Sunday, October 7, 2018

యోగం

Nov 16, 2017
దివ్యశక్తితో సంధానం కలిగి ఉండటమే యోగం...అద్భుతమైన మాట.. అనుకోడానికి చిన్నదే కానీ.. అనుభవానికి తేవాలంటే. ఎంత  పూర్వజన్మ సుకృతం సంస్కార బలం  సత్సంగ కృషి కావాలి.!  దివ్యశక్తి అనేది నాలోనే  అంతరాత్మ రూపంలో ఉంది.. అన్న గుర్తింపు . దానిని బయట ఉన్న పరమాత్మ తో నిత్యం స్మరిస్తూ అనుసంధానం చేయ గలిగితే అంతకన్నా భాగ్యం ఉండబోదు ... ఆ ప్రయత్నం లో తొడ్పడమని దేవకీ నందనుని ప్రార్టిద్దాం..

జంతువులకు బందాలకంటే తిండి మీదనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది.. ఇదే మనిషి విషయంలో అయితే..... ఇద్దరం కలిసి bread తిందాం అనుకుంటారు .. కదా.. ఎందుకంటే ఈ మనిషి కి జ్ఞానం ఉంది అని అంటారు కొందరు...

నిజానికి యోగం అంటే యోగ్యత.. దేనికైనా యోగం ఉండాలి.. వాహనయోగం. దనయోగం... లాంటివి.. ఈ యోగ్యత తనకు తాను స్వయంగా కృషి చేసి సంపాదించాలి.. ఉద్యోగం కోసం డిగ్రీ చదివినట్టు.... అయితే దివ్య శక్తి అంటే పరమాత్మ స్వరూపం సందర్శన అనుభూతి కలగడం.. ఎలా . దీనికి ఏం చదవాలి... ఎం చేయాలి.... నాకు తోచింది. నిత్యం హరినామ సంకీర్తన యే.... స్మరణయే... సేవయే ... అన్నమయ్య సంకీర్తనల లో అర్ధం. పరమార్థం  . అంతర్యామి తో అనుసంధానం లభిస్తాయి... కదూ..!"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...