Thursday, October 14, 2021

బతుకమ్మ బతుకమ్మ వుయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో_,!

బంగారు బతుకమ్మ__ ఉయ్యాలో !

అందాల బతుకమ్మ_! ఉయ్యాలో!

ఆనంద మిచ్చెను , ఉయ్యాలో_!


ఆడపిల్లల కెంతో , ఉయ్యాలో!

హుషారు కలిగించు ఉయ్యాలో_!

రంగుల పట్టు లంగ ఉయ్యాలో_!

పరికిణీ జాకెట్టు ఉయ్యాలో_!

పచ్చని గాజులు ఉయ్యాలో_!

కళ్ల కూ కాటుకా ఉయ్యాలో _!

కాళ్లకు గజ్జెలు ఉయ్యాలో,_!

చెవుల లోలకులు ,ఉయ్యాలో _!

 పాపిటా చేరుతో , ఉయ్యాలో,,_!

కుంకుమా బొట్టెట్టి , ఉయ్యాలో_!

ముక్కు పుడ కా బెట్టి ఉయ్యాలో,!

మెడలో నెక్లెస్ తో డ ఉయ్యాలో,_!

పొడుగాటి జడ వేసి, ఉయ్యాలో_!

పూలదండలు పెట్టు కొని ఉయ్యాలో_!

ధరియించి  తిరిగేరు, ఉయ్యాలో_!


బతుకమ్మ పాటను ఉయ్యాలో_!

  అందరితో కలిసి , ఉయ్యాలో_!

ఆనందము గ పాడేరు ఉయ్యాలో_!

 చప్పట్లు  కొడుతూ ను ఉయ్యాలో

  ముద్దుగా మురిసేరు ఉయ్యాలో_!

 మహా లక్ష్మి రూపాలు ఉయ్యాలో_!

 ఇంటింట వెలిగేరు ఉయ్యాలో_!

ఆడపిల్ల తిరుగిల్లు ఉయ్యాలో_!

ఆనంద నిలయమౌ , ఉయ్యాలో_!

వారి నవ్వుల పువ్వులే ఉయ్యాలో_!

 మనల  బతికించు చల్లంగ ఉయ్యాలో _!


బతుకమ్మ పండుగ ఉయ్యాలో_!

బతుకు బాగు చేయు ఉయ్యాలో_!

 ప్రత్యక్ష దైవంగ , ఉయ్యాలో_!

నమ్మి కొలుతురు స్త్రీలు , ఉయ్యాలో_!

  పర దేవత దుర్గమ్మ, ఉయ్యాలో_!

పూల బతుకమ్మ గా వెలిసే ఉయ్యాలో_!

భక్తి తో పూజించ ఉయ్యాలో_!

 బ్రతుకు  అందముగా మారేను ఉయ్యాలో_!

రంగు రంగుల పూలు ఉయ్యాలో_!

 దుర్గ వైభవం తలపించు ఉయ్యాలో_!


అందరీ పండు గిది ఉయ్యాలో_!

అందరిని కలుపు ఇది ఉయ్యాలో_!

అందాల బతుకమ్మ ఉయ్యాలో _!

 చల్లని దీవన లీయమ్మ ఉయ్యాలో_!

మరువక  నిను కొలిచేము ఉయ్యాలో _!

తీరు తీరు పూల_ ఉయ్యాలో_!

ఏటేట కోలిచేము , ఉయ్యాలో _!

 దయ ఉంచి మమ్మెలు ఉయ్యాలో_!


  ఈ కరోనా కష్టాలు ఉయ్యాలో_!

నీ దయ చేత నే తొలగు ఉయ్యాలో_!

 ఊరూర ఆరు బయట ఉయ్యాలో_!

 కలిసి ఆడుకునే  పండుగ ఇది ఉయ్యాలో _!!

ఊరంత కలుసుకొని  ఉయ్యాలో_!

ఆడి పాడే రోజు _ఉయ్యాలో_!

అందిం చు త్వర లోన, ఉయ్యాలో_!

 వేల దండాలు నీకమ్మ _! ఉయ్యాలో!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...