Jan 1, 2019
బృందావనంలో ఒక శ్రీకృష్ణ భక్తుడు అనునిత్యం రాధాకృష్ణ దేవాలయం వెళ్లి శ్రీకృష్ణ సుందర విగ్రహ దర్శనం చేస్తూ కన్నయ్య దివ్య లావణ్య వైభవాలను, అద్భుతమైన లీలలను స్మరిస్తూ భావిస్తూ సేవిస్తూ మనస్సును కృష్ణ కైంకర్యం చేస్తూ పూజిస్తున్నాడు. క్రమంగా అతడి శ్రీకృష్ణ ఆరాధనా జీవితం వృద్ధాప్య దశవరకు వచ్చింది. అయినా కృష్ణ భక్తితో. కృష్ణ దర్శనా లాలస తో ,కృష్ణయ్య లేకుండా క్షణం గడవని మానసిక భావోద్వేