయస్సువరకూ  అలాగే -తన జీవనాన్ని  కొన సాగించింది! -తన జీవేన శైలిలో  -ఎలాంటి మార్పులేదు ! చలి -వాన  ఎండా  కాలాల్లో నిశ్చలంగా -తన మడి వంట  ఆచారాన్ని - తు -చ  -తప్పక  పాటించింది - అదీ గంపెడు పిల్లలతో - ఇంటికి  వచ్చే పోయే  అతిథులు - అభ్యాగతులతో- ! తన ఇంటిలోనే గాదు  ఎవరింటికి వెళ్ళినా- అక్కడ కూడా  అదే  తన దిన చర్య  కొన సాగించింది 
                                  ఉదయమే  ఐదు గంటలకు - గంట కొట్టినట్లుగా - లేవడం  ---వెంటనే చన్నీళ్ళ  స్నానం చేయడం -పూలు -పూజ సామాగ్రి ఏర్పరచుకోడం - మడి చీర   కట్టుకొని దేవుని పూజ చేసు కోడం--తరవాత  మధ్యాహ్నం మళ్ళీ మడితో-  వంటా వార్పూ -రక రకాల పచ్చళ్ళు  శాకాలు -కుర పప్పులు - చారు -పండగైతే  బూరెలు -పుణుకులు-- పాయసం  పరమాన్నం - పూరీలు బజ్జీలు -ఒకటేమిటీ ? ఎన్నో రుచులతో  తనే స్వయంగా వంట  చేసి  - అందరికి  తనే స్వయంగా వడ్డించి -అందరిని తన వంటకాలతో  సంతృప్తి  పరచి -- చిట్ట చివరకు తను భోజనం  చేసేది  ఆ  మహా సాధ్వి -గొప్ప  ఇల్లాలు -పుణ్యాత్మురాలు ! మధ్యాహ్నం  పడుకోనేది కాదు -దేవుని  వత్తులు చేసుకుంటూ  ఏదైనా మాట్లాడుతూ  కాలక్షేపం  చేసేది -
                                           వయసు పై బడినా - చేత గాక పొయినా - అలాగే  అంత ఖచ్చితంగా  ఆ మడీ  ఆచారాన్ని పాటించడం  ఆమెకే చెల్లింది! -ఆమె మానాన  ఆమెను స్వతంత్రంగా  విడిచి - ఉదారంగా చూడటం  ఆమె  భర్తకే  చెల్లింది -!" చేత గాకున్నా  ఎందుకీ మడీ  వంటా ? """
 అని ఎవరైనా  ఆడిగితే- ఆమె నవ్వుతు  జవాబు చెప్పేది - !   "ఎవరైనా  నాకు మడికి వంట చేసి  పెడితే - నాకు కష్ట పడే అవసరం ఏమిటి ?"
 దీనికి  సమాధానం  లేదు -అంటే అలా మడి కట్టుకొని  రోజు ఆమెకు వంట చేసి పెట్టె వారెవరు  ?  అంత దీక్ష ఎందరికి  ఉంటుంది? !ఆమె పై ప్రేమతో  చేయ వచ్చు ! కాని అంత ప్రేమ  - ఎంత మందికి  ఉంటుంది ? పైగా ఆమెకు అంత చాదస్తం ఎందుకు అని ఈసడించుకునే వారు లేక పోలేదు -ముసలి తనంలో  ఇంత పట్టింప! అని కొట్టి పారేసే  వాళ్ళు  ఈ  రోజుల్లో చాలా మంది ఉన్నారు !ఇలాంటి వ్యకులమధ్య  -ఇలాంటి సంప్రదాయంతో ఉండాలనుకోడం  సాహసమే - మనసు గాయ పడటం సహజమే - అయినా మొక్కవోని విశ్వాసం  అమెది -తను ఇలా చేయడం వల్ల ఇతరులు  ఎవరికీ  ఇబ్బంది కలుగడం లేదుకదా ! తను వారిని తన లాగే ఆచరించమని  - ఉండాలనీ బలవంత పెట్టడం లేదు కదా ! తన పని  తాను చేసుకొంటూ - ఇతరులపై ఆధార పడకుండా  - నొప్పించకుండా మౌనంగా  ప్రశాంతంగా  గడుపుతోంది కదా ! 
             ఆమె ఒక గంగి గోవులా నిస్వార్థ జీవి - తనకోసం ఎవరిని  ఏమి  ఎప్పుడు అడగకుండా  - తనకు ఎ విషయాలు ఎవరూ చెప్పకున్న  పట్టించు కోకుండా  సీదా - సాదాగా  నిరాడంబరంగా  కలం వెల్ల బుచ్చింది - కావాలని  కొడుకులను  కూతుళ్ళను  చేయి  చాచి ఎప్పుడు ఇదీ కావాలని  అడగలేదు - వందనోటుకీ-- పది రూపాయల నోటుకీ  తేడా తెలీని  అమాయక  పల్లెటూరు  గృహిణి -పదహారు అణాల  తెలంగాణా పడుచు -!దేవుడు పూజ - ఎంత మందికైనా  అలసట లేకుండా -  ఆ  యాస పడకుండా  వండి  విస్తర్లలో  తృప్తిగా కొసరి  కొసరి వడ్డించి తిని పించడమే  ఆమెకు పరమానందం - అదే ఆమెకు మృష్టాన్న  భోజనం ! 
          అయితే ఇదే ఆమె చివరి కోరిక ఆమె జీవితంలో ! ఇలాగే పోవాలని -ఎవరి మోతాదులో  లేకుండా -తనను ఎవరూ చీదరించుకొనే పరిస్తితి  రాకుండా  చేయమని భగవంతున్ని  నిరంతరం  ప్రార్తించింది -! ఆయన ఆమె మొర విన్నాడు - అలాగే కరుణించాడు  కూడా !
                               చాలా మంది  ఆడవాళ్ళలో  ఇలా మడి  ఆచారం గల వాళ్ళు  లేక  పోలేదు - ఉన్నారు ! కాని  - ఆమెలా ఏక భుక్తం తో 
 కడుపు నింపుకొని  -అంత మధ్యాహ్నం  మాత్రమె తిని  - రాత్రి  ఏమి తినకుండా - దొరికితే  ఎప్పుడైనా  అరటిపండు-  లేదా ఉపవాసం  తో  ఇన్నేళ్ళు  బ్రతుకుని  గట్టి కట్టు బాటుతో  గడపడం  ఆమెకే చెల్లింది  !
                 దసరా - దీపావళి - సంక్రాంతి  - ముక్కోటి  ఏకాదశి  - ఇలాంటి పర్వ దినాల్లో - ఉదయమే లేవడం -అదీ వేన్నీళ్ళ  స్నానం చేయడం  అందరు చేసే పనే  ! కాని అనుదినం  అలా చేయడం  ఎ కొందరికో  సాధ్యం ! అదీ ఇలాంటి ధృడ  సంకల్పం  గల వాళ్ళకే  సాధ్యం అవుతుంది -!  అయితే ఆమెను దేవుడు చిన్న చూపు చూశాడు - ఆమె కళ్ళ ముందే-- కన్న కూతురు  - కన్న కొడుకు ఒకరు కాన్సర్ తోనూ మరొకరు ఆక్సిడెంటు తోనూ మరణించారు - ఎదిగిన పిల్లలు ఇద్దరు బిడ్డల్ని కన్నవాళ్ళు -చూస్తూ  చూస్తూ వెళ్ళారు  రెండు  సంసారాలు కుప్ప కూలి పోయాయి అదే పెద్ద షాక్ - అనుకుంటే -! ఏడాది దాటిందో  లేదో  - కట్టుకున్న భర్త - తనను విడిచి పరలోకాలకు వెళ్లి పోయారు -! అదే  ఆమెకు  BP SUGAR HEART ATTACK  లా ఒకే సారి వచ్చి పడ్డాయి -దాంతో ఎ జబ్బు లేని ఆవిడ మంచాన మూలకు పది ఉండాల్సి వచ్చింది మడి  ఆచారం దూరమయ్యాయి - ఆమె మానసికంగా క్రుంగి పోయింది - భగవంతుని నిర్ధయతకు దిగులుతో మంచం పట్టింది - చివరకి కాలు విరిగింది-  రెండు రోజుల్లోతన భర్త సాన్నిధ్యం  చేరుకుంది  ! అయితేచివేరి ఘడియల్లో కూడా ఎవరి మోచేతి నీళ్ళు తాగకుండా - మల మూత్రముల   బాధ  లేకుండా - ఇతరులు రోయకుండా-  తన జీవితం  చాలించింది - దేవుడిచ్చిన  ఆమె  కళ్ళను  నేత్రదానం చేశారు  రేకుర్తి  కంటి ఆస్పత్రి వాళ్ళను  పిలిపించి -పెద్ద కొడుకు !     
                 ఒక్క మాటలో  చెప్పాలంటే  - పళ్ళ మధ్య నాలుకలా-- ఇప్పుడున్న జీవన వ్యవస్థ లో - మారుతున్న సమాజంలో - ఇంత గొప్ప మనసుతో  ఒక యోగిలా - మునిలా - గడపడం  అనితర  సాధ్యం - ఆమెకే  సాధ్యం ! దేవుడు  పూజా మడి  ఆచారం ! ఇదే ఆమె నిత్య  ఆరాటం -వాటికి  పోరాటం  కూడా ఇంటిలో  నిరంతరం -నచ్చని వారి మధ్య  విసుక్కొనే వారి  మాటల నేదుర్కొంటు తను మాత్రం అలసట లేకుండా - యాష్ట  పడకుండా  - ఆయాస పడకుండా  ఇంత మందికి  అదే మడితో  వాడి వడ్డించి - పెట్టింది  -తను ఒక్కతే  వండుకోకుండా ! 
   ఆమె తన పెద్ద కొడుకు గురించి  సగర్వంగా  సంతోషంగా ఉండేది - :"వాడు -నాకు కొడుకు గా కాక - నేను వానికి తల్లిని అని చెప్పుకుంటే  నాకు ఆనందంగా ఉంది -ఎందుకంటే  పది మందిలో ఒక గొప్ప విలువైన -పదవిలో ఉంటూ -మంచి పేరు -కీర్తి -మాత్రమె గాక -ఎంతో మందికి ఆదర్శం  గా  ఉంటూ - ఫలాని రామారావు  అంటే చాలు - మాకు తెలుసు  అని నగర మంతా  అందరు చెప్పుకునే విధంగా జనం లోకి చొచ్చుకుని పోయి  వారికోసం -అంకిత భావంతో  పని చేసి -జిల్లా స్తాయిలో - రాష్ట్ర స్తాయిలో - చివరకు దేశ స్తాయిలో - ఖ్యాతి గడించిన  కొడుకు గురించి  ఎ తలి దండ్రులు మాత్రం  సంతోషం పొంద కుండా  ఉండ గలరు -  ?-
                             లోపాలు ఉంటాయి  మనిషిగా పుట్టాక !అవి లేక పొతే మనిషే కాదు !-పైగా ఆడవాళ్ళకు  ఉండే అతి సహజమైన - గుణాలు  -ఈమెలోను లేక పోలేదు - కాని  అవగుణాల కన్నా సుగుణాలే  మిన్న  ఈవిడలో ! అందుకే ఆమె చేసిన పూజా  ఫలం-- అందరిని సంతోష పెట్టింది! - చివరి ఘడియల్లో  అనాయాస మరణం  సంప్రాప్తించింది! -బ్రతికినన్నాళ్లు-  ఎ వ్యాధి ఆమెను  బాధించ  లేదు-! తన భర్త వలె  తాను అంత మంచి పేరు  తెచ్చుకుంది !- ఆరోగ్యము - ఐశ్వర్యము - కీర్తి ప్రతిష్టలు కలిగిన కొడుకులు  - కోడళ్ళు - కూతుళ్ళు  అల్లుళ్ళు - ఏనాడు పల్లెత్తు - కాని మాట అనని భర్త - -బంధువులు -అందరు  కలిసి  ఆమెను ఆప్యాయంగా - గౌరవంగా చూసేవారు !-  ఇప్పుడు-- ఆమె బలగం --మనవలు  మనవరాల్లతో కలిసి ఈజీగా - వంద మందికి పైగా  ఉన్నారు -! -కుడి భుజంలా  పెద్ద అల్లుడు  - మేనల్లుండ్రు -ఎడమ భుజం వలె పెద్ద కొడుకు -
ఆమె ఇంట్లో ఎన్నో పుణ్య కార్యాలు చేయడానికి అండగా నిలిచారు ఆ దంపతులకు సహస్ర చంద్ర దర్శనం చేయించారు అద్భుతంగా  ఘనంగా వైభవంగా -ఇంత గొప్పగా ఎవరికీ ఎవరు చేయలేదేమో  ? అన్నంత బాగా జరిపారు అంతాకలిసి -!ఆరుగురు కుతుల్లకి  ముగ్గురు చెల్లెళ్లకి పీటల పై కూర్చుంది కన్యా దానం చేశారు - ఇంట్లో నోములు - వ్రతాలు -పురుళ్ళు -పుణ్యాలు అన్నదానాలు చేసి దైవ భక్తిని పెంచుకున్నారు నత్యం  సంద్యా వందనం చేసే భర్త -- ప్రతి రోజూ- మడితో వంట చేసి  దేవునికి నైవేద్యం పెట్టె  ఇల్లాలు -ఇదీ చాలదా ? ఆ ఇల్లు  స్వర్గం  కావడానికి - పిల్లా పాపలతో  -కల -కల లాడటానికి !  - ఇంతకంటే మహా భాగ్యం  ఏముంటుంది  మనిషికి ?  
                  తన సౌఖ్యం - త్యాగం- చేసుకొని --- ఆరుగురు  చెల్లెళ్ళ  పెళ్లి ధ్యేయంగా - తన పెళ్లిని శాశ్వతంగా వాయిదా వేసుకుని - పరోపకారమే  పరమార్ధంగా -అంకిత భావంతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించి -  జిల్లా లోనే కాక -రాష్ట్ర -  -కేంద్ర  స్తాయిలో  మంచి గౌరవం-  పేరు -సంపాదించిన  కొడుకు -  కలగడం  వారు చేసు కున్న పూర్వ జన్మ పుణ్యం - ఇదీ వారు  అన్న  మాట ! నా మాట కాదు - !   
          ఎందరున్నా - పరిస్తితులు ఎలాఉన్నా  మొక్కవోని ఆత్మ బలం-- దైవం పై అచంచల విశ్వాసం  ఆమెకు ఉంది - అదే ఆమెకు జయాన్ని --శుభాన్ని- సంతృప్తిని  ఇచ్చింది - ఎంతటి వాడైనా దైవ బలం ముందు తల వంచ వలసిందే -!స్వధర్మం  మరవకుండా ఆచరిస్తే  చాలు ! 
                  -   తన కంటూ ఒక ప్రత్యేకత - ఒక చరిత్ర - ఒక కట్టుబాటు - ఒక విశ్వాసం - తన  ఆచరణ పై గట్టి నమ్మకం  -  చెక్కు చెదరని మనో నిగ్రహం  - ఇదీ ఒకరు  చెబితే  రాదు - నేర్చుకునేది అసలే కాదు - జన్మతహా  రావాలి - !ఆ సంస్కారం గల ఆమె మక్కువకు  జోహారులు హృదయ పూర్వకమైన  ప్రణామాలు ! శ్రద్దాంజలులు సమర్పిస్తున్నాము 

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...