భగవంతుడు అంతటా ఉంటాడు - కాని ఎందుకో" తిరుమల శ్రీనివాసుని
సన్నిధానం" లో భక్తులు పొందే ఆనందం -త్రుప్తి ఎనలేనివి !- మెట్ల
దారిలో ఏడుకొండలవానిని స్మరిస్తూ -"గోవిందా -! గోవిందా 1" అంటూ వందల
మందితో నడుస్తుంటే -" దొరకునా ఇటువంటి సేవా !"అనిపిస్తుంది - ఇక తలనీలాలు
స్వామీవారికి సమర్పిస్తుంటే - మనలోని అహంకార -మమకారాలు త్యజించి
-"స్వామి! నీకు సేవలు -పూజలు చేయలేను -నిన్ను శరణు వేడుకుంటున్నాను
"-అన్న భావం కలుగు తుంది - ఇక స్వామిదర్శనంవల్ల కలిగేఅనుభూతి- తన్మయత్వం
అంతా ఇంత కాదు - అన్నమయ్య గీతంలో చెప్పినట్లుగా -"నీ వంటి దైవాలు లేరు-
నిఖిల లోకము లందు !"--లక్షలమంది భక్తులకు ఆశ్రయం -అభయం- ఆనందం -తో బాటు
-మళ్ళీ దర్శించుకోవాలన్న అనుభూతినీ అనుగ్రహించిన ఆ దేవదేవుని దయకి-
ప్రణామాలు సమర్పించడం తప్ప -ప్రతిగా మనం ఏమి చేయగలం -!ఇదంతా నీదే - నేను
మేము నీ వారమే - నీది నీకే సమర్పిస్తున్నాం స్వామీ !-
1-నాకు గల పెద్ద వయస్సు - మోకాళ్ళ నొప్పులు -కాలి
మడమపట్టు- కాలుకింద పెట్టలేనంత బాధఉన్నా - డెబ్బై లోపడుతున్న వయసులో
కూడా నన్ను తనవధ్హ్ధకు రప్పించుకుని- అన్నిమెట్లు కూడా అవలీలగా ఎక్కించి
-దివ్యమైన తనదర్శనం ఇప్పించాడు-" స్వామి వైభవం "అంటే ఇదియే కదా ! 2-
బంగారు వాకిలి -వెండివాకిలి - ద్వారములవద్ద ఎనలేని ఉత్సాహంతో -
భక్తిప్రపత్తులతో -స్వామిని చూడాలన్న తపనతో -దూరమనక - భారమనక- ఎన్నో
ప్రయాసలకు ఓర్చి - స్వామిసన్నిధిని ఆనందంతోచేరిన- భక్తజనంతో "గోవింద
నామాన్ని " ముక్త కంఠంతో నాద్వారా" స్వామీ' అనిపించడంబ్రహ్మానందం గా
తోచింది -3- దివ్యమైన -అద్భుతమైన -ఆనందకరమైన -అపురూపమైన తన సుందర
రూపాన్ని -సర్వఅలంకార -అలంకృత- మందహాస మంగళమోహన విగ్రహాన్ని దర్శింప
జేసి - ఇందరి జన్మలను జన్మను తరింప జేశాడు -శ్రీ వేంకటేశుడు -4- తనతల్లి
వకుళామాతకి- కొడుకుగా శ్రీనివాసుడు తన కుడి ప్రక్కన నిలుపుకొని - ఇచ్చిన
మర్యాద -భక్తి గౌరవాన్ని చూస్తే - మన తలి దండ్రులనుకూడా మనం అలా ప్రేమతో
చూదాలి అని స్వామీసూచన చేస్తున్నట్లుగా అనిపిస్తుంది మనకు--1 అప్పుడుకదా
నిజంగా మనం -'స్వామి కరుణ"కు పాత్రులం అవుతాం -అన్న మధుర భావన ఎవరికైనా
కలుగకమానదు - అక్కడేగల వైకుంఠదారం వద్ద స్వామిని దర్శించుకుని వచ్చి
కూర్చుని ఆదివ్యమంగళ విగ్రహాన్ని మదిలో స్మరించుకుంటున్న భక్తులచే - తన
గోవింద నామాన్ని-అన్నమయ్య గీతాన్ని "-పొడగంటిమయ్యా !నిన్ను పురుషోత్తమా
1" అన్న అమృతతుల్యమైన అమర గానాన్ని నానోటపలికిస్తూ- దానిని అందరితో
అనిపిస్తూ స్వా మి సన్నిధిలో అరగంటసేపు -గడపడం నిజంగా నా
పాలిటపెన్నిధికదా" -ఇలాంటి స్వర్ణఅవకాశం అక్కడ అంతసేపు నాకు లభింపజేయడం
నా భాగ్యం గా భావిస్తున్నాను - ' స్వామిదయ -అపారమైన కరుణ "ఈ - జన్మను
ధన్యంచేసిన మధుర దివ్య స్మృతులుగా గుర్తు ఉండిపోతాయి - 5- గతఆదివారం
రోజున -స్వామి బంగారు వాకిలి ముందు నెల్లూరు బృందం వారు -యువకులు
-యువతులు ఏభై మంది - సాయంకాలం - స్వామి వారి నాలుగుమాడలగుండా ప్రతిరొజూ"
నిత్య కల్యాణం -పచ్చ తోరణం 'లా జరిగిన ఊరేగింపు తర్వాత - అక్కడ కోలాటం
ప్రదర్శించారు - అందులో అప్పుడు - నా నోటస్వామివారు పలికించిన" రామ-
కృష్ణ- గోవింద" భజనకు ఒక అరగంటసేపు వారంతా కలిసి -తమ కోలాటనృత్యంద్వారా
అద్భుతంగా ప్రదర్శించడం సామూహికంగా అభినయం చేయడం --అందరికీ త్రుప్తినీ
సంతోషాన్ని కలిగించింది - -
ఇలా "ఎన్నిదివ్యానుభూతులో - ఎంత కృపయో !"- వేలాదిమందికి తన
దివ్యమైన వరదహస్తంతో -తన భక్తులకోరికలను తీర్చేవాడు- వారిఆపదలను తొలగించే
వాడు - తన అభయహస్తంతో దివ్యదర్శనంతో -భక్తులలో అమిత విశ్వాసాన్ని
-భక్తి శ్రద్ధలనుపెంచేవాడు -అందరికీ ఇలవేలుపు - పిలిస్తే పలికే
ఆపద్భాందవుడు -మన ఈ " ఏడుకొండల వేంకటరమణుని లీలలు -పొగడ తరమా - 1
వర్ణింపవశమా !శరణు కోరుతూ సవినయంగా స్వామికీ నమస్కరించడం తప్ప 1" : ఓం
నమో వేంకటేశాయ " అనే మంత్రాన్ని -అంటూ అనునిత్యం స్వామిని మనసులో
తలచుకొంటూ -ఆ రూపాన్ని నిలుపుకోవాలి -- ఇదేకదా మన మానవజన్మ సార్ధకత-
సాఫల్యత ! - -
April 4, 2016
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment