బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో_,!
బంగారు బతుకమ్మ__ ఉయ్యాలో !
అందాల బతుకమ్మ_! ఉయ్యాలో!
ఆనంద మిచ్చెను , ఉయ్యాలో_!
ఆడపిల్లల కెంతో , ఉయ్యాలో!
హుషారు కలిగించు ఉయ్యాలో_!
రంగుల పట్టు లంగ ఉయ్యాలో_!
పరికిణీ జాకెట్టు ఉయ్యాలో_!
పచ్చని గాజులు ఉయ్యాలో_!
కళ్ల కూ కాటుకా ఉయ్యాలో _!
కాళ్లకు గజ్జెలు ఉయ్యాలో,_!
చెవుల లోలకులు ,ఉయ్యాలో _!
పాపిటా చేరుతో , ఉయ్యాలో,,_!
కుంకుమా బొట్టెట్టి , ఉయ్యాలో_!
ముక్కు పుడ కా బెట్టి ఉయ్యాలో,!
మెడలో నెక్లెస్ తో డ ఉయ్యాలో,_!
పొడుగాటి జడ వేసి, ఉయ్యాలో_!
పూలదండలు పెట్టు కొని ఉయ్యాలో_!
ధరియించి తిరిగేరు, ఉయ్యాలో_!
బతుకమ్మ పాటను ఉయ్యాలో_!
అందరితో కలిసి , ఉయ్యాలో_!
ఆనందము గ పాడేరు ఉయ్యాలో_!
చప్పట్లు కొడుతూ ను ఉయ్యాలో
ముద్దుగా మురిసేరు ఉయ్యాలో_!
మహా లక్ష్మి రూపాలు ఉయ్యాలో_!
ఇంటింట వెలిగేరు ఉయ్యాలో_!
ఆడపిల్ల తిరుగిల్లు ఉయ్యాలో_!
ఆనంద నిలయమౌ , ఉయ్యాలో_!
వారి నవ్వుల పువ్వులే ఉయ్యాలో_!
మనల బతికించు చల్లంగ ఉయ్యాలో _!
బతుకమ్మ పండుగ ఉయ్యాలో_!
బతుకు బాగు చేయు ఉయ్యాలో_!
ప్రత్యక్ష దైవంగ , ఉయ్యాలో_!
నమ్మి కొలుతురు స్త్రీలు , ఉయ్యాలో_!
పర దేవత దుర్గమ్మ, ఉయ్యాలో_!
పూల బతుకమ్మ గా వెలిసే ఉయ్యాలో_!
భక్తి తో పూజించ ఉయ్యాలో_!
బ్రతుకు అందముగా మారేను ఉయ్యాలో_!
రంగు రంగుల పూలు ఉయ్యాలో_!
దుర్గ వైభవం తలపించు ఉయ్యాలో_!
అందరీ పండు గిది ఉయ్యాలో_!
అందరిని కలుపు ఇది ఉయ్యాలో_!
అందాల బతుకమ్మ ఉయ్యాలో _!
చల్లని దీవన లీయమ్మ ఉయ్యాలో_!
మరువక నిను కొలిచేము ఉయ్యాలో _!
తీరు తీరు పూల_ ఉయ్యాలో_!
ఏటేట కోలిచేము , ఉయ్యాలో _!
దయ ఉంచి మమ్మెలు ఉయ్యాలో_!
ఈ కరోనా కష్టాలు ఉయ్యాలో_!
నీ దయ చేత నే తొలగు ఉయ్యాలో_!
ఊరూర ఆరు బయట ఉయ్యాలో_!
కలిసి ఆడుకునే పండుగ ఇది ఉయ్యాలో _!!
ఊరంత కలుసుకొని ఉయ్యాలో_!
ఆడి పాడే రోజు _ఉయ్యాలో_!
అందిం చు త్వర లోన, ఉయ్యాలో_!
వేల దండాలు నీకమ్మ _! ఉయ్యాలో!