తిరుమల వెంకటేశ్వర స్వామీ వారి దర్శనార్థం -సంకల్పం చేయడం - స్వామి కరుణించి ఆ భాగ్యాన్ని అనుగ్రహించడం అనుకోకుండా - అంతా శ్రీ వారి లీలగా జరిగింది -- అలిపిరి వైపు నుండి మెట్ల దారి గుండా వెళ్లి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఈ సారి రెండవ వైపున గల శ్రీవారి మెట్లు ఎక్కి స్వామిని దర్శించు కోవాలని అనుకున్నాము - శ్రీనివాస మంగాపురం నుండి గల శ్రీవారి మెట్ల ద్వారా నడక ఉపక్రమించాము -- అలిపిరి వైపున ఒక్క చోటుననే మెట్లు నిటారుగా ఎత్తుగా ఉన్న మోకాళ్ళ పర్వతం ఉంది-- అక్కడ మెట్లు ఎక్కడానికి విధిగా మోకాళ్ళు పట్టుకుని ఎక్క వలసిందే !- అంత ఖచ్చితంగా ఉండటం వల్ల - గుట్ట ఎక్కుతున్న ప్రయాస కలుగుతుంది - నిజానికి మాకు విపరీత మైన మోకాళ్ళ నొప్పులు - 70 ఏళ్ల వయస్సు- 2500 మెట్లు- సుమారు 3కిలోమీటర్ల దూరం- ఎక్కగలమా ? అన్న సందేహం వచ్చినా - స్వామి మీద భారం వేసి -ప్రయాణం సాగించాము -- అదేమీ చిత్రమో 1- ఒక్క చోట గాక అంతటా అన్నీ మెట్లు - మోకాళ్ళ పర్వతం వలెనే- మరీ నిటారుగా ఉన్నాయి -అయినా మాకు ఆయాసం -అలసట- బాధ- ఏమాత్రం కలగ లేదు- ఇది స్వామి వారి లీల కాక మరేమీ కాదు కదా!
వైకుంట కాంప్లెక్స్ -లోని ధర్మ దర్శనంకొరకు రెండుసార్లు నడక ద్వారా వెళ్ళడం - పుష్కరిణి స్నానం - వెంగమాంబ అన్నప్రసాదం - లగేజి నిమిత్తం తల నీలాలు ఇవ్వడం కొరకు -లడ్డు కౌంటర్ కు వెళ్ళడం - ఇలా శ్రీవారి సన్నిధి లో ఎన్ని సార్లు కాలి నడకన తిరిగినా-- ఏమాత్రం కష్టం కాలేదు - కాళ్ళ నొప్పులు రాలేదు - కాటేజ్ తీసుకో కున్నా - విశ్ర్ఫాంతి లేకున్నా - బాధ అనిపించ లేదు -
ఒకే రోజున రెండుసార్లు శ్రీవారి దర్శనం దివ్యంగా లభించింది -- అడుగడుగునా స్వామిని " గోవిందా 1 గోవిందా ! "అంటూ తలచు కోవడమే మేము చేసుకున్న పుణ్యం ! శ్రీ వారి లీలలు గాక ఇంత సులభంగా ఆనందంగా పరమ అద్భుతంగా -సులభంగా దివ్యంగా స్వామీ దర్శనం లభించడం మామూలు మాటలా !
సోమవారం రోజున శ్రీ వారి దర్శనం దివ్యంగా జరిగింది -అద్భుతంగా అగుపించాడు స్వామీ -! ఈ రోజున తన ఆనంత ప్రభలతో -వెలుగొందిన తేజో మూర్తిని మాకు దర్శింప జేశాడు - చేసుకున్న పుణ్యమో - పెద్దల దీవనయో - ఈ జన్మ కింత దయ చూపాడు చాలు !--
వెండి వాకిలి నుండి భక్త బృందం తో బంగారు వాకిలి వేపు స్వామీ దర్శనార్థం పరుగులు పెడుతున్న సమయంలో - ఆనంద నిలయం గర్భ గుడికి కుడి వైపున గల స్వర్ణ మహా లక్ష్మి దేవి విగ్రం వైపు నుండి సూర్య భగవానుని సాయంకాలపు లేత బంగారు కిరణాలు ఆలయంలోకి ప్రసరించాయి - ఆనంద నిలయ స్వర్ణ గోపురం ఆలయం- దివ్య కాంతుల్లో ధగ ధగ మెరిసి పోయింది --
భక్త బృందం క్రమంగా బంగారు వాకిలికి ఎడమ వైపున నుండి శ్రీవారి సన్నిధిని చేరే సమయంలో తిరిగి సూర్య నారాయణుని సంధ్యా సమయ లేలేత కిరణాల ప్రసరనతో ఆలయంలోని స్వర్ణ మాయ శోభలు అద్భుతంగా కను విందు చేశాయి --" లోన ఉన్నదీ - బయట ఉన్నదీ నేనే ! "అని చెప్పుతున్నట్లుగా తోచింది -
లోనికి భక్తబృందం తో బాటు ఆనంద నిలయం లోనికి ప్రవేశించి -శ్రీవారి కి అభిముఖంగా నిలబడటం -అనంత శోభలతో విరాజిల్లే స్వామి దివ్య మంగళ విగ్రహాన్ని పాధములనుండి మకర తోరణం వరకు ఈ కళ్ళకు - చూసే పరమానందం కలిగింది పరమాత్మ అంటే ఇతడేకదా !అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు - జగన్మోహనా కారుడు - లీలామానుష విగ్రహుడు - దేవాది దేవుడు - ఆపద మొక్కుల వాడు ఆపద్బాంధవుడు - -ఏడూ కొండల వెంకట రమణుడు - శ్రీనివాసుడు - శ్రీవేంకటేశుడు - నిరంతరం భక్త జనావళిని రప్పించి వారి ఆపద మొక్కులను గ్రహించి - కోరిన కోర్కెలు దీర్చే గోవిందుడు - మాధవుడు - అచ్యుతుడు --నిర్గుణ నిరాకార సచ్చిదా నంద స్వరూపి కి దర్శిస్తూ మమ్ములను మేమే మరచి పోయాము -ఆ రెండు నిముషాలు ఎదురుగా శ్రీ వారిని చూస్తూ అలౌకిక ఆనంద అనుభూతి లోమునిగి పోయాము -
-ఎన్నడు లేనంత సౌందర్యం - శోభలతో - గజ మాలలతో స్వర్ణ భూషిత మణి మయ ఆభరణాలతోఅందంగా అల్లంత దూరం నుండే దివ్యంగా భవ్యంగా - శత కోటి చంద్ర ప్రకాశంతో తిరు నామాలతో -భుజ కీర్తులతో వజ్ర మకుట కిరీటం తో సూర్య కాంతి ప్రభలతో వెలుగులు విర జిమ్ముతూ విరాజిల్లే శ్రీ వెంకటేశ్వరా స్వామి కన్నుల పండువుగా దర్శనమిచ్చాడు -- ఇదే సమయంలో గర్భగుడిలో స్వామి మూర్తి కి ముందున అర్చకుల వారు మంగళ హారతిని వెలిగించి స్వామికి ఇస్తూ స్వామిని పాదాలనుండి శిరస్సు పై గల కిరీటం వరకు దీప కాంతులలో స్వామీ దివ్య మంగళ విగ్రహాన్ని తిలకించమని చూసి తరించ మని అన్నట్లుగా హారతిని రెండు నిముషాల పాటు స్వామికి నీరాజనం పట్టాడు -- ఆ అద్భుత దృశ్యాన్ని చూడటానికి ఈ మాంస నేత్రాలు చాలవు - చూసి స్వామీ వైభవం ఇలా ఉందని చెప్పడానికి మాటలు చాలవు - స్వామీ దివ్య వైభవ సొగసులను - కళ్ళు చెదిరే సౌందర్య కాంతులను వర్ణించడానికి శక్తి చాలదు -శబ్దాలు పనికి రావు -కలం సరి పోదు -
ఆ సమయంలో స్వామిని దర్శించిన భక్తుల అద్వితీయమైన అనుభూతి ఆనందం చెప్పనలవి కాదు "-గోవిందా! -వేంకటేశా !-శ్రీనివాసా!" అంటూ సంతోషంతో రెండు చేతు లెత్తి స్వామికి బిగ్గరగా జేజేలు - పలకడం తప్ప -ఆ విధంగా తమ సంతోషాన్ని ప్రకటించడం తప్ప -మరేమీ చేయలేని అజ్ఞానులం !ఆ రెండు నిముషాలు స్వామికి ఎదురుగా స్వామీ సన్నిధిలో స్వామిని ఆపాద మస్తకం దర్శించే మహద్భాగ్యాన్ని ప్రసాదించిన దేవాదిదేవునికి ఏమిచ్జ్చి ఋణం తీర్చు కోన గలం -! జీవితంలో మరచి పోలేని మరపురాని అనుభూతులు -మధుర స్మృతులు ఇవి 1మానవ జన్మ ను ధన్యం చేసే దివ్య సందర్శనం -ఈ క్షణాలు -!
SEPT 16, 2015
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment