Thursday, May 28, 2020

మధుర భావన

May 31, 2016 10am
------------------------------------------------
 ఆరోజు-"హనుమత్ జయంతి"! --మంగళవారం 31-05-2016-   ఉదయం -10గంటలు --
శ్రీవిష్ణు సహస్రనామాలు నేను చదువుతూ ఉండగా -పద్మావతి  తులసీదళాలు
శ్రీకృష్ణునిపాదములవద్ద సమర్పిస్తూఉంది -- అప్పుడు నాఅంతరంగములో -ఒక
అద్భుతమైన దృశ్యo  కదలాడింది - మా తండ్రికి  ఎడమ వైపున మా తల్లి- ఇద్దరు
ఒకరి ప్రక్కన మరొకరు కూర్చొని ఉండడం - నేను చెప్పుతున్న ఒక్కొక్క
నామానికి - వారిద్దరుకలిసి -తమచేతులతో  -తమకు ఎదురుగాఉన్న నల్లనిఎత్తైన
శివలింగంపైన - తులసీదళాలను  వేస్తుండడం  -నాకు ప్రత్యక్షంగా కనిపించింది
- కళ్ళు తెరిస్తే ఎదురుగా భార్య  పూజ కృష్ణ విగ్రహానికి  -- కళ్ళు మూస్తే
కన్నతల్లి తండ్రి  పూజ శివ లింగానికి - నా నోట పలికే ప్రతి ఒక విష్ణు
నామానికి - అనుగుణంగా  చేస్తుండడం  దివ్యమైన -అద్భుతమైన -పరమానందకరమైన
అనుభవంగా తోచింది - కళ్ళవెంట ఆనందభాష్పాలు రాలాయి -శరీరం జలదరించింది
-నామాలు తడ బడ్డాయి -కంఠం  గద్గద మయ్యింది - "ఇంత గొప్ప భాగ్యమా -- ఈ
దీనుని పైన  వర్షించడం ! జగదీశ్వరా 1 నీకు ఇవే నా భక్తి పూర్వక ప్రణామాలు
-- అందుకో  -- అంతర్యామి 1 అనంతా ! ఆదిశేషా ! -'
   కలలో కూడా ఊహించని అమృత భావాలు -అనిర్వచనీయమైన అద్భుతక్షణాలు
అనుకోకుండా ఇలా అనుభవానికి రావడం - కేవలం పరమాత్మ అనుగ్రహం  తప్ప  -నేను
భావించింది కాదు -నాకు నా తండ్రి రూపం నిజంగా తెలీదు -  నాకు మూడేళ్ళ
వయసులో తండ్రి పోవడం - ఆయన ఫోటోకూడా లేకపోవడం - నావలె ఉంటాడని అందరు
అనుకోవడం తప్ప - మా తండ్రి రూపం అంతగా గుర్తు లేదు --
 అదేరూపం ఇప్పుడు కళ్ళముందు కదలాడడం - అతని ప్రక్కనఅమ్మ కూర్చుని ఉండటం -
ఇద్దరు కలిసి తమఆరాధ్య దైవమైన పరమ శివుని  పూజిస్తూ - నాకు తోచడం - ఇదంతా
 నాపైగల పరంధాముని కరుణాకటాక్ష వీక్షణలకు నిదర్శనగా -భావిస్తే -ఒళ్ళు
పరవశత్వంతో  పులకరిస్తోంది--
                                     కలలోనైనా  ఊహించని నా కన్న
తలిదండ్రుల జంటరూపాలను -15 నిముషాలపాటు -కనులముందు చూపించి --'భక్తితో
దైవపూజతో  తమవలె ధన్యులు" కమ్మని  -ఉపదేశించిన  ఆపరంధాముని
దివ్యపాదపద్మాలకు   సాష్టాంగప్రణామాలు సమర్పించడంతప్ప - - "ఆతని దయకు
వెలకట్టగలమా --!పొగడగ తరమా అతని లీలలు --!"
                   "  అంతయు నీవే హరి పుండరీకాక్ష !చెంత నాకు నీవే
--శ్రీ రఘు రామా !"
               ఓం నమశ్శివాయ  ! ఓం నమో నారాయణాయ !--
         నీ గురించిన ఇలాంటి  మధురభావాలతో  -  నిరంతరచింతనలతో  ఈ
జీవితాన్ని కొనసాగించేలా   అనుగ్రహించు తండ్రీ ! పాహిమాం 1 పరమేశ్వరా !
రక్షమాం !శ్రీ రామచంద్రా ! -- -

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...