Sunday, December 9, 2018

వైవిద్యం

ఒక సినిమా ,లేదా ఒక సన్నివేశం, ఒక వ్యక్తి ,సంఘటన గురించి చెప్పే అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఒకే రకంగా ఉండవు. అందరిదీ ఒకే మానవ శరీరం.. కానీ ఆలోచనలు వేరు ,అభిప్రాయాలు వేరు. ఒక్క తల్లి కడుపులో పుట్టిన కొడుకుల్లో కూతుర్ల లో ఎన్నో వైవిద్యాలు , సంపద,ఆస్తి ,సంతానం, నివాసం ,ఇలా ఎన్నో రకాలుగా ఉండడం నిత్యం చూస్తున్నాం.. అంతెందుకు. ఒక సంఘటన గురించి ఇప్పుడు చెప్పిన అభిప్రాయం రేపు మారుతుంది.. అంటే క్షణం క్షణం మనుషుల ఆలోచనల్లో తేడా , ఎందుకు వస్తోంది ? కారణం చూసే చూపు ! అనుకునే తీరు ,దృక్పథం లో తేడా ! దీనికి కారణం సంస్కారం ! గత జన్మ జన్మల కర్మ ఫలాల అనుభవాలు ఇప్పుడు దర్శిస్తున్నాము.. ఈ ఆధునికత ముసుగులో దైవ దర్శనానికి , ఇడ్లి సాంబారు జీవించడానికి తేడా లేకుండా పోయింది.. భోజన చేస్తుంటే తినే ఆహారపదార్థాల ఆస్వాదనతో కొంత రసానుభూతిని పొందుతున్న విషయం తెలిసిందే ! ఉదయం లేచిన సమయం నుండి పడుకునే వరకు ఎన్నింటినో దర్శిస్తూ ఉన్నాము. స్పందిస్తూ ఉన్నాము. భార్య ను చూసి భర్త ,పిల్లల్ని చూస్తూ తల్లిదండ్రులు, స్నేహితులతో ,బంధువులతో ఇలా చేసే ప్రతి దర్శనంతో మనసు స్పందిస్తూ, దానిని గురించిన రసానుభూతిని పొందుతున్నాము.. అందులో ఒకటి దైవాన్ని దర్శించడం.. అది జగన్మాత, కావచ్చును! రాముడు ,కృష్ణుడు ,ఎవరైనా కావచ్చును , ఆ సమయంలో కలిగే స్పందన తాత్కాలికంగా., ఉంటోంది. అందులోని  ,రసానుభూతి అంతగా  బాధించడం లేదు , అంటే మన నిత్య జీవితంలో అనుభవానికి రావడం లేదు.. సంసారంలో వెంబడిస్తూ ఉన్న జ్ఞాపకాలు ,,ఆనందాలు ,అనుభూతులు అనునిత్యం, అనుక్షణం మనసులో తిరుగుతూ ఉంటున్నాయి .కానీ దేవాలయంలో, ఇంటిలో ,క్షేత్రాలలో, యాత్రా సందర్శనంలో దర్శించున దేవతల ,దేవుళ్ళ  దివ్య వైభవ మంగళక ర రస రమ్య మూర్తుల కాంతులు మనలో మాటిమాటికి, తరుచుగా ,పదే పదే ,ఎక్కడవుంటున్నా ,ఎందుకు  కలగడం లేదు. ఎన్ని సార్లు తిరుమల వెళ్ళాము అన్నది కాదు ముఖ్యం..స్వామి మూర్తిత్వాన్ని ప్రతీ సంఘటన లో అనుభవానికి తెచ్చుకుంటూ ,ఆనందపారవశ్యాన్ని పొందడం ముఖ్యం కదా.! ఎలాంటి అసభ్యకరమైన లేదా మనోరంజకమైన దృశ్యాలను ఈ కన్నులు చూడకుండా ఉండలేవు.. ఆ దృశ్యాల్లో కదలాడే వ్యక్తుల ప్రతిబింబాల నీడల్లో స్వామి మహాత్మ్యం చూస్తూ ,రసానుభూతిని పొందితే అది స్వామి నిజమైన దర్శనం అవుతుంది కదా ! అలాగే ఇది పాపపు మనసు ! ఏది చూడకూడనిదో దానినే పంతం పట్టి చూస్తుంది  హృదయంలో దాగినకామ క్రోధ ఈర్ష్యా ది రసాలతో మనసారా గ్రోలుతుంది.. కానీ ఈ మనసును ప్రేరేపించే మూల తత్వ ము నీవే నని, అంతరంలో బాహ్యములో ఉన్న అంతర్యామిగా అందరిలో అణువణువునా ఉన్న స్వామి అనుగ్రహం తో నే ఈ ఆనందం ఈ రసానుభూతి కలుగుతున్నాయి అనే భావ సంపదతోనే   మనసు,దానితో మనిషి ధన్యం అవుతోంది కదా !ఇక కష్టసుఖాలు అనుభవించే ఈ శరీరం, స్వామి కారుణ్యం వలన ప్రసాదించబడటం వల్లనే కదా జగతిలో ఉన్న ఆనందాలు రసానుభూతులు పొందగలుగు తున్నాం.. !అందుచేత పంచేంద్రియాలను కరుణించి, మానవ జీవితాన్ని చక్కగా enjoy చెయ్యమని ,ఆనందించమని ,అనుభవించమని ఇచ్చి న పరమాత్మ కు మనం చేయవలసింది చేయ గలిగింది ఒక్కటే సర్వమ్ పరమేశ్వరార్పణ మస్తు ! రామార్పణమస్తు ! కృష్ణార్పణమస్తు ! జగదాంబ విశ్వపాలిని చరణారవిందార్పణమస్తు అన్న దైవారాధన భావం హృదయంలో ఉండాలి. ఇష్టదైవాన్ని చూసినా తలచినా కొలిచినా పాలపొంగులా ఆనందంతో ఉత్సాహంగా ఉవ్వెత్తున మనః పూర్వకంగా భావిస్తూ తన్మయత్వం తో  పరవశించాలి  .సర్వాంతర్యామి యైన పరందాముని కృపా కరుణా కటాక్ష వీక్షణాల సంప్రోక్షణ ప్రాప్తికై ఆర్తితో ఆవేదనతో ఆరాటపడాలి.. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు కదా ! ఇన్ని ఇచ్చిన ఆ స్వామికి కృతజ్ఞతతో దండం పెట్టకుండా ,అంతటా స్వామిని దర్శించకుండా మరిచి పోవడం ,నిర్లక్ష్యం చేయడం కృతఘ్నత అనిపించుకొదూ !

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...