స్వర్గీయ గూడూరు కమలాకర్ రావు మామగారు -మే నెల - ఒకటవ తేది 2016- న స్వర్గస్తులయారు-వారు మా కు చిన మేనమామ -పైగా తొమ్మిది పదవ తరగతిలో నాకు గణితంచక్కగా బోధించిన లేక్కలమాస్టర్- అందుకే నాకు లెక్కలపైన పట్టు వచ్చింది - నాలోని TALENT ను గుర్తించి -నన్ను OPTIONAL HISTORY నుండి -OPTIONAL MATHEMATICS పట్టు బట్టి మార్పించి నన్ను ఉత్సాహ పరచింది ఈ చిన మామగారే-1 అందుకే INTER లోనూ -డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ లో నూ వరుసగా MATHEMATICS సబ్జెక్టు నన్ను -నా బాల్యమిక్కడే గడిచింది కనుక వీరి సాదు స్వభావం -సత్వగుణం -సమయ పాలన -మిత భాషిత్వం -ఆయన సహజ లక్షణాలు --- ఎప్పుడూ అతడు - ఏదో ఆలోచన చేస్తున్నట్లుగా కనిపించేది - మనమ్మాట్లాడిస్తేనే తప్ప- తాను స్వయంగా కల్పించుకొని మాట్లాడే వాడు కాదు
-పంచాయతీలకు - తగాదాలకు రాజకీయాలకు ఆడంబరాలకు - అప్రస్తుత ప్రసంగాలకు అతడు దూరం ఉండేవాడు - జీవితాంతం అలామౌనంగా -మౌనమునిలా - పరమ శాంతంగా -నిర్లిప్తంగా-అనుబంధాలకు అతీతంగా -అలా "సాక్షిలా ' చూస్తూ ఆయనలా - ఉండటం అందరికి సాధ్యమయ్యే విషయంకాదు - HE WAS NEVER SERIOUS -IN ANY MATTER - BUT HE WAS VERY VERY PARTICULAR MAINTAINING HIS DAILY ROUTINE AS
PER HIS FIXED TIMETABLE - నాకు తెలిసి అంత ఖచ్చితంగా సమయం ప్రకారం లేవడం -స్నానం -సంధ్యావందనం -టీ టిఫిన్-లంచ్ విశ్రాంతి తీసుకోవడం -వాకింగ్ -రాత్రి భోజనం - తర్వాత నిద్రా -ఇవన్నీ పండుగ అయినా =వేరే ఉరిలో ఉన్నా -ఎంత మంది ఉన్నా చక్కగా పాటించేవాడు -
-- ప్రస్తుత సమాజంలో- నోరుంటేనే ఊరు - అన్నట్లుమనం చూస్తున్నాం - కాని ఈయనకు నాలుగు మాటలు ధారాళంగా మాట్లాడిన సంఘటనలు లేవు - గట్టిగా బిగ్గరగా మన బ్రాహ్మణవాడ అంతా వినబడేలా -అన్నట్లు మనమేవ్వరంవిన లేదు -మా తరగతి లోయన చెప్పే లెక్కలు మొదటి రెండు బెంచిలవరకే విన బడేవి -అంత మెల్లిగా
-నెమ్మదిగా -కొసరి కొసరి మాట్లాడటం ఆయనకేచేల్లింది - అలాఅని ఆతడు అమాయకుడుకాదు -మంచి తెలివి గలవాడు -BSC -MATHS - ఫస్ట్ డివిజన్ - -ఆ రోజుల్లో అంటే -సాధారణ విషయం కాదు -గవర్నమెంట్ టీచర్ -ఉద్యోగం -తన స్వంత ఊరిలో- ఇక్కడ -వచ్చింది - ఆయనకు MATHEMATICS లో ఉన్న ప్రావీణ్యత కు స్టాఫ్ అంతా ఆశ్చర్య పడేవాళ్ళు -ఎవరికీ సాధ్యంకాని PROBLEMS ని ఎంతో సులభంగా సాల్వ్ చేసే వాడు -అయన ఎంత అందంగా ఉండే వాడో - నడక - నవ్వు - చివరకు ఆయన HANDWRITING కూడా అందంగా అద్భుతంగా ఉండేది - అయినా
