Mar 27, 2020
శార్వరి ,,,! అంటే జ్ఞాన దేవత ! సరస్వతీ మాత!"
""నీవెవరు ?
ఎక్కడి నుండి వచ్చావు ఈ భూమి పైకి ?"
ఏం ఉద్దేశ్యం తో వచ్చావు ? ,"
ఎక్కడికి వెళ్తున్నా వు ,?" తిరిగి ఎప్పుడు వెళ్తావు ??"
నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారు ? "
నీవే అనుకోని వచ్చావా ? "
తిరిగి ఎవరి వద్దకు వెళ్తావు ??
ఈ ఆకారం ,,ఎత్తూ,రంగు , ఈ స్వభావం , ఈ తలిదండ్రులు ,స్నేహితులు , ఇవన్నీ నీకు ఎవరు ,,ఎలా, ఎందుకు. ఎప్పుడు ఇచ్చారు ? ""
నీకంటే పెద్దవారు , నీ కంటే చిన్నవారు కూడా,నిన్ను విడిచి శాశ్వతంగా పోతున్నారు కదా ,,!
మరి నీవు ఎందుకు పోవడం లేదు ??
ఈ బందువులు అనబడే వాళ్ళను , నీ చుట్టూ తిరిగే ఇంతమందిని ,,నీవు ముందే చూసి తీసుకొని వచ్చావా ,,నీతో ??""
ఈ ఊళ్ళోనే , ఈ జిల్లా,, ఈ దేశంలో నే ,ఎందుకు పుట్టావు ?""
అమెరికా లాంటి ఇతర దేశాల్లో ఎందుకు పుట్టలేదు !?
అంటె. ముందే అనుకోని వచ్చావా ???
గత జన్మ లో ఎవరు నీవు ?""
వచ్చే జన్మ లో ఏమౌతావు ?""
అసలు ఈ చావడం అనేది ఎందుకు ?
ఈ ముసలి తనం ఎందుకు ?
ఇలాగే యువకుడిగా ఎప్పుడూ ఉండవచ్చు కదా !!""
నీకు భార్య గా ,లేదా భర్తగా లేదా కొడుకు కూతురు ,,, ఎప్పుడు ఎవరు వస్తారో నీకు ముందే తెలుసా ?""
వందల వేల గ్రహాలను,ఒకదానికొకటి తాకకుండా విశ్వంలో ఎవరు తింపుతున్నారు ??
ఎందుకు ? ఎలా?
ఎప్పటినుండి ??
ఇలా ఎంతకాలం ?!
,,,,??? భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటే దానిపై గల సముద్ర ,నదీ జలాలు ఎందుకు పడి పోవడం లేదు ??
భూమికి సూర్యుడికి మద్య యుగ యుగాల నుండి ఒకే దూరం ,ఒకే వేగంతో , ఒకే వలయం లో ఏ శక్తి తింపుతు ఉంది ?
నేను పడుకున్నా తెలివితో ఉన్నా ,నా శరీరంలో ఉన్న ఊపిరి తిత్తులు ,గుండె ,మెదడు ,రక్తప్రసరణ ,కాలేయము ,మూత్రపిండాలు , ఇలా అనేక అవయవాల ను ఆగకుండా ,, నా ప్రమేయం లేకుండా నడిపిస్తున్నది ఎవరు?!
నన్ను జీవింపచేస్తు ,నాతో పనులు చేయించే a అద్భుత దైవిక శక్తి ఎక్కడ ఉంటుంది ??
అసలు నేను ఎవరు ??
నా అసలు స్వరూపం ఏమిటీ ??
ఎన్నాళ్ళు ఈ ప్రయాణం , దేని కోసం , ఈ తాపత్రయం ??
ఇలాంటి అనేక వందల వేల కోట్ల ప్రశ్నలకి మనం జవాబు తెలుసుకోలేము !
అఙ్ఞానులం మనం !
సర్వజ్ఞుడు ,, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు !
మనకు""అంతా తెలుస్తోంది!"" అన్న "భ్రాంతి ""లో ఉన్నాం !
కానీ మనిషికి ఇంతవరకూ తెలిసింది ,సముద్ర తీరాల్లో ఉండే ఇసుకలో ఒక చిన్న రేణువు కూడా కాదు !
ఇవన్నీ పగలు వెలుతురు లో మన కళ్ళకు కనపడుతున్న వే !!
కానీ మనకు ఒక్క ముక్కా ,అర్థం కాదు ! సృష్టిలో
ఏ ఒక్క దాని గురించికూడా పూర్తి జ్ఞానం లేదు మనకు !!
అందుకే ,,ఇలాంటి పరి ప్రశ్నలు మనకోసం అర్జునుడు అడిగాడు భగవద్గీత లో !
""మహాత్మా ! పరమ పురుష! శ్రీకృష్ణా!!
ఈ ,యుగాలు ,తరాలు జన్మలు ,,ఎన్ని మారినా ,మనం ఎప్పుడూ కలిసి ఉన్నవారలమే !"" అని నీవు అంటున్నావు
,,కానీ
నీ గతం గురించి నీకు తెలియదు !
కానీ ,నాకు తెలుసు ! అని కూడా చెప్పావు !
పరంధా మా !, పరాత్ప రా !!
ఎప్పటినుండి ఈ జీవుడు,, ఆ దేవుడు కలిసి ఉంటూ ఉన్నారు?
అని అర్జునుడు అడిగిన
ఈ ప్రశ్నకు భగవానుడు ,!
భగవద్గీత , 4అధ్యాయం జ్ఞాన యోగం లో 5వ శ్లోకం !! లో samshaya నివృత్తి చేశాడు
"బహూ ని మే వ్యతీతా ని. జన్మాని తవ చార్జున ,!
తాన్యహం వేద శార్వాణి , న త్వం వేత్త పరంతప !!""
ఓ అర్జునా,!నీవును నేనును పెక్కు జన్మము లు ఎత్తి నాము !!
అవి అన్ని నాకు జ్ఞప్తి యందున్నవి !!
నీకు మాత్రం జ్ఞప్తి యందు లేవు !"""
ఈ పరంపర
అనాది నుండి వస్తూ ఉంది ! అంటూ క్లుప్తంగా ముగిస్తాడు . శ్రీకృష్ణపరమాత్మ !!
అంటే ,ఇన్ని కోట్ల జన్మల నుండి అని ఖచ్చితంగా సంఖ్యల్లో చెప్పాలి కదా !
శ్రీకృష్ణుడు చెప్పినా కూడా ,, ఆ స్థాయి లో ,
అర్థం చేసుకునే పరిజ్ఞానం , అర్జునుడికి లేదు !
అలాగే మనకు కూడా ,విజ్ఞులను ప్రశ్న అడగటం తెలియదు ,!!తెలిసిన దాన్ని అవగాహన చేసుకునే పరిజ్ఞానం కూడా లేదు !!
ఇప్పుడు మానవ జీవితంలో ఉన్న ఈ స్వర్ణ అవకాశం ""జ్ఞానం ""అనే దీపాన్ని వెలిగించుకోవడం !!
,దాని సహాయంతో , ఇహము పరము,
తనవా రు,పరాయి వారు, ఏం తెచ్చాం , ఏం తీసుకుని పోతాం
,గురించిన పరి ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవ డం!!
అది నిరంతర సాధన తోనే సాధ్యం !!
మనలో ఉన్న జ్ఞానం అనే దీపాన్ని వెలిగించే జగద్గురువు ,, దైవం ఆ శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా తన వాక్కు ల ద్వారా . మనకు అనుగ్రహించిన ""భగవద్గీత ""అనే సద్గ్రందం మాత్రమే , సకల మానవాళికి శరణ్యం !
మరి వేరే దారి లేదు !
""శార్వరి "" ఆ విధంగా జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తూ ఇప్పుడు ,వచ్చిన మన తెలుగు సంవత్సరం ,!!
మన ఋషులు ,,మన బాగు కోసం ముందు చూపుతో ,చక్కగా ఏర్పాటు చేసిన 60సంవత్సరాల లో,, 34 వది !"ఈ శార్వరి!
శార్వరి అన్న నామం , దాని వెనక ఉన్న పరమార్థం , పరిజ్ఞానాన్ని తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి !!
సృష్టి లోని సకల జంతువులలో మనిషి శ్రేష్ఠుడు గా పిలవబడ టానికి కారణం అతడికి ఉన్న ""జ్ఞానమే ""కదా !;
ఆ జ్ఞానాన్ని ,మనకున్న ""అజ్ఞానం అవిద్య ,అహంకారం "అనే చీకట్లను తొలగించడానికి వినియోగించు కోవాలి !
ఈ ""శార్వరి "" కొత్త సంవత్సరములో రెండు జీవిత లక్ష్యాలు పెట్టుకుందాం !!
ఒకటి ,___
""జ్ఞానం"" అనే జ్యోతినీ వెలిగించి , ఆ వెలుతురు సహాయం తో జీవన మార్గాన్ని సుగమం చేసుకోవాలి !!
అంతే కాదు!!
ఆ వెలుతురు ఇతరులకు కూడా మార్గదర్శనం చేసేలా,, దీపాన్ని పెద్దగా చేసి వెలిగించే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలి !
అంటే జ్ఞానాన్ని అభివృద్ది చేసుకోవాలి !!
ఈ జ్ఞానజ్యోతిని ,,మన ప్రాణ సమానంగా చూస్తూ , జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లకు , ఇబ్బందులు అనబడే తీవ్రమైన గాలుల తాకిడికి ,, అది ఆరిపోకుండా అప్రమత్తత తో ఉండాలి !!
రెండు !!'"
ఈ ""జ్ఞాన జ్యోతి" వెలుతురులో ,, ప్రాపంచిక దృక్పథం తో నే కాకుండా ,ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉండాలి !
రవి కాంచని చోటును కవి గాంచును
అన్నట్టుగా
జ్ఞానం ఉపయోగించు కోనివా డు మనిషి అనిపించు కోడు కదా!
భగవంతుని తో నేరుగా ఒక సంబంధం పెట్టుకుంటే , అతడి అనుగ్రహం మనపై. ,,""శ్రీరామరక్ష ""వలె పరిపూర్ణంగా ఉంటుంది !!
జ్ఞానం అనేది మన హృదయం లో ఉన్న పరమాత్మ గురించిన ""భావ సంపద ""!;
చిత్తశుద్ది ,ఆత్మవిచారం ఉంటేనే ఈ "జ్ఞాన పుష్పం"" వికసించి ,అందలి పరిమళభరితమైన సువాసనలు అనబడే " సంస్కారాలు ,,""భక్తి శ్రద్ధలు ,"" వెలువడి, మన జీవాత్మ ను పరమాత్మ వైపు నడిపిస్తాయి !!
శ్రీకృష్ణుని కరుణతో , భగవద్గీత ,పఠనం తో ,పదార్థం లో వున్న యదార్థ జ్ఞానం తెలుసుకుంటూ , పరమాత్ముని అనుగ్రహానికి పాత్రులం కావాలి !""
సర్వే జనాః స్సుఖీనో భవంతు !!""
స్వస్తి !""
హరే కృష్ణ హరే కృష్ణా !"
Sunday, March 29, 2020
శార్వరి నీవెవరు ?
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment