Sunday, October 7, 2018

శివోహం

Nov 18, 2017 , Vemulawada  శ్రీ చాగంటి ప్రవచనం

ఓ మానవా..!"   నా లింగారూపాన్నిరాయి లా మాత్రమే భావించి నన్ను పూజించడానికి . బాహ్యంగా నీవు చూపే ఆడంబరాలు ఇకనైనా మానవా.. !".  అందులో  ఉన్న నా శివ చైతన్యం.. దర్శించిన కొందరు భక్తులకృషిని చెబుతాను.......1.అవ్వయ్యారు అనే తమిళ వృద్ధ స్త్రీ. తన భక్తిచే విఘ్నేశ్వరుని మెప్పించి  శివ సాన్నిధ్యంలో కూర్చింది..సుందరరాజు దంపతులు విస్మయంతో.. అదేంటి శివునికి ఎదురుగా కూర్చుంటావా... ఆంటే ప్రక్కకు జరిగింది.. శివుడూ జరిగాడు ఆమెకు ఎదురుగా... అదేంటమ్మా.. మళ్ళీ ఆలా ఎదురుగా కూర్చోడం తప్పు కదా... ఆంటే  అయ్యా ! శివయ్య ఎక్కడ లేడో చెప్పు... అక్కడ కూర్చుంటాను... అని ఆమె అంటే.. నేను అన్నాను... ఇక నేను జరగలేను  నొప్పిగా ఉంటోంది తల్లీ.. ఎక్కడో ఒకచోట కుదురుగా  కూర్చో... అన్నాను.. ఎం చేయను.. నన్ను ఇంతగా ప్రేమించిన తల్లిప్రేమను యాతనను  ఎలా కాదనగలను.....!" చెప్పు.........2. ఒక భక్తుడు మారేడు దళాలతో నన్ను పూజిస్తూ.. ఒకదళం వెనక ఉన్న ఒక పురుగును గమనించకుండా నాపై వేశాడు. అది నాపైఎలా కదుల్తూ ఉంటె  ఆలా దద్దుర్లు మంట పుడుతున్నాయి..ఇది అతడి భార్య చూసి పురుగును తొలగించి తన నోటి ఉమ్మి తీసినాపై రాసింది.. చిత్రం నాకు హాయిగా అనిపించింది. కాని ఆ భర్త .ఆలా చేస్తున్న భార్యను కసిరాడు.. దూరంగా వెళ్ళ గొట్టాడు... కానీ నాకు ఇంకా ఆ దద్దుర్లు ఉండి బాధగానే అనిపిస్తోంది.. ఆరోజు అతడి కలలో కనిపించి నా దద్దుర్లు చూపి పడే బాధచెప్పాను.. ఆమె ప్రేమతో భక్తితో  నన్ను అనగా శివుణ్ణి చూస్తుంటే. నీవు రాయిని చేస్తున్నావు!"  ఇది నీకు ధర్మమా... ఆమెను పిలిచి తననోటి ఉమ్మితో నా బాధ ఉపశమింప చేయమని చెప్పవయ్యా.... అని అడిగాను. ..ఏం చేయను... నా పై అంత ప్రేమను వాత్సల్యాన్ని చూపే  భక్తురాలికి జరిగే అవహేళన ను నేను భరించ గలనా.... చెప్పు   !"   3..భక్త కన్నప్ప.. నాకు మాంసం తినిపించాడు తినాలని పట్టు బట్టాడు..తినేవారకు వదల్లేదు.. నన్ను రాయిలా కాకుండా  సాటి మనిషిలా భావించి.. అయ్యో అడవిలో ఆలనా పాలనా తిండి నీడ లేకుండా  దిక్కు లేకుండా ఈ అడవిలో పడిఉన్నావా...అంటూ విలవిలా తపించాడు .చెప్పుతో నామీద ఉన్న ఆకులు పువ్వులు తొలగించిండు.. నోటితో పుక్కిలించి నన్ను శుభ్రంగా చేశాడు.. అతడి భక్తికి అదే  ప్రేమకి పరవశించాను...నేను పెట్టిన నేత్రదాన పరీక్షలో. నన్ను కరిగించాడు .నిజంగానాకు కన్నీళ్లు  పెట్టించాడు.. అందుకే కాళహస్తిలో నా ఆలయం ప్రక్కన నాకంటే ఎత్తైన స్థలంలో నా ప్రియమైన భక్తుడి నివాసం ఏర్పాటు చేశాను...  నా కోసం తన ప్రాణమైనా ఫణంగా పెట్టిన భక్తికి ఇంతకంటే మేలు ఏమి చేయగలను... చెప్పు..!"

శివుని మెడలో పుర్రెల దండ..... వింతగా ఉంటుంది వినడానికిI చూడటానికి. ..అవి బ్రహ్మ కపాలాలు...కొన్ని యుగాల తర్వాత బ్రహ్మకు కూడా ఆయువు తీరిపోవడం.. అలా ఎంత మంది పోయారో.. అంతమంది బ్రహ్మల పుర్రెలు .సృష్టి ఆవిర్భావం కోసం చేసిన మేలు మరవకుండా ఆ బ్రహ్మగారల పుర్రెలు మేడలో హారంగా దరిస్తాడట...!" అంతే కాదు.. ఓ మానవా.! ఉత్కృష్ట జన్మించిన నీవు ఎన్ని కపాలాలు మార్చావో.. ఇంకా ఎన్ని మారుస్తావో... పునరపి జననం   పునరపి మరణం... దీనికి నిష్కృతి కోసం ప్రయత్నం చెయ్యి..ఇకనైనా. ఇప్పుడైనా  ఇప్పుడున్న నీ పుర్రెలో నా గురించి తలచుకొంటూ. ఇక పుర్రెలు మార్చే అవసరం లేకుండా చేసుకో....!" నీకు నేను ఇచ్చిన జ్ఞానాన్ని .మానవ జన్మను సార్ధకం చేసుకో...!-- ఓ మానవా !" బ్రతుకు తీరును. శివతత్వ చింతనతో గడుపుకో....!"

శివోహం.. శివోహం.. శివోహం ...!"  ప్రాణం ఉన్నంతవరకూ అందరూ బంధువులే.. స్మశానం వరకు వచ్చి. వెళ్తారు . చివరగా నిప్పుపెట్టాక కొడుకు వెళ్తాడు..కపాలచేదనం తో జీవుడు .బయటికొస్తాడు.. తనకు నివాసంగా ఉన్న శరీరం అనే ఇల్లు చితి మంటలలో కాలిపోతుండటం చూసి వ్యథ పడుతుండటం చూసి.. నేను ప్రేమతో అక్కున చేర్చుకుని ఓదారుస్తాను..... బ్రతుకు పై మమకారం పెంచుకొని. కోరికలు తీరక.. ఆశలు చావక.. భార్యా పుత్రులు ఇళ్ళు ఆస్తులపై మోహం వదలక చచ్చాక కూడా ..సద్గతులు పుట్టక ఇదే స్మశానంలో భూత ప్రేత పిశాచాలయి .ఉన్మాదం తో. పిచ్చిగా బ్రతికిఉన్న వారిని పీక్కుతినే కక్ష ద్వేషంతో ఉన్న గణాలను నా ప్రళయ తాండవ నృత్యంతో. నియంత్రిస్తూ ..వాటిని పాలిస్తూ ఉంటాను.....2...ఇలా సకల ప్రాణికోటి సృష్టి స్థితి లయ కార్యాలను నిర్వహించడానికి....ఉన్న నాకు బట్టకట్టుకోడానికి  తీరిక ఉండదు.. అందుకే దిగంబరిని. సుగంద ద్రవ్యాలు పూసుకునే ఓపిక ఉండదు.. అందుకే భస్మాంబరధారిని. ..తిండితో పని లేదు... బిక్షాన్ దేహి..!అని లోకమాత  మాతృమూర్తి వద్ద.. కపాలం తో భిక్షాటన చేస్తాను. అనగా ఓ మానవా. .మీరు మీ కపాలాలలో జ్ఞానంకోసం రాజరాజేశ్వరిని భిక్ష యాచించండి. మీ ధర్మపత్ని సహాయ సహకారంతో..". అన్న సూచనగా నేను ఆది భిక్షువును అయ్యాను.. !" అలా నేను  "యోగి " ని   అయ్యాను మీ కోసం..------------------------------------. అలాగే  నేను అనగా శివుణ్ణి   నీలో ఉన్న  అంతర్యామి ని "భోగి " ని  కూడా....!   "జగమంత కుటుంబం నాది..! " ఇందరు కొడుకులు కూతుళ్లు.. చక్కగా నా లో సగభాగం అయిన ధర్మపత్ని రాజరాజేశ్వరి.. భార్యగా ఉండగా.. ధర్మ అర్థ కామ మోక్ష సాధనాల కై శ్రమించే మీరు ఉండగా. నేను సుఖంగా ప్రశాంతంగా . భోగిని కాకుండా. ఉంటానా . ? " నేను అనంతమైన వాణ్ని అయినా. మీకోసం  ఇంత చిన్న లింగకారంలో మీకు అందుబాటులో ఉంటున్నాను .నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలతో పైన ఈశాన స్వరూపం తో వ్యక్తం అవుతూ.. నాకు మీరు ఎటువైపునుండి పూజలు చేసినా సంతోష పడుతుంటాను.. నేనేం మిమ్మల్ని సుగంధ ద్రవ్యాలు పట్టు పీతాంబరాలు .లక్షల డబ్బులు .వెండి బంగారాలు అడిగానా. .. .? ఇన్ని నీళ్లు పాలు పోస్తే చాలు ఇంత.భస్మం..పూసి నాలుగు ఆకులూ  వేస్తే చాలు. ...!" అయితే ఎదో మొక్కుబడిగా కాకుండా మీ హృదయపూర్వక సమర్పణ.. తో ఆంటే ..శివ శివా అంటూ మీరు పోసే జలాధార లో మీ మనసు అనే పుష్పం వేసి.. సమర్పణా భావం తో చేయండి. అది నాకు ప్రియం.. మీ తలిదండ్రుల వద్దకు వెళ్తున్నప్పుడు .మీకు ఎంత ఆనందం ఉంటుందో. అలా నా వద్దకు రావాలి... అదే యజ్ఞం అదే  నిజమైన భక్తి ప్రేమ  శరణాగతి... జీవునికి దేవునికి అనుసంధానం ఈ మీ కైంకర్య శ్రద్దా భక్తి భావన. .ఇందులో ఆడంబరం లేదు. ఖర్చు లేదు.. బంధు జన పరివారంతో. పనిలేదు.. చదువు నమక చమకాలతో .నియమ నిష్టలతో పనిలేదు.. నిర్మల చిత్తం..పై గురి !. ఇష్టదైవం పై నమ్మకం  ! "  ౼౼౼౼౼౼౼౼౼౼౼౼ఓ మానవా !"  నీకు నా తత్వం  అదే  శివం ఆంటే శివ చైతన్యం ఆంటే.  శివ పూజ ఆంటే  నీకూ నాకూ ఉన్న అనుబంధం ఏమిటో    ..అర్థమైంది అనుకుంటాను..ఇక నీ ఇష్టం !  --- దూరంగాహిమాలయ పర్వతాలలో ఉంచుతావో.. లేదా  శివోహం శివోహం అనుకుంటూ..నీ హృదయ కమలంలో నిలుపుకుంటావో....!"   ... వేములవాడ .శ్రీ రాజ రాజేశ్వర స్వామికి  జై... శ్రీ రాజ రాజేశ్వరి మాతాకి జై..!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...