Monday, October 22, 2012

pedda manasunna peddamama! - Gudur Venkatrama Rao


  త్రోవ నడచిన చాలు -దండాలు పెట్టుచు మొగము   దించి  ప్రక్క దొలగువారు-
మాటా డినను   చాలు -ఎ పని నెవరైన  -చేయవలె నను మాట కల్లగాదు
   ---మొగము చూసిన  చాలు ఎంత  దండి వాడైనను -దడ పుట్టి ధైర్యము చూపలేదు 
కరుణ చూపిన చాలు -కట్టలు దెంచుక ప్రేమాను రాగాల  గండి తెగును ---!-------------------!
ఎడ్ల బండి వచ్చె-గజ్జెలు చప్పుడయ్యే-నన్నపరుగు తీయు వాని తీరు చూడ 
బ్రతికె పులివోలె -అందరినదర జేసే -దర్పమున తనకు తనే సాటి యయ్యె !------------------2
   -అపర బ్రహ్మయే కాదు -ఎంతో రసికావతంసుడు -
కోపమే గాదు--! ప్రేమను గూడ-పట్ట లేము 
తనకు నచ్చిన తన ప్రాణ మిచ్చు చుండె--!
తనకు నచ్చనిచో -మొగము చూడ కుండె-  !------------3
    --ఇచ్చోటనే  ఏబది ఆరు ఊరుల-ఖ్యాతి నేలిన రాజ రాజితండు -!
ఇచ్చోటనే  పేరెన్ని కనుగన్న ఘనుడు పెద్దొర  -వెంకట రామరావితండు -!
ఇచ్చోటనే చేత  కొరడా-తుపాకీ ల బూని రాజ్య మేలిన  దొడ్డ  దొర ఇతన్డు !
ఇచ్చోటనే కోరమీసాల రోసాల -గడ గడ లాడించు గండర గండ యితడు -!----------------4
 నాల్గు దిక్కుల నడయాడు దొరతనంబు
ఒక్కడైనాను తన కెదుర నిలిచినాడ ?
ఎక్కడైనను బెదరి తిరిగినాడ ?
అక్కటా !అట్టి రారాజు  నేడు దివికి చనెనే-!------------5
ముగ్గురు తోబుట్టుల-ముదమున మురిపించి
ప్రమతో  పెంచి -పెళ్ళిళ్ళు  చేసె -!
ముగురు బావల నాదరంబున జూసి -
మేన కోడళ్ళకు -  ప్రేమ పంచె
మేన అల్లుళ్ళ -పోషించి  విద్య గరిపె!
ఎవ్వ రివ్వని   గారవంబాత డిచ్చె--!---------------------6
తోబుట్టువుల  నింత గొప్పగా దిద్దిన -తోబుట్టువే   లేదు  ఎక్కడైనా
బావ గారల నింత  మర్యాద జేసిన  - బావమరిది  లేడు ఎరక   లోన 
దురావస్తల నుండి  తనయుల - నమెరికా పంపిన తండ్రియే  కానరాడు
అప్పులేన్నైనాను -గుంత భుమమ్మక--ఇబ్బంది పాలైన మనిషి లేడు -7
బ్రతికె దొడ్డ దొరగా - డెబ్బది వత్సరములు -
ఎంత దర్పమో -రాజసము -అంత ఠీవి !
చివరి దశలోన ఎంతో-అతి దీనముగ బ్రతుకునీడ్చినావు --మామ !
అనుభవించిన దుర్భర స్తితిని  జూడ -నరక యాతన క్షోభ ను చెండా చూడ
కడకు నీ బ్రతుకే నీకు రోత యయ్యె-!ఎన్నో కష్టాల పాలై తి వయ్య మామ !
భార్య లేకుండ మనసు -రాయిగా  మార్చినావు--!
మళ్లీ పెళ్లి చేసుకోక -పిల్లల క్షేమము   --  కొరకు -అనవరతము  కుమిలినావు -!
బ్రతుకెంతో భాధగా  గడిపినా--తొణకక నిజమైన  తండ్రి  అనిపించి నావు !-----------8
ఎంత కుమిలి తి వో గాని  ఏమొ మామ - ఏమి తలచి వేగాచితివో గాని  పెద్ద మామ
చివరి దశలోన చాల బాధ -పాడినావు మామ   -ఎందరం ఉన్న అక్కరకు రామైతి మయ్య మామ ---9
నీవు చాపిన చేయి  అందు కొనని వాడు - మన బంధువుల లోన లేనే లేడు
నీవు చూపిన కోప మొక్కటే  అలుసుగా తల పోసి ఋణము తీర్చ లేరు
ఎంత కోపమో  మామకు అంత కరుణ -
తిట్టినను  కడుపు నిండుగా పెట్టినావు
మొట్టినను బ్రతుకు నిలబెట్టి నావు ------------10
పెద్దకొడుకు సత్య  -మల్లదిగో  అచట --కంటికి ధారగా  ఎద్చుచుండే
రాజన్న అదే చూడు -కంటికి మింటికి -ఏడ్చి  ఏడ్చి వట్టి శిలగా మారే
బాపు -బాపు  యంచు నీ చిన్ని వసు- తండ్రిలో తల్లి ప్రేమకై  వగచే
బక్క పక్షి వాడు లచ్చన్న ఒంటిగా -తండ్రికి బెంగతో చిక్కి పోయే
కన్నతండ్రి  చూపు కడసారి నోచక -నలుగురు పిల్లలు బెంగ పడిరి
సుజాతా  శరతుల-పుణ్యమో యనగా కనుల నిండుగా తండ్రి ని  చూసు కొనిరి
చేతులారంగ  సేవలు చేసుకొనిరి -!------------11
భర్తను కోలుపోయి -కాదు రోగపు బాధల చిక్కి పోయి -పసి కూనలు పిల్లల నీదలేక
మా  పిన తండ్రుల ఘాతల కోర్వలేని -తారక్కను ఆదుకున్న పెదతమ్ముడు వెంకట రమనుడే  నిజమ్ముగా
మాకు ఇలవేల్పు !భాగ్య ప్రదాత -!పిడికెడన్నము పెట్టిన  అన్నదాత -!అట్టి  మా మామకు శాంతిని  ఇచ్చుగాక
శ్రీ  వేంకట రమణు డెపుడు చల్లగా గాచుగాక -మామ కుటుంబమున్ !-------------12
 జీవితంబున చాల శ్రమించినావు -నీదు కోర్కె  ఫలించే -నిలిచే ఖ్యాతి -!
పిల్ల్లలందరూ  ఎవరి మోతాదు లేకుండ  -నిలిపెదరు    నీ పేరు శాశ్వతముగా ----13
 కావున శాంతి నొందుమ మామ పెద మామ- తృప్తి నొందు మా 
మేమందరమూ  నిను గొల్చు వారమే -మీ పిల్లల మంచిని గోరువారమే 
ఎ  చింతయు పెట్టుకోక -ఆత్మ పరమాత్మతో  నిల్పిన  మాకు చాలు 
మాకదే  పడి వేలు --మా హృదయ పూర్వక వందన మందు కొనుమ  -!
మమ్ము దీవింపుము  మామ ! మనసారగ పద్యాంజలి  అందుకొనుమ  !
       కీర్తి శేషులు         -సతీ  సావిత్రి  వేంకట రామ రావు గారలకు  అంకితం -!
       కీర్తి శేషులు మా అమ్మ బాపు తారాబాయి లక్ష్మి నరసింహ రావు ల  జ్ఞాపకార్ధం !
పద్మ మనోహరరావు
కరీంనగర్ -

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...