Saturday, July 25, 2020

వాసనా బలం 2

Jul 1, 2020
శాస్త్ర వాసన ,మూడవది
,  ధర్మం ,న్యాయం ,సత్యం , భగవద్ భక్తి తెలిసినవాడు ,అనగా శాస్త్రం పట్ల అవగాహన  ఆసక్తి , ఉండి , దాని రుచి తెలిసిన వాడు ,  పొరబాటున _ప్రక్క దారిన పడితే   ఏమౌతుంది ?
  ఒక పండితుడు తన కూతుర్ని.  విద్యా బుద్దులు నేర్చిన ఒక యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించాడు
,ఏడాదికి కూతురు తండ్రి వద్దకు వచ్చి , నీ అల్లుడు  జూదం ,ఆడుతూ ,మద్యం తాగుతూ , పరాయి స్త్రీల సాంగత్యం తో పెడదారిన పడుతూ ,భ్రశ్టుడై పోతున్నాడు
అంటూ ఏడుస్తూ వాపోయింది
తండ్రి ఆమెను సముదాయించి నేను వచ్చి అతడితో మాట్లాడతానని చెప్పి తిరిగి పంపించాడు
,ఈయన వెళ్లి ,,తన అల్లుడిని ఏకాంతంగా కలిసి ఇలా చెప్పాడు
చూడూ !,నీవు చదువుకున్న వాడివి ,శాస్త్ర జ్ఞానం తెలుసు , !
నీవు చేస్తున్న మద్య పానం ,జూదం ఆట ,వ్యభిచారం లాంటి పర్యవసానం గురించి  నీకు బాగా తెలుసు
కానీ నీ భార్యకు ఇదంతా  అర్థం చేసుకునే పరిజ్ఞానం లేదు ,అమాయకంగా నీవు ఏదో తప్పు దారిన పోతున్నవని అనుకుంటూ ఉంది
,నిన్ను   అవన్నీ మానుకోమని అనడం లేదు
అయితే  అలాంటి చోటికి వెళ్ళేటపుడు  నీవు ఆమెకు కొంత జ్ఞాన బోధ చేసి వెళ్లు ,,ఒక శ్లోకం ,మంచి నీతి కథ చెప్పి  _నీ పని మీద వెళ్తూ ఉండు !
అంతే ! నీ మంచితనం మీద నమ్మకం తో ఆమె నీ తిరుగుళ్ళు గురించి ఇక  అంతగా పట్టించుకోదు ,
ఇలా నీవు చేయడం వల్ల __
ఇద్దరి మధ్య ఎలాంటి  సమస్య ఉండదు
అని చెప్పి వెళ్లి పోయాడు
  ఇతడి కి  కూడా    సంతోషంగా ఉంది,తనకు అడ్డు రాకుండా ,భార్యకు నాలుగు మంచి మాటలు చెప్పి వదిలించు కోవచ్చు గదా అనుకున్నాడు
ఆ రోజు నుండి బయటకు వెళ్ళే ముందు ఆమెను కూర్చో బెట్టి భగవద్గీత శ్లోకాలు ,జ్ఞాన యోగం గురించి చెప్తూ  ,  ఆ తర్వాత  తన  విలాస జీవితం గడపడానికి పోయే వాడు ,
అలా చేస్తూ చేస్తూ కొన్ని రోజులకు  ఆ వ్యసనాలకు దూరంగా ఉంటూ ,, వివేకంతో ఆత్మ విచారణ చేసుకుంటూ  వచ్చాడు
నేను  ఇంట్లో ఆమెకు చెబుతున్నది  ఏమిటి ? బయట నేను చేస్తున్నది ఏమిటి ?
శాస్త్ర విజ్ఞానం ఏ మాత్రం లేని ,,నేను చెప్పిందే వేదంగా   ఆమె వింటూ   నమ్ముతూ వస్తోంది
  నేను  చెప్పేదానికి , చేసేదా నికి   ఏమైనా పొంతన ఉందా ?'"
అంటూ  అత్మ విమర్శ చేస్తూ ఉంటే ,చివరకు తాను చేస్తున్న  తప్పు తెలిసి వచ్చింది ,
, శాస్త్ర వాసన ప్రభావం అలా ఉంటుంది
  ఈ మూడు వాసనలు ,దేహ వాసన , లోక వాసన,,శాస్త్ర వాసన ల గురించి అప్రమత్తత తో మెలగాలి ,
వాసన అనగా రుచి ,
ఒకసారి నాలిక తో రుచి తెలిశాక , ముక్కు తో వాసన పసిగట్టాక ఇక  మనిషి  దాన్ని అనుభవం లోకి తెచ్చుకునే వరకూ    పిచ్చి వాడి లా దాని వెనక తిరుగుతూ ఉంటాడు ,
ఒకవేళ దొరక్కుండా పోతే కోపం , ఆవేశం బాధ దుఖం ,, కసి,, పగ ప్రతీకారం ,, ఇలా ఆ పదార్థం ,లేదా వ్యక్తి గురించి మధనపడుతూ  ఉంటాడు
,దుర్యోధనుడు ద్రౌపది విషయం లో పెంచుకున్న  ఈర్ష్య కోపం ,  కట్టలు తెంచుకుని పోయాయి
చివరకు ద్రౌపదీ వస్త్రాపహరణం తో గానీ  , యుద్ధంలో అందర్నీ కోల్పోతే గానీ అతడి పగ చల్లారలేదు
, తన కున్న ఇంద్రియాల బలం దుర్వినియోగం చేస్తే , పశువు ఔతాడు
అవే పంచేంద్రియాల ను మనస్సుతో   కలిపి ఆత్మ లో లయం చేస్తే   సచ్చిదానంద స్వరూపుడు ఔతాడు
, వాసనా బలానికి లొంగ కుండా ఉండాలి అంటే , ఆ వాసన స్థలాలకు వ్యక్తులకు దూరంగా ఉంటూ, తప్పించుకు తిరగాలి
, ఎలాంటి సాంగత్యం అలవాటు చేసుకుంటే , అలాంటి వాటి వాసనల ప్రభావానికి లో నౌ తుంటాడు మనిషి
,ఎదురుగా బాహ్యంగా కనిపించే తీపి మత్తు జూదం లాంటి గురించిన వాసనలు మాత్రమే కాకుండా
గత జన్మ వాసనలు కూడా  మనిషిని వెంట బడి పీడిస్తూ ఉంటాయి
అపుడపుడు స్వప్నంలో కనిపించే భయంకర ,దృశ్యాలు  ఎన్నో జన్మల కర్మల వాసనా ప్రభావాలే
, టీవీ ,ఫోన్ సినిమాలు , మత్తు పానీయాలు, క్లబ్ లు ,విందులు ,వినోదాలు , ఇవన్నీ  వాసనలను  క్రమంగా బలపరిచేవే ,
  వాటి నుండి బయట పడాలంటే
తరుచుగా
ఆత్మ పరిశోధన చేస్తూ ఉండాలి ,
గత జన్మ లో చేసిన కర్మ ఫలాల వాసన ఈ జన్మలో అనుభవానికి వస్తూ ఉంటుంది ,,
జడ భరతుడు జింక గురించిన చింతలో చనిపోయి, జింక గా జన్మించి , అయ్యో ఎంత మూర్ఖంగా నా తపస్సు ను మాని,,ఇంద్రియాలకు వశుడ నై, జింక పై వ్యామోహం తో  జంతువు వలె ప్రవర్తించాను
భగవంతుడా ,నాకు మరొక్క   అవకాశం ఇవ్వు తండ్రీ అంటూ వల వలా ఏడ్చాడు
అలా ఉంటుంది వాసనా బలం
గీతాచార్యుడు చెప్పినట్టుగా దేన్నీ గురించి చింతిస్తూ మరణిస్తూ ఉంటాడో, మరుజన్మ లో జీవుడు అదే సంపర్కం తో జన్మిస్తాడు అని,,
హరి నామం, హరి రూపం హరి ధ్యానం చేస్తూ ,శ్వాస విడుస్తూ ఉంటే,జీవుడికి ముక్తి లభిస్తుంది ,
భీష్మ పితామహుడు ,,అన్యాయం అధర్మం వైపు ఉంటూ , ఏమీ చేయలేని విపరీత నిస్సహాయ స్థితిలో ఉంటూ కూడా , చివరి దశలో, తన ఎదురుగా శ్రీకృష్ణుని చూస్తూ   అంతిమ శ్వాస విడిచి మోక్షాన్ని పొందాడు ,,
అందుకే ఆత్మ ఉద్దరింపబడాలి అంటే  దుర్వ్యసనపరులకు దూరంగా ఉండాలి
సజ్జన సాంగత్యం అభిలషించా లి,,
దుర్వ్యస న స్థలాలకు ,వ్యక్తులకు,, దూరంగా ఉండాలి,
వివేకం తో   మంచి చెడూ  తెలుసుకుంటూ ఉండాలి
ఇదంతా స్వయంగా ప్రయాణిస్తూ ఉద్యమంగా సాగాలి
తాగుడు అలవాటు కు బానిసలైన వారు  ఇక ఆ వ్యసనం నుండి విముక్తిని పొందే అవకాశం చాలా చాలా తక్కువ ,
అలాంటి వారు , ఆ పరిస్థితుల ను  తప్పించు కుని ,, తిరుగుతూ ఉంటే  ,క్రమంగా  ఆ వాసనను  మరచిపోయే  అవకాశం ఉంటుంది ,,
అందుకే  సత్సంగం గొప్పది ,ఉన్నతమైనది ,ఉత్తమమైనది  మనిషిని , దైవం దగ్గరకు  చేర్చే అత్యుత్తమ మహోన్నత ఉత్కృష్టమైన  అద్భుత సాధనా సంపత్తి
  అలాంటి సంస్కారం ఉన్నవాడు నిజంగా అదృష్ట వంతుడు
పూర్వ జన్మ పుణ్య ఫలం ఉంటేనే గానీ ఆ "" సత్సంగ వాసన   "" లభించదు కదా
__ సత్సంగం తో , దుర్వ్య సన ల పట్ల  ఉన్న వాసనా బలం  క్రమంగా సన్నగిల్లుతుంది
, ఇది కావాలన్న  బలీయమైన వాసన కోరిక , ఆకాంక్ష, ఉండదు
ఈ దశలో మనస్సు నిలకడ గా ఉంటుంది ,ఇప్పుడు పరమాత్మ వైపు మరల్చు కొనే అవకాశం.  మనకు  ఏర్పడుతుంది
ఇదే జీవన్ముక్తి కి  మార్గాన్ని సుగమం చేస్తుంది
,అందువల్ల సత్వ గుణాన్ని స్వంతం చేసుకుందాం
  మనల్ని ప్రలోభ పెట్టే  వాసనలను  అణచి వేస్తూ ,,మనస్సును నిరంతర  దైవ చింతన తో ,,ఆత్మ విచారణ తో   ఆ  పరందామున్   భక్తి శద్దలతో ,ఆరాధిస్తూ  మానవ జన్మను సార్ధకం చేసుకుందాం
_"" సత్సంగ త్వే నిస్సంగత్వం !
నిస్సంగత్వే  నిర్మోహత్వం !
నిర్మోహత్వే  నిశ్చలతత్వం !
నిశ్చల తత్వే  జీవన్ముక్తిః _!
భజగోవిందం భజగోవిందం,!
గోవిందం భజ మూఢమతే! _!""
సర్వే జనాః సుఖినోభవంతు !
స్వస్తి!
హరే కృష్ణ హరే కృష్ణా !_""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...