Nov 27, 2017
స్వామీ యే శరణం .అయ్యప్పా శరణం... గాయం అయ్యింది అనుకోకుండా... స్వామి కరుణ వల్ల చిన్నగా తగిలింది.. అయ్యప్పా ..అనగా అయ్య ఆంటే తండ్రి.. అప్పా ఆంటే తల్లి ..దయ వల్ల ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. రోజులో కనీసం కొన్ని నిముషాలు అయినా ఇంత వైభవాన్ని జ్ఞానాన్ని మానవ జన్మని అనుగ్రహించిన ఆ దైవానికి కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలుపాల్సిన ఆవశ్యకతను గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయినా జ్ఞాపకం చేసుకోవాలి రోజూ..... మా అమ్మ చదివే ఆపదోద్దారక మంత్రం నిత్యం వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ...నేను ఉన్నానురా నీలో .అంటూ. వచ్చాడు ఎదలో నిలిచాడు... కరుణతో.
అజ్ఞానమనే అంధకారాన్ని ..కామ క్రోధ అహంకార మద మత్సర మమకారాలనే అరిషడ్వర్గాలనే అంతః శత్రువులను సూచించే మాయ అనే పొర వల్ల మనిషి రెండు కళ్ళు ఉండి కూడా మూడవజ్ఞాన నేత్రం ఉండికూడా సత్యాన్ని .నిజాన్ని ధర్మాన్ని .నిజాయితీగా చూడలేక శాస్త్రం చెప్పినట్టు కాకుండా తన మనసుకు నచ్చినట్టుగా ప్రవర్తించడం..మానవత్వం అనిపించదు.. అయ్యప్ప స్వాములు వేసే నల్ల దుస్తుల ఆంతర్యం.ఇలా చీకటిలో బ్రతుకుతున్న జీవన విధానాన్ని .వేసుకున్న అయ్యప్పమాల లో నున్న స్వామి మూర్తి ప్రభావం వల్ల.. చేసే దీక్షా శిక్షణ వల్ల.. లోనున్న దైవాన్ని.. గుర్తిస్తాడాని చేసే తపన ఒక సాధనమార్గం అవుతుంది.. ఇహం పరం రెండింటిని స్వామి అనుగ్రహముతో నియంత్రింస్తూ పోవచ్చును... ఎందరో తలిదండ్రులకు అయ్యవు అప్పవూ అనగా. తల్లివి తండ్రివీ. అయిన స్వామీ.. నీకు శరణు. !"అమ్మవలె దయచూపి ఉత్తమ మానవ జన్మను బుద్ధిని ఆరోగ్యాన్ని ఆయువునీ. బంధు మిత్ర కళత్ర పుత్ర పరివారాన్ని సంపదలను ధనాన్ని. ప్రకృతి ఒడిలో పెరిగే ఫల పుష్ఫ ధాన్యాది ఆహారాలను జాలితో ప్రేమతో అందిస్తున్న తల్లి ప్రేమ నీది .అయ్యప్పా....!"ఇక మా మనుగడకు రక్షణ కవచంలా సూర్య చంద్ర భూమి ఆకాశ జల అగ్నివాయు అవకాశాల సమకూర్చి ఈ ప్రాణికోటికి నీవు కన్న తండ్రి అప్ప వలె రక్షణగా నిలుస్తున్నావు... ఏమిచ్చి ఋణం తీర్చుకొన గలం స్వామీ..! అనుదినం. కృతజ్ఞతతో అంజలి ఘటించడం తప్ప !తెలిసి తెలియక అపరాధాలు ఎన్నో చేశాము. ఇంకా చేస్తున్నాం కూడా. .స్వామీ ! కరుణతో క్షమించు.. మాలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించు . ." తెర తీయగరాదా. .నాలోని మత్సరమనే .తెర. !." అని త్యాగరాజ స్వామి తన కీర్తనాల్లో కోరినట్లుగా. .అయ్యప్పా నిన్ను కోరుకుంటున్నాం . మాలో ఒక చిన్న జ్ఞాన జ్యోతిని వెలిగించు..! ..మా చేతకాదు స్వామీ.... నిన్ను ఏకాగ్రతతో పూజించుటకు ధ్యానించి సేవించుటకు. ..!"..నీవు అండగా లేని జీవి బ్రతుకు దండగే !"..అందుకే ముక్త కంఠం తో స్వామియే శరణం అని ఎలుగెత్తి కీర్తించడం తప్ప...సచ్చిదానంద ఘన స్వరూపుడివి .నిన్ను తెలియ ..పొగడ.. కీర్తించ. సేవించి తరించ వశమా.. ఈ మానవ మాత్రులకు...! .నీ కీర్తన మాధుర్యం వైభవం .నీవు మాకు అందించే అనుగ్రహప్రసాదం కాగలదు.........! ఓమ్ నమశ్శివాయ.! ఓమ్ నమో నారాయణాయ..!" .జై శ్రీరామ్.... భగవతి జగదంబ మాతాకి జై ..స్వామియే శరణం...!"
No comments:
Post a Comment