కృష్ణ శాస్త్రిని గన్నట్టి అన్నపూర్ణ - మాకు నిజముగా దేవత మూర్తి గాదె !
నిరత హరినామ కీర్తన జేసి తాను- మమ్ము ధన్యుల జేసిన భక్తీ పరుడు ,
తాను తరియించి -తరింప జేసే --!----------1
దైవ భక్తికి మించిన ధనము గలదే - జలజ నాభుని గనిన జన్మంబు గలదే !
పాప భూయిస్టమగు -మా హృదయ కుహర మందు --- పుణ్య కథలను -భజనలను వినిపించి తాను,
నొసట కుంకుమలా తాను -వెలిగే నయ్య !----------2
ఎలానయ్యా ! నీవు సుతి గొని -కృష్ణుని గానా మ్రుతమ్మును గ్రోలినావు ?
ఏలనయ్య ! నీవు భాగవత సప్తాహ యజ్ఞాలు నూరులు చేసినావు --?
ఏలనయ్య -నీవు చల్లని చూపుల నవ్వుచు మమ్ముల దోచినావు ?
ఏలనయ్య !నిన్ను గొనియాడ లేకుండా -కృష్ణ ప్రేమలో ముంచి వెళ్ళినావు ?-----------3
ఏమనందును ! మహాత్మా ! ఎటుల కందు !
కనుల పండువు గా-ఆది దంపతు లట్లుగా-
మీరు మీ సతితో కలిసి మెలగు చుండ -
గాంచి మ్రొక్కిన పాపాలు తొలగు గాదె !-----------------------4
విధికి దయ తప్పే --సతి అనసూయ పైన -
వారి అనురాగము గొన్న వారి పైన -
హరి కథా మృతమ్ము ను విన్న వారి పైన -
వారి పేరున బరగు ఈ ఊరి పైన ------------------------------ --5
దేవ దేవుని స్తుతియింప మీరు లేరు
చిన్ని కృష్ణుని భజియింప -- కిస్టన్న లేడు--
బ్రాహ్మణ దేవతా ! మీరు పోయినారు --!
బ్రాహ్మ లందరిలో --తల లాంటివారు --!
బ్రహ్మ తేజస్సు - ముగమున వెలుగు వారు !--------------------6
బక్కచిక్కిన ఆ వృద్ధ దేహ మందు
నాల్గు దిక్కులా నినదించు గాన మందు
రామ రామా శ్రీ రామ రామ యనుచు
మేలు కొలుపులు - తన్మ యత్వంబు తోడ -!
పాడుకున్నట్టి ఆ కృష్ణ శాస్త్రి ఏడి?-------------------------- --7
అందరిని ఒక్కరీతిని ఆదరించిన మహాత్మా
ఎందరికో -మీ చలువన జన్మ ధన్య మయ్యే !
స్వామి ! హరి నామమే మాకు దూరమాయె-!
దేవ దేవుని భజియించు తీరు మారే !---------------------------8
---హాయిగ రామ కృష్ణ యనుచు -కన్నులు ముయుచు నాలకించు -
మీ కమ్మని గానమింక కరువాయెను ---మా కిక కృష్ణ శాస్రి !
మీ మోమున మంద హాసమును --మెల్లని చూపుల నమ్రుతమ్ము నన్ !
సాదరమైన వాక్కులన్ కరగ --నారయుచుంతిమి భూసు రోత్తమ!-----------9
చిక్కని కరుణా మృ తమ్మును----చక్కని భాగతా మృ తమ్ము నన్ -
మెక్కిన పుణ్య జీవులము --మీ దయ వల్లనే ఇంట యయితీ --
మేము -మ్రొక్కగా కాన రారెవరు --!?మీవలె భక్తులు ఏమి సేతు ?
అక్కటా ! మాకు దిక్కెవరు ?యా హరి నామమే మృ గ్యమే ఇకన్ !----------------------10
----------రాగము పేట గాదిది --!రంజిలు కృష్ణయ గారి పేట
ఎ యాగములోన గాని -పర ఊరిలో- పరిచయ మే కలుంగు --!
పరమ భాగవతోత్తమ --!పావన మయ్యే కదా -ఈ గ్రామము --!
మా ఊరును పేరు గాంచే గదా !మీ పద స్పర్శన -నామ కీర్తనన్ -!---------------11
ఎంత దయ జుపినావయ్య తాత ! నీవు !
పిల్లలందున చిన్ని క్రిషుని రూపమ్ము జూసి
పరవసించుచు నైవేద్య మిచ్చి నావు -
రాజ రాజేశ్వరుని తోడు నిలిపినావు -!------------------------12
నీ భజనల్ పురాణముల నిర్మల చిత్తముతో భజించు -
ఆ కృష్ణుని లీలలన్ --తనదు మానస మందున తేలియాడ --
తాదాత్మ్యము పొందుచున్ - హరి హరీ యనుచును -ఈ
బాహ్య ప్రపంచము మరచి పోదువో --సతతమ్మును నీకు మ్రొక్కెదన్ --!-------------13
మాటలు చాలవింక -కవితల్ నుతి చేయగా జాలవింక --!
ఈ ఆలయమందునన్ భగవ నామము - శాస్త్రములన్ పురాణముల్-
వింటిమి -కంటిమి --చాలునయ్య !-మా భాగ్యము పండే నయ్య !
నిను గాంచిన కన్నుల -బ్రాహ్మణోత్తమా --!-------------------------14
భాగవతా మృ తమ్మును బాగుగా పంచిన భాగ్య శాలి - మా నోట
భజింతు ము ఈ హరి నామమే - మమ్ము నమ్ముమో -!
అంజలి ఘటించి కోరేదము -ఆర్య ! కృష్ణమా చార్య !
నీ దేవనలే ప్రసాదముగా - ఈయగదయ్య- ! బిరాన మా కికన్ !------------15
No comments:
Post a Comment