Sept 21, 2020
"మనసు బాధ పడటం , వలన కష్టంగా అనిపిస్తూ వుంటుంది _!""
"" _మనసా ? అంటే ఏమిటి _??"" అదెక్కడుంటుంది ??
__""మనసు అంటే నేను ,అనే అహంకార __జీవ భావం _!""
_"" మరి , బాధ పడటం అంటే ఏమిటి _?"
"" తాను అనుకున్నట్టుగా జీవితంలో జరగక పోవడం వలన , రోగం జ్వరం , ముసలి తనం ,నష్టం రావడం లాంటి పరిణామాల వలన బాధలు కలుగుతాయి !""
""కష్టాలు రాని వారు ,లేని వారు ఉంటారా _?"
"" ఉండరు _! కష్టాల కు అతీతులు ఎవరూ కారు _! జన్మించిన ప్రతి ప్రాణి కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది _!""
""ఎవరికి వస్తాయి కష్టాలు _?""
""మనిషి అన్న ప్రతివాడికీ వస్తాయి కష్టాలు _!""
"" ఎవరి కష్టాలు ఎక్కువ _? ఎవరివి తక్కువ _?""
"" ఎవరి కష్టాలు వారికే క ఎక్కువగా,, ,ఇతరులవి తక్కువ అనిపిస్తాయి _!
""ఎందుకు ,, అలా ఒకే కష్టం ఒకరికి ఎక్కువా మరొకరికి తక్కువగా అనిపిస్తాయి ?"
"" ఎందుకంటే ఇతరుల కష్టాలు టీవీ,లో సినిమాలో చూస్తున్నట్టుగా చూసి మరచి పోయే వీలు ఉంటుంది _!,, కానీ తాను కష్టం లో ఉంటే ఇతరులు చూసి "" అయ్యో_! పాపం _! ,అని సానుభూతి తెలిపేందుకు వస్తుంటే భరించలేక కోపం ,ద్వేషం ,అసూయ , బ్రతుకు పై నిరాశ ,కలిగి చివరకు చావడానికి కూడా సిద్ధపడతాడు _! తన కష్టాన్ని విపరీతంగా ఊహిస్తూ , పిచ్చి వాడై పోతూ ఉంటాడు _!"" అందుకే
ఏదైనా తన దాకా వస్తేనే తెలుస్తుంది కదా _!"అంటారు విజ్ఞులు _!!""
""మరి కష్టం వస్తె _ఏం చేయాలి _?
_"" వచ్చిన కష్టాన్ని భగవద్ అనుగ్రహంగా ఎంతో ఇష్టంగా స్వీకరించాలి ,_! సుఖం వస్తే తనకు ఎంత సంతోషం అనిపించిం దో __అలాగే కష్టం కూడా సుఖమే, అనుకోవాలి _!
"" కొందరికే కష్టంగా ఎందుకు అనిపిస్తుంది ,,_?
,ఎందుకు అలా అనిపిస్తుంది _? ,కష్టాల్లో కూడా తేడా లు ఉంటాయా !"??
""ఉంటాయి అనుకుంటే ఉంటాయో _! అసలు ఈ కష్టం ఎందుకు వచ్చింది,,అనేది కేవలం అత్మ విచారణ చేస్తే , నే తెలుస్తుంది,_!!
అత్మ అంటే ఏమిటి _?అదెక్కడుంది _?
అత్మ ,జీవుడితో కలిసి ఉంటుంది, _!అందరిలో జీవాత్మ ఉంటుంది ,_! ,జనన మరణ చక్ర వలయంలో తిరుగుతూ జీవాత్మ ఇలా కష్ట సుఖాలు అనుభవిస్తూనే ఉంటుంది _!"" _
"" అసలు ఎందుకు కష్టాలు వస్తాయి _?""
"" చేసే ప్రతీపనిలో ఫలితం కోరడం వలన ,, అది కష్టం ,సుఖం రూపంలో లభిస్తూ ఉంటుంది _!!, ఆ ఫలితం అనుకూలంగా ఉంటే సుఖం గానూ ,,,ప్రతికూలంగా ఉంటే కష్టం గానూ ఉంటుంది _! ""
_"" మరి ,అందరి కష్టాలు ఒకేలా ఎందుకు ఉండవు ?""
__" ఉండవు ,వారి స్వభావం గుణాలు కర్మలను బట్టి , కష్టాల తీరు మారుతూ ఉంటుంది _! వారి ఆకారం వలెనే ,వారి ఆలోచన _అదృష్ట దురదృష్ట అనుభవాలు కూడా భిన్నంగా ఉంటాయి _!
,"అలా ఎందుకు ఉంటాయి ,అందరం మనుషుల మే కదా _!"
అవే కాళ్ళు,,అవే చేతులు,అదే ఆకారం కదా_??"" _!"
"" నిజమే _! కానీ , గత జన్మలో చేసిన పాప ఫలాలు ఈ జన్మ లో వేధిస్తూ , ,జీవుడిని ఆ ఫలితాన్ని అనుభవించే లా చేస్తుంది _!_!""
__ ఏమిటీ _?గత జన్మ ప్రభావం ఇప్పుడు_ ఈ జన్మలో ఉంటుందా ? నేను నమ్మను _!""
సృష్టి నియమాలు అవి ,, , పుట్టక తప్పదు ,చావక తప్పదు ,కర్మలు చేయక తప్పదు ,అలాగే వాని ఫలితం మంచి అయినా చెడు అయినా ఎవరికైనా , రాముని కైన ,కృష్ణుడైన , మానవ జన్మ ఎత్తాక అనుభవించక తప్పదు _!!"" ,మనం__"అందరం మనుషులమే అన్నావు కదా _ నీవు _!
మరి , అందరం అందంగా ఒకేలా ఆకారంలో స్వభావాల లో ఒకేలా ఎందుకు ఉండటం లేదు _! అంటే సృష్టి నియమాలు మనల్ని మన జీవన చర్యల్ని నియంత్రిస్తూ ఉన్నాయి ,అనగా నీవు స్వతంత్రుడ వు కాదు , ,_! ఉదాహరణకి ,,మనలో కొంతమంది గ్రుడ్డి వారు __, కుంటి ,అవిటి ,చెవిటి ,అంగ వైకల్యం తో ,వికారంగా కొందరు ,అందంగా కొందరు , కుబేరులు కొందరు ,దరిద్ర నారాయణ చక్రవర్తులు కొందరు ,పొట్టిగా ,పొడుగ్గా ,ఎర్రగా నల్లగా , అనిపిస్తూ ఉంటారు _! ఇలా ఎందరు మనుషులు_ ఎన్ని దేశాల్లో , భూమిపై ఉన్నారో ,,వారిలో అన్ని తేడాలు ఉన్నాయి,_!! అంతెందుకు __?!_ ఒక్క తల్లి కడుపులో పుట్టినవారు కూడా ఎన్నో రకాల ఆకారాలు ,స్వభావాలు ,అనుభవాలు కలిగి ఉండటం మనం చూస్తున్నాం కదా ,_!""
" కష్టాలు ఒకసారి ఎక్కువగా తక్కువగా , ఎందుకు అనిపిస్తాయి ?
,_"",ఎందుకంటే,ఇతరుల తో పోల్చుకోవడం వల్ల కష్టాల్లో హెచ్చు తగ్గులు అనిపిస్తూ ఉంటాయి _!
__ ఎందుకు అలా అనిపిస్తాయి _??"
__ కష్టాలు పడేవారు ,,తనకన్నా ఎక్కువ కష్టాలు పడేవారితో పోల్చుకుంటే , తమ కష్టాలు చిన్నగా అవుతాయి ,క్రమంగా ,, మరిచి పోతారు కూడా _! ,,,కానీ ,వచ్చిన చిక్కే మంటే ఎప్పుడూ ,తనకన్నా తక్కువ కష్టాలు పడే వారితో నే పోల్చు కుంటాడు_ చిత్రమైన తత్వం గల ఈ మనిషి _!_!""
,_"" కష్టం అనేది రాకుండా ,కష్టం తెలియకుండా ,ఎవరైనా ఉండవచ్చా ?"
__ ,"" బహుచక్కగా ఉండవచ్చు _! కానీ దానికి నిరంతర సాధన అవసరం ఉంటుంది _!"
,""ఎలాంటి సాధన _ అది_? సులభమా _? కష్టమా _??
___"" , చెప్పానుగా కష్టం సుఖం అనేది ,మన భావనలో ఉంటుంది అనీ_! ఈ కష్టం దైవారాధన కోసం వినియోగిస్తే అది నీకు శాశ్వత సుఖాన్ని ఇస్తుంది _! కష్టం తొలగాలి అనుకుంటే , పరమాత్ముని ఆశ్రయించడమే , దారి_! వేరే మార్గం లేదు _!
"" అలా చేస్తే _ ఇక కష్టాలు రావా _? గత జన్మ కర్మ ప్రభావాలు మనల్ని , బాధించవా _??"
,__ వచ్చే కష్టాలు లేదా సుఖాలు అనుభవించక తప్పదు దేవుడైన సరే _!; ఆ వ్యవస్థ ను దేవుడు కూడా మార్చలే డు , _!_ ప్రతివాడు విధిగా అనుభవించాలి _, _ఎవరికైనా ,ఎంత భక్తుని కైన తప్పదు __!
"",అంతేనా _? కష్టాలు తగ్గించలే ని ఆ పరమాత్ముని ఇక ఎందుకు పట్టుకోవడం ,_చెప్పండి _?""
""" ఇక్కడే ఉంది మనిషి జన్మలో తెలుసు కోవాల్సిన అసలు కిటుకు __!""
""ఏమిటా కిటుకు _? అంత రహస్యమా _?
""రహస్యమే ,_! అది బ్రహ్మ పదార్థం ,_!,ఎవరికి ఎన్నడూ ,ఎప్పుడూ కనపడని బ్రహ్మ రహస్యం _అది _!
""దయచేసి చెప్పండి _! నాకు కష్టాలు అంటే భయం ,, అవి రాకుండా చూసు కోవాలి నేను , దయచేసి , అపాయం తప్పించే ఆ ఉపాయం చెప్పండి _!_""
__ చెబుతాను ,, అక్కడకే వస్తున్నా __!మనిషికి జంతువుకు మధ్య తేడా ఏమిటి _ చెప్పండి ?
_ "" జ్ఞానం _! భగవంతుడు దయతో మనిషికి అనుగ్రహించిన అమూల్యమైన అపురూపమైన వరం ఈ జ్ఞానం _!!"""
""అవును కదా _! మీరు చెప్పినట్టుగా _ మనిషిలోఆ జ్ఞానం పాళ్లు కాస్తా ఎక్కువగా ఉంటాయి _!అయితే ఆ జ్ఞానాన్ని మానవుడు తన ప్రయత్నం తో ,దాన్ని ఎంతైనా పెంచు కోవచ్చు ,,_! జంతువుల్లో ఆ సౌలభ్యం లేదు _!,అందుకే మానవ జన్మ ఉత్కృష్టమైనది అంటారు _!
నిజమే _! కానీ సహజంగా తనలో నిబిడి అణగి అజ్ఞాతంగా ఉన్న ఈ జ్ఞానం ఎలా పెంపొందాలి _!?
__ జ్ఞాన సముపార్జన కొరకు , సత్సంగం చేస్తూ ,,సద్గ్రంద పఠనం కావిస్తూ, , సద్గురువుల ఆశ్రయం ,పొందాలి _; అలా,, సత్వ గుణ సాధనతో , భక్తిమార్గం లో పయనించే వారికి వచ్చే కష్టాలు,, దూది పింజ ల వలె చాలా తేలిక అవుతాయి _!
""అంటే వారికి జీవితంలో ఇక కష్టాలు రావా _? __"వస్తాయి కానీ , ఆ కష్టాలను పరమాత్ముని ప్రసాదంగా భావిస్తూ వారు ,, ఆ భారాన్ని అతడికే వదిలేస్తారు ,,
""అంటే _ !?
ఆ దేవుడే దిగి వచ్చి వీరి పాప భారాన్ని ,ఈ కష్టాలను భరిస్తా డా _?
_""లేదు , ఎవరు చేసిన కర్మను వారే అనుభవించక తప్పదు _!, కానీ ""జ్ఞానం"" అనబడే అగ్ని కణం తో కష్టం ,సుఖం ,పాపం పుణ్యం_ అనబడే గడ్డి కుప్పల ను భస్మం చేసే ప్రతిభ ,లభిస్తూ ఉంటుంది ,
అవునా _?ఎలా __కాస్తా వివరంగా చెప్పండి _?
నేనుశరీరాన్ని ,కాదు ,_! నేను ,ఆత్మను ,_! అనడం తో ఏ కర్మలు నిన్ను బాధించవు _; అత్మ సత్యం_! ,,దీనికి చావు పుట్టుకలు కష్ట సుఖాలు ఉండవు , నేను చేస్తున్న ,లేదా చేసిన కర్మల ఫలితాలు నేను త్యజిస్తూ ఉన్నాను ,,కష్టం అనేది శరీరానికి ,నాకు కాదు ,నేను పరమాత్ముని స్వరూపాన్ని ,, నాలో పరమాత్ముడు కొలువై ఉన్నాడు ,అతడు ప్రసాదము ఈ జన్మ ,ఈ శరీరం , ఈ ఆకారం , ఈ ప్రకృతి సంపద ,ఈ బంధువులు ఈ అనుభవాలు ,, తినే అన్నం తాగే నీరు ,పుట్టిన స్థలం , భార్యా భర్తలు పిల్లలు తలిదండ్రులు అన్నీ ఆ దేవాది దేవుని అనుగ్రహం వల్లనే ప్రాప్తించాయి , ,దేవుడు ఎలా సాక్షిగా చూస్తూ ఉన్నాడో ,అలాగే దైవ స్వరూపమైన నేను కూడా సాక్షిగా వచ్చే పోయె కష్ట సుఖాలను సాక్షిగా గమనిస్తూ ,, కర్మలు చేస్తూ కూడా ,దానితో సంబంధం లేకుండా ఉంటాను ,
""వాస్తవంగా "" కష్టం అంటే , నన్ను నేను తెలుసు కొకపోవడం _! అన్నది కష్టానికి సరియైన నిర్వచనం _!""
ఇక "సుఖం ""అంటే నా లోన __,నా చుట్టూ ఉన్న పరమాత్ముని తెలియ డమే _!
""_ ఎవరికి గోచరించనీ _ నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపుడైన ఆ పరమాత్ముని మనం ఎలా తెలుసు కోవాలి , స్వామీ"? _?
_"" ఆర్తితో ,ఆరాధిస్తూ ,,ఆవేదనతో స్వామి దర్శనాన్ని ఆపెక్షిస్తూ , నిరంతర సాధనా ప్రక్రియ ద్వారా _ అణువణువున నిండి ఉన్న_ ఆ జగన్నాథుని ,, ఆ పరమాత్ముని అంతరంగంలో అంతః శుద్ధితో దర్శించాలి __!ఈ మాంస నేత్రాలతో పరమాత్మను చూసే వీలు లేదు _! ఎందుకంటే ,ఇది పరిమితం _!, ఇంద్రియాలు కూడా పరిమితాలు ,_;
""అపరిమితం ,అనంతము అఖండమైన_ ఆ బ్రహ్మాండ నాయకు ని దర్శించాలి అంటే _ఆత్మ శోధన ,,ఆత్మ జ్ఞానం, ద్వారా ,నిరంతర సాధన ద్వారా ,, అకుంఠిత భక్తి మార్గంలో అంకిత భావంతో,శరణాగత తత్వంతో , పట్టుదలతో మాత్రమే సాధ్యం అవుతుంది _!; _మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అంటే ,,అతడికి ఉన్న జ్ఞానం వినియోగించాలి _!
అలా చేయకుండా బ్రతికితే ,, ఇవే కష్టాలు ,ఇదే జన్మ పరంపర ,ఇదే యాంత్రిక జీవనం , ""_! అంతా వృధా_! మనం పడుతున్న వ్యర్థ ప్రయాసలు, వృధా _!
అందుకే ,,
""జాతస్య ధృవో మృత్యుః__!""__
అని భగవద్గీత లో గీతాచార్యుడు ఉపదేశ అనుసారం గా ,
""తస్మాత్ జాగ్రత్త _!""
""మళ్లీ మళ్లీ రాదు ఈ మానవ జన్మ _!"
ఉన్నపుడే తెలివిగా_ నీ జీవన విధానాన్ని పరమార్థ చింతన కోసం ఉపయోగించు కో _!"
ప్రతీ క్షణం భగవంతుని సేవకు స్మరణకు , భజనకు , వినియోగించు _!
"" నీవు భావించే , ఆ కష్టాలు__ నీవు చేస్తున్న సంగత్వం తో నే వస్తాయి ,_!;అనగా చేసే పనుల ఫలితాలకు నీవు అంటుకు పోతే అదే నీకు విడదీయరాని బంధంగా , తొలగించలేని కష్టం గా _ అవుతోంది ! అనగా కష్టాలు అనేవి నీ స్వయం కృతా పరాధా లు గా నీకు సంక్రమిస్తు ఉన్నాయి _!
అందమైన ,, సుమధుర ,పుష్పాన్ని చెట్టునుండి కోసి ,ప్రేమతో ,నీవు , నీ భార్యకు ఇస్తే అది స్వార్థం అవుతుంది _!
పరమాత్ముని చరణాల ముందు ,లేదా గురువు ఫోటో ముందు భక్తితో సమర్పిస్తే _ అది _"పరమార్థ చింతన అవుతుంది
ఇక్కడ నీ చేతి లోని పూవులో మార్పు లేదు _; _!
చేసే విధానం లో భావన లో _ సమర్పణ భావం లో ,మార్పు ఉంటుంది
__ అందుచేత ,,మనం అనుకునే ఈ కష్టాలు__ మనలోని గుణాల వలన , చేస్తున్న ,కర్మల వలన కలుగుతాయి _!
పరమాత్మ భావన తో ఆ కర్మలు చేస్తే _ బంధ విముక్తి కలుగుతుంది ,,_!
అవి మనల్ని అంటవు _! ఎందుకంటే సాక్షి వలె , వాటిని అంటకుండా ఉన్నాం కనుక _!!
ఇక ఏ కష్టమూ నిన్ను బాధించదు ,,_!
కష్టం నీకు వచ్చినా, నీ బంధువులకు వచ్చినా,నీవు ఏడుస్తా వు కదా _!
ఉచితంగా ఉదారంగా ప్రేమగా , ఇన్ని సౌకర్యాలు కల్పించి అనందంగా జీవించమని పంపించిన ఆ పరమాత్ముని కోసం ఎపుడైనా ఏడ్చావా _? , అయ్యో_! నేను ఎంత పాపిని _!;"అతడిని సేవించలేక పోయాను గదా ,_?? భక్తితో భజన ,స్మరణ తపన , భావన , అత్మ సమర్పణ చేసు కొలేక పోయాను కదా , _!!"అయ్యో __! రామా _!! విలువైన కాలాన్ని _ వ్యర్ధం చేస్తూ ,,సంసారసుఖం కోసం వెంపర్లాడటం కోసం వృధా చేశానే ,,,కానీ ,, జన్మ బుద్ది జ్ఞానం వైభవం సంపదలు ఎన్నో ప్రసాదించిన ఆ భగవంతుని గురించి ఆలోచించ లేక __ మూర్ఖంగా అజ్ఞానంతో గడిపానే అంటూ ఎప్పుడైనా బాధ పడ్డావా _!? కృష్ణుని నీల మేఘ శ్యామ సుందర రూపం దర్శించలేని మంద భాగ్యుడను అయ్యాను కదా _! కళ్ళు ఉండి కూడా కన్నయ్యను గుర్తించలేని గ్రుడ్డి వాన్ని అయ్యాను కదా _!! ఈ విధంగా పరితపిస్తూ, ,
__ వృద్దాప్యం వచ్చాక చింతించే దౌర్భాగ్య స్థితి దాపురించక ముందే ,_ నీలో దాగిఉన్న సహజమైన జ్ఞానంతో ___ తత్వమ సి అను తత్వ జ్ఞానం ద్వారా,, ""నీవు ఎవరివో ,, తెలుసుకునే ప్రయత్నం చేయాలి _!!"
__""గడచిన కాలం ముందుకు రాదు _!, నడుస్తున్న కాలం నీవు ఆపలేవు ._! వర్తమానం లో బంగారు భవిత కు _పునాది వేసే ప్రయత్నం చెయ్యి _!
నీ ముందు ఉన్న కాలాన్ని_ శక్తిని జ్ఞానాన్ని ,భక్తితో,, జ్ఞాన సముపార్జన కొరకై ,పరమాత్ముని సన్నిధానం లో జీవితాన్ని గడపడానికి ఉపయోగించాలి ,_;
మనమందరం కూడా __అలాంటి అద్భుత వైభవ భావ సంపద ను అనుగ్రహించమని , కోరుకుందాం _!
_""అతడి సేవయే సుఖం_!
ఆ యోగం కోల్పోతే కష్టంగా భావించాలి__!""
_""హే సర్వేశ్వరా _!
"నేను ఆశక్తు డను _;!అఙ్ఞాని ని _!
అహంకారి ని _! మహా పాపిని , స్వామీ _!" నారాయణా _!""
నిన్ను తెలుసుకునే ప్రయత్నం చేయని
నా ఘోర అపరాధం దయతో కనికరించి క్షమించు తండ్రీ _! కృపా నిది_! ఆశ్రిత జన వత్సలా _! ఆపద్బాంధ వా __!;
అపురూపమైన ,, అమోఘమైన వరప్రసాదంగా నాకు అనుగ్రహించిన , ఈ జన్మకు తగిన యోగ్యతను, జ్ఞానాన్ని , అనుగ్రహించి. నన్ను నీ దరికి చేర్చు కో _! ఈ దీను ని మొర ఆలకించి , ఈ జన్మకు నీవే విలువ కట్టి_ _ దానికి _ సార్థకతను అనుగ్రహించు ప్రభూ _!
శరణు ఈశ్వరా _!
శరణు పరాత్పర_!
శరణు పరమేశ్వరా _!
శరణు శరణు శరణు_!
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా_!!"
Thursday, November 12, 2020
కష్టం అంటే _?!"
జయ జయ దేవ_ జయ రాధా మాధవ!
Sept 16, 2020
"రాధా _! నాపై నీ కున్న ప్రేమ ఎంత ?
" కృష్ణా_!_ అంతులేని అగాధ సముద్రమంత _!
కాదు_ కాదు_!
ఈ అనంతమైన విశ్వ మంత __!
"రాధా _!నేనంటే నీకు ఎందుకింత ప్రేమ ?
_""అది నేను అడగాలి నిన్ను
"కృష్ణా _! అయినా ,నేను అంటూ వేరే లేను , కదా,_!
నీవే నేను _!
నేనే నీవు _!
అందుకే ,నేనే నీవై న , నీవు అంటే ఇష్టం నాకు ,ప్రాణం_!, ప్రేమ _! స్వామవిి, ప్రభువు,భర్త ,కర్త అంతా నీవే , సర్వస్వం నీవే ,_!"_
"రాధా_! క్షణమైనా నేను నిన్ను విడచి ఉండలేక పోతున్నాను,, ,ఎందుకో తెలియడం లేదు నాకు ?_!""
_ "కృష్ణా_! అది రేపల్లె గోపికలను అడుగు ,వారు చెబుతారు _ నీకు ఎందుకో _!"" రాధా,నీకు అసూయ కలగడం లేదా,నాకోసం పరితపించే ఆ , గోప స్త్రీలను చూస్తుంటే ?""
_""కృష్ణా _! మహా రాసలీల వైభవం పొందిన తర్వాత ఏ వ్రజ వనితలకు అలాంటి వికారాలు , అసూయ కలుగుతూ ఉంటాయి చెప్పు _?""
""రాధా _! నిన్ను ఇక్కడకు ఈ రోజున తీసుకుని వచ్చింది ,,_" అదిగో ఆ జయదేవ కవి ఉన్నాడే,,,నీకు అత డిని చూపించ డానికి ,,_!!"" , గీతా గోవిందం"" అనబడే మధుర కావ్యం రాస్తూ ఉన్నాడు చూశావా ?""
"" కృష్ణా _! మన రాధా మాధవ ప్రేమ తత్వం అర్థం కావాలి ,, అంటే __ఈ జయదేవుడు రమణీయంగా కమనీయంగా ,,, శ్రవనానం దము గా ,,మనోహరంగా , మధురాతి మధురం గా , రచిస్తూ ఉన్న_ ఆ అష్టపదులు చదివితే చాలు ,నాకు నీపై ఉన్న ప్రేమానుబంధం నీకు తెలుస్తుంది తెలుసా _! నా ప్రేమ ఇంత, అంత అని ,నేను ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు గోవిందా _!""
""నిజమే రాధా _! మన కే కాదు , మన భక్త జనులను కూడా ఆనందింప జేసే రసవత్తర రమణీయ దృశ్యకావ్యం ఇది _!! ఈ జయదేవ కవి ,బృందావనం లోని అణువణువూ తో మనకున్న అవినాభావ సంబంధాన్ని అద్భుతంగా తన అష్టపది రచనా శైలి లో వర్ణిస్తూ ఉన్నాడు సుమా _!; రాధా మాధవ శృంగారకేళి ,విరహ తాపాన్ని , ఇంత గొప్ప మహత్తర రస రమ్య శృంగార ప్రబంధం గా ఆవిష్కరించడం ఇతడికి ఎలా సాధ్యం అయ్యిందా అని నా సందేహం రాధా _!_??""
""కృష్ణా , ఎంత మాయగా డివయ్య నీవు ,?!_! నిన్ను గాఢంగా విశ్వసించి , నీ కోసమే బ్రతుకుతూ__ నిన్ను ఆరాధించే నీ అపర భక్త శిఖామణి గురించి ,నీకు తెలియ కుండా ఉంటుందా , స్వామీ?? _!
""రాధా _! నమ్ము_!! ,నా మాటలు _! _, ఈ జయదేవుడు రమణీయంగా చిత్రీకరించే ప్రతీ దృశ్యం యదార్థం ,_!
__ మన యమునా తీర విహారం , పూల పొదరిండ్లు , మలయ పవనాలు , ఈ నా చిలుక అలుక లు ,_ నా పరోక్షంలో నీ చెలులు నా గురించి చెప్పిన ఓదార్పు మాటలు , నీ విరహం నిట్టూర్పులు ,కోపం ,దుఖం,ఇలా ఎవరూ చూడని మన ప్రేమా నుభవం ,, ,అన్నీ ఈ మహానుభావుడు మన కోసమే ,మన ఇరువురి ప్రేమానురాగాల గురించే ,, తాను రచిస్తూ ఉన్న ఈ గీత గోవిందం కావ్యం లో,, మన గుట్టు రట్టు చేస్తూ, మన ప్రణయ గాథ, బట్ట బయలు చేస్తువున్నాడు ! చూశావా రాధా _?""
""మాధవా __! నీ అనుగ్రహం లేకుండా , నీ శృంగార లీలలు దర్శించే భాగ్యం కలగడం సాధ్యమా ? చెప్పు _?!""
"రాధా _! నీవు ఇలా చెప్పాలి , ఈ రాధా దేవి అనుగ్రహం పొందకుండా నన్ను చేరుకోలే రు అని_! కదా _! __!""!నా మాట అసత్యమా చెప్పు ??
"" కృష్ణా _! నీ గురించి చెప్పే ప్రతీ కావ్యం , ఇతిహాసం,, పురాణం , ప్రబంధం ఏదైనా అందులో నా ప్రసక్తి లేకుండా ఉంటుందా చెప్పు ,?"""
"" రాధా _! చూడు , ఇంతవరకూ అనందంగా రచన చేస్తూ ఉన్న జయదేవ కవి __ అయ్యో ,అదేమిటి _?! ఒక్కసారిగా విచార వదనంతో ,రచన ఆపి వెళ్లి పోతున్నాడు , ఏమైంది రాధా ?""
"" మాధవా_!! ,అదిగో__ ఆయన భార్య పద్మావతి ఇదంతా చూస్తూ కూడా ఎమీ మాట్లాడ టం లేదు_ సుమా , అంతా నిశ్శబ్ధం_! ,,
"మనం ఏం చేద్దాం రాధా,_?
""కృష్ణా మన ప్రియభక్తుని కి కలిగిన ఖేదం తొలగించ కుండా ఉంటామా _ చెప్పు _!? మనం వచ్చింది అతడిని అనుగ్రహించ డానికే కదా ప్రభూ _!_ నీవు వెళ్ళి , ఆ కావ్య రచన అతడు ఎక్కడ ఆపాడో __ ఎందుకు ఆపాడో చూడు , _!;నీకు అర్థం అవుతుంది అతడి విచారానికి కారణం _!_!"
,"" రాధా _! ఎలా వెళ్లను,__? ఈ కృష్ణ రూపం తోనా _?
"" కృష్ణా ,_! అన్నీ తెలిసిన నీకు ఏమని చెప్పను _? నాతో చెప్పింతు వేమయ్యా , నటనా గ్రేసర చక్రవర్తి _!?? నిన్ను మించిన మహా నటులు లేరని నాకు తెలుసు లే , నంద నందనా _!! నంద కిషో రా ,,_!వెళ్లు స్వామీ __!తొందరగా ,_! జాగ్రత్త _! పద్మావతి భర్త రూపంలో , వెళ్ళి చూడు _!_ఆమెకు అనుమానం రాకుండా నటించు _ అని చెప్పాలా __జగన్నాటక సూత్రధారి ??_!" నేను కూడా ఉంటా ను లే__ నీ ప్రక్కన __!ఆమెకు అగుపించ కుండా _!
""రాధా _! చూడు ఈ అష్ట పది __! ఇక్కడే రాసి కొట్టి వేశాడు , ఎందుకో ,, తనకి నచ్చలేదు కాబోలు _!_!""
"" కృష్ణా _! ఏ సందర్భము అది ? తాను రాసింది తనకే నచ్చలేదు అంటే ,ఎదో సంకట స్థితి లో ఉన్నాడు అన్నట్టే గా _ మన జయదేవుడు ,_!""
"" హే రాధికా _! ప్రియతమా__! ,ప్రియే _!, చారు శీలే ,_!రాధే ,! ఇందాకా మనం అనుకున్న మన ప్రేమ విషయమే అతడి బాధకు కారణం అయ్యింది సుమా _!, చూడు _ఇక్కడ_!!"'
""అవును కృష్ణా_! నా ప్రేమ విషమై నిన్ను కాటేస్తు ఉంది అట _! అమ్మో _!!"" స్వామీ ఇది నిజమా ? నిన్ను అంతగా బాధ పెడుతూ ఉన్నానా నేను ?"_
"" స్మర గరళ ఖండనం _
మమ శిరసి మండనం _
దేహి పద పల్లవ ముదా రం__!""
_!"" కృష్ణా ఇతడు మన ప్రేమ గుట్టు రట్టు చేస్తున్నాడు సుమా _!"
"" రాధా _! నీ చిగురు టాకులవంటి నీ కోమలమైన మృదువైన పాద పద్మం తో నా శిరస్సును ,, నీ కాలితో తాకితెనే గానీ , నా తలకెక్కిన నీ ప్రేమ అనే ఈ విషము తగ్గదు సుమా _! అని నేను ఆ పొదరింటి లో,,బాధపడుతూ నేను నీతో అన్న విషయం కూడా రాశాడు ,,_! ఎలా తెలిసిందో కదా ఈయనకు _?!"'
కానీ రాధా నేను పొందిన ఆ బాధ కంటే , నా గురించి నా భక్తుడు పొందిన ఈ బాధే ఎక్కువగా ఉంది _!;, ""చూశావా__! ఇవే చరణాలు__! రాసినవి కొట్టి వేశాడు ,_! అలాంటి చెడు ఆలోచన కలిగినందుకు,,తాను బాధ పడుతూ ఉన్నాడు రాధా_!!" మనం ఇపుడు ఏం చేద్దాం ?""
"" కృష్ణా _!! భక్తుడు పొందిన అనుభూతి మనం ఆనందంతో అనుభవించిం దే కదా ,,_! కల్పన కాదు కదా _; స్వామీ _!! తాను దైవంగా భావిస్తూ ఉన్న కృష్ణ పరమాత్మ తలపై ,, రాధాదేవి కాలితో తాకడం ,అన్న సున్నిత భావనను పాపం , అతడు తట్టుకోలేక పోయాడు __!అందుకే ఆ చరణాలను కొట్టి వేసి , ఇటువంటి ఆలోచన తనకు వచ్చినందుకు సిగ్గు పడుతూ వెళ్ళి పోయాడు
కృష్ణా _! ""
""" రాధా _! జయదేవుని కి కలిగిన అనుభూతి నిజం అని నిరూపించాలి మనం_! ఏమంటావు నీవు _??"" _! ""అవును కృష్ణా _! అవే చరణాలు మళ్లీ నీవే __నీ స్వహస్తాలతో రాస్తే _ సరి పోతుంది కదా _! """ జయదేవుని రూపంలో ఉన్న నీవు అలా రాస్తూ ఉంటే , చిరునవ్వుతో , చూస్తూ ఉన్న పద్మావతి ,, నిజంగానే నిన్ను తన భర్త గా అనుకుంటూ ఉంది , రాధా మనోహ రా _ అదిగో అతడి సతీమణి పద్మావతి , నిన్ను ఓరకంట చూస్తూ మందహాసం చేస్తూ ఉంది ,చూడండి ,,_!
"" ఆమెను నీవు కనిపెట్టు _ కానీ ,రాధా _!,నీవు చెప్పినట్టు అవే పదాలు తిరిగి రాశాను _!, నీకు తెలుసా ,_ రాధా ! అసలు ఈ అష్టపదులు రచనకు మూల కారణం ఎవరో _?""
"" కృష్ణా _! ప్రతీ భర్త విజయానికి వెనుక భార్య హస్తం ఉంటుంది __!
రాధా ఇలా నీవు నా వెనక ఉంటూ , నా పనులు చక్కచేస్తు ఉన్నట్టుగా అవునా _?
అలా నవ్వకు కృష్ణా _! ఇది వాస్తవం _! స్త్రీ అనే శక్తి తోడు లేని ఏ పురుషుడూ స్పందన లేని శిల వలె జడ పదార్థం అవుతాడు సుమా_! చూడు ఈ పద్మావతిని ,, తన నాట్యం తో హావ భావాల అభినయం తో , భర్తపై తనకు గల అమితమైన ప్రేమతో ,, అతడి కావ్య రచన కు అడుగడుగునా ఉత్సాహాన్ని మనసులో నింపుతూ ప్రోత్సహించిన ఈమె నిజంగా ధన్యు రాలు , మాధవా _!""
""రాధా , తన భర్తకు గల అపారమైన , శ్రీకృష్ణ భక్తి తత్వం అర్థం చేసుకొని ,, అతడిని తన నటనా చాతుర్యం తో బుద్ది కుశలత తో ఉచిత రీతిలో ప్రేరేపించిన ,ఇలాంటి పతివ్రతా శిరోమణి ,, కృష్ణ ప్రేమకు అంకితమైన అలాంటి కవి శ్రేష్ఠుడు , భక్త శిఖామణి ___
ఇరువురూ ధన్యులే , రాధా _! మన ప్రేమ కు , బృందావన దివ్య సీమకు , గీత గోవిందం అనే కావ్యం ద్వారా రూప కల్పన కావించిన ఈ పుణ్య దంపతులు జీవన్ముక్తి పొందుటకు యోగ్యులు కదా _!,
""కృష్ణా__! అసలు జయదేవుడు వచ్చే వేళ అయ్యింది , కలం పెట్టేసి లే __ అక్కడినుండి. ,,_! స్వామీ _! పద _పద , తొందరగా _!,
""అయిపోయింది రాధా రాయడం ,, పద _!!!
అమ్మయ్య అనుకున్నట్టే వచ్చాడు , అదిగో చూశాడు మనం రాసింది ఆహా , _! అతడి మొహం లో ఎంత ఆనందం వెలిగి పోతూ ఉందో చూశావా రాధా __!""?
__"" కృష్ణా _!తన భార్యను పిలిచ అమిత ి సంతోషం తో చూపిస్తూ ఉన్నాడు _!!,వారి భక్తి విశ్వాసాలు , కావ్య రచనా పరిశ్రమ కు "రాధా కృష్ణ పరమాత్మ ""అనుగ్రహం లభించినందుకు ఎంతగా పరవశిస్తూ ఆనందిస్తూ ఉన్నారో చూడు ,_!"
""కృష్ణా నీ సన్నిధానం లో ఆమెకు కలిగిన మహదానందం తో దంపతులు ప్రణామాలు చేస్తూ ఉన్నారు , చూడూ ,_! స్వామీ , జయదేవ దంపతులు ముక్తిని ఎప్పుడు పొందగలరు _?""
""రాధా _! నీ అనుగ్రహం పొందాక ముక్తి మార్గం సులభతరం అవుతుంది కదా _! , మన ఇద్దరమూ అతడి అంతరంగంలో అనునిత్యము నర్తిస్తూ ఉంటాము , __; _ ! అయినా
రాధా ,_! నాకు తెలియని విషయమా ,, నీ కు నాపై గల ప్రేమాతి శేయం ??,_!
మన ప్రణయ గాథ ను , ప్రేమానురాగాల ను మానవాళికి ఆదర్శంగా ఉండేట్టు గా , దంపతుల ప్రేమ అద్వైత ప్రేమ గా , ఒకరికొకరు ప్రాణం గా భావించే విధంగా ఉండేందుకు ఒక ఉదాహరణగా ఉండాలని ,__ కదూ ,, రాధా,,నీవే స్వయంగా పద్మావతి అంతరంగంలో నర్తి స్తు,, నీ నాట్య గతుల ద్వారా , పద ఘట్టన ము తో ,,, కాలి అందెల సవ్వడి తో ,, సుస్వర సంగీత భరిత ధ్వనులతో , అలరింపజేస్తు ,,ఈ గీతా గోవిందం కావ్య రచనకు అష్టపదుల గాన మధురిమ కు ప్రాణం పోస్తూ __మన ప్రేమకు సచ్చిదానంద స్వరూ పాన్ని , ఆపాదించి పాత్ర పోషణ చేస్తూ_ పరోక్షంగా ,_ ఈ కావ్యానికి శాశ్వత త్వాన్ని కల్పించా వు కదూ రాధా__;""
""కృష్ణా _! నేను పద్మావతి అంతరంగం లో ఉన్నాను అంటే నీవు జయదేవుని లో అంతర్యామి గా ఉంటూ అతడి బుద్దిని ప్రేరేపిస్తూ , అతడి కలం పట్టుకొని " సంస్కృత సాహిత్యం లో అష్ట పదులు అన్న నూతన కవిత్వ కావ్య రచన కు శ్రీకారం చుట్టా వని అర్థం కదూ కృష్ణా __!
జయదేవ కవి రచిస్తూ ఉన్న తమ ప్రణయ కావ్య రచనా ఆనంద పారవశ్యంలో ఇలా రాధా కృష్ణులు ఆనందానుభూతి పొందుతూ , పరస్పరం సంభాషిస్తూ , వారి ఆనందనిలయమైన, గోలోక ధామ మైన , పరమానంద కరమైన , వారు నడయాడిన బృందావనం చేరుకున్నారు
__ అద్వితీయమైన ,అపురూపమైన, సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుని అపార కృపా కటాక్షములు తనకు లభించడానికి __కారణం జయదేవుని అంకిత భక్తి యే కదా _!
__"కొందరు పుట్టుకతోనే జన్మతః భక్తులై , జ్ఞానులై ఉంటారు ,_!
భక్తి భావంతో సాధన చేస్తే భగవంతుడే ఏదో ఒక రూపంలో వచ్చి అనుగ్రహిస్తాడు అని నమ్ముతూ ఉన్న జగన్నాథ స్వామి భక్తుడు , ఈ జయదేవుడు _! అతడు ఏక సంతాగ్రాహి ,_! జగన్నాథుని పై కలిగిన ,అపార భక్తి విశ్వాసాలతో ,,అతడు ,ఆడుతూ పాడుతూ ఆశువుగా గానం చేస్తూ ఉంటే , స్వామి లీలలు అతడికి కళ్ళకు కట్టినట్లు కనబడుతూ ఉండేవి _!
జనాదరణ pindua అతడి గీతాలు పాడుకుంటూ భక్తజన కృష్ణ భక్తి తన్మయత్వం లో స్తుతిస్తూ ,జయదేవుని అష్టపదుల వైభవాన్ని ఆనందిస్తూ ఉండేవారు _! ఆ విధంగా ,,
జయదేవుడు శ్రీకృష్ణుని పరబ్రహ్మ స్వరూపం గా పూజించాడు _;
గీత గోవిందమును శృంగార రసముతో , మధుర భక్తి తో , శ్రీకృష్ణుడు, పరమాత్మ గా , నాయ కుడుగా , రాధాదేవి జీవాత్మ గా ,నాయకీగా చిత్రీకరిస్తూ భక్తి భావంతో స్తుతించాడు __!
జీవాత్మ పరమాత్మల అనిర్వచనీయ మైన__ అవినాభావ ప్రేమానురాగాల అనుబంధమే __ ఈ ""గీత గోవిందం ""అనబడే కావ్య సారాంశం _!
హరిః ఓం తత్సత్ _!
స్వస్తి _!
హరే కృష్ణ హరే కృష్ణా _!
A Drama that became Real!
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
The Turning Point Forty years ago, while teaching at Ragampet village high school, I experienced a moment that changed a student’s life fore...
-
May 8, 2020 పగలే వెన్నెలా.... పల్లవి !" ____&___ "కరోనా వచ్చేరా ,కష్టాలు తెచ్చేరా !! కరుణ లేక మన వారిని చంపు చుండే రా!!...
-
May 27, 2020 ఈ గోపికా స్త్రీలకు శ్రీకృష్ణుని పట్ల గల ఆ ఆరాధనా భావం ఎలా కలుగు తోంది? భర్తా పిల్లలు అత్తా మామలు బంధువులు,సంసార బాధ్యతలు , ఇ...