Jul 17, 2019 Dallas
నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్శన భాగ్యం కలుగజే స్తున్న వ్యవధిలో, నాకు వారి సన్నిధిలో ఒక అరగంట సేపు, గాత్రం, వేణు వాద్యం లతో భక్తి గీతాలు ఆలపిస్తూ ఆనందించే మహద్ భాగ్యం లభించింది. అటు,స్వామీజీ భక్తులతో మమేకం అవుతూ కూడా నా ప్రార్థన, భజన, అంతా విన్నారు,,! వాలంటీర్ తో నన్ను పిలిపించి నా వేణువు ను స్పర్శించడం, నన్ను తన సురుచిర దరహాసం తో రెండు చేతులతో దీవించి, మేము అందించిన శాలువా ను స్వీకరించి, మమ్మల్ని అనుగ్రహించ డం, జీవితంలో మరవరాని మరచిపోలేని మధురానుభూతి గా తలపిస్తూ ఉంటోంది,! స్వామీజీ ముందు, సదా శివ బ్రహ్మేంద్ర కీర్తన, పాడాను,"పరమహంస హృదయోత్సవ కారీ, పరిపూరిత మురళీ రవధారీ,, గాయ తీ, వనమాలి, మధురం, అంటూ,"",! దానికి స్వామీజీ పరమానంద భరితు లై, "శుభమస్తు"!" అంటూ చెదరని, వదలని, అందమైన, అపురూపం అయిన,ఆనందకరమైన తన చిరు మందహాస వదనం తో, కరుణా పూరిత వాత్సల్య కటాక్ష వీక్షణ లతో, నా లోని అత్మచైతన్యాన్ని సున్నితంగా, తట్టి, భక్తి దాగిన నా జ్ఞాన వైరాగ్య భావ సంపద లను మరింతగా ఇనుమడింప జేయడం, నా పూర్వజన్మ కృత సుకృతం!, పితృదేవతల దీవనా ఫలం, కాదా! పరందామా,! పరమాత్మా! ఇలాంటి, దయ రానీ,! దయ రానీ, దాశరథీ, రామా,!! అంటూ "ఆనందభాష్పాలు రాలు స్తూ, రెండు చేతులు మోడ్చి, స్వామీజీ ముందు కృతజ్ఞతా భావంతో ప్రణమిల్లడం, ఇలాంటి బృహత్తర సన్నివేశ మహద్భాగ్యం మరీ మరీ కావాలని కోరుకోవడం తప్ప, దీనులం!, అఙ్ఞాను లం,! అవివేకులం,! ప్రతిగా , మరేం చేయగలం? ఇంతకన్నా ఆనందమే మి ఉంటుంది, మీరు చెప్పండి ? హరే క్రిష్ణ హరే కృష్ణా!
దైవానుగ్రహం వలన మా పిల్లల కోరిక మేరకు,, మా దంపతులకు అమెరికా ప్రయాణం లభించింది. ఈ రోజున ఇక్కడ డల్లాస్ లో, గురు పూర్ణిమ, ఉదయం లక్ష్మీ గణపతి ఆలయం లో, సుదర్శన హోమం, చండీ హోమం లో పాల్గొనే మహా భాగ్యాన్ని. పరమాత్ముడు కలిగించాడు. అంతే గాకుండా, గురు పూర్ణిమ పండుగ రోజు, సందర్భంగా ఇక్కడి ,దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో కట్టబడిన గొప్ప హనుమాన్ దేవాలయం లో, వేల మంది దత్త భక్తుల మధ్య, శిష్యులతో గురుగీతా పఠనం యుక్తంగా,అపర హనుమా న్, మరియు దత్త భగవానుని, అవతార మూర్తిగా భాశించే, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అందించిన ఉపదేశ సారాన్ని యధాతథంగా రాసి, గురు పూర్ణిమ ప్రాశస్త్యాన్ని , దత్త గురు వైభవాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. స్వామీజీ మాటల్లోనే చెప్పాలంటే,,,**నిజానికి జీవితంలో మనమే సమస్యలు సృష్టించు కుంటాం !, గురు గీతలో అదే ఉంది, దానికి సమాధానం కూడా ఉంది. సమస్యలు ఉండాలి , అవి భోజనం లో షడ్రుచుల వలె ఉండాలి , అప్పుడే, లైఫ్ రుచికరంగా ఉంటుంది.! లేకపోతే కిక్ థ్రిల్ ఉండదు ,, దేవుడిచ్చిన జ్ఞానం వివేకం అప్పుడు ఉపయోగించు కోవాలి. సమస్యలు లేకపోతే , మనిషికి దేవుడు జ్ఞాపకం రాడు, కదా; అందుకే చాలెంజ్ గా తీసుకోవాలి , భయపడ కూడదు ,, మనలో ఉన్న అత్మ నే నిజమైన మొదటి గురువు, అదే అత్మ ప్రబోధం అది సత్యాన్ని, ధర్మాన్ని తెలుపుతూ, దైర్యం ఇస్తు, మార్గాన్ని సుగమం చేస్తుంది. , అయ్యో మేము,ప్రత్యక్షంగా, స్వామీజీ నీ కలవలేదు కదా అనుకోవద్దు ! ఈ శరీరం కేవలం భౌతికం! కాని మానవతా విలువలు ముఖ్యం! అవి మనల్ని దైవానికి దగ్గరికి చేరుస్తాయి. , దేవుడు నీలో ఉన్నాడు, అనే నిజం, నీవు ఎవరికైనా, సహాయం చేస్తే, దైవం ఆ అనుభూతినీ నీకు ఇస్తుంది.! ఒక అంధునికి, చేసే సహాయం, తిరుపతి వేంకట రమణ స్వామి హుండీలో వేసే డబ్బు ఎన్నో రెట్లు సత్ ఫలితం ఇస్తుంది, ఎందుకంటే అది మానవసేవ కోసం ఉపయోగం అవుతోంది కదా ,, సాటి మానవునిలో దైవాన్ని చూడటం అత్మ శోధన వల్ల సాధ్యం, అనగా నీ అంతరాత్మ నీకు ప్రథమ గురువు !!ఇక. రెండవ గురువు మీ కు చదువు,విద్యాభ్యాసం బోధించిన ఉపాధ్యాయు డు !! మూడవ నేత్రం లాంటి జ్ఞానదాత గురువు అతడు మనిషికి, దేవుడు ఇచ్చిన ప్రసాదం! గురువు కృప వలె, మన. మనసు స్ఫటికం లా స్వచ్చంగా ఉండాలి,! ధర్మం, దానం, సత్యం, గౌరవం మన మతం లో ఆచరిస్తూ ఉండాలి, ఒకనాటి బెగ్గర్ అనేవాడు ఈ నాడు bigger కావచ్చు ! అంటే కర్మను ఎవరూ తీసుకోలేరు,, తప్పించు కొలేరు కూడా !! కాని జ్ఞాన మార్గం ద్వారా కర్మకు అంటకుండా తిరగవచ్చును, అది మాట అన్నంత సులభం కాదు ! సాధన చేయాలి !,కర్మను ఎదిరించాలి,! మెడలో పాము ధరించిన శివుడు, పామును పడగ గా చేసుకున్న విష్ణువు ఆనందంగా ఉంటున్నారు, వారు కూడా వారి వారి కర్మలను ఆచరిస్తూ ఉన్నారు, కాని నిర్భయంగా! సద్ గురువు ద్వారా ,జ్ఞానాన్ని ఆయుధంగా ధరించి ఉన్నారు,,! అందుకే ,గురువు మనకు చక్కని స్నేహితుడు కావాలి, ! సాధన లేకుండా మోక్షం లేదు.! త్రిశంకు అనే రాజు తపస్సు, సాధన చేయకుండా స్వర్గానికి వెళ్లాలని అనుకోడం లాగా ఉంటుంది, ఇలా ఎందరో త్రిశంకు లు మనలో ఉన్నారు, కష్ట పడకుండా, గురువు ను ఆశ్రయించకుండ , సుఖం కావాలి,. "గురుగీత"అదే చెబుతుంది !గురువు ను ఎలా సేవించాలి,, అని!! అందుకు నియమాలు లేవు, ఒక అంకిత భావన మాత్రమే, గట్టి విశ్వాసమే కావాలి . పార్టీ మారుస్తాడు త్రిశంకు. వశిష్ఠుని వద్ద నుండి విశ్వామిత్రుని వద్దకు వెళ్తాడు,! పాపం, మూర్ఖుని చేత బట్టి, విశ్వామిత్రుడు తన వేల ఏండ్ల తపస్సును వృథా చేసుకుంటాడు, అప్పుడే కాదు, ఇప్పుడు కూడా,ఎవరి స్వార్థం వారిదే ; షార్ట్ కట్ లో లాభాలు, పుణ్యాలు తన ఖాతాలో వచ్చి పడాలి,, అలా గురువు పట్ల పరి పూర్ణ విశ్వాసం లేని వారుసమస్యల పాలు అవుతూ ఉంటారు,! అందుకే, గురువు పట్ల మనకు,ఎంత విశ్వాసం ఉంటుందో అంత ఫలితం ఉంటుంది!! కొద్ది మంది మాత్రమే గురుభక్తి కలిగి ఉంటారు, మనిషి లోని స్వార్థానికి పరాకాష్ట నిజంగా జరిగిన ఒక సంఘటన,. ఒకడు ఆడపిల్లల తర్వాత కొడుకు ను కంటాడు, ప్రయాణం లోనదీ అడ్డం గా ఉంది, తాను మునగకుండా , తన కాళ్ళ క్రింద,భార్య పిల్లలను కొడుకును తలి దండ్రులను గాడిదను వేసి ,చివరి కి తాను కూడా కొట్టుకు పోతాడు !, అందరికి , తమకున్న అన్నింటిలోనూ,తమ ప్రాణ మే ఎక్కువ గా భావిస్తారు,,! భక్తులు అంతా అంటూ ఉంటారు,, , స్వామి ! నేను నలుగురు ఆడపిల్లల పెండ్లి చేయలేక సతమత మౌతూ ఉన్నాను, ఈ బాధ్యత నీవు తీసుకో, అంటే, నా కష్టాలు నీవు తీసుకో, ! అంటారు,! అదిఎలా వీలౌతుంది,? చెప్పండి! నీవేమో, సంతోషంగా కంటావు,! సంతోషంగా ఉంటావు,! నేనేమో నీ బిడ్డల పేండ్లిల్లు చేయాలి! అల్లుడు, పెర్మనెంట్ సిటిజన్ అయి ఉండాలి, గ్రీన్ కార్డ్ ఉన్నవాడే కావాలి,! కాని ఇదంతా చేయడానికి, నాకూ ,నీకూ మద్యలో ఏదైనా agreement ఉందా,,?? లేదే !! అది నా పని కాదు ! నేను చేయలేను!!, నీ కష్టం నీవు పడు,! ఆ కష్టానికి తట్టుకునే శక్తిని ఇస్తాడు గురువు ,! అంతే ,! మరొక వింతైన విషయం ఏమిటంటే, ఎవరూ కష్టాల ను శాంతంగా వినరు, !ఒక సద్గురువు మాత్రమే వింటాడు,; అవునా !! కష్టాలను తీసుకోడానికి కాదు, ! చెప్పడం ద్వారా నీవు ఉపశమనం పొందడానికి మాత్రమే సుమా !;; ఈ గురు పూర్ణిమ రోజున మనమంతా తలచుకొని, పూజించ వలసిన ఆది గురువు "వ్యాస భగ వానుడు!,"" వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే!!" అన్నట్లు, అతడే విష్ణువు, బ్రహ్మ, శివుడు కూడా,,! భగవద్గీత , మహాభారతం, ఉపనిషత్తులు , స్మృతి శృతి పురాణాలు ఆన్ని మనకు ప్రసాదించిన జగద్గురువు, వ్యాస మహర్షి! ఎంతో వాంగ్మయం, ఇతిహాసం, ఆధ్యాత్మికత ను ఇచ్చి సనాతన హిందూధర్మ సారధి అయ్యాడు,! వ్యాసుడే విష్ణువు;,, ఈ రోజు వ్యాస పూర్ణిమ,!, ఇదే గురు పూర్ణిమ, !గురువులను పూజించి సేవించి, గురు దక్షిణ సమర్పించి, జ్ఞానదా త ఋణం తీర్చుకోవాలి,!, మీరు అంతా మీ, స్వామీజీ వలె నవ్వుతూ ఉండాలి;! మీరు కూడా,, దత్తాత్రేయుని, జయలక్ష్మి మాత, కరపత్ర స్వామీజీ లకు నమస్కారం చెయ్యాలి; ! ముక్తి కోసం, గురు పూర్ణిమ రోజున కృతజ్ఞతా పూర్వక ప్రణామాలు చెయ్యాలి,! తల్లీ దండ్రి కూడా గురువులే,, వారికి దండం పెట్టాలి,! , తెలిసో తెలియకో కట్టేసు కున్నాం, మనలను ఈ బందనాలకి,,,!; ఘోరమైన ఈ సంసార సాగరం దాటడానికి మనకి ,ఒక నావ కావాలి !అదే గురువుగారి పడవ!; భజన id 1766 Bhajan మాల app,, ,,, నావ చల్ పడీ, గురు కి నావ చల్ పడీ, గురువు అనేది ఒక బోర్డు. ఈ శరీరం తొమ్మిది తూట్ల నావ, !!పురందర దాసు కీర్తన ఇది. శరీరం లో ఉన్న రోగాలు బహు బాధాకరం, గా ఉంటాయి !! ఈ రోగ బాధను మరిచెలా జ్ఞానం కోసం గురు ప్రార్థన,, చేయాలి,! అప్పుడు కుటుంబాన్ని మరచి పోతాం. , దైవానికి దగ్గర అవుతాం, అదీ గురువు కృప వల్ల! అందుకే, ఈ సంస్కారాన్ని, మీ పిల్లలకు అందించండి !; పిల్లలకు గురువు ల పట్ల గౌరవ భావం నేర్పండి !!మాంసాహారం వదలండి,! ఇంట్లో బార్, అంటే, మద్యం సీసాలు తీసేయండి ! మీ, బెడ్ రూం లో స్వామీజీ ఫోటో లు పెట్టుకోవద్దండీ,,! హల్ లో ఉంచండి,! నేను ,మీ ప్రయాణం లో, మిమ్మల్ని విడవని తోడుని!! నేను, కొంత ఈత తెలిసిన వాడిని, ! అందుకే మంచి మాట గా చెబుతున్నాను ,చంచల మన సు ఉండ వద్దు,! హనుమంతుని వలె దృఢమైన చిత్తం ఉండాలి,! ఈ రోజు నేను ఇక్కడ, మీ ముందు!! వచ్చే గురు పూర్ణిమ ఎక్కడో, ?కర్మ ఎక్కడికి తీసుకుని వెళ్తుందో?? నాకు కూడా తెలియదు,, ! అందరికీ జయం శుభం ,,! అమెరికా దేశంలో జనమంతా చల్లగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి,! గతంలో, నా పాద పూజకు వచ్చిన డబ్బు 75 లక్ష లు పల్లె పల్లె లో వైద్య సహాయం కోసం ఖర్చు చేశాను,, శ్రీ చక్ర అర్చన ఎంత ముఖ్యమో, బీదవారి కి సేవ చేయడం నాకు అంత ముఖ్యం!,, విజయవాడ లో ఉన్న""నరహరి తీర్త మెడిసిన్ హాస్పిటల్ ""కు, ఈ రోజు పాదపూజ డబ్బును పూర్తిగా అందిస్తున్నాను, మీకు వీలు ఉంటే, ఆ హాస్పిటల్ లో పరికరాలు ఏర్పాటు చేయండి.; మీరు ఉదారంగా అందిస్తున్న, ప్రతీ పైసా హాస్పిటల్ కి చెందాలి,! ఇదే నా జీవిత ఆశయం! గత 50 ఏళ్ల నుండి నేను చేస్తున్న పనే ఇది!! ఇందుకు, నా పై నమ్మకం తో,, చాలా మంది సహాయం చేస్తున్నారు,! నాకు చాలా సంతోషం! అలా, గట్టి సంకల్పం తీసుకోండి,! ఈ ,"" తాతాజీ"" సైన్యం పెంచండి!, భగవద్ గీత సైన్యం పెంచండి!! ఈ రోజున,, పిల్లలు తమ తలుదంద్రులను ఇక్కడికి తెచ్చారు.! ఒకనాడు, 6 ఏళ్ల వయసు బాలుడు తీర్టం తీసుకొని ఇప్పుడు తమ 6 ఏళ్ల మనవడు తో వచ్చారు! అందుకే, ఈ అనుబంధం ఇలానే ఉండాలి, మీరు నన్ను మరచినా, విడచినా. నేను మిమ్మల్ని ఒద లను,!, , I am your silence teacher ,!!hats off to ,great America!,give respect to it;;,,,thanks to America!,thanka to the president;, ;American s are good, ;gave place, permission for our Shiva, Murugan, Hanuman temple s,,,May this country is free from సునామీ, వరదలు, అగ్నిప్రమాదాలు !! నాకు ప్రత్యేకంగా ఇప్పుడు, ఏదో తెలియని ఫ్యామిలీ ఫీలింగ్ ఉంది!, ఎందుకో నాకు తెలీదు,! ఇలా నాకు ఎప్పుడూ అనిపించలేదు! అంటే, మీరు అంటే అభిమానం, !! ప్రేమ !!మళ్లీ మిమ్మల్ని చూడాలని ఆశ !! , జై గురు దత్త,, జై జై గురుదత్త !!
No comments:
Post a Comment