Friday, September 14, 2018

వెన్నదొంగ

"వెన్నదొంగ, !"అని కృష్ణుని పిలుస్తుంటారు .కానీ అది నిజమా.? కాదు !".బ్రహ్మాండాలను బొజ్జలో దాచుకున్న కన్నయ్యకు వెన్న కావాలా.! అది దొంగతనం గానా..! 

అసలు సత్యం ,చిన్నికృష్ణునిపై గోపికలకు గల అపారమైన భక్తి. ! కృష్ణుని యందు అనురక్తి. ! క్షణమైనా తనను విడిచి ఉండలేని వారి నిర్మలహృదయాన్ని ,ప్రేమను అందివ్వడానికి వెన్నను గ్రహించే నెపంతో గోపికలయిండ్లు దూరి వారి నిష్కలంకమైన ప్రేమను అందుకుంటూ చివరకు వారికి మోక్షాన్ని ఇచ్చాడు.!.భక్తులందరిలో గోపికల భక్తి అత్యున్నతస్థాయి కి చెందినది ! ..కన్నయ్య చోరత్వం ఒక లీల.! శ్రీకృష్ణ లీలల అర్థము మహా యోగులకే అర్థము కాలేదు. 

యశోద మాతచే కట్టుపడకుండా త్రాడును "రెండు అంగుళాలు " తగ్గించాడు,ఇక తాను కృష్ణయ్యను కట్టలేనని తెలుసుకొని, నిరాశపడడం, చూసి, తల్లిలో అహంకార మమకారాలు తొలగడం గ్రహించి తానే స్వయంగా త్రాడు కట్టేసికుంటాడు, 



లీలమానుష విగ్రహుడు, శ్రీకృష్ణ భగవానుడు..!అంటే అన్ని వికారాలు తొలగించి తనయందలి భక్తికి యోగ్యత అందిస్తాడు.. తాను మ్రోగించిన మురళి మన శరీరమే, ! దానికి, ఉన్న రంధ్రాలు మన శరీరానికి గల రంద్రాలే !కన్నయ్యను తలచుకుంటూ చేసే పనులు కృష్ణునికి దగ్గరకు చేరుస్తాయి.. అంటే పలికే స్వరంలో కృష్ణ నామం కృష్ణభక్తి కృష్ణప్రేమ మాధుర్యం హృదయంలో పొంగిపోవాలి. .ఇక వంశీలోలుని ఊదిన సప్తస్వరాలు నాలుగు వేదాల నాదాలు . !అదే జీవన గీతం.! 

రాధారాణి కలయిక తర్వాత మాధవుడు వేణువు పట్టలేదు. రాధయే అతనికి వేణువు,!రాధయే సర్వస్వం,! రాధయే వంశీనాదం!.. రాధయే మాధవుడు,,! మాధవుడే రాధ!,.అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీకలు ,ఆ ప్రేమమూర్తులు,,! భాగవతం లో రాధగురించిన ప్రస్తావన రాదు,,వ్యాస మహర్షికి రాధ అన్న పేరు తలచినంతనే తనను తానే మరచిపోతాడట. అంతగొప్ప భక్తి తత్వం రాధమ్మది, !. మనసును కృష్ణుని వేపు మరలిస్తే, మన శరీరం ధర్మక్షేత్రం అవుతుంది !.. శ్రీకృష్ణుని మరచితిమా అది కురుక్షేత్రం అయిపోతుంది..అంటే జీవన పోరాటాలు కదుల్తాయి . 



అందుకే మనం చేసే ప్రతి మనసా వాచా కర్మలకు ముందు సారధిగా కృష్ణుణ్ణి తలచి కొలిచి పూజించి హృదయంలో నిలిపి ,అంకితభావంతో పూర్తిగా సమర్పించుకొన్న పిదప కర్తవ్యాన్ని నిర్వహించాలి ఏ పనికైనా దేవుణ్ణి ముందు నిలిపి, మనం సంకల్పాన్ని చెయ్యాలి.ఫలితాన్ని "శ్రీకృష్ణార్పణ మస్తు "!" అనుకునే గట్టి నమ్మకం గలగాలి ..అందుకు కృష్ణయ్యనే ప్రార్తించాలి. రాధాకృష్ణా.!. నీ లీలలు అపురూపం! అద్భుతం,! అమోఘం !

దయయుంచి ఈ దీనునిపై కృపజూపి నాచే మంచి పనులు చేయించు!. కర్త కర్మ క్రియ అన్నీ నీవే తండ్రీ !.నీ పాదపద్మములనే బంగారు పంజరంలో నా మనసును బందించు.! స్వామీ. శరణు ! నందనందనా, యశోద తనయా. గోపీలోలా ,శరణు..! గోపాలకృష్ణ భగవాన్ కీ జై.! జై శ్రీరాధే !జై జై శ్రీకృష్ణ..!,గోవింద్ బోలో గోపాల్ బోలో, రాధా రమణ హరి గోపాల్ బోలో..!"


No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...