Friday, September 14, 2018
దేవుడు చూస్తున్నాడు
మనిషి జన్మించిన సమయం నుండి అంతిమ శ్వాస విడిచే వరకూ .ఆరాటం. జీవన పోరాటం .ప్రాణాలతో చెలగాటం చేస్తుంటాడు. .కొత్తదనం కోసం.. ప్రయత్నం.. పాత ఇల్లు కారు వస్తువులు అస్తులు మనుషులు ఉద్యోగం, బంధువులతో సరిపెట్టుకోక.. ఉన్నదానితో తృప్తి పడకుండా నిరంతర ప్రయత్నం చేస్తూ.జీవిత లక్ష్యం మాత్రం మరచిపోతున్నాడు.. తెలియనిదాన్ని దొరికించుకునే మార్గంలో బాల్యం నుండీ వృద్ధుడయ్యేవరకు సాధన చేస్తూనే ఉన్నాడు.. ఒకటి సాదించాక ఇది కాదు..ఇది సరిపోదు.. ఇంకా కావాలి.. ఇంకా చూడాలి ఇంకా సంపాదించాలి ..ఇలాంటి అంతులేని కథల సారాంశం ఏమిటి..అసంతృప్తి అనే జవాబు వస్తుంది.. మరి తృప్తి ఎలా కలుగుతుంది అన్న ప్రశ్నకు జవాబు భగవద్భక్తి మాత్రమే అని చెప్పవచ్చును.. మన ప్రయత్నం బాహ్యంగా దొరికే లౌకిక ఆనందాల కోసమే ..అవుతోంది.. ఉద్యోగాలు చదువులు గ్రామాలు పరిశోధనలు. ఇళ్ళు. మనుషులు. ఇలా ఎన్నెన్నో తెలియనివాటికోసం సాధించి దొరికించుకుంటాం.. కానీ దేవుని విషయంలో మాత్రం ఆ ప్రయత్నం చెయ్యం.. కనీసం ఆలోచన కూడా చేయడానికి సాహసించం. .అందరిలో అన్నింటిలో అంతటా నీలో నాలో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో పంచభూతాల్లో దైవశక్తి ఉందని. అందుకే ఈ జగతి .లోని చరాచర ప్రాణులు. అందంగా ఆనందంగా శోభిల్లుతున్నాయని మనకు తెలుసు.. కానీ విశ్వసించం! ..గదిలో ఒంటరిగా ఉండి ఎవ్వరికీ తెలీకుండా మనం చేసే ప్రతీ పనిని దైవం గమనిస్తుంది. అన్న విషయం నమ్మలేం కదా !.. అందుకే ఈ ఆందోళనలు. అలజడులు..అల్లరులు.! "దేవుడు చూస్తున్నాడు" అన్న ఒక్కవిషయం గుర్తుంటే మనం చెడ్డపనులు. ఇతరులను బాధించే చర్యలు చేయలేం.! కుటుంబ సభ్యులను స్నేహితులను అపరిచితులను నమ్ముతాం కానీ మనకు ఇన్ని వసతులు. సంపదలను ఇచ్చిన దేవుని ఉనికిని మాత్రం నమ్మం !..." ఇదంతా దేవుడిచ్చిన వైభవమే "అని అనడం వేరు.. !నమ్మడం వేరు...! నమ్మకం అనేది ఆచరణ ద్వారా మాత్రమే తెలుస్తుంది. అప్పుడు లక్షల డబ్బు వచ్చినా పోయినా బాధ ఉండదు.. ఎంత విశ్వాసమో అంత ఫలితం.. దేవుని విషయంలో కూడా అంతే.. !దైవాన్ని నమ్మి చెడినవాడు లేడు.!. అయ్యప్ప భక్తులు కానీ. దుర్గాభవాని భక్తులు కానీ హనుమాన్. సుబ్రహ్మణ్య వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ తమ దీక్షసమయంలో అంతులేని దైవబలాన్ని ఆత్మానందాన్ని.. అభీష్ట పలితాలని పొందుతూ ఉంటారు..!ఇష్టదైవాన్ని తమలో భక్తులు ఆవహింప జేసుకుంటారు .నోములు వ్రతాలు చేసే స్త్రీల నమ్మకానికి దైవం చక్కని సత్ఫలితాలను ఇస్తుంది కూడా.. ప్రయత్న లోపం లేకుండా త్రికరణ శుద్ధితో చేసే ప్రతీ పనికి దైవం తోడుగా ఉంటుందని మనకు తెలుసు. దేవుడు ఎక్కడఉన్నాడు.?. ఆంటే .మన నమ్మకం లొనే ఉన్నాడు .! ఎందుకు కనపడడు.?. ఆంటే అతడు నిరాకారుడు.. సఛ్చి దానందస్వరూపుడు! ఆకారం అంటూ ఉండదు కానీ ఎవరు ఏ ఆకారాన్ని ఆరాధిస్తారో ఆ రూపంలో దైవం వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది...!అందుకే బాహ్యంలో భావంలో. ఎవరు ఆనందంగా సంతృప్తిగా ప్రశాంత చిత్తంతో ఉంటే వారే దైవ స్వరూపులు.!. పోతే ఈ సాధన ప్రక్రియ నిరంతరం కొనసాగాలి. శరీరంలో రక్తం ప్రవహిస్తూ ఉన్నట్టుగా భక్తి తత్వం హృదయంలో అంతరంగంలో నిండిపోవాలి.. దైవం కోసం నిత్యం అన్వేషణ చేస్తూనే ఉండాలి.. కళ్ళుమూసినా కళ్ళు తెరిచినా ఏ పని చేస్తున్నా ఏ వస్తువు ను చూసినా మూలకారణభూతమైన ఆ పరమాత్ముని దివ్యదర్శనం చేయగలిగితే అదే పరమ పద సోపానం..! ఆదే మన జీవిత లక్ష్యం.!. అదే మానవజన్మ సార్థకత ! పరమావధి !... అందుచేత. పరిపూర్ణ విశ్వాసంతో నమ్ముదాం. !మనలో ఉండి మనల్ని నడిపించేవాడు ,మన ప్రాణాధారము ,..సకల ప్రాణుల మనుగడకు ఆధారభూతమైనవాడు ,.అంతర్యామిగా మనలో ఉంటూ .మనం చేసే చర్యలకు సాక్షిగా ఉంటున్నవాడు , ..ఆ జగదానంద కారకుడు.అన్న నమ్మకం ఆలోచన ఆచరణ అంతరంగంలో ఉంటే చాలు.కదా.. జన్మధన్యం కావడానికి..! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ..! శివాయ గురవే నమః !
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment