Thursday, November 12, 2020

జయ జయ దేవ_ జయ రాధా మాధవ!

Sept 16, 2020
"రాధా _! నాపై నీ  కున్న ప్రేమ ఎంత ?
" కృష్ణా_!_ అంతులేని అగాధ సముద్రమంత _!
కాదు_ కాదు_!
ఈ అనంతమైన విశ్వ మంత __!
"రాధా _!నేనంటే నీకు  ఎందుకింత ప్రేమ ?
_""అది నేను అడగాలి నిన్ను
"కృష్ణా _! అయినా ,నేను  అంటూ వేరే లేను , కదా,_!
నీవే నేను _!
నేనే నీవు _!
అందుకే ,నేనే నీవై న , నీవు అంటే ఇష్టం నాకు  ,ప్రాణం_!, ప్రేమ _! స్వామవిి, ప్రభువు,భర్త ,కర్త  అంతా నీవే , సర్వస్వం నీవే  ,_!"_
"రాధా_!  క్షణమైనా నేను నిన్ను విడచి ఉండలేక పోతున్నాను,, ,ఎందుకో  తెలియడం లేదు నాకు ?_!""
_ "కృష్ణా_! అది  రేపల్లె గోపికలను  అడుగు ,వారు చెబుతారు _ నీకు  ఎందుకో _!"" రాధా,నీకు అసూయ కలగడం లేదా,నాకోసం   పరితపించే ఆ , గోప స్త్రీలను చూస్తుంటే  ?""
_""కృష్ణా _!    మహా రాసలీల వైభవం పొందిన తర్వాత  ఏ వ్రజ వనితలకు అలాంటి వికారాలు , అసూయ కలుగుతూ ఉంటాయి  చెప్పు _?""
""రాధా _! నిన్ను ఇక్కడకు  ఈ రోజున తీసుకుని వచ్చింది ,,_" అదిగో ఆ జయదేవ కవి ఉన్నాడే,,,నీకు అత డిని చూపించ డానికి ,,_!!"" , గీతా గోవిందం""  అనబడే  మధుర కావ్యం రాస్తూ ఉన్నాడు  చూశావా ?""
"" కృష్ణా _! మన  రాధా మాధవ ప్రేమ తత్వం అర్థం కావాలి ,, అంటే __ఈ  జయదేవుడు రమణీయంగా  కమనీయంగా ,,, శ్రవనానం దము గా ,,మనోహరంగా , మధురాతి మధురం గా , రచిస్తూ  ఉన్న_ ఆ  అష్టపదులు   చదివితే  చాలు ,నాకు నీపై ఉన్న ప్రేమానుబంధం నీకు  తెలుస్తుంది   తెలుసా _! నా ప్రేమ ఇంత, అంత అని ,నేను ప్రత్యేకంగా  చెప్పే అవసరం లేదు గోవిందా _!""
  ""నిజమే రాధా _! మన కే కాదు ,   మన భక్త జనులను  కూడా     ఆనందింప జేసే రసవత్తర రమణీయ దృశ్యకావ్యం ఇది _!! ఈ జయదేవ కవి ,బృందావనం   లోని అణువణువూ    తో మనకున్న అవినాభావ సంబంధాన్ని  అద్భుతంగా తన అష్టపది రచనా శైలి లో వర్ణిస్తూ ఉన్నాడు సుమా _!;  రాధా మాధవ శృంగారకేళి ,విరహ తాపాన్ని , ఇంత గొప్ప మహత్తర  రస రమ్య  శృంగార  ప్రబంధం గా  ఆవిష్కరించడం  ఇతడికి   ఎలా సాధ్యం అయ్యిందా అని నా సందేహం రాధా _!_??""
""కృష్ణా , ఎంత మాయగా డివయ్య నీవు ,?!_!  నిన్ను గాఢంగా విశ్వసించి , నీ కోసమే బ్రతుకుతూ__ నిన్ను ఆరాధించే  నీ అపర భక్త శిఖామణి గురించి ,నీకు తెలియ కుండా ఉంటుందా , స్వామీ?? _!
""రాధా _!   నమ్ము_!! ,నా మాటలు _! _, ఈ  జయదేవుడు రమణీయంగా చిత్రీకరించే ప్రతీ  దృశ్యం  యదార్థం ,_! 
__ మన యమునా తీర విహారం , పూల పొదరిండ్లు , మలయ పవనాలు , ఈ నా చిలుక అలుక లు ,_  నా పరోక్షంలో  నీ చెలులు  నా గురించి చెప్పిన ఓదార్పు మాటలు , నీ విరహం నిట్టూర్పులు ,కోపం ,దుఖం,ఇలా ఎవరూ చూడని మన ప్రేమా నుభవం ,, ,అన్నీ ఈ మహానుభావుడు మన కోసమే ,మన ఇరువురి ప్రేమానురాగాల గురించే ,,  తాను రచిస్తూ ఉన్న ఈ  గీత గోవిందం   కావ్యం లో,, మన గుట్టు రట్టు చేస్తూ, మన ప్రణయ గాథ, బట్ట బయలు చేస్తువున్నాడు  ! చూశావా రాధా _?""
""మాధవా __! నీ అనుగ్రహం లేకుండా ,   నీ శృంగార లీలలు  దర్శించే  భాగ్యం కలగడం  సాధ్యమా ? చెప్పు _?!""
"రాధా _!    నీవు   ఇలా చెప్పాలి  , ఈ  రాధా దేవి అనుగ్రహం పొందకుండా నన్ను చేరుకోలే రు అని_! కదా _! __!""!నా మాట అసత్యమా చెప్పు ??
"" కృష్ణా _!    నీ గురించి చెప్పే ప్రతీ కావ్యం , ఇతిహాసం,, పురాణం , ప్రబంధం ఏదైనా  అందులో  నా ప్రసక్తి లేకుండా ఉంటుందా చెప్పు ,?"""
"" రాధా _! చూడు , ఇంతవరకూ  అనందంగా రచన చేస్తూ ఉన్న  జయదేవ కవి __ అయ్యో ,అదేమిటి _?!  ఒక్కసారిగా  విచార వదనంతో ,రచన ఆపి  వెళ్లి పోతున్నాడు , ఏమైంది రాధా ?""
"" మాధవా_!! ,అదిగో__ ఆయన భార్య పద్మావతి    ఇదంతా చూస్తూ కూడా  ఎమీ మాట్లాడ టం లేదు_ సుమా  , అంతా నిశ్శబ్ధం_! ,,
  "మనం ఏం చేద్దాం రాధా,_?
""కృష్ణా మన ప్రియభక్తుని కి కలిగిన  ఖేదం  తొలగించ కుండా ఉంటామా _ చెప్పు _!? మనం వచ్చింది అతడిని అనుగ్రహించ డానికే కదా ప్రభూ _!_  నీవు  వెళ్ళి , ఆ కావ్య రచన అతడు  ఎక్కడ  ఆపాడో __ ఎందుకు ఆపాడో  చూడు , _!;నీకు  అర్థం అవుతుంది  అతడి     విచారానికి కారణం _!_!"
,"" రాధా _! ఎలా వెళ్లను,__? ఈ కృష్ణ రూపం తోనా   _?
    "" కృష్ణా ,_! అన్నీ తెలిసిన నీకు ఏమని చెప్పను _? నాతో చెప్పింతు వేమయ్యా , నటనా గ్రేసర చక్రవర్తి _!?? నిన్ను మించిన మహా నటులు లేరని నాకు తెలుసు లే , నంద నందనా _!!  నంద కిషో రా ,,_!వెళ్లు  స్వామీ __!తొందరగా ,_!  జాగ్రత్త _! పద్మావతి భర్త రూపంలో , వెళ్ళి  చూడు _!_ఆమెకు అనుమానం రాకుండా నటించు  _  అని చెప్పాలా __జగన్నాటక సూత్రధారి  ??_!" నేను కూడా  ఉంటా ను లే__   నీ ప్రక్కన   __!ఆమెకు అగుపించ కుండా _!
""రాధా _!   చూడు ఈ అష్ట పది __! ఇక్కడే రాసి కొట్టి వేశాడు , ఎందుకో ,, తనకి నచ్చలేదు కాబోలు _!_!""
"" కృష్ణా _! ఏ సందర్భము అది ? తాను రాసింది తనకే  నచ్చలేదు అంటే ,ఎదో సంకట స్థితి లో ఉన్నాడు అన్నట్టే గా _ మన  జయదేవుడు ,_!""
"" హే రాధికా _! ప్రియతమా__! ,ప్రియే _!, చారు శీలే ,_!రాధే ,! ఇందాకా మనం అనుకున్న మన ప్రేమ విషయమే అతడి బాధకు కారణం  అయ్యింది సుమా _!, చూడు _ఇక్కడ_!!"'
""అవును కృష్ణా_!   నా ప్రేమ విషమై నిన్ను కాటేస్తు ఉంది  అట  _! అమ్మో _!!"" స్వామీ ఇది నిజమా ?    నిన్ను  అంతగా బాధ పెడుతూ ఉన్నానా నేను ?"_
  ""  స్మర గరళ ఖండనం _
మమ శిరసి మండనం _
దేహి పద పల్లవ ముదా రం__!""
_!"" కృష్ణా ఇతడు మన ప్రేమ గుట్టు రట్టు చేస్తున్నాడు సుమా _!"
""  రాధా _!     నీ  చిగురు టాకులవంటి నీ కోమలమైన  మృదువైన పాద పద్మం తో నా శిరస్సును  ,,  నీ కాలితో తాకితెనే గానీ , నా తలకెక్కిన నీ ప్రేమ అనే    ఈ విషము తగ్గదు  సుమా  _! అని నేను   ఆ పొదరింటి లో,,బాధపడుతూ  నేను   నీతో  అన్న విషయం కూడా రాశాడు ,,_! ఎలా తెలిసిందో కదా ఈయనకు _?!"'
కానీ రాధా నేను పొందిన ఆ  బాధ కంటే , నా గురించి నా భక్తుడు పొందిన  ఈ బాధే  ఎక్కువగా ఉంది  _!;, ""చూశావా__! ఇవే చరణాలు__! రాసినవి కొట్టి వేశాడు ,_! అలాంటి చెడు ఆలోచన కలిగినందుకు,,తాను  బాధ పడుతూ ఉన్నాడు  రాధా_!!" మనం ఇపుడు ఏం చేద్దాం ?""
"" కృష్ణా  _!! భక్తుడు పొందిన అనుభూతి   మనం  ఆనందంతో అనుభవించిం దే  కదా ,,_! కల్పన కాదు కదా _; స్వామీ _!!  తాను దైవంగా భావిస్తూ ఉన్న కృష్ణ పరమాత్మ తలపై ,, రాధాదేవి కాలితో తాకడం ,అన్న  సున్నిత భావనను  పాపం , అతడు తట్టుకోలేక పోయాడు __!అందుకే   ఆ  చరణాలను కొట్టి వేసి  , ఇటువంటి ఆలోచన తనకు వచ్చినందుకు సిగ్గు పడుతూ  వెళ్ళి పోయాడు
కృష్ణా  _!   ""
""" రాధా  _!  జయదేవుని కి కలిగిన  అనుభూతి నిజం అని నిరూపించాలి మనం_! ఏమంటావు నీవు _??"" _!  ""అవును కృష్ణా _!  అవే చరణాలు మళ్లీ  నీవే __నీ స్వహస్తాలతో రాస్తే   _  సరి పోతుంది కదా _! """   జయదేవుని రూపంలో  ఉన్న నీవు అలా రాస్తూ ఉంటే , చిరునవ్వుతో , చూస్తూ ఉన్న   పద్మావతి ,, నిజంగానే   నిన్ను తన భర్త గా  అనుకుంటూ ఉంది ,    రాధా మనోహ రా _  అదిగో   అతడి  సతీమణి పద్మావతి , నిన్ను ఓరకంట చూస్తూ మందహాసం చేస్తూ  ఉంది ,చూడండి  ,,_!
""  ఆమెను నీవు కనిపెట్టు _  కానీ ,రాధా _!,నీవు చెప్పినట్టు అవే పదాలు తిరిగి   రాశాను _!,  నీకు తెలుసా ,_ రాధా ! అసలు  ఈ అష్టపదులు రచనకు మూల కారణం ఎవరో _?""
  "" కృష్ణా _! ప్రతీ భర్త విజయానికి వెనుక భార్య హస్తం ఉంటుంది  __!
రాధా  ఇలా నీవు నా  వెనక ఉంటూ , నా పనులు చక్కచేస్తు ఉన్నట్టుగా అవునా _?
అలా నవ్వకు కృష్ణా _! ఇది వాస్తవం _!  స్త్రీ అనే శక్తి తోడు లేని ఏ పురుషుడూ స్పందన లేని శిల వలె జడ పదార్థం  అవుతాడు సుమా_! చూడు  ఈ పద్మావతిని ,,  తన నాట్యం తో  హావ భావాల అభినయం తో , భర్తపై తనకు గల  అమితమైన ప్రేమతో ,, అతడి కావ్య రచన కు అడుగడుగునా ఉత్సాహాన్ని మనసులో నింపుతూ ప్రోత్సహించిన  ఈమె నిజంగా  ధన్యు రాలు , మాధవా _!""
""రాధా , తన భర్తకు గల అపారమైన ,  శ్రీకృష్ణ భక్తి తత్వం  అర్థం చేసుకొని ,, అతడిని తన నటనా చాతుర్యం తో బుద్ది కుశలత తో ఉచిత రీతిలో ప్రేరేపించిన    ,ఇలాంటి పతివ్రతా శిరోమణి ,,   కృష్ణ ప్రేమకు అంకితమైన  అలాంటి  కవి శ్రేష్ఠుడు , భక్త శిఖామణి  ___
ఇరువురూ ధన్యులే ,  రాధా _!  మన ప్రేమ కు ,  బృందావన దివ్య సీమకు , గీత గోవిందం అనే కావ్యం ద్వారా రూప కల్పన కావించిన  ఈ పుణ్య దంపతులు జీవన్ముక్తి పొందుటకు   యోగ్యులు కదా  _!,
""కృష్ణా__!  అసలు జయదేవుడు వచ్చే వేళ అయ్యింది ,  కలం పెట్టేసి లే __ అక్కడినుండి. ,,_! స్వామీ _! పద _పద , తొందరగా   _!,
  ""అయిపోయింది రాధా రాయడం ,, పద _!!!
అమ్మయ్య అనుకున్నట్టే వచ్చాడు , అదిగో  చూశాడు  మనం రాసింది ఆహా  , _! అతడి మొహం లో ఎంత ఆనందం వెలిగి పోతూ ఉందో చూశావా రాధా __!""?
__""  కృష్ణా _!తన భార్యను పిలిచ అమిత ి  సంతోషం తో చూపిస్తూ ఉన్నాడు _!!,వారి భక్తి విశ్వాసాలు ,   కావ్య రచనా పరిశ్రమ  కు  "రాధా కృష్ణ పరమాత్మ  ""అనుగ్రహం లభించినందుకు  ఎంతగా పరవశిస్తూ ఆనందిస్తూ ఉన్నారో చూడు  ,_!"
""కృష్ణా   నీ సన్నిధానం లో ఆమెకు కలిగిన మహదానందం  తో దంపతులు  ప్రణామాలు చేస్తూ ఉన్నారు , చూడూ ,_! స్వామీ , జయదేవ దంపతులు  ముక్తిని ఎప్పుడు పొందగలరు _?""
""రాధా _! నీ అనుగ్రహం పొందాక  ముక్తి మార్గం  సులభతరం అవుతుంది కదా _! ,  మన ఇద్దరమూ అతడి అంతరంగంలో  అనునిత్యము   నర్తిస్తూ ఉంటాము , __; _ ! అయినా
  రాధా ,_!  నాకు తెలియని విషయమా ,, నీ కు నాపై గల ప్రేమాతి శేయం  ??,_!
మన ప్రణయ గాథ ను , ప్రేమానురాగాల ను మానవాళికి   ఆదర్శంగా ఉండేట్టు గా , దంపతుల ప్రేమ అద్వైత ప్రేమ గా , ఒకరికొకరు ప్రాణం గా భావించే విధంగా ఉండేందుకు  ఒక ఉదాహరణగా ఉండాలని ,__ కదూ ,, రాధా,,నీవే  స్వయంగా  పద్మావతి  అంతరంగంలో   నర్తి స్తు,,  నీ నాట్య గతుల ద్వారా , పద ఘట్టన ము తో  ,,, కాలి అందెల సవ్వడి తో ,,   సుస్వర సంగీత భరిత  ధ్వనులతో ,  అలరింపజేస్తు ,,ఈ  గీతా గోవిందం కావ్య రచనకు  అష్టపదుల గాన మధురిమ కు  ప్రాణం పోస్తూ  __మన ప్రేమకు    సచ్చిదానంద స్వరూ పాన్ని   , ఆపాదించి పాత్ర పోషణ చేస్తూ_ పరోక్షంగా ,_  ఈ కావ్యానికి శాశ్వత త్వాన్ని కల్పించా వు  కదూ  రాధా__;""
""కృష్ణా _!  నేను పద్మావతి  అంతరంగం లో  ఉన్నాను  అంటే నీవు జయదేవుని లో అంతర్యామి  గా   ఉంటూ అతడి బుద్దిని ప్రేరేపిస్తూ , అతడి  కలం పట్టుకొని "  సంస్కృత సాహిత్యం లో  అష్ట పదులు అన్న నూతన కవిత్వ కావ్య రచన కు శ్రీకారం చుట్టా వని అర్థం కదూ కృష్ణా __!
        జయదేవ కవి రచిస్తూ ఉన్న తమ ప్రణయ కావ్య రచనా ఆనంద పారవశ్యంలో    ఇలా  రాధా కృష్ణులు  ఆనందానుభూతి పొందుతూ , పరస్పరం సంభాషిస్తూ , వారి  ఆనందనిలయమైన,  గోలోక ధామ మైన , పరమానంద కరమైన , వారు నడయాడిన  బృందావనం  చేరుకున్నారు
__  అద్వితీయమైన ,అపురూపమైన,   సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుని అపార కృపా కటాక్షములు  తనకు  లభించడానికి   __కారణం  జయదేవుని    అంకిత భక్తి యే కదా _!
__"కొందరు పుట్టుకతోనే జన్మతః భక్తులై , జ్ఞానులై ఉంటారు ,_!
భక్తి భావంతో సాధన చేస్తే భగవంతుడే  ఏదో ఒక రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడు అని  నమ్ముతూ  ఉన్న జగన్నాథ స్వామి భక్తుడు , ఈ జయదేవుడు _! అతడు  ఏక సంతాగ్రాహి ,_!  జగన్నాథుని పై కలిగిన ,అపార     భక్తి విశ్వాసాలతో  ,,అతడు ,ఆడుతూ పాడుతూ  ఆశువుగా గానం చేస్తూ ఉంటే , స్వామి లీలలు అతడికి కళ్ళకు కట్టినట్లు కనబడుతూ ఉండేవి _!
జనాదరణ pindua అతడి గీతాలు పాడుకుంటూ భక్తజన కృష్ణ భక్తి తన్మయత్వం లో   స్తుతిస్తూ  ,జయదేవుని అష్టపదుల వైభవాన్ని ఆనందిస్తూ ఉండేవారు _! ఆ విధంగా ,,
జయదేవుడు శ్రీకృష్ణుని పరబ్రహ్మ స్వరూపం గా పూజించాడు _;
గీత గోవిందమును శృంగార రసముతో , మధుర భక్తి తో ,  శ్రీకృష్ణుడు, పరమాత్మ గా , నాయ కుడుగా  , రాధాదేవి  జీవాత్మ గా ,నాయకీగా   చిత్రీకరిస్తూ భక్తి భావంతో  స్తుతించాడు __!
జీవాత్మ పరమాత్మల అనిర్వచనీయ మైన__  అవినాభావ  ప్రేమానురాగాల అనుబంధమే  __ ఈ ""గీత గోవిందం ""అనబడే కావ్య సారాంశం _!
హరిః ఓం తత్సత్ _!
    స్వస్తి _!
   హరే కృష్ణ హరే కృష్ణా _!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...