Monday, October 22, 2012

LATE-GUDURU SATEE SULOCHANA


కమ్మగ  మాటలాడి మరియాదలు-- చేయుచు   ఛాయ  నిచ్చి
గల గల  నవ్వుచున్ - తమల పాకును బాగము నంది  యిచ్చు చున్
ఠీవిగా  T V  జూచుచు -నడిమి హాలులో  మామతో  గుడి  యుండి -
పరియాచక  మాడు సులోచనత్త-- చిన్నత్త  ! దేవుని  దరికి  జేరేనే  !------------1
       కన్నులు  చాల కున్నవి -ఎద తెగని  కంటి ధారలే  కమ్ము కొను చున్నవి
          తోడుగా  నీవులేని  కామా లాకరు  మామను  చూడ లేకున్నవి -!
           ఎందుకు  దేవుడింత దయ మాలిన   దండన  మేల వేయునో  -?
            జంటను  వేరు  జేసే ! విధి  విలాసము గాక --! మరేమీ  చోద్యమో ?--------2
డెందము  చిన్నవోయే - నిను  గానక -  అత్తరో ! ఎందు  చూసినాన్--
మందుగా మంద హాసమున గుమ్మమునందున  పల్కరింతువే !
ఇందరి నొక్క  చోటు  గన--ఎంతగ సంతస  మందువో--గదా   !
వందన మమ్మ !మీ  చేతిలో  పెరిగితి -మింత యైతిమిన్ --------------3
                        మామ  తెరుంగు  గన -మ్రాన్పడి పోయే  తనువూ  మనస్సులున్ 
                       మామ గతంబే- తన  మానస మందున  నిలుపు కోవలేన్ --
                          నీ తోడూ లేక  చినమామ  మొగంబు - చిన్న  బోయే
                        మామ  అమాయకున్డని   గదా ! విధి  ఘాటుగ   వేటు  వేసేనా ?-------------4
కొడుకులు  బుద్ది మంతులు -కోడంద్రందరూ ప్రేమ ముర్తులే -!
ముదముగా  నిన్ను  జూతురు -ఇక ఇందర మున్తిమి  -నిన్ను జూడ !
అత్త లేదనిక  --మరి మరి క్రుల్లుచు  ఎద్వాబోకుమా ! -మామ
విధి  విధానము  మార్చగ--విధికి  సాధ్యమా --?---------------------------5
             పోయినది   సులోచనత్త ముత్తైదువుగా -పది మంది మెచ్చగా-
             భాద్యత లన్ని దీరే -ఇక బాధ లేకనే -బయలు దేరే
             హటాత్తుగా  మాయమయ్యే గదా-- నవ్వుల మాటల   తేలి యాడుచున్
               ఎ  మాత్రము  కోలుకొని స్తితి  చేసే గదా -పరమాత్మ  అందరిన్ ---------------6
నుదుటను  ఇంతగా  బొట్టు పెట్టుకొని -చక్కని చుక్కగా  తీర్చి కొంటు -
విలక్షనమ్ము -సతీ సులోచనా  --సముఖమ్మనుచున్
అందరు ఔనని మెచ్చగా వినియు -నీ వింత తొందరగా
అంబర వీధికి  ఎగినావే !నీ పై దయ అపార మయ్యే గదా -దేవ దేవికిన్ !-----------------------7
              ఎవ్వరు  తోడూ రారు -తన చేతలే దండిగా  వెంబడించు
              ఎన్నడు గానరాదు -తన  పుణ్యము పాపము రూప  కూపముళ్
             ఎక్కడ మారిపోదు -తన పూర్వ కర్మానుసారముల్
            ఎచ్చట  జారిపోదు - తన కృతా కృత దైవ కృపా కటాక్షముల్ !--------------------8
                                     కీర్తి శేషులు శ్రీమతి గూడూరు సులోచనా దేవి -సం స్మరణలో
                                               మనోహరం
                                               10 -04 -2000

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...