Friday, September 14, 2018

ఆనందం అంటే ఏమిటీ?

ఆనందం అంటే ఏమిటీ? కమ్మని భోజనం పుష్టిగా తినడమా.?. ఇష్టమైన సంగీతం, లేదా వృత్తిలో, వ్యవహారాల్లో లేదా భార్యాపిల్లలతో బందువుల్లో సంతోషన్గా సంసార జీవితం గడపడమా..?. డబ్బు హోదా విలాసవంతమైన కార్లు పదవులు హుందాగా ఉండటమా ?... రోజంతా ఎదో ఒకరకంగా బిజీగా ఉంటూ ,విచారం లేకుండా జీవించడమా...? 

రంది, బాధలు బాధ్యతలు, కష్టాలు దుఃఖాలు, అప్పులు ఇవేమీ లేకుండా ఉండటమా .?.ఇదే ఆనందమా..? ఈ అనుబంధాలే ఆనందమా. .?.నిజానికి ఇవన్నీ ఐహిక సుఖాలు,,! పంచేంద్రియాలను తృప్తి పరచడానికి జీవుడు పడుతున్న తపన.. 

కనీస అవసరాలు తీర్చుకునేందుకు.. జీవితంలో కొరత లేకుండా తింటూ అనుభవిస్తూ కూడా భవిష్యత్తు కోసం దాచుకునేందుకు ,చేస్తున్న నిర్విరామ కృషి ,శ్రమ,! అలుపెరుగని అంతులేని, ఆశ చావని, గమ్యం తెలీని పోరాటం !ఈ బ్రతుకులో జానెడు పొట్టకోసం నానా అవస్థలు, బాధలు, పడుతున్న ఆరాటం..! దీనినుండి విముక్తి లేదు, పుట్టిన ప్రతీ ప్రాణి కూడూ, గుడ్డా, ఆశ్రయం కోసం చచ్చేదాకా తిప్పలు పడవల్సిందే.!. ఇది మాత్రం అందరి జీవితాల్లో సర్వ సాధారణం.!. 

నీ జీవితగమ్యం ఏమిటీ. అనిముక్కుసూటిగా అడిగితే చెప్పే జవాబులు కోకొల్లలు... ! "నేనెవరిని ?"అని అడిగే ప్రశ్న లాంటిదే ఇది కూడా.. దీనికి ఏ విజ్ఞాన శాస్త్రము కూడా వివరణ ఇవ్వలేదు .ఒక్క ఆధ్యాత్మిక సాధనం ద్వారా మాత్రమే సమాధానం పొందవచ్చును.. తాత్కాలిక సౌఖ్యాలను సంతోషాలను ఇచ్చే భౌతికఅనుభూతులకు ""ఆనందము 'అని నిర్వచింప లేము.. 

"ఆనందం " అనేది శాశ్వతము. సత్యము , నిత్యము అయిన సచ్చిదానంద స్వరూపము ,ఎంతో రుచిరా,! ఓ రామ నీ నామం.. !" అని పాడుకుంటూ పొందే అద్భుతమైన అపురూపమైన, అనుభవైక వేద్యమైన దివ్యమైన అనుభూతులను మహానుభావులు ,పరమ భక్తశిఖామణులు పరమాత్మను ఆత్మదర్శనం చేసుకొని మనకు ఆ భావసంపద ను సనాతన భారతీయుల అనువంశిక వారసత్వ సంపదగా సంక్రమింప జేశారు.. ఆ కీర్తనల్లో పురాణాల్లో, గేయాల్లో, రచనల్లో శ్రుతుల్లో ,వారు ఋషిపీఠం నుండి బ్రహ్మానందాన్ని మనకు అందించారు.. త్యాగరాజు, రామదాసు పోతన, కబీర్ దాసు, మీరాబాయి, లాంటి ఆనందపు తరంగాల్లో ఓలలాడారు. భక్తిపారవశ్యంతో పులకించి పరవశించి తన్మయులయ్యారు,,

ఆనందం అంటే హరికీర్తన,హరి నామ రచన, హరి గుణగాన భజన, హరి సేవా భాగ్యం కోసం పడే తపన, హరి భక్తుల సాంగత్యం కోసం పడే ఆవేదన,,,! ఒక్కమాటలో చెప్పాలంటే పరమాత్మ రూపంలో దర్శనంలో ,సేవన ,అర్చన, పూజన ,శరణాగతి భావనలో మాత్రమే ఆనందం ,బ్రహ్మానందం,పరమానందం,,నిండి ఉంది..! ఈ సృష్టిలో అందంగా రచింపబడిన నదులు, కొండలు, కోనలు,పచ్చని చెట్లు,రంగుల పూలు, సూర్యోదయ, సూర్యాస్తమయం వేళల్లో ఆకాశంలో వెలిగే అద్భుతమైన రంగుల హంగుల దర్శనంలో ఆనందం ఉంటుంది.. ఎందుకంటే అదంతా హరిమయమే.!. 

శ్రీహరి లేని జగతి ప్రగతి,నియతి, విశ్వంలో లేదు.!. ఎటు చూసినా పరందాముని జగన్మోహన విశ్వరూపమే,! అందాలన్నీ రంగరించి కలబోసి, తన అందమైన కుంచెతో ప్రతిరోజూ తీర్చిదిద్ది మనకోసం అందిస్తున్న అపురూప అద్వితీయమైన అఖండ చాతుర్య శిల్పకళా ఖండ బాండారము.ఈ ప్రక్రుతి , !ఒక్క గులాబీ పుష్పం , రచనలో ఎన్ని కళలు, ఎన్ని రేకులు, సొగసులు,కాంతులు,సున్నితమైన సువాసనల పొరలు, అన్ని గులాబీలు ఒకే తీరు!,ఒకే సౌష్టవం,!ఒకే రంగు.. ! ఈ అందాల ఆనందాల పరిమళాల భరితమైన ఆహ్లాదకరమైన వాతావరణం ను ఇంతగా అమృతతుల్యముగా చేస్తున్నది ఎవరు,? పరమేశ్వరుని కరుణా కటాక్ష వీక్షణ వైభవము తప్ప,, !



ఆహా , !ప్రభూ ! నీ లీలలు వర్ణించతరమా ! అనిపిస్తుంది కదా ఆ గులాబీ పుష్పం ఉన్న ఆకులు మొక్కలు ,మొగ్గల నిగ్గులు,,!ఇలాంటి అందాలను ఒలికించే రంగు రంగుల పువ్వులు ఆకులు వృక్షాలు పచ్చిక బయళ్లు, నీలి కొండలు జగతిలో ఎన్నో కదా.! ,భగవన్తుని సృష్టి చిత్రవిచిత్రం,!అనంతం,,,! అందుకే ప్రకృతిలో ఎక్కడ చూసినా పరమాత్మ వైభవం ,దర్శించే భావించి స్పందించే అనుభూతిలో చూపులో, ప్రతిస్పందన లో ,అంతరంగంలో పొందే కమనీయము ,,రమణీయం,మనోహరము, 

మంగళ కరమైన భావసంపదలో ఉంటుంది ఆనందం యొక్క నిర్వచనం.!" .ఆనందో బ్రహ్మ !""అన్నది వేద వాక్యం,,! అందుచేత పుణ్యాత్ములు చూపిన దైవారాధన భావనా మార్గంలో మన బ్రతుకును సుసంపన్నం చేసుకుందాం !,చేసే ప్రతీ పనిలో ,వేసే ప్రతి అడుగులో,అనుభూతిలో ఆ పరందాముని ఉనికిని వైభవాన్ని,మహత్తుని, అనుభవిస్తూ,జీవితాన్ని దేవదేవుని దివ్యమైన చరణ కమలాల ముందు సమర్పించుతూ, ఆనందంగా గడుపుదాం, ! ఇంతా కన్నా ఆనందమేమి,? ఓ రామా.!. అంటూ భక్తితో భగవన్తునితో అనుబంధాన్ని ఏర్పరచు కుందాం...!.. ఓమ్ నమో భగవతే వాసుదేవాయ.. ! హరిః ఓమ్ తత్సత్,,! సర్వమ్ శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణ మస్తు.!. స్వస్తి. !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...