Tuesday, October 23, 2012

Sambasivudu

కీర్తి  శేషులు గూడూరు  సాంబశివ రావు మామ గారు ఎంతో  పుణ్యాత్ముడు -వీరి తండ్రి నరహర్ రావు గారు -తల్లి  సూర్యా బాయి -ఉత్తమ భక్తురాలు -వీరి సంతానం ఆరుగురు -తారాబాయి ( మా అమ్మ ) వెంకటరామారావు -ఆనందా బాయి -చుక్కమ్మ - సాంబశివ రావు - కమలాకర్ రావు - కమలాకర్ రావు  తల్లి కడుపులో ఉండగానే  తండ్రి నరహర్  రావు గతించాడు -బాల్యం నుండి కష్టాల్లో పెరిగారు - పెద్దాడైన  మా పెద్ద మామ -వెంకటరామ రావు చాలా శ్రమించి  కష్ట పడి  తమ్ములను  చదివించాడు - ఆస్తిని  - వతన్ లను  కాపాడాడు  - చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు -కొడుకులను  అమెరికా పంపాడు ( పుత్రవాత్సల్యం  చంపుకుని )-కూతురిని కూడా  పెళ్లి చేసి స్టేట్స్ కి పంపించాడు -భార్య సావిత్రి మరణించడం-  ఆరుగురు పిల్లల ను సంరక్షించడం కోసం -శ్రమించి - వృద్ధాప్యంలో బ్రతుకు పోరాటంలో - ఆరాటపడి -అలసట  చెంది పరమాత్మునిలో లీనమయ్యారు -
            అలాగే సాంబశివ రావు గారు కూడా  బాల్యం నుండి -తమ్ముడు కమలాకరుని  కంటికి  రెప్పలా ఆదరించి -  హైస్కూలు చదువు వరకు మంథని లోను -హన్మకొండ లో తను బి ఏ -తమ్ముని బి ఎస్ సి - డిగ్రీ చదువులు పూర్తీ చేసుకుని జీవితాంతం వరకు కలిసి ఉంటూ బ్రతికారు తమ అన్న గారు వెంకట రామారావు గారి మాట జవ దాటి ఎరుగని  విద్యా వినయ సంపన్నులు --
                సాంబశివ రావు గారు  పేరులోనే కాదు -తన తీరు లోను  - బ్రతుకు  దెరువు లోను తనదంటూ  ఒక ప్రత్యేకమైన  వ్యక్తిత్వంతో నిరంతరం  సాంబశివ  ధ్యానం -  నామం  జపించి ధన్యులైనారు -లక్షెట్టిపేట  గ్రామంలో అందరి చేత  మంచి వాడని పేరు తెచ్చుకున్న  ఉదార స్వభావి - కష్ట జీవి - నిత్య సంతోషి --!
            భక్తి అతని సొమ్ము 1 అనుకరణ చేత గాని  -- అభ్యాసం చేత  గాని  అలవడని భక్తీ తత్వం -- ఆ సాంబశివుని అనుగ్రహం  వల్ల  అలవోకగా -ఈ సాంబశివున్ని  వరించి అలరించింది -
         వీరు  మహా సాహసి - ! ధైర్యం -గుండె నిబ్బరం - ఆత్మ విశ్వాసం  -మెండుగా గల వ్యక్తీ - !నిండు గంగను ఒంటరిగా - అడ్డంగా ఈదుకుంటూ వెళ్ళిన  మొండి ఘటం !తన గ్రామం -కొత్తూరు లో జరుగుతున్న ఒక హత్య ను ఒంటరిగా ఆపడానికి యత్నించిన  పరోపకారి -- బావిలో పడిన ఎద్దును  ఒంటరిగా తానె లాగడానికి ప్రయత్నించిన భూత దయాళువు --!
             శిథిలా వస్తలో  ఉన్న శివాలయాన్ని  - తానె అను నిత్యం గంగ నీటితో -- శుద్ది చేస్తూ --శుభ్రంగా   ఉంచి-- జీర్ణోద్ధారణ  గావించి  -- ఇదేండ్లు శ్రమించి - పునః ప్రతిష్ట  చేసి - అందరిని కూడా గట్టుకుని  -ఆలయ ధ్వజారోహణం  గావించి - అంకిత భావం -- అకుంటి త - దీక్షతో   జీర్ణాలయాన్ని   బాగు చేసి- ఉద్ధరించిన  మహోన్నత వ్యక్తీ  ప్రయత్న ఫలితమే   - ఈ నాడు ప్రజాదరణ పొంది వెలుగొందుచున్న  - సాంబశివ  ఆలయం  !నిరంతర అన్నదానాలతో  భక్తుల భజన -భక్తీ గీతాలతో - నిత్య శివ అభిషేక పూజలతో - గ్రామానికి తల మానికంగా - అలరారుచు -ప్రజల నీరాజనాలను  అందుకుంటున్నది !
                  అతడే ఒక  సంఘం - ! ఒక వ్యవస్థ  ! ఒక ధార్మిక కుటుంబం  ! మెండైన   -- నిండైన  -వ్యక్తిత్వం - దేహ దారుడ్యం -మనో ధైర్యం - కలిగిన  సంపూర్ణ  వ్యక్తీ  !HE  DESERVES  LEADERSHIP  QUALITIES  !
                 నాకు ఎనిమి దేళ్ళ  వయసులో - చిన్నతనంలో - బావి వద్ద  - మధ్యాహ్నం  - నీరు చేద బోతుండగా -నా చేతుల్లోంచి - నిండు బొక్కెన జారడం - నేను కూడా బాలెన్స్  తప్పి బావిలోకి తలక్రిందులుగా  జారడం - ఎదో పనిపై - అటుగా వచ్చి - మామగారు చటుక్కున నా ఎడమ కాలి మడమ ను -బట్టి పైకి లాగి నాకు పునర్జన్మ  ప్రసాదించిన ప్రాణ దాత - అది ఒక డివ లీల నా ఈ  జీవనం వారి స్మ్రుతి చిహ్నం !   

 ఏమిచ్చి ఋణం తీర్చుకో గలను - ?-అంజలి ఘటించి ప్రణ మిల్లడం తప్ప !
          గీతా విద్యాలయం SCHOOL  లో అంత  వృద్ధాప్యంలో కుడా పిల్లలకు పాఠాలు  చెప్పడంలో మనసా- వాచా- కర్మణా - సఫలీకృతుడైన  ఉత్తమ  ఉపాధ్యాయుడు వీరు    VILLAGE REVENUE  OFFICER  గా కుడా పని చేసి అక్కడ కూడా  మారు మూల కుగ్రామం లో కూడా దేవాలయం వెళ్ళడం శుభ్రం చేయడం భజనలు చేయడం - వండుకుని తినడం - ఆ  గ్రామస్తుల మన్ననలు  పొందడం  గమనార్హం !
            తన సరస సంభాషణలతో -- చమత్కారాలతో - తోటి వారందరినీ - పిల్లలను -   పెద్దలను  నవ్వుతు   -  నవ్వింప జేస్తూ -తన జీవితంలో మోదమే -కాని - ఖేదానికి  తావివ్వకుండా  గడిపిన నిత్య సంతోషి శ్రీ  సాంబశివ రావుగారు   !
             తనకంటూ ఒక చరిత్ర స్వయంగా రాసుకుని గ్రామంలో మంచి వ్యక్తిగా - ఉదార ఉపకార స్వభావిగా పేరొందిన  ఘనుడు -- చెక్కు చెదరని  మొక్కవోని -మనస్తత్వంతో -నిశ్చల చిత్తంతో  -రెండు పూటలా సంద్యావందన - గాయత్రీ జపం తో - మడీ  ఆచారంతో  - అనుష్టానము - ఆధ్యాత్మిక చింతనతో పురాణ గ్రంధ పట నంతో -- అత్యంత నియమ నిష్టలతో - శ్రద్ధా భక్తులతో - ఈశ్వరుణ్ణి ధ్యానించి -  పూజించి -  సేవించి - తరించి -అతనిలో ఐక్యమైన  వందనీయుడు - పుణ్య జీవి - పరమ భక్తుడు -- ఈ సాంబశివుడు -- !
                        వీరి తల్లి-- మా అమ్మమ్మ - శ్రీమతి  సూర్యా బాయి గారి నిరాడంబర జీవితం - నిరంతర దైవ  ధ్యానం  - మేలుకొలుపు గీతాలు - తులసి -సాలగ్రామ  అర్చనల  ప్రభావం వీరిపై మెండుగా పడింది --మా అమ్మ - మా అమ్మమ్మ  లతో బాటు  సదాచారతా - భజనలు - హరి నామ సంకీర్తనం - శ్రీ--------------శ్రీ మద్భాగవతపద్యాలు చదవడం-- గజేంద్ర మోక్షం-- రుక్మిణి కల్యాణం - అంబ రీశో    పాఖ్యానం - లాంటి ఆధ్యాయాలు   అనునిత్యం చదివే వారు - ఎవరు విన్నా - వినకున్నా -దైవ  ప్రార్థనలో లీనమై పాడుకుని తన జన్మ - నిరంతర దైవ  ధ్యానంతో -- భక్తీ తత్పరతతో - ధన్యం   చేసుకున్నాడు !
               ప్రతి సోమ వారం రోజున - ఉపవాసం - గంగా స్నానం - సాలగ్రామ పూజ - నమక చమకాలతో  ఆహిషేకం - నివేదన - భజన - దేవాలయ సందర్శనం - రాత్రి  గుడిలో కెళ్ళి - తాళాలతో - తబలాతో - - -నలు గురిని కూడ గట్టుకుని  -- గొంతెత్తి - పంచమ స్వరంలో - పద్యాలు - భజన పాటలు - చదవడం - ఇంటికొచ్చి -రామాయణ కావ్యాలు చదివి తల్లికి - వినిపించడం - -అతడి దినచర్యలో ఒక భాగమైంది  -
            అయితే - ఐదేండ్లు - మంచాన పడి - భాద పడుతుంటే -చూడలేని ప్రజలు - ఇంత మంచి  భక్తునికి - ఎంత కష్ట మొచ్చింది ! అని బాధ పడ్డారు -
  ఆ విధంగా అతనికి "భక్తుడు " అన్న ముద్ర పడింది - ! తాళాలు పట్టి - గంతులు వేస్తూ - సత్సంగంలోను - ఇంటిలోనూ - ఆలయాల్లో - నిత్య సంకీర్తనం చేశారు --విరామం - అలసట కాన రాకుండా - అందరితో ఆడుతూ --పాడుతూ - ఆనందంగా జీవితాన్ని సంతోషాన్ని అందరితో  పంచుకున్నారు -!
         అలాగె సంబందాలు  - చూసి - ఖర్చుల కోర్చి - ఇతరులకు పెళ్ళిళ్ళు చేశారు కూడా  ! పెళ్లి పీటలపై ధర్మపత్నితో - కూర్చుండి ఆమె సహచర్యంలో - సహకారంతో -  తన వారికే గాక -పరాయి ఆడపడుచులకు ఉత్సాహంతో నాలుగు జంటలను ఆశీర్వ దించిన సహృదయుడు -  
          వీరు నిష్టా గరిష్టులు - సద్  బ్రాహ్మణుడు -సచ్చరితుడు - అబద్దము లెన్నడు ఆది ఎరుగడు  సంతృప్తి - సంతోషం -సహృదయం కలవాడు - ఎంత కోపం  వచ్చినా తన నోటివెంట దుర్భాషలు గానీ - తిట్టు మాటలు గానీ - ఇతరులను నిందించడం  గానీ బాధ పెట్టడం గానీ -  తెలియని నిష్కపటి -! నిరాడంబరుడు - నిశ్చలమైన  ప్రశాంత చిత్తులు --
                      తన కైనా-- ఇతరుల కైనా అన్యాయం జరిగితే సహించేవాడు కాదు ఎదురు తిరిగి - ప్రతిఘటించి - ఒంటరిగానైనా-  పోరాడే పటిమ గల వాడు మొండి -  సాహసి - రాత్రిళ్ళు కుడా నిర్భయంగా గ్రామాల్లో -  చేలల్లో -- వరి కల్లాల్లో - సంచరించేవారు ముక్కుసూటిగా - నిర్మోహ మాతంగా మాట్లాడే  తత్వంతో కొంతమందికి కంటూ వయ్యాడు కూడా - 

   "ఆత్మ బుద్ది సుఖం   చైవ   !" అని చెప్పి నట్లుగా అక్షరాలా  ఖండితమైన నిర్ణయాలు  తీసుకోడం ఆతని  నైజం  ! వారి అభివృద్ది - ప్రగతి వెనుక  వారి భార్యా -పిల్లల సహకారం -- ఆవ గాహన   నూటికి  నూరుపాళ్ళు  ఉంది -అంత్య కాలంలో  ఐదేండ్లు వీరు మంచాన పడిన బాధ  వర్ణనాతీతం - ! శత్రువుకు కూడా అంతటి బాధ  రాకూడదు -- ! కాలు - చేతులు - పలుకు  లేకుండా అచేతనావస్తలో  ఆయన అనుభవించిన దురవస్త నరకప్రాయం --!
                      ఇలాంటి దశలో వారి శ్రీమతి -దుర్గాబాయి -మా అత్తగారు -తన భర్తకు చేసిన సపరిచర్యలు  శ్లాఘనీయం - ! అనితరసాధ్యం -- కూడా  ! ఆమె ఓపిక -నేర్పు - భర్త పట్ల ఆమెకు గల భక్తీ శ్రద్ధ - ప్రేమానురాగాలు - స్త్రీ జాతికే  ఆదర్శ ప్రాయం ! సతీ దుర్గ గా- ఒక పతివ్రత లాంటి  ఆ  తల్లి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోనినా పుణ్యమే -- ! భర్త  సేవకు  మాత్రమె   అంకితమై - పండుగలు - -పెండ్లిళ్ళు - సంతోషాలు -  సంబరాలు - నిద్రాహారాలు వదలుకుంది !-రెప్పపాటు  కాలాన్ని కుడా వృధా  చేయకుండా -ఆయన ఆరోగ్యం - కోసం బాగు కోసం మాత్రమె జీవించిన ఆ పరమ సాధ్వికి హృదయ పూర్వక  ప్రణామాలు = సమర్పిస్తున్నాను --!
                   ! భార్య  అంటే అలా ఆమెలా - ఉండాలి !"
                     ఆయన ఇంత  కష్ట పడుతూ  కూడా - ఇన్నేండ్లు  సంతృప్తిగా ఉండటం అటు భార్య -ఇటు కొడుకులు  చేసిన  సేవల వల్లనే  అని చెప్పక తప్పదు !   "కొడుకులు అంటే  ఇలా వారిలా - ఉండాలి" !
 తండ్రికి వెన్నంటి ఉండి  ఆయన అంతిమ శ్వాస వరకు షాయా శక్తులా స్వయంగా - తమ భార్యలతో  సహా - సేవించుకుని - తమ ప్రేమను -  శ్రమను  ధార పోసి కన్నా తండ్రిని  బ్రతికిన్చుకోడం కోసం   వారు  ముగ్గురు  ఎంతో  శ్రమించారు కన్నీళ్ళు   కార్చారు - బాధపడ్డారు  !ఒక సారి తండ్రిగారి కి ఆస్పత్రిలో  -   అవసరం ఉండగా --  పెద్దకొడుకు తన నెత్తురు  కుడా ఇచ్చాడు తామే స్వయంగా డాక్టరు పనీ - నర్సు పనీ చేస్తూ -సగం వైద్యం తామే చేశారు ప్రాణానికి ప్రాణంగా వారు పడిన శ్రమ అభినందనీయం   !
                   భగవద్గీత లోని  శ్లోకం  ప్రకారం  అంతిమ ఘడియల్లో  ఎవరైతే హరినామ స్మరణ చేస్తూ పోతారో  వారు సాయుజ్యం పొందుతారు అని !
 దానికోసం మా మామగారు కీర్తి శేషులు గూడూరు సాంబశివరావు గారు జీవితాంతం  సాధన చేశారు - ! శరీరం  కదలలేకున్నా - నోటితో పలుక లేకున్నా కంటి చూపు - వినికిడి జ్ఞానం వెంట అంటి ఉన్నాయి చివరి క్షణం వరకు --!  ఆ  అనుగ్రహం వలన  భగవన్నామ  స్మరణ  -శ్రవణం  చేస్తూ  - పరమాత్మలో  కలిసి పోయారు  ! వారి నిరంతర ఆధ్యాత్మిక చింతన - భక్తీ  జ్ఞాన వ్య్రాగ్యాల వల్లనే  ముక్తిని పొందడానికి  కారణం   !
               అలా  ఈ సాంబశివుని   ఆత్మ  -- ఆ పరమాత్మలో  ఐక్యమైంది --!
   వారి  ఆత్మ శాంతిని  పొందుగాక ! ఆ దేవాది  దేవుని  అనుగ్రహ -  ఆశీర్వచనాల వలన  వారి కుటుంబం శాంతి సౌఖ్యాలను పొందుగాక ! 
               సర్వే  జనాః  సుఖినో  భవంతు ! సమస్త   సన్  మంగళాని  భవంతు   ! 
                      ఓమ్  -శాంతి - శ్శాంతి - శ్శాంతి::! 


మంచి భక్తుడు -! అందరికి  సన్నిహితుడు  కావాలంటే  భక్తి అవసర మేమో !నిరంతర  సాలగ్రామ అభిషేక -పరాయణత  -- పురాణ పత్తనము--భజన - గంగ స్నానం - నిత్య కాల క్రుత్యంలో  భాగంగా  కావడం --ఆయన భాగ్యం !- ఉదయం నాలుగు  గంటలకే లేవడం --రావి చెంబు తో  గంగ కు  వెళ్ళడం - ఇంకా నాకు జ్ఞాపకం - -- తల్లి మీద ఎనలేని  ప్రేమ ----ఇలా మనిషిలో ని మంచి  గుణాలు -అనుసరించడం -సుకృతం  ! -తల్లి దండ్రులు --అందరి పట్ల -వాత్సల్య భావన - ఇవి ఆయన సహజ సంస్కారములు ! అవే అతని సంతానంలో  ప్రతి భిమ్భిస్టున్నాయి---నిజమైన వారసత్వ  సంపద  అదే !
తండ్రి -తల్లి గర్వ పడేది - తమ పిల్లలు ప్రయోజకులై - ప్రేమానురాగాలు కలవారై -- హితోభి లాశులై - ఉంటేనే !
                 ఏమైనా  ఆయన సత్వ గుణ సంపాదకు -- కు వారసులము  మనమై నందుకు  సంతోషమే ! పూర్వ కాలంలో  పతివ్రతలను  తలపించే  సతీమణి  ఆయనకు భార్యగా  లభించడం -- ఆయన చేసిన  పుణ్యాల ఫలం ! ఆయనలా ఉండొచ్చేమో   గాని  ఆమెలా  సేవలు చేయడం   నిజంగా అనితర సాధ్యం - - ఒక రోజు కాదు-- నెల కాదు -సంవత్సరం కాదు - నాలుగేళ్ల  పైగా  భర్తను - -- కంటి పాపలు చంపుకొని --నిద్రాహారాలు  మాని -- పెళ్ళిళ్ళు  పండుగలు తల్లిగారిల్లు --అన్నీ ఆయన సేవలోనే  భావించి  - సేవ చేస్తూ  తరించడం - చాలా గొప్ప విషయం --! దీనిలో పిల్లల సహాయ  సహా కారాలు ఉన్నయి -ప్రేమానురాగాలు  ఉన్నాయి  -  వారిలో  తండ్రికి సేవ చేయడం  లో  అలసట పొందని--దీక్ష  ఉంది !   అయినా - స్త్రీలలో  ఇంత ఓపిక -ప్రేమ - ఉండటం -   చాలా అరుదు ! 
                                వారు ఒకరికి  మరొకరు -తీసిపోరు --చక్కని  జత !
 మనం నేర్చుకునేది -  ఒకరికోసం  మరొకరు ప్రాణానికి  ప్రాణంగా ప్రేమిస్తూ  జీవించడం --!పొరబాట్లను  వేలెత్తి చూపడం  కాకుండా - వాటిని  సరి దిద్దుకుని   ఆదర్శంగా బ్రతకడం -- !   ఈవిడా  ప్రేమ మూర్తులు -త్యాగ దనులు -ఆదర్శ ప్రాయులు !
                              కాలచక్ర ప్రభావంలో  నిలిచేది  -- గెలిచేది -భక్తి మార్గమే !స్త్రీకి భర్తనే దేవుడు ! అతని సేవ దేవుని సేవకంటే  గోప్ప్ ! ఏ యాత్రా - నోము - వ్రతము -        దానికి  సాటి  కాదు --ఇది వేద ప్రమాణము కనుక ఇలాంటి  సేవలు చేసి  పుణ్యాన్ని చేద్దాం   ! ఇలాంటి పుణ్య దంపతులను  సేవించడం -- అలా ఉండడం - మనం చేయాల్సిన  -పని !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...