Friday, September 14, 2018

భజన

భజనలు చేయడం హరికీర్తనలు పాడటం హరినామాన్ని స్మరించడం మన విధి కర్తవ్యం .ప్రతిరోజూ ఆలా కనీసం ఒక అరగంట అయినా చేయడం వలన మన శరీరంలో ని వేలాది నాడులు స్పందిస్తాయి.. మన రెండు చేతులనూ కలిపి భక్తి తో కీర్తనకు అనుగుణంగా తాళం వేస్తూఉంటే .లోన ఉన్న గుండె కాలేయము ఊపిరితిత్తులు మూత్రపిండాలు. గ్రంధులు అవయవాలు అన్నీ స్పందిస్తాయి.. భజన కీర్తన తోబాటు అరచేతుల చప్పట్లతో లేదా చిరతలు లేదా గజ్జెలమోతతో .కీర్తనలోని భావవ్యక్తీకరణ తో బాటు పరవశించి పోతూఉంటే పొందేదే నిజమైన బ్రహ్మానందం.. దేహాన్ని మరచి మనస్సును దైవంతో లయం చేస్తే.. జీవుడు దేవుడౌతాడు కదా..! సత్సంగంలో సామూహికంగా . ఒంటరిగా .దైవ మందిరాల్లో .తీర్థ యాత్రలలో గానీ భక్తి గీతాలు. పాడుతూ పాల్గొంటే పొందే ఆనందం అమోఘం.అనిర్వచనీయం . రెండు చేతులనుండి మొదలై శరీరంలోని అన్ని అవయవాలకు కలుపుతూ ఉన్న నాడులు అన్నీ స్పందిస్తాయి.ఆలా లోనున్న సమస్త నాడుల ఉత్తేజంతో . కండరాలన్నీ సంకోచ వ్యాకోచాలతో కదలడం వల్ల..నరాల్లోని అడ్డంకులు తొలగిపోయి చక్కగా రక్తప్రసారం జరుగుతుంది. గుండె సక్రమంగా పనిచేస్తుంది.. గ్రంధుల విడుదల తో జీర్ణవ్యవస్థ చక్కబడుతుంది ..ఇవి ఎముకల పెరుగుదలను.నాడీ మండల వ్యవస్థను.మెరుగుచేస్తాయి. మెదడులోనున్న సూక్ష్మ నాడులు కండరాలు సక్రమచలనంతో ఆరోగ్యంగా ఉంటాయి.. ఇలా మనలోని మానసిక శారీరక రుగ్మతలు ""భజన చేయడం "" అన్న ఒకే ఒక్క ప్రక్రియతో తొలగిపోయి.. రక్తపోటు. చక్కెరవ్యాధులు. గుండె జబ్బులు. నరాల బలహీనతలు లాంటి ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా నివారింప బడతాయి.. అంతటి శక్తి హరినామస్మరణ లో ఉంది.. ఎన్ని మందులు వాడినా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా నయం కానీ రోగాలు భగవన్నామం తో బాగుపడతాయి...భజన చేసినా వినినా స్మరించినా. పాపాలు హరింపబడటమే కాక..మనసు ఉత్సాహంతో హృదయం ఆనందంతో.. ఆరోగ్యంగా ఉంటుంది...మనం చేబట్టిన పనులు జయప్రదంగా జరుగుతాయి. దైవభావన మనసులో నిలిపితే బాహ్యంగా పనులు దివ్యంగా తృప్తిగా జరుగుతాయి..ఇన్ని ప్రయోజనాలు ఇచ్చే భజన వల్ల మరో ముఖ్యమైన ఫలితం ఉంది .దేహం నీటితో శుభ్రపడితే మనం భక్తితో చేసే భజనతో చిత్తశుద్ధి.. కలుగుతుంది అనగా దుఃఖాలు బాధలు ఆపదలు అడ్డంకులు మనల్ని అంతగా బాధించవు.. ఎందుకంటే "అలాంటి భక్తుల యోగక్షేమాలు తాను చూస్తుంటానని " గీతాచార్యుడు శ్రీకృష్ణుడుప్రతిజ్ఞ చేశాడు . .అయితే "నాకు సమయం దొరకడం లేదు భజన చేయడానికి !" అని అంటావేమో...! మన. నిత్యకృత్యాల్లో కూడా దైవాన్ని స్మరిస్తూ.. ఇంట్లో విధిగా పూజ గదిలోని దేవున్ని పూజిస్తూ.. నిద్ర లేచినపుడు.. స్నానం చేస్తున్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు..నీరు త్రాగుతున్నపుడు.. నిదుర పోవడానికి ముందు.. బయట పనిలో తీరిక దొరికినప్పుడు. ఆలయం వెళ్ళినపుడు .దైవచింతన చేసే పెద్దవారు కనిపించినపుడు. యాత్రల్లో..ఉగాది దసరా సంక్రాంతి లాంటి పండుగ రోజుల్లో... ఇలా మనకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చేతులు జోడించి నమస్కరించడం. వచ్చిన స్తోత్రాలు నామాలు పద్యాలు పాటలు చదవడం చేస్తే ఆది ప్రవృత్తి అవుతుంది... నిజానికి ఈ ప్రక్రియ మనకోసం చేస్తున్నాం.. అంతేకాదు మనపిల్లలకు అందించే తరగని వారసత్వసంపద ఈ హరిభక్తి.. అందుకు తలిదండ్రులు తమ పిల్లలకు బాల్యంనుండే అలవాటు చేయాలి .ఈ సంస్కృతి సంస్కరమే వారికీ మనకు మన దేశానికీ శ్రీరామరక్ష అవుతుంది.. మనకు ఉచితంగా కోరకుండానే ఈ మానవజన్మ.ఈ. ఆస్తులు అంతస్తులు సంపదలు బంధువులు. భార్యా భర్తకొడుకులు కూతుళ్లు.మనవలు మనవరాళ్లు. భగవత్ ప్రసాదంగా అనుగ్రహించబడినాయి.. ఇవి మాత్రమే గాక ఫలాలు పుష్పాలు నదీినదాలు.కొండలు కోనలు అందమైన ప్రకృతి.. కర్మసాక్షి సూర్యభగవానుడు.. చల్లని దైవం చందమామ. నక్షత్రాలు. రామాయణ భాగవతాది పురాణాలు ఉపనిషత్తులు. లాంటి గ్రంధాలు.. జీవితాన్ని మధురంగా మలచుకోడానిక పరమాత్మ ప్రసాదంగా మనకు అందించాడు..రోజంతా శ్రమించిన శరీరానికి విశ్రాంతినిచ్చే నిదుర అనే దివ్యమైన ఔషధాన్ని.. అనంతమైన ప్రాణవాయువును.. అమృతతుల్యమైన తీయని జలాలను.. పుష్టినిచ్చే పృథ్వి. పాడిపంటలు..పాలు పెరుగు సమృద్ధిగా అందించే పశుసంపద.. ఇలా ఎన్నో ఎన్నెన్నో సౌకర్యాలు మన సుఖకరజీవనానికి సమకూర్చిన ఆ అపార కరుణా కరుడు దయానిధి.. అయిన పరమాత్మునికి బదులుగా ఏమివ్వగలం మనం...? మనం అనుభవించేవన్నీ ఆయనవే..!. ఏ ఒక్కటి మనది కాదు.!. అంతెందుకు.!. ఈ శరీరం ,ఈ బంధువులు, సంపదలు, ఏవీ మనవి కావు.మనం తయారు చేసినవి అసలే కాదు. ప్రకృతిని జ్ఞానాన్ని దేహాన్ని అందమైన పరిసరాలను వాడుకొమ్మని.. సద్వినియోగం చేసుకొనమని అందుకు బదులుగా .కృతజ్ఞత చూపేందుకు విజ్ఞానాన్ని ఇచ్చాడు! నిజానికి ఆయనకు తిరిగి ఇచ్చేందుకు మనదంటూ ఏమీ లేదు..! అతనిది అతనికే సమర్పించడం తప్ప మరేదారి లేదు మనవద్ద...! అందుకే ...కృతజ్ఞతగా మనం చేయగలిగింది , చేయవల్సింది భక్తితో చేతులెత్తి మనసుతో హరినామం చేయడమే !. ఒక వంద రూపాయలు ఎవరైనా ఇస్తే "థాంక్స్" అంటాము.. మరి అనంతమైన అందమైన .రమణీయమైనప్రకృతి సంపదలను.అనుభవిస్తూ ఆధ్యాత్మిక చింతనలేకుండా .జగన్నాథుని స్మరించకుండా గడిపే జీవనం పశుతుల్యం అవుతుందికదా !.పరమ ఉత్కృష్టమైన మానవజన్మ ను సార్ధకం చేసుకోడానికి దైవభావన కలిగించే .దైవం పట్ల భక్తినిపెంచే భగవన్నామ స్మరణ ఆంటే భజనలు కీర్తనలు స్తోత్రాలు చేద్దాం. పురాణ శ్రవణం తో దైవం గురించిన జ్ఞానాన్ని విశ్వాసాన్ని. పెంచుకుందాం.. తద్వారా ఈ జన్మను ధన్యం చేసుకుందాం. ఆ సాధనా మార్గాన్ని సులభతరం చేసేందుకు ఈ భారాన్ని అప్పగిస్తూ .కావాల్సిన బుద్ధినీ శక్తినీ స్ఫూర్తినీ తెలివినీ సమయాన్నీ.. కరుణించమని ఆ దైవాన్నే శరణు వేడుదాం.!" ఓమ్ శాంతి శాంతి శ్శాంతిః ! . గౌరీ శంకర భగవాన్ కి జై...! గోపాల కృష్ణ భగవాన్ కీ జై...! పవనసుత హనుమాన్ కీ జై ! గజానన భగవాన్ కీ జై.!.భవానీ మాతా కీ జై.! సరస్వతీ మాతా కీ జై !"మహాలక్ష్మీ మాతాకి జై ! స్వామియే శరణం ..అయ్యప్పా శరణం . !.హరహర మహాదేవ శంభో హర..! సమస్త భక్తజనులకు జై..! సద్గురువులకు జై..! లలితా త్రిపురసుందరి మాతాకి జై...!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...