-రెండుసంవత్సరాలు చేసిమానేశాడు పట్వారిగా చలామణి అయ్యాడు -ఎన్నడు తహసిల్దారు ముందుగాని - కచేరీ లోగాని మాట్లాడి ఎరగడు అని చెప్తుంటారు --- ఆరోజుల్లోఆయన కు - కోరిన ఉద్యోగం -హోదా వచ్చేది -- కాని అంతగా
సంపాదించాలని- ఉద్యోగం హోదా -పదవీ - లపై ఆసక్తి -లేవు -తన అన్నగారు కుడా ఇదే కోవకి చెందిన వాడు-ఆయన కుడా డిగ్రీ చేశాడు =ప్రభుత్వ ఉద్యోగం చేశాడు - వదిలేశాడు కుడా --
నిజానికి తన ఇద్దరు తమ్ముళ్ళ చదువుకోసం - అన్నగారు వెంకట రామా రావు గారు - ప్రోత్సహించారు - గొప్ప పదవుల్లో-తహసిల్దారు - కలెక్టర్ - లాంటి స్థాయిలో తనైద్ద్రు తమ్ముళ్ళను చూడాలని ఆయన ఆకాంక్ష -- డబ్బులు
హోదా -పదవి- అధికారం- దర్పం- అట్టహాసం అజమాయిషీ - డాబు దర్పం - అజమాయిషీ - ఇవన్నీ వెంకన్నకి ఇష్టం- కాని సామ్బంనకి -కమలన్నకీ నిరాడంబరత ఇష్టం - కష్టపడి మంతనిలో- మెట్రిక్ వరకు- హన్మకొండలో డిగ్రీ చదువు చక్కని నేర్పు నైపుణ్యంతో పూర్తి చేసి - ళాXఏట్టీఫేటా గ్రామంమోత్తంలోంత గా చదివిన వారు లేరు అనిపించారు - తెలివి -జ్ఞానం -పట్టుదల - తమచదువులవరకే -వ్యవహార జ్ఞానం లోఅన్నగారిని త్రుప్తిపరచ లేక పోయారు -
కమలాకేర్ రావు మామగారు కన్నా తండ్రిని కనులారా చూసుకునే అదృష్టానికి నోచుకోలేదు -తాను తల్లి సూర్యాబాయి కడుపులో ఉండగానే తండ్రి నరహరి రావుగారు పరమ పదించారు --అప్పటినుండి చిన్న తమ్ముడు - ఇద్దరు అన్నలకు-ముగ్గురు అక్కలకు గారాల పట్టి - అయ్యాడు - ఎన్నడు ఎవ్వరు కమలయ్యను నొప్పించలేదు - కోప్పడ లేదు కూడా -- చక్కని సంతానం -అందమైన ఆరోగ్యకరమైన తెలివైన పిల్లలు-ఐదుగురు కొడుకులు కోడళ్ళు -ఇద్దరు కూతుళ్ళు బుద్దిమంతులైన అల్లుళ్ళు - ఎనమండుగురు మనవలు -ఎనమండుగురు మనవరాళ్ళు -- కళ్ళముందు ఆనందంగా అభివృద్ధిలో పైకి రావడం -ఈ తాతగారు వాళ్ళని తృప్తిగా చూసుకోవడం -సంతోషించడం - నిజంగా అతడిభాగ్య మే - తల్లి సులోచన కంటే - తండ్రిగా మా కమలాకర్ రావుగారు ఎక్కువ అదృష్ట వంతులు - భాగ్యవంతులు - ఆఖరు క్షణం వరకు జీవితం లోని మధురాను భూతు లు అన్నీ అనుభవించారు-- బాల్యంలో కష్ట పడ్డారు - కుటుంబం అంతా అనుకోని విపత్తులతో - పినతండ్రులు పిన తల్లులు పోవడం - కన్నతండ్రి తమ చిన్న వయసు లోనే గతించడం - పెద్దవాడైన వెంకన్నపై కుటుంబ భారం-పడటం -- ఆయన సమర్థ వంతంగా వయసులోచిన్న అయినా -తండ్రి లేకున్నా - కన్నా తండ్రి వాలే - తమ్ముల్లచదువులు ఆలనా పాలనాచూస్తూ తన పెళ్ళితో బాటు -ఇద్దరు చెల్లెళ్ళకు -తమ్ముళ్ళకు పెళ్ళిళ్ళు చేయడం - వ్యవహారం - వతన్లు - భూములు - ఆస్తీ ఆరోగ్యం- ఎన్నో ఊర్లలో వ్యవసాయం - గుమాస్తాలు - పట్వారీలు పటేల్లు - పాలేళ్ళు - -ఎంతో కష్ట పది-- భార్యను పోగొట్టుకొని - జబ్బుల
తో ఇబ్బంది పడుతూ కూడా - కుటుంబాన్ని పైకితేచ్చాడు - నలుగురిలో శహబాష్ అనిపించు కున్నాడు
-- ఆరకంగా మాచిన మామగారు అందరికి ఆప్యాయంగా- గారాబంగా పెరిగారు -అలాగే తానుకూడా తన పిల్లలను గారాబంగా పెంచిపెద్ధజేసి విద్యా బుద్ధులు చెప్పించి - పెళ్ళిళ్ళు చేసి -తన బాధ్యతను సక్రమంగా నిర్వహించారు -- తన కున్న ఒకే ఒక కష్టం - తాను అమితంగా ప్రేమించే భార్యను కోల్పో వడం -- - భార్యను కోల్పోవడం మగవానికి ఒక శాపం -- బార్య లేకుండా బ్రతకడం చాలా కష్టం - దుర్భరం - ఆ మనిషి మానసిక పరిస్తితిని ఉహించలెం --దారంతగిన గాలి పటంలా - ఎన్నో వ్యసనాలకు లోనై - అతని జావితం గమ్యం తెలీకుండా సాగుతుంది - పెద్దతనం లో -ఇంకా ఇబ్బంది - చెప్పుకోలేని దేహావస్తలతో - తన పనులు తాను స్వయంగా చేసుకోలేని -చేతగాని తనంతో - బ్రతుకు పరాదీనంగా అయిపోతుంది -- ఎందరు అయిన వారున్నా -ఎంత సంపద -బలగం ఉన్నా - ఆర్చలేని తీర్చలేని వెలితి - అర్ధాంగి లేకపోవడం --ఎవరు తీర్చ లేని లోపం -- ఒక దశలో జీవితం నరక ప్రాయం లా మారుతుంది -దీనికి
ప్రత్యక్ష ఉదాహరణ మా పెద్ద మామగారు - భార్య లేని దుస్థితిలో తన వ్రుద్ధ్యాప్యం లో -ఎన్నో అవస్తల పాలయ్యాడు --భర్త లేకుండా తన పిల్లలతో ఎన్ని కష్టాలైనా పడుతూ -విధిని ఎదురిస్తూ -ఎక్కడా రాజీ పడకుండా బ్రతుకును
కొనసాగించే సత్తా -తె గింపు దేవుడు స్త్రీజాతికి ఇచ్చాడు అందుకు మా అమ్మనే చక్కని ఉదాహరణ - మా బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన -నిస్సహాయ స్థితిలో మా కన్నా తల్లి- తల్లి తండ్రి అన్నీ తానే అయ్యి - తన ప్రాణానికి
ప్రాణంగా మమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచి పెద్దచేసింది -- అలాగే మా చిన్నాయిలు చుక్కమ్మ -ఆనందమ్మ చిన్నాయిలు కూడా - తమ తండ్రి కరవైన తమ సంతానాన్ని కంటిపాపలా సంరక్షించారు - ఈ విషయంలో మాత్రం - మాతృప్రేమ ముందు పిత్రుప్రేమ తక్కువే అనిపిస్తుంది - ఎందుకంటే కన్న కూతుళ్ళ కు కన్నా తల్లి చూపే అనురాగం -ఆదరణ -ఆప్యాయత -ప్రేమ ఏ తండ్రి కూడా ఇవ్వలేడు - కనుక-1 అమ్మ పంచిన ప్రేమ సాక్షాత్తు ఆ భగవంతుడు కూడా ఇవ్వలేడు-- ఆ ముద్దు ముచ్చట్లు తల్లి వద్ద ఉండే చనువు బిడ్డలు తమ కష్టసుఖాలు చెప్పుకోడం - అమ్మఒడిలో ఉన్న త్రుప్తి ఓదార్పు ప్రశాంతత -ప్రపంచంలో ఎక్కడా లభించదు కదా 1
కాని - మాచిన మామగారు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా వ్యవహరించారు --మనసును చిక్క పట్టుకొని ధైర్యంగా - ఎక్కడా ఎవరితోనూ చెప్పుకోకుండా - వెలితి పడకుండా -ఆఖరు శ్వాస వరకు నిబ్బరంగా జీవించారు - వైరాగ్యం - జ్ఞానం కలబోసిన మూర్తి అతడు - దేనిమీదా ఆసక్తి లేదు - ఇది కావాలని ఎవరిని ఎప్పుడు అడగ లేదు - తెల్లని ధోతి కమీజు - అందమైన -ఆరడుగులఆజానుబాహువు - -- హిందీ సినిమా హీరో లా - అచ్చుబోసిన అందమైన నవ్వుతున్న అచ్చమైనజయపూర్ నుండి తెచ్చిన తెల్లని పాలరాతి బొమ్మలా చేసి -దేవుడు మనకడకు పంపించాడు -- నాకు తెలిసి నంత వరకు -ఆయన ఎవరినీ -ఎప్పుడు - బాధపెట్టలేదు -ఇబ్బంది కలిగించ లేదు- భార్య ఉండగా ఎలా ఉండే వాడో - ఆమె పోయిన ఈ పదిహేడేళ్ళ ఒంటరి జీవితం లో కూడా అలాగే ఉన్నాడు - అలా ఉండటం అందరికి సాధ్యం కాదు -అలా ఉన్నవాళ్ళు చాలా అరుదు - నిరాడంబరి - నిగర్వి - అలాంటి గుణాన్ని - భగవద్గీతలో -భక్తియోగం లో స్థిత
ప్రజ్ఞత అంటారు -- పదవి సంపద భార్య బలగం ఉన్నప్పుడు -లేనప్పుడు ఒకేలా ఉండటం --ఇష్ట మైన వస్తువుకు పొంగిపోనివాడు -దేనియందును ద్వేష భావం లేనివాడును -దేనికిని శోకింప నివాడును దేనిని ఆశింప ని వాడును -అందరి యెడ సమభావముతో ఉండు వాడును - మానావా మానములు - శీతోష్ణములు - సుఖ దుఖములు మొదలగు ద్వంధ్వములను సమానముగా స్వీకరించువాడును నిందా స్తుతులకు చలింపని వాడును - మనన శీలుడును - శరీర నిర్వహణకై లభించిన దానితో త్రుప్తి పడువాడును - నివాసా స్థలమందు మమతాసక్తులు లేని వాడును - స్థిత
ప్రజ్ఞుడు అయిన భక్తుడు నాకు అత్యంత ప్రియులు - అని భగవానుడైన శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన సారాంశము -
చక్కని దస్తూరి -ముహంలో చక్కని వర్చస్సు - మితభాషి - నిరాడంబరి - తెల్లదనం అనే దుస్తుల్లో దుస్తుల్లో చల్లదనం - వైరాగ్యం పరిజ్ఞానం - ప్రేమ ఆప్యాయతలనే ధనాన్ని దాచుకుని - అందరికి పంచిపెట్టి - అజాత శత్రువులా - మెలగి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న మా మేన మామ కీర్తిశేషులు గూడూరు కమలాకర రావు మామగారు నిజంగా ధన్య జీవులు - ఇహము పరము తెలిసిన - వివేక సంపన్నులు - అనుదినం సమయం తప్పక ఉదయం - సాయంకాలం
సంధ్యావందన కార్య క్రమాన్ని -నిత్య పూజా విధానాన్ని కొనసాగిస్తూ -తన చిన్నఅన్నగారివలే భక్తి శ్రద్ధలతో - నీతి నిజాయితీ నియమాలతో -పెద్ధలఎడ గోరవంతో పిన్నలఎడ ప్రేమతో - జీవితాంతం అనుష్టించిన మామామగారు దైవ
కృపకు -ధైవానుగ్రహానికి పాత్రులు అయ్యారని నిస్సందేహంగా చెప్పవచ్చును -- ఆయన ను కోల్పోవడం తీరని లోటు -కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుడ్రు ఆయనని ప్రేమగా చూశారు -ఆదరించారు -సేవచేశారు - అయితే అందరి
కంటే ఎక్కువగా మా మామగారికిసేవ చేసుకునే మహా భాగ్యానికి నోచుకున్నది ఆయన చిన్న కొడుకు కోడలు - శ్రీదర్ కవితలు - తన స్వంత ఇంటిలోనే ఉండటానికి ఆయన - ఎక్కువగా ఇష్ట పడటం-ఇక్కడే శ్రీదర్ దంపతులు నివాసం ఉండటం - వాటి సేవాభాగ్యానికి కారణం అయ్యింది --
వృద్ధాప్యంలో ఉన్న పెద్దవారి సేవ చేసుకోవడం - వారి పిల్లల అదృష్టం - అనాధాశ్రమంలో తమ తల్లి దండ్రులను అనాధలుగా చేర్చే నేటి అనాగరిక సమాజంలో -ఇలా సహనంతో - విసుక్కోకుండా ఆయన కన్నకొడుకులే కాకుండా -
కోడళ్ళుకూడా -భార్యలేకుండా ఒంటరితనం తో బాధ పడుతున్న -తమ మామగారిని ఆప్యాయతతో తమకన్నతండ్రికివలె ఆదరించి -ఆయన చివరి శ్వాస వరకు -మేమున్నాం 1 మీకు అని ఆయనకీ సంతోషాన్ని - ప్రశాంతతను -సంతృప్తినీ అందించిన ఈ సాంప్రదాయం -ఈ సంస్కృతీ అందరికీ ఆదర్శనీయం -ఆచరనీయం --1
మా మేన మామలు ముగ్గురు మా బ్రతుకులకు వెలుగు చూపిన దివ్వెలు - వారికి మా మేనల్లుళ్ళం -వారి మేన కోడళ్ళు - మా కుటుంబాలు రుణపడి ఉంటాయి --పిల్లలము పేద వారము -చదువు సంధ్యా -లేనివారము అయిన మా అందరినీ ఆదరించి - ఆశ్రయమిచ్చీ -అన్నం పెట్టీ - తిండీ గుడ్డా అందించీ - మాజీవితానికి సరిపడే విద్యా బుద్ధులు చెప్పించడమే గాకుండా - ఆప్యాయతతో తమ కన్నవారితో సమానంగా మమ్మల్ని కూడా గారవించి - మేనళ్ళు లమైన మాకు తమ కూతుళ్ళ నిచ్చి-అదేవిధంగా తమ మేన కోడళ్ళ కు కూడా తామే స్వయంగా పూనుకొని పెళ్ళిచేశారు --మమ్మల్ని ఒక ఇంటివాళ్ళను చేశారు -అలాంటి ప్రేమమూ ర్తులూ - కీర్తి శేషులూ ఐన మా ముగ్గురు మేనమామ ల వాత్సల్యానికి -- వారి అపారమైన దయకు మేమంతా కలిసి - మా హృదయ పూర్వక మైన శ్రద్దాంజలులు
సమర్పిస్తూ ఉన్నాము -- --
వారి ఆత్మలు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాము -- వారి -కుటుంబాలు పిల్లా పాపలతో - ఆయురారోగ్య ఐశ్వర్యాలతో - చక్కని ప్రేమానురాగాలతో -అందరికీ ఆదర్శంగా - తమ తండ్రులకు -తాత ముత్తాతల కీర్తి
ప్రతిష్టలను వంశ గౌరవాన్ని నిలబెట్టేందుకు-వేద మూర్తులైన బ్రాహ్మణోత్త ముల ఆశీర్వచనములే కాకుండా -పెద్దవారు బంధువులు స్నేహితులు - హితోభిలాషుల ప్రేమపూర్వక మైన దీవన ల తో బాటు - ఆ ఆదిదంపతులు కూడా
-వీరికి తగిన శక్తినీ స్పూర్తి నీ అనుగ్రాహించాలని ప్రార్థిస్తూ సెలవు -!
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment