Thursday, October 18, 2018

రాధాకృష్ణ

Oct 17 2018

రాధాకృష్ణుల అనుబంధం-- అద్వితీయము ,,!అమోఘం  !అద్భుతం కూడా  ! ఇద్దర్నీ విడదీసి చూడలేము.. !సరికదా ,పొరబాటున కూడా వేరుగా భావించలేము  !  తనను కట్టిపడేసేంత  "అమోఘమైన శక్తి రాధాదేవి కి  "ఎలా లభించింది  ?అన్న విషయం శ్రీకృష్ణుని అంతర్యానికి కూడా అంతుబట్టలేదు  !..ఏ దేవత కరుణ ,ఏ తపస్సు మహిమ ,ఏ యజ్ఞదీక్షా ఫలమో , ఏ యోగ బలమో ,రాధాదేవి అద్భుతమైన ప్రజ్ఞకు ,అసాధారణ మహిమకు  కారణం అవుతున్నాదో , దానిని మాదవుడు తెలుసుకోవాలని అనుకున్నాడు.!.అందుకు తాను  ఏం చెయ్యాలి..? అంటే  తాను రాధగా మారాలి,! అంతే ! అప్పుడే రాధాదేవి తత్వాన్ని ,ఆమె అంతర్యాన్ని ,అంతరంగ ఆవిష్కరణ ను అవగాహన చేసుకొని గలుగుతాడు. ! అప్పుడే .ఆమెకు   తనపై గల  అమితమైన ,అవ్యాజమైన ,నిష్కల్మషమైన ,నిరుపమానమైన  అఖండమైన ,ప్రేమానురాగాలు   తనకు అర్థం అవుతాయని ,,  భావించాడు శ్రీకృష్ణుడు..! తాను స్త్రీ రూపం ధరించకున్నా ఫర్వాలేదు ,కానీ రాధాదేవి తత్వరూపాన్ని ధరిస్తూ అయినా ,, ,ఆమె ఆరాధనా బలానికి హేతువేమిటో  కనుక్కోవాలని ,కుతూహలంతో .దరిత్రిపై మానవజన్మ ఎత్తాలను కున్నాడు..!ఆ విదంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో,క్రిష్ణ చైతన్య అనే పేరుతో  అవతరించాడు.. ఇంకేముంది.!. పుట్టుకతోనే శ్రీకృష్ణ దాసుడయ్యాడు..! ఎక్కడ చూసినా ,ఎవరిని చూసినా. ,ఏది వినినా, తింటున్నా ,నిద్రావస్థలో కూడా శ్రీకృష్ణభగవాను ని దివ్య రూప సందర్శన సాక్షాత్కారం తనకి ప్రకట మౌతోంది..! చీమలో ,ఈగలో ,,పిల్లిలో ఎగిరే పావురం చిలకా ,డేగ పక్షులలో కృష్ణ దర్శనం చేస్తున్నాడు.. భూలోకంలో కాదు ,తాను గోలోకంలో హరికృష్ణ  వైభవమంత్రం తో  "దేహద్యాస "లేకుండా,, ఇంటా బయటా ",నీవారు, నావారు  " అనే బేధభావం లేకుండా ,""సర్వమ్ శ్రీకృష్ణ మయం !"  అనే అద్వైతభావన సిద్ధాంతం క్రమేణా బలపడుతోంది.. అప్పుడు అనుభవానికి వచ్చింది రాధాదేవి శ్రీకృష్ణ  సిద్ధాంత ఆరాధనా  తత్వం ! అందులో  మనసు, తనువు లగ్నం చేస్తూ పోతూ ఉంటే... కనురెప్ప పాటు సమయంలో కూడా బాహ్యప్రపంచంలోకి రాలేక పోతున్నాడు..! అప్పుడు అర్థం అయ్యింది ,  తన ఈ నూతన శరీర ధారణ కూడా  "రాధాదేవి సంకల్పం!"  వల్లనే జరిగింది అని తెలుసుకున్నాడు..! తాను రాధాదేవి వేరు కాదనీ ,తాను చేసే ప్రతీ పనీ రాధాదేవి కి తెలుస్తుందని గ్రహించాడు.!  రాధాదేవి అంతర్యాన్ని తాను ఎన్నుకుంటే ,,తనను " శ్రీ కృష్ణ  మంత్ర చైతన్య  మహా యాగానికి.," వ్యాప్తికి ,,తనను" రాధారాణి ఎన్నుకుంది!" అనుకోని మహదానందం తో  అపర  రాధాకృష్ణ  అద్వైత సిద్ధాంత సమ్మిళితమైన ,భక్తి యోగాన్ని   ,యాగాన్ని ,చైతన్య మహా ప్రభువు  తన అవతార ప్రయోజనం తో సాధించాడు.! ..పుట్టింది పశ్చిమ బెంగాల్  లో , అయిన భారతదేశం నలుమూలలా తిరిగి "" శ్రీకృష్ణ చైతన్య మహా ప్రభువు  "  శ్రీకృష్ణుని అవతారము "గా పేరు పొందాడు.!  పూరీ జగన్నాథ క్షేత్రంలో 24 ఏళ్ళు ,గడిపి భాగవత, భగవద్గీత ల  అధ్యయనం  చేస్తూ ,శిష్యులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ధర్మ బద్దంగా  కృష్ణ ప్రేమను తాను అనందిస్తూ ,అందరికీ  హరే కృష్ణ మంత్రాన్ని బోధించి ., అందించాడు..భజనలు చేయించి ఒక ఉద్యమం లా శ్రీకృష్ణుని,పట్ల భక్తిని అనురక్తిని  ,పెంచాడు ! కృష్ణ భక్తి సంస్థలు స్థాపించి  ,సాధు వర్తనాన్ని   భక్తివిశ్వాసాలకు జోడిస్తూ, శ్రీకృష్ణ  తత్వాన్ని , అనుగ్రహింప జేశాడు !,పిదప బృందావనం వెళ్ళి ,మరుగున పడిన రాధమాధవులు నడయాడిన పుణ్య స్థలాలను , దేవాలయాలను  గుర్తించి వాటిని ఉద్ధరించాడు .రాధాదేవి మహత్తును ,శ్రీకృష్ణ భగవానుని అవతార ప్రయోజనాలను కాలినడకన దేశ దేశాలు సంచరిస్తూ   ,భాగవత పురాణ శ్రవణ వైభవాన్ని వ్యాప్తి చెందించాడు..!ఆప్పటినుండి బృందావనం ",రాధాదేవి  శ్రీకృష్ణప్రేమ "లకు నిలయంగా భావించ బడుతోంది.!". జై శ్రీ రాధే!. జై శ్రీ కృష్ణ !" అంటూ అక్కడ నిత్యం ,రోజువారీ కార్యక్రమాలలో తలచుకొంటూ రాధా కృష్ణుల పై భక్తిశ్రద్దలను ,పెంచుకొంటూ  జీవితాలను సార్ధకం చేసుకొంటున్నారు..!" గీతా చార్యుడు శ్రీకృష్జ్ఞ పరమాత్మ   '"" తనను గురువుగా భావించిన అర్జునునికి కర్తవ్యాన్ని ఉపదేశించి , భయాన్ని పారద్రోలి ,సందేహాలను నివృత్తి జేసీ ,అతడికి మార్గదర్శనం   చేశాడని మనకు తెలుసు ఆదేవిదంగా ",   భగవద్గీత " ను నిత్యం  అధ్యయనం  చేయడం వలన  ,మనకు ఆత్మస్తైర్యం ,కలిగి.. ,జీవితంలో ఎదురయ్యే సమస్యలను  సమర్థవంతంగా ఎదుర్కొనే విశ్వాసం, వివేకం ,విజ్ఞానం లభిస్తాయి.!  అంతే కాదు మన విలువైన ఉత్కృష్టమైన మానవ జీవిత పరమార్ధాన్ని కూడా తెలుసుకుంటాం  !. కావున శ్రీకృష్ణుని పై భక్తివిశ్వాసాలను కలిగి ఉందాం!.. "భగవద్గీత పుస్తకాన్ని  "ఎల్లప్పుడూ  దగ్గర ఉంచుకొంటూ. వీలు అయినప్పుడల్లా  ,రోజుకు ఒక  శ్లోకాన్ని దాని అర్థ తాత్పర్య సహితంగా  అర్థం చేసుకుంటూ చదువుకుందాం..! విదేశీయులు  కృష్ణునిపై చూపిస్తూ ఇస్కాన్ సంస్థ ద్వారా వ్యాప్తి చేస్తున్న హరికృష్ణ హరే రామ  నామ మంత్ర జపాన్ని  మనం కూడా ,రోజుకు కనీసం పదిసార్లు జపిస్తూ, క్రమంగా శ్రీకృష్ణ నామ సంకీర్తన,శ్రీకృష్ణ మంత్ర జప సంఖ్యను పెంచుకుందాం..!  "రాధాదేవి" ని  ఆర్తితో భక్తితో ప్రార్థిస్తూ  "కృష్ణానుగ్రహం " అనుగ్రహించమని వేడుకుందాం... !  గోపాలకృష్ణ భగవానుని కి జై.  !!జై శ్రీ రాధే !! జై శ్రీకృష్ణ. !  !!స్వస్తి !!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...