భార్య భర్తకు చాలా సంతోషంగా రుచికరమైన పదార్తాలు వండి వడ్డించింది.. ఆ రోజు తమ పెళ్లిరోజు కాబట్టి ఇంకా ఉత్సాహంగా ఉంది..కానీ తింటున్నంతసేపు అమ్మ ను గుర్తు చేసుకుంటూ .మా అమ్మ ఉంటే ఇంతకంటే బాగా చేసేది. అంటూ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తిని వెళ్ళిపోయాడు. ఆవిడకు మండి పోయింది.. ఎప్పుడూ అమ్మ అమ్మా.. !ఇంత ప్రేమతో వండాను. బావున్నాయి అని ఒక ముక్క అనవచ్చు కదా..అని కళ్ళ నీళ్లు పెట్టుకుంది అంతలో కొడుకు అమ్మా అన్నం పెట్టు అంటూ వచ్చాడు.. వాడు తింటున్నంత సేపు లొట్టలు వేస్తూ.. వాహ్ ఎంత రుచిగా చేశావే అమ్మా. అంటూ తిని వెళ్ళిపోయాడు అప్పుడు అర్థమయ్యింది... అమ్మ చేతి వంటలో కమ్మదనం ఏమిటో.. తినే పదార్ధంలో కాదు.. ప్రేమగా ఆప్యాయత తో కొడుకా ! కడుపు నిండా తిను .అంటూ తానే స్వయంగా కొసరి కొసరి తినిపించే అమ్మ చేతిలోని అన్నం ముద్దలో.. ఆ పిలుపులో ఆ చల్లని చూపులో. ఉన్న కమ్మదనం. భువిలో దివిలో ఆ దైవంలో నైనా దొరకదు కాక దొరకదు.. జీవితంలో ఆనందపు అనుభూతులు చాలా ఉంటాయి.. కానీ ఎక్కడున్నా .ఎలాఉన్నా గుండెను తట్టి. కొడుకా !" పొద్దు పోయింది కదా .ఆకలి వేయడం లేదా.. నానా లే కొంచెం ఎంగిలి పడుదువు గాని.. తర్వాత చూడవచ్చు ఆ పనులు.. అంటూ సాక్షాత్తు జగన్మాత అన్నపూర్ణ యే అమ్మ రూపంలో వచ్చి. ప్రేమ కరుణ వాత్సల్యం దయ అనురాగం ఆప్యాయత.లను అనుగ్రహిస్తోందా.. అనిపిస్తుంది.. ఇది నిజమైన ప్రేమ. అందులోని ఆనందం అనుభూతి అనిర్వచనీయం.. అపురూపం ..ఈ దివ్య వైభవం కోసమే కదా కృష్ణయ్య ముద్దుగారే యశోదా ముంగిట ముత్యం అయ్యాడు... అమ్మ ఒడిలో స్వర్గం. అమ్మ తలంపులో తృప్తి విశ్రాంతి ఆనందం.. అమ్మ నీడలో ఎంతో రక్షణ. స్వతంత్రం. నిర్భయం..అమ్మంటేనే అసలు సిసలైన ప్రేమ.. అమ్మ వద్ద ఉన్నవాడు నిజంగానే ధనవంతుడు.. అమ్మ జ్ఞాపకాలను పదిలంగా గుండెలో దాచుకున్నవారు నిజమైన భాగ్యవంతులు. అమ్మా ! నీకు శతకోటి వందనములు..ఎన్ని జన్మ లెత్తినా తీర్చుకోలేని నీ రుణం .సృష్టికర్తకు కూడా చెల్లించ దుర్లభం.. అందుకే తల్లీ అమ్మా జననీ మాతా. నీకు సాగిలపడి సాష్టాంగప్రణామాలు సమార్పిస్తున్నాము..
Friday, September 14, 2018
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment