Sunday, September 13, 2020

కృష్ణా! నిను తలచినంతనే

Aug 18, 2020

కృష్ణా! నిను
తలచినంతనే
విషము కూడా
అమృత మగును
_
నీదు స్మరణ 
_చేయువారికి
తొలగజేయును
   వారి, తాపము_!

"ఏది విషము ?,
ఏది అమృతము_?
  భావనలోనే  భాగ్యమున్నది ,_!

కృష్ణా_! నీవు
కనికరించిన
కష్టమన్నది
  ఉండ బో దు!
  నీవు దయ చూపించకుండిన__
అమృతమ్మే
విషమ్ము కాదా _!?"

మనసు మలినము చేసుకొనిన_
ఆ విషము _మనిషికి నిలువెల్ల  పాకును_!
కామ క్రోధ  లోభ మోహ
మదము మత్సరములు కూడా _
   పీడించు   బ్రతికి_ ఉన్నంతవర కూ_!
విషము గా మారి
చంపు చుండును _!

విషము ఒక్కటే _
కాదు చెడ్డది_!
చెడ్డ ఆలోచన
,_లన్నీ విషమే_!
మంచి భావన
లమృత తుల్యము _!

  కృష్ణ భక్తి యే_
, ముక్తి మార్గ ము_!
మంచీ చెడ్డా
,పాప పుణ్యా_
భారమిక 
నీదేరా కృష్ణా_!

  నిన్ను తెలియుట
మా కు తరమా_!
నీవు నన్ను
కరుణించకున్న _
నిను  భజించుట
_మాకు వశమా _!

  నీ ప్రసాదము 
_విషమే అయినా_
జీవన్ముక్తిని _
ప్రసాదించును _!
   నీదు రూపము_
,_ మది లోన నిలిపి _
అస్వాదింతును_
ఆనందింతు ను _!

కృష్ణా_! నీవే
  అంతర్యామి వి _!
జగతి నేలే _
సర్వాంతర్యామి వి_!
నన్ను బ్రోచె,_ దైవం నీవే _!
నాదు జీవన _ధ్యేయం నీవే _!
  నా పతియు ,గతియు ,_ మతియు నీవె_!
నన్ను బ్రోచే దిక్కు నీ వే,_!
నాదు సర్వస్వమ్ము నీవే_!

విషము నీ వే_! _అమృతమ్ము నీవే_!
నాదు శరణా గతివి నీవే_!
నా బ్రతుకు ,నీవే
_ భారమ్ము నీవే_!
శరణు శరణు_
సర్వేశ్వరా_!
పాహిమాం
జగదీశ్వ రా _!"

  స్వస్తి _!
  హరే కృష్ణ హరే కృష్ణా _!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...