దేవునిసేవకు గాని -నిరుపేదలకుగాని ఇవ్వడం తెలియని వాళ్లకు దేవుణ్ణి కోరికలు అడిగేహక్కు లేదు -ఇచ్చిన వానికే అడిగేహక్కు ఉంటుంది -బలిచక్రవర్తి "దానం -చేయడంలో ఎదుటి వాడు ఎవరైనా- ఏదైనా సందేహించడు -చివరికి తన గురువు చెప్పినా తన ధర్మాన్ని నిర్ణయాన్ని మార్చుకోడు - ఇస్తాడు-అలా -మనం కూడా దానం -త్యాగం చేయడం అలవాటు చేసు కోవాలి - దానం చేసే బలిని ఆపాలని చుసిన అతని గురువు శుక్రా చార్యున్నిశ్రీహరి శిక్షించిన విధంగా -భగవంతుడు అలాంటివారిని క్షమించడు
నిత్యం దైవ భజన చేస్తూ ఉండే ఒక దంపతులకు ఒక పదేళ్ళ కొడుకు ఉండే వాడు - ఒక రోజున ఇంట్లోతలి దండ్రులు భజనచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తూ కొడుకు చనిపోతాడు -తల్లి ఏడుస్తూఉంటె తండ్రి ఊరడిస్తాడు- కాని కన్తతల్లి గుండె పగిలేలా ఏడుస్తుంది -అప్పుడు అటుగావెళ్తున్నకృష్ణ భక్తుడు " చైతన్య మహా ప్రభువు "ఆ తల్లి రోదనవిని పిల్లవాణ్ని బ్రతికిస్తాడు - ఆ బాలుడు కళ్ళు తెరచి అ మహాభక్తుణ్ణి చూసి "స్వామీ! నన్ను ఎందుకు బ్రతికించారు ?- దైవనామస్మరణ జరుగుతున్న సమయంలో నాకు మృత్యువు కరుణించింది!" -అనగా" మీ తల్లిదండ్రులు నీకై ఏడుస్తున్నారు"! అంటాడు - దానికి జవాబుగా ఆ బాలుడు నవ్వి" ఈ జన్మకు వీరు నాకు తలి దండ్రులు- నేను గతజన్మలో ఎందరికి తండ్రినో? --ఎందరికి కొడుకునో ? ఎవరికీ తెలుసు ?-ఈ జన్మబందాలనుండి నన్ను విముక్తున్నిచేసే దైవనామస్మరణ ఇక్కడ జరగడం నా అదృష్టం -ఇలాంటిఇంటిలో-ఇలాంటివారి కడుపులో జన్మించడం నేను చేసుకున్న పుణ్యం ! ఇంత చక్కని క్షణాల్లో చనిపోతున్నందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది - మహాత్మా ! నన్ను కరుణించి -నాకు ముక్తిని ప్రసాదించండి" అనగావిన్న వారందరూ దైవ నామ స్మరణ -భజన ఎంత గొప్పదో తేలుకొని -నిరంతరం హరిభజన చేస్తూ -ఇతరులలో దైవాన్ని దర్శించుకుని పునీతులౌతారు
యాగాలు- క్రతువులు -జపాలు -హోమాలు దీక్షతో చేయలేము - మనసును ఆధీనంలో పెట్టుకోలేము - కేవలం మానవ సేవ - హరి భజన చేస్తూ మనజన్మ ధన్యం చేసుకోనవచ్చును-
"సత్యం- ధర్మం!" -ఇవి రెండు పాటించే వానికి జయం కలుగుతుంది - సత్యహరిశ్చంద్రుడు ఆ ధర్మాన్ని అక్షరాలా పాటించాడు -" హరిశ్చంద్ర సమోరాజా --నభూతో నభవిష్యతి " అనిపించాడు -తాను- తనభార్య- తనకొడుకు -ధర్మనిరతులై పేరు తెచ్చుకున్నారు- భార్య గయ్యాళి అయినా భర్త ఆమెను చక్కబెట్టు కోవాలి -అలాగే భర్త చెడునడక నడచినా భార్య ఓర్పుతో అతన్ని సరిచేసుకోవాలి -ప్రతిరోజు ఏదైనా ఒక మంచిపని చేయడం- ప్రతి మనిషి తన ధర్మంగా -వ్రతంగా పెట్టు కోవాలి -ఈ సత్యం అందరికీ తెలుసు -కాని ఆచరించడం తనధర్మంగా చేసుకోవాలి -దారిలోవచ్చే ఇబ్బందులు అధిగమించడం ద్వారా అతడు ఇహపరాలు సాధిస్తాడు
NOV 29, 2014
Thursday, May 19, 2016
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment