Oct 19, 2018
"దైవారాదనకు స్త్రీలే "తగిన వారు. ! ఎందుకంటే "అంకితభావం "అనే పరమ పవిత్ర భావన తో వారకేి స్వంతం !, ,కన్నవారిని కాదని , మెట్టినింట ,భర్తను మాత్రమే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ ,సేవిస్తూ ,తరిస్తూ ,మన హైందవ జాతి సంస్కృతి సంస్కార వైభవ సంపదలను ,పంచుకుంటూ ,పెంచుకుంటూ ,ఆనందంగా జీవించడం స్త్రీలకు వారి సమర్పణా భావంతో నే సాధ్యపడుతుంది కదా. !, ,రాధమాధావుల ప్రేమానుబంధం తో ,ముడివడిన , బంధంతో ,వారి అన్యోన్యఅనురాగాలను మేళవించే వివాహసంబందంతో , సీతారాములు ,గౌరీశంకరుల ,లక్ష్మీ నారాయణుల మంగళకరమైన దివ్యఆశీస్సుల తో ,ఇద్దరూ రూపంలో వేరైనా , దైవభక్తి తో ఒక్కటై ,కలిసివేసే ప్రతీ అడుగు అద్భుతం ! ఆదర్శనీయం! ,ఆచరణీయం, !పరమానందకరం కదా ! ఇలాంటి " అద్వైత భావంతో ," నేను నీవు అన్న ,బేధం లేకుండా, ఎడబాటు అన్న శబ్దాన్ని మానసికంగా కానీ ,శారీరికంగా కానీ కలుగనీకుండా , భార్యాభర్తలు అనుభవిస్తున్న ప్రేమ సామ్రాజ్యం ,,బృందావనసీమ సౌరభాలు తలపిస్తూ ఉంటున్నాయి కదా ! "ప్రేమయాత్ర లకు బృందావనము ,నందనవనము ఎలనో ...? ప్రేమించిన పతి ,సతి ఎదుట ఉండగా వేరే స్వర్గము ఏలనో ? ,అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగి రాదా ?"".. అనే మధుర సంగీతభరిత గీతవైభవాన్ని నిత్య జీవితంలో ఒక్కటై ,సాగుతున్న అనురాగ దాంపత్య జీవితం ,రాధ లాంటి స్త్రీ ల అంకితభావం తోనే సాధ్యం కదా ! ె మగవానికి దైవం కరుణించి , ప్రసాదించిన వరం! ,అనురాగవల్లరి, ! అందమైన ఆనందకరమైన సంతోషాల తొలకరి ! స్త్రీ మూర్తి !మనం , ఏ.కృష్ణుణ్ణి అతని జగన్మోహన రూపాన్ని , అపురూప సౌందర్య లావణ్య వైభవాన్ని దర్శిస్తూ శ్రీ,క్రిష్ణ,రూప గుణ కీల విశేషాల శ్రవణం చేస్తే , పరవశించి పోతుంటామో ,అంతటి మహానుభావుడు "శ్రీకృష్ణుడు "" రాధ పేరు వింటే చాలు ,తన్మయత్వంలో తనను తాను మరచిపోతుంటాడు..! అంత గొప్పసమ్మోహనకర భక్తి ప్రేమానురాగాలు ,ఆరాధనా భావ సంపద రాధ రూపంలో,గుణంలో ,నామంలో నిబిడీకృతం అయివున్నాయి.! నిరూపమన మైన". రాధా మాధవుల అద్వైతభావనా ప్రేమ " ,,అనంతం..! అద్వితీయము ,!అపురూపం! బృందావన దివ్యసీమలో అణువణువునా ప్రతిధ్వనిస్తూ , ప్రతిబింబించే రాధమాధావుల తత్వదర్శనాన్ని , "కృష్ణభక్తి " విశేషం తో అనుభవ పూర్వకంగా తెలుసుకోవచ్చును ! ,ఇప్పటికీ ఈ బృందవనం రాధాకృష్ణుల ప్రేమైక పరమానంద సామ్రాజ్యం.! అక్కడ ఒకసారి ,వాస్తవంగా జరిగిన విషయం.!. ఒకరోజు రాధమాధవ ఆలయంలో , వారి సన్నిధిలో రాత్రి పూట , తీయని మదురపదార్థాల నివేదన చేయడం భక్తుడు మరిచాడు! .తెల్లారి చూస్తే వారి విగ్రహాల చేతులకున్న స్వర్ణకంకణాలు లేకుండా చూసి ,ఆందోళన లో ఉంటే ,ఎదురుగా ఉన్న దుకాణదారు వచ్చి ,తన వద్ద ఉన్న ఆ రెండు కంకణాలు చూపించాడు.! రాత్రి ఇద్దరు " చిన్న పిల్లలు" ,వచ్చి స్వీట్ కావాలని ,కానీ డబ్బులు లేవనీ ,ఈ కంకణాలు ఉంచమని ,చెప్పి ,తాను ఇచ్చిన మదురపదార్థాల పట్టుకెళ్లారని చెప్పాడు..! ఇది ప్రత్యక్ష గాధ ! ఆ ఇరువురి అవినాభావ అనురాగ బంధాన్ని సూచించే ,పవిత్ర ప్రణయసంబంధం ! అంత గొప్ప అన్యోన్య మైన , అనుబంధం అది ! ఆ ఇద్దరిదీ. "అర్ధనారీశ్వర "తత్వం !" ప్రత్యక్షంగా దర్శించే అనుభవైకావేద్యము ,హృద్యము ,బ్రహ్మానంద స్థితిని కలిగించే పరమ పావన పావన మధుర భావనా వల్లరి ,, రాధాకృష్ణుల అవ్యాజమైన ప్రేమామృత అనుబంధ సంబంధం...! "మనసే అందాల బృందావనం ! ,వేణుమాధవుని ప్రేమే మధురామృతం!కృష్ణుని. కమ్మని నగుమోము ,కాంచుటే తొలినోము!కృష్ణుని ,కడగంటి చూపే కడు పావనం. ! ""అన్న రాధమ్మ మధురభావన ,తలచుకుంటే చాలు ,,ఎదలో శతకోటి యమునా తరంగాలు పొంగుతాయి కదా!!..ఈ మాయామోహ జగత్తులో ,సంసారం అనే సముద్రంలో ,,వివశులై ,దారి తెలియని స్థితిలో ఉన్నవారికి ,,అద్భుతమైన,జీవన మాధుర్యంతో బాటు, మానవజన్మ ఉద్దరణకు వలసిన సద్గతిని ,సన్మార్గాన్ని ,సద్భావనతో తరించే భాగ్యాన్ని , రాధమాధావుల నడయాడిన బృందవన దివ్యభూమిలో దర్శించవచ్చును.! అలాంటి అదృష్టాన్ని ,మధురానుభవాన్ని అనుగ్రహిస్తూ ,దానికి యోగ్యతగా" రాధానురాగ భావ సంపద ""ను ప్రసాదించమని కోరుకుందాం..! జై శ్రీరాధే. ! జై శ్రీకృష్ణ ! స్వస్తి. !
Monday, October 22, 2018
దైవారాదనకు స్త్రీలే తగిన వారు
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment