sri Vemuganti Narsing rao of YALABAKA -- HIS EXCELLANCY -
An excellent individual -a golden ancient paint of the of the past -took birth in a corner village -got fame and name in all the villages AND RELATIONS by his generous nature - brought up kith and kin sons and daughters --fed a dozen children every day - with his love and affection - a generous man with humility and abundant knowledge -in every groud -most calculative - and talkative - - his wife being different in attitude and thought - never spoke any hard or harsh words -to anybody -
- A GOOD ADMINISTATOR -FATHER -PATWARI A VILLAGE HEAD -ALLIN ONE --
and separated by the time - leaving her alone -WE ARE PROUD OF HIS INTIMACY AND RELATION
No change in earth rotation- the sun- the moon- day and night --everything is normal -
A STAR IS GONE -SETTING A REMARKABLE LIFE HISTORY AS A ROLE MODEL -SIMLE LIVING AND HIGH THINKING - A BEST MAN OF HIS AGE .
శ్రీ ఖర నామ సం-= మార్గశిర బహుళ పంచమి- రోజు ! -కీర్తి శేషులు శ్రీ వేముగంటి నరసింగ రావుగారి - స్మారకార్థం ! శ్రద్ధాంజలి సమర్పణ -!
------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------ -------- ------
----మచ్చ లేని మనిషి ---! -నిర్భయుడు ! బుద్ది కుశలత గలవాడు -! కాదు యుక్తిగా తీర్పులు చెప్పువాడు !
ధార్మిక చింతన చేయువాడు1 --అపకారము ఎన్నడు తలపడు! -చక్కని యోచన చేయువాడు -!
ఎప్పుడు ఆధ్యాత్మిక భావము చేయు వాడు-!- గ్రామ పెద్దగ పదుగురి మన్నన పొందినాడు-!- కుటుంబము పెద్దగ --
ఎల్లరిని నియంత్రించు పటిమ గలవాడు! - నిరాడంబర నిష్ట జీవి! --కడు యుక్తితో కార్యము దీర్చువాడు --!
వాదమ్మున గెల్చువాడు !- హాస్య చతురోక్తుల నందర మెప్పించువాడు !-తన కష్టము ఇతరులకు పంచువాడు కాడు!
బహుజన హితాభిలాషి - !సుగుణాల రాశి - !స్నేహవాత్సల్య త నందరి నాదరించు మితభాషి --!గంభీరుడు -!
ఉన్నదానితో తృప్తి ని గనిన నిత్య సంతోషి! --!నిత్య సంధ్యా వందనమ్మును - పడి తప్పక ఒనర్చిన సద్ బ్రాహ్మణ శ్రేష్టి !
సద్వర్తన వినయ శీలి ! - నిరత గంభీరత నొప్పు దయాశాలి !--!మేనల్లుర - అల్లుర - తమ పిల్లల వోలె ప్రేమించి -పోషించి --
వారికి ఆత్మా విశ్వాసము నేర్పిన ప్రేమమూర్తి! --గ్రామస్తుల - పనివారలన్దరిని - అన్ని అవసరముల అన్ని విధముల --
మంచి చెడ్డలను విచారణ చేసిన వ్యవహార శీలి -! --అందరిని ఒకే త్రాటిపై -- ఒకే మాటగా - నడిపిన మార్గదర్శి --!
ALL IN ONE _ SIMPLE LIVING _ HIGH THINKING _అని పించుకున్న మహాను భావుడు !----------------------------- -------------------1
దొర వలె పుట్టి యలబాక గ్రామపెద్దగ- దొరతనంబున మిగుల ఖ్యాతి గాంచె!
తన తలిదండ్రుల పున్యమనంగా -- ఘన కార్యముల నెన్నో - యిట్టె జేసే --!
పురుడు -పుణ్యకార్యముల - నెన్నిటినో - అవలీల జేసే -- నరసింగ రావు గారు !
ఎంతటి భాగ్య శాలియో ! చరితాత్ముడు - ! దివ్యము - నీ జీవనంబిలన్ !---------------------------- ------------------------------ ------2
తన ఆడపడుచులను అమితముగా - ఆప్యాయత నాదరించి - కడు ఇడుముల బాపి - బ్రోచిన అనురాగ సోదర మూర్తి --!
--చక్కని తండ్రి --చక్కని భ్రాత --!చక్కని పాటలు -గ్రామ పెద్ద !పండితుడు -!వేదాంతి !ఒక గ్రంధము !
ఒక నిఘంటువు !గొప్ప భూస్వామి -!అలసట నెరుగని మేటి వ్యవసాయ దారుడు -!బంధు జనా బాన్దవుడు-- కార్య దీక్షాపరుడు !
---- వేయేల ! ఒక మహాను భావుడు ! ------------------------------ ------------------------------ ------------------------------ -----------------3
నోటిలో నాలుక వలె - -పురజనులందరి -మెప్పు బడసె -మిక్కిలి మక్కువ చూపి !
ఎ లోటును రానీక ---- మేనల్లుర -కన్న కుమారుల రీతిగా ఆప్యాయత జూపి
చదువు సంద్యలను - బుద్ధియు జ్ఞానము - విద్య నేర్పే- పెండ్లి చేసే !
సహస్ర చంద్ర దర్శనమున అందరు ఒక్కటి -- అను బంధము వేసే -!
ఆనంద మరీచికల డెందము ఊగిపోయి --మీ పెళ్లి వేడుకలో పాల్గొనగా కడు ముచ్చ టాయే ! ----------4
కొడుకును గోలుపోయి కోడలు మనవల - బేల ముగంబులన్ జూసే --!
ఇంతలో కూతురు కన్ను మూయ- కూలిన సంసారములన్ జూసే --!
దైవము - అక్కట ! జాలిని కరుణయు-- లేనిదయ్యే --!
విధి విచిత్రమో--!విధాత రచించిన మాయాజాలమో ?----------------------------- ------------------------------ ------------------------------ ---------5
చేసితి వెంతో పుణ్యము --!సతీ అనసూయను ధర్మపత్ని గా జే పట్టి --
ఆమె -ఇంటికడుగిడిన సుముహుర్త బలమ్మో! పితృ దేవుల దీవన ఫలమ్మో!
వైభావంములు పదిఒఅన్తలు సత్సంతానము- సత్బందువుల్ -
సదాచారత-నొప్పె మీ గృహము ! -చేసిన పుణ్యము రిత్త పోవునే ?----------------------------- -----------6
అల్లుండ్రు కొడుకులైరి--తమ తలి దండ్రులవోలె మిమ్ము సేవించి నారు !
కొడుకులతో సమానముగా -మీరు పుత్రా వాత్సల్యము పంచినారు -!
వారలతి వైభవముగా -సహస్ర చంద్ర - దర్శన భాగ్య సేవ గావించినారు -!
పార్వతి పరమేశ్వర దర్శన ము - మన్మన్దిరంములో ధృడముగా నిలిపినారు ! ----------------------------- ------------------------------ ------------------7
కరుకుగా మాట లాడడు కదా !ఎన్నడు ఒరులను బాధ పెట్టడు -!
అవసరానికి మించిన భాషణంబులు చెయ్యడు- వృధా ప్రసంగముల్--
చెయ్యడు -! !పొరపాటు ననైన- ఎవ్వరిన్ తిట్టడు- కొట్టడు ! మాట జారడు -!
మిత భాషణంబులన్ రంజిల జేయునందరిని ! - నవ్వుల కైన-
ఎవ్వరిన్ వెక్కస మాడడు ఎన్నడున్ - !మచ్చ లేని జీవనమును గడిపెన్ - !
వేముగంటి వంశ భూషణుడు - శ్రీ నరసింగరావు ధీరతన్--!-------------------- ------------------------------ ------------8
తాళి కట్టిన భార్య - సతి అనసూయ --నిను గన లేక దుఖించు నోయి !
మావా - మావా ! అనుచు మదన మొహనుడదిగో- పెద్ద కొడుకు వోలె వగచే నోయి --!
బంధు జనులందరూ --బ్రాహ్మణోత్తము లంత ----శ్రద్ధాంజలి సమర్పింతు రోయి- !
తోబుట్టువులు అన్న - ! అన్నయ్యా ! అనుచును ఆర్తితో దుఃఖించి క్రుంగిరోయి-- !
కన్న కొడుకులు కన్న తండ్రిని గోల్పోయి - కన్నుల నీరు పై గప్పెనోయి---
యలబాక గ్రామము దొర లేని కొరతతో -- వెత జెంది బాధ లో మునిగె నోయీ-------------------------- ------------------------------ --------------------9
ఎంత లోటో- ! నీవు లేనట్టి ఇల్లు ? ఎంత కోరతో నీవు రానట్టి ఊరు ?
ఎన్ని జ్ఞాపకాలో ? ! -- ఎంత గురుతో ? !-- రంగా రావు గనిన - రాధా రమణి గనిన -
-- గుండెలు చెరువులై-- నిండు నోయీ !----------------------------- ------------------------------ ---------------10
ఎంత వారలైన - విధికి వంచితులే - నిజము--!
వెనక వచ్చు వారెల్ల - వెనక పోవుదురు --నిజము -!
కాని నీవలె - ఉత్తమ చరిత గలిగి --!
పేరు గన్నట్టి - జన్మ ధన్యమ్ము -- నిజము !----------------------------- ------------------------------ ------------------------------ -----------------------11
మా పాలిట భాగ్యముగా స్మరియింతు మయ్య -!
మీ చల్లని దీవన మాకు - మా పిల్లలకు - శ్రీ రఘు రామ రక్షగా భాసిలునయ్య !
ప్రేమ పుష్పాంజలు లివిగో --! సమర్పింతుమయ్య -!
ప్రశాంత మైన ఆత్మానందము నందుమయ్య - ------------------------------ ------------------------------ ----12
విశిష్ట వ్యక్తిత్వము కలిగిన నరసింగ రాయా --! యలబాక గ్రామ పురంధరాయా --!
సతీ అనసూయ ప్రాణ ప్రియాయా -!
సకల బంధు జన -గ్రామపురజనుల స్నేహితుల ఆత్మా బంధనాయా --!
మగరాయా ! గురువా రాయా ! యశోధరాయ !---------------------------- ------------------------------ ------------------------------ -----------------13
మాటలు జాల వాయే -- నిను గొని యాడగ !- హృదయము భారమాయే --!
ఈ దుర్భర దుస్తితి లో మీకు-- తీరని - ఆరని గాయ మాయే !
కీర్తి ప్రతిష్ట లన్- గణుతి కెక్కిన వారల బాధ మీరె !
గతించిన వారి - జీవానోన్నతి గురించి మదిన్ - క్రుంగి పోయే గదా !----------------------------- ------------------15
అలసట జెంది నావు కదా -! కన్న కడుపు తీపి కోతతో --!
విశ్రాంతిని పొండుమయ్య --! నమస్సులయ్య --!
మా మనసు రంజిలు నయ్య - మిమ్మెపుడు తలచినచో--!
ఆత్మ విశ్వ్వాసము తల ఎత్తునయ్య --! అందరి ఆత్మ బంధువా !----------------------------- ------------------------------ ------------------------------ 17
------------------------------ ------------------------------ ------------------------------ ------------------------------ -------------------
- వేద మూర్తుల - బ్రాహ్మణోత్త ముల ఆశీర్వచన సమయములో వందన సమర్పణ !
15-12-2011- thursday 7-00pm-knr
No comments:
Post a Comment