Thursday, September 8, 2016

వినాయక విగ్రహ మహాత్మ్యం - విశిష్టత

వినాయక విగ్రహ మహాత్మ్యం - విశిష్టత -
---------------------------------------------------
వినాయకుడు విజ్ఞానఖని - మూషికం అజ్ఞానానికి చంచలమైన ఇంద్రియాలకు సంకేతం - మనిషి తన వివేకంతో ఇంద్రియాలను నియంత్రించు కోవాలని మూషిక వాహనగణపతి సూచిస్తున్నాడు వినాయకుని ఆరు హస్తాలలో ఆరు రకాల చిత్రమైన వస్తువులని చూస్తాము -
----మొదటి చేతిలో -" కఠారి -అనగా కొడవలి " లాంటి ఆయుధం ఉంటుంది -- మనలో చెలరేగే చెడ్డగుణాలను - సంకుచిత అజ్ఞాన భావాలను - నరికివేయడానికి అది ఉపయోగిస్తుంది -
----రెండవ చేతిలో " త్రాడు అనగా -పాశం "ఉంటుంది - -మనలో నున్న పవిత్ర మైనఆత్మనుండి ఇంద్రియాలు మనస్సు విఛ్చల విడిగా ప్రవర్తించకుండా - బుధ్దితో కట్టిపడేయడానికి ఉపయోగపడుతుంది-
----మూడవ చేతిలో -"-త్రిశూలం "చూస్తాము - భూత వర్తమాన -భవిష్యత్త్తులను సూచించే మూడు భాగాలుగా దీనిని గుర్తించ వచ్చుఁను -

వినాయకచవితి సందర్బంగా -అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని సామూహికంగా పండుగ చేసుకునే రోజులివి -ఆ విగ్రహంలో ఆరుచేతులు -ఆ మూషిక వాహనం లోని అంతరార్థం- అద్భుతం - ఆచరణీయం - ఆయన "విజ్ఞానఖని" అయితే -అతని మూషికవాహనం మనఅజ్ఞానానికి - చంచలమైన ఇంద్రియాలకు -చెడుపనులకు -సంకుచిత భావాలకు సంకేతం - బరువుగా స్థూలంగా ఉన్న వినాయకుడు -చిన్నఎలుక రూపంలో ఉండి చెడుపనులు చేసే ఇంద్రియాలను తన విజ్ఞానంతో తన ఆధీనంలో ఉంచుకొని -తాను చెప్పి నట్లుగా ప్రవర్తించే విధంగా వానిపై నియంత్రణ ఉండాలి- అన్న నిగూఢమైన అర్థాన్ని వివరిస్తుంది -

ఇక గణపతి చెవులు చేటంత పెద్ద్దవి -తేలికగా కదలాడుతూ -వినడానికి రెడీ గా ఉంటాయి -" అన్నీ వింటూ చూస్తూ మంచీ చెడూ గ్రహిస్తూఉండాలి "-అని సూచన-
అతని కళ్ళు చిన్నవి - అనగా "సూక్ష్మబుధ్దితో దూరదృష్టితో" మెలగాలి - అని సూచన--
ఆయననుదురు -ఫాలభాగం విశాలంగా ఉంటుంది -అపారమైన విజ్ఞానం- ప్రశాంతత -సహనం ఎక్కువగా ఉండడానికి సంకేతం -
లంబోదరుని 'బాన"లాంటి పెద్ద్ద బొర్ర - -కలతలు- విచారాలు -ఆవేదనలు - ఎన్నిఉన్నా ఆందోళన పడకుండా - మనస్సును నిశ్చలంగా -సమస్యలను పరిష్కరించుకునే విధంగా జీవితం కొనసాగించాలి అని అర్థం --
గణపతి కూర్చున్న భంగిమలో -ఒక కాలు క్రిందికి భూమిపైన ఆనించడం- అనగా "ఇహం -రెండవకాలు ఆసనంపైన ఉంచడం -అనగా "పరం " -సూచనగా నిలకడగా నిశ్చలంగా -రెండింటికీ అనుసంధానంగా - జీవితం సాగి పోవాలని గుర్తు -
ఇక అతని గజగమనంలాంటి" నెమ్మదినడక" --మన " మనసు- వాక్కు -కర్మ "ఒకేరీతిగా ఒకే బాటలో -స్థిరచిత్త్తంతో పనిచేసేదిశలో నెమ్మదిగా -జీవిత లక్ష్యం వైపుగా -సమాజ ప్రయోజనకరంగా ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితిని పొందేలా అడుగు వేయాలీ -అన్న భావన.

గజాననుని తల పెద్ద్దగా ఉండటం ఇతర ప్రాణుల కంటే మెదడు పెద్ద్దగా ఉంది విమర్శనాత్మకంగా ఆలోచించే శక్తి భగవంతుడు ఈ మనిషి జాతికి ప్రసాదించాడు -- జాగ్రత్త్తగా వాడుకోవాలని సందేశం -
గజ్జకర్ణుని వక్రతుండం -మన జాగరూకత -సత్ప్రవర్తన తో కూడిన కదలికలను సూచిస్తుంది-సంభవించ బోయే విఘ్నాలను తొలగించడానికి ఉపకరిస్తుంది కూడా --!
ఏకదంతుని -దంతాన్ని జ్ఞానదంతంగా - విరిగిన దంతాన్నిఖండించ బడిన మూర్ఖత్వం మరియు అజ్ఞానంగా పేర్కొన వచ్చుఁను
--ఇంకా షట్భుజ గణపతికి ఉండే ఆరు చేతులలోనగా "పూర్వ జన్మలలో చేసిన కర్మలకు అనుగుణంగా నేడు మనం అనుభవించే పరిణామాలు ఇవి ! "అని భావిస్తూ బంగారు భవిష్యత్త్తును దృష్టిలో ఉంచుకొంటూ - ఈ వర్తమానం లో తగిన ఆలోచన చేస్తూ సత్ప్రవర్తనతో -సంయమనంతో చర్యలు చేబట్టాలి -

ఐదవ చేతిలో --" ఢమరుకం !"ఇది అనంతమైన -ఆకాశాన్ని- అందులో -ఓంకార ప్రణవ నాద -----నాలుగవ చేతిలో - అందమైన వికసించిన స్వచ్ఛంగా ఉన్న" కమలం "చూస్తాము - బాధలు బరువులు కష్టాలు కన్నీళ్లు లాంటి బురద గుంతలు ఎన్ని ఉన్నా అన్నింటికీ అతీతంగా - -దేనికీ అంటకుండా పరిమళాలు వెదజల్లుతూ - ఆనందంతో కదలాడే సౌరభాన్ని ఆత్మసౌందర్యాన్ని ప్రదర్శిస్తుంది ఈ పుష్పం
స్వరూపంలో అంతటా నిండియున్న పరమాత్మను సూచిస్తుంది ఈ సృష్టిలో -మనకు తెలిసింది - చూస్తున్నది -మన జీవితం అతిస్వల్పం - ఈ సృష్టిలో కోటాను కోట్ల జీవ రాశులలో ఈ ప్రాణుల ఆయువు మనుగడ తాత్కాలికం -జీవులలోనున్న ఆత్మ ఒక్కటే శాశ్వతం - దానికి పరమాత్మయే ఆధారం " అన్న సూచనగా అందులోనుండి జనించే ధ్వని - సృష్టి స్థితి -లయాదులకు ఉదాహరణ
----- ఇంకా ఆరవచేతిలో ఉన్న" మోదకం -అనగా తీయనిలడ్డు "- మన కర్మ ఫలం !- దానిని వినాయకుడు తినడం లేదు -తన చేతిలో చూపుతూ అట్టే పెట్టుకుంటాడు- అనగా లడ్డు తయారు చేయడానికి మనంపడిన శ్రమ- దానిని ఆస్వాదించడం - అంతా "ఒక మహిమ - దైవ ఘటన"గా మాత్రమే భావించాలి -

మనం పాత్రధారులం - సూత్రధారి ఆ పరమేశ్వరుడు -అందులో మన గొప్పదనం ఏమీ లేదు అనే ఆధ్యాత్మిక భావనతో --జగన్నాటక సూత్రధారి నడిపించే నాటకరంగం ఈ జీవనంఅనే -ఇలాంటి అద్భుతమైన భావాలతో మన హృదయంలో వినాయకుణ్ణి ప్రతిస్థించు కోవాలి -- -----ఎదుటివాడి ని బాగుచేయడానికి నీవు కేవలం సలహాలు ఈయగలవు - కోరితే సహాయం చేయగలవు --కానీ బాగుచేయాలనుకోవడం - తప్పు -- ! చిన్న పిల్లవానికైతే తప్పులు -ఒప్పులు చెప్పవచ్ఛును -కానీ వ్యవస్థలో పెద్ద్దమనుషులుగా చెలామణి అవుతున్నవారికి బుధ్ది చెప్పాలనుకోవడం మన తప్పు అవుతుంది --సలహాలు ఇవ్వవచ్ఛును తాను చేస్తూన్నది తప్పు అని ఎవరు ఒప్పుకోరు - నిజంగా అది తప్పు అని తెలిసినా తప్పని అనుకోరు - మనిషిలో చాలావింతైన విషయాలలో ఇది ఒకటి --అలా తప్పులు ఎన్నడం మనం చేసే పెద్ద్దతప్పు - నీవరకు పవిత్రంగా తప్పులు లేకుండా ఉండగలిగితే చాలు -- అది ఒక జ్ఞాన యజ్ఞం - కానీ అలాఉండటం మామూలు విషయం కాదు - ఎవరి కర్మలకు అనుగుణంగా వారి చర్యలు -ఫలితాలు ఉంటాయి -నీవు ఏ విధంగా నైతే ఈ జన్మలో చేయని తప్పులకు కష్టం బాధలను అనుభవిస్తున్నావో -- అలాగే ప్రతివాడు వారి కర్మలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ -ఉంటాడు -

నీ తప్పులు నీవు ఒప్పుకోవడం -- మళ్ళీ అలా జరగకుండా చూడటం -ఎంతో విజ్ఞానంతో చేయాల్సిన పని - అలాగే ఎదుటివాడి తప్పులను సహనంగా -శాంతంగా -సంతోషం తో స్వీకరించడం కూడా సహనం శాంతం సమర్థత లతో కూడిన పని - ఎదుటివాని అపరాధాలను క్షమించడం దైవత్వం
ఆ విధంగా మన విజ్ఞానాన్ని మనసా వాచా కర్మలలో ఉపయోగించాలి ---
ఈ విధంగా విఘ్ననాయకుని ఆకారం -చరిత్ర అణువణువునా జ్ఞానభరితం -ఇలా అర్థం చేసుకుని వినాయకుని ఆరాధించడం మంగళ కరం -లాభదాయకం - ఎందరో సంకీర్తనా చార్యులు కొనియాడిన సంకష్టహర గణపతి కథనం - వీతరాగిణం -వినుతయోగినం -విశ్వకారణం -విఘ్నవారణం !ఇదే మన జీవిత పరమార్థం
వినాయకుడి అహంకారపూరిత మైన శిరస్సును పరమ శివుడు ఖండించాడు -నేను ఎవరినైనా ఎదుర్కొనగలను 'అన్న వినాయకుడి అహంకారాన్ని ఖండించడంతో బాటు - ఏనుగు శిరస్సుని అతికించడంతో అతనిలో జ్ఞానోదయం అయ్యింది -
సోదరుడైన కుమారస్వామితో పోటీపడటం కష్టం అనిపించి బుధ్దితో ఆలోచించి మాతాపితరులను సేవించుకోవడం - ఆత్మదర్శనం పొందడం - చాలా గొప్పవిషయం అని చెబుతుంది --
ఇలా వినాయకుని ఆకారం చూడటానికి మిగతా దేవతామూర్తులవలె అందంగా లేకున్నా-అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఆధ్యాత్మిక సందేశాలను మనకు అందజేస్తుంది ఆ సారాన్ని -సారాంశాన్ని -అర్థం చేసుకొని -- ప్రతి ఒక్కరు తమ హృదయాలను - ఆనంద మయమైన వినాయక మందిరంలా చేసుకోవాలి - ఇలాటి భావంతో చేసే అతని ఆరాధన ఈతిబాధలను దూరం చేస్తుంది --" దుఖ్ హర్తా --సుఖ్ కర్తా --! గణపతి పప్పా మోరియా -- ! "
జై బోలో గణపతి భగవాన్కి జై ! -


No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...