Thursday, October 24, 2019

సంకీర్తన

Oct 24, 2019 Austin
"రాధే శ్యామ్, రాధే శ్యామ్, రాధే శ్యామ్, !""అనే నామం లో , ఆ నామ గానం లో ఏదో తెలియని అనందం అద్భుత శక్తి ఉంది, ! ఆ నామం పలుకుతూ, ఆడుతూ ఉంటే అంతరంగంలో రాధాకృష్ణ దివ్య మంగళ సుందర స్వరూపాలు  కదలాడుతూ మనసు ఆనందడోలికల్లో ఉయ్యాల లుగుతూ వుంటుంది.!
,. గోవిందుని నామ సంకీర్తన ఎంత గా పాడుతూ  భావిస్తూ ఉంటే అంతగా శ్రీకృష్ణ భగవానుని చుట్టూ మన అత్మ ప్రదక్షిణ చేస్తూ పరమాత్మ సాన్నిధ్యం లో తన్మయత్వం తాదాత్మ్యం చెంది పరమానంద భరిత హృదయంతో ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది.
నామం ఆపితే చాలు, ఆ ఆనంద నిలయం నుండి తిరిగి ఈ లోకంలో కి వచ్చేస్తాము , మళ్లీ సంసారం ప్రపంచం, నేను, నీవు, నాది నీది ప్రారంభం, దేనికైనా అంతు ఉంటుందేమో కానీ, ఈ గుంజాటనకు మాత్రం, శ్వాస మిగిలేవరకు అంటుల్లా అవుతూ ఉంటాం !
,, ఇదే నిత్యం,, ఇదే సత్యం అనుకుంటాం ,!
వాస్తవమే  !"జగత్తు మిథ్య" కాదు !, నిజమే, ! సత్యమే !!అంతా బ్రహ్మమే,! బ్రహ్మ పదార్థమే,! "అణువణువునా పరమాత్మ నిండి యున్నాడు!"" అని కూడా మనకు తెలుసు,,!,,
కానీ కనిపించే ప్రతీ పదార్థం లో ఆ దివ్యత్వాన్ని గుర్తించడం ఎలా,,?? అంతటా ఉండే దైవాన్ని దర్శించడం ఎలా ?
,,అనంత స్వరూపుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు , ఆద్యంత స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణపరంధాము నీ కనుగొనడం అంత సులభమా,?? నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపుడగు నాగరాజ ధరుని కాంచడం సామాన్య మా ?? కాదు కదా !
అది కేవలం, అతడి దివ్య నామ సంకీర్తన చేయడం వల్ల మాత్రమే సాధ్యం,!
నారాయణుడు ,పరమేశ్వరుడు నాద ప్రియులు,!" నా దొ బ్రహ్మ ,!"" అనగా ఆర్ద్రత తో, ఆర్తితో, పసి పిల్లవాడు అమ్మ కోసం అక్రందించిన విధంగా చిత్తశుద్ది తో పిలిచే పిలుపుకు దేవదేవు నీ సాక్షాత్కారం పొందే అవకాశం ఉంది,!" అని ఎందరో మహానుభావులు , భక్తులు , మహాత్ములు, ఋషులు , మునులు తమ ఆత్మార్పణ అంకిత భావంతో జీవితాలను పరమాత్ముని శ్రీ చరణాల ముందు సమర్పించి తరించిన పుణ్య చరిత ల ద్వారా మనకు తెలుస్తోంది.!
,, ఉదాహరణకు "శ్రీకృష్ణ భక్త
, మీరాబాయి "కేవలం   శ్యామసుందరుని నామ గాన ధ్యాన వైభవం తో పునీతు రాలై తన జన్మను ధన్యం చేసుకుంది,!
అంతేకాదు,! కన్నయ్య కు  తన మధుర కీర్తనలు వినిపిస్తూ , తాను తరించడమే కాకుండా, సమస్త వైష్ణవ భక్త లోకానికి  ఆ దివ్య నామ గాన మాధుర్యం తాను పాడిన మీరా భజన్ , పాటల ద్వారా అందిస్తూ, అతి సామాన్యులు కూడా  దైవానుగ్రహం పొందడానికి  ఒక చక్కని మార్గదర్శి అయ్యింది !!
కానీ ఆ "బ్రహ్మ పదార్థం"" లభించడం కోసం, ఇలా జీవితాలను త్యాగం చేసుకోవడం అందరివల్లా అయ్యే పనికాదు,!
, ఎవరో పుణ్యాత్ములు, తమ పూర్వ జన్మ పుణ్య ఫలం గా పొందే మధురానుభవ ప్రాప్తి పొందుతారు, అయ్యో, మనకా ప్రాప్తి లేకపోయే నా!"అని బాధ పడే అవసరం లేదు,
,,, అలాంటి త్యాగ నిరతి, సాధనా సంపత్తి , మామూలు జీవితం గడుపుతూ కూడా , ధ్యాస ఆ "పైవాడి ""పై మళ్ళిస్తు కూడా సాధించు కోవచ్చును,
ఎలాగంటే ,,ఏడుకొండల పై శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రాంగణం లో ,అనునిత్యం సాయంత్రం నిర్వహించే  నాదనీరాజనం  కార్యక్రమంలో  సంగీత విద్వాంసులు , వాద్య కారులు  తాము కృషి చేసి సంపాదించిన సంగీత సాహిత్య ప్రావీణ్యం తో ప్రతిరోజూ  శ్రీహరి భక్త జనులకు అనందాన్ని కలిగిస్తూ ఉన్నారు.
అక్కడే ధ్వజస్తంభం  సమీపంలో మరో వైపు , ఒక అద్భుత శ్రీహరి దివ్య నామ గాన భజన కార్య క్రమం ,  ""అఖండ నామ సంకీర్తన" పేరుతో అనుదినం అనునిత్యం అను క్షణం  అదే తిరుమల తిరుపతి దేవస్థానం వారు  నిర్వహిస్తు వస్తున్నారు,!,,
ఇక్కడ చేసే" శ్రీహరి భజన"" కు ఏ సంగీత పరిజ్ఞానం  సాహిత్య కృషి, , అధ్యయనము , అనుభవము , కృషి కూడా అవసరం లేదు,!
,,24 గంటలు "హరీ హరీ హరీ శ్రీహరీ!" అంటూ "రామా కృష్ణా నారాయణా, ఈశ్వరా , శివా , గణ నాయకా!"" అంటూ తమకు వచ్చిన బాణీ లో , నచ్చిన పద్దతిలో , ఆపకుండా తమ బృందంతో భజన చేస్తూ పోవడమే ,, నిత్యం వారు చేసేది !!" ఓస్,,ఇంతే కదా,!"" అనుకోడం కూడా  మన పొరబాటే  అవుతుంది,,,!
ఎందుకంటే" రాగం, భావం, తాళం , పాడుతున్నపాట మాధుర్యం , తెలియకున్నా అలా 8 గంటలు non stop గా శ్రీహరి దివ్య నామ గాన ధ్యాన ముద్రలో ఉండడం కూడా, మనం తలచుకుంటే వీలు అయ్యే పని కాదు!! అది  "భగవద్ అనుగ్రహం "తోనే వీలవుతుంది,
అలా అందరికీ అక్కడికి వెళ్లి, "శ్రీ రామ్ జయరామ్, జయ జయ రామ్ !""అంటూ బృందగానం చేసుకుని, ఆనందిస్తూ, తరించే అవకాశం ఉండక పోవచ్చును,! కానీ,,
""మనసుంటే మార్గం ఉండక పోదు కదా!, దైవభీతి, దైవభక్తి దైవానుగ్రహం ఉండాలి కానీ, మన ఇంటిలో మన మనసునే మందిరంగా భావిస్తూ తీరిక చేసుకొని "రామా కృష్ణా శివా" అంటూ తమకు ఇష్టమైన ఇలవేలుపు భజన ఎప్పుడైనా ఎక్కడైనా  చేసుకోవచ్చును,,
దేనికైనా, ఏపనికైన  ,తీరిక చేసుకుంటాం  !!కానీ,  దీనికి మాత్రం తీరిక , ఓపిక దొరకదు కదా,!
అనగా  ఈ "సంసార బంధాల"" ప్రభావం ఎంత బలవత్తరంగా ఉంటుంది అనే విషయం గ్రహించాలి,!,
ఈ భోగ భాగ్యాలు , సుఖ సంతోషాలు ,,ఏ దైవం వల్ల సమకూరాయి. అనే విషయాన్ని "అంతర్మథనం" చేసుకుంటే తప్ప , ఈ జన్మ కు ,"నిష్కృతి ,నివృత్తి "" మార్గం దొరకదు..
, అందుకే  పరమ దయా కరుడు అయిన ఆ పరమేశ్వరుని మనసారా వేడుకుందాం ,!
"" స్వామీ ! జగదీశ్వర!! మాకు సన్మార్గం చూపు,! సద్గతి ని అనుగ్రహించు,! సద్భావన ను ప్రసాదించు,! తండ్రీ!! నీవే గురుడవు! దైవానికి ,తల్లివి, తండ్రివి,! సర్వం నీవే,!
నన్ను బ్రోచి రక్షించే భారం నీదే !!పరమాత్మా,! పరందామా !!, పరమేశ్వరా! శరణు !శరణు! శరణు! అంటూ ప్రార్టించుకుందాం !
హరే కృష్ణ హరే కృష్ణా!"
,

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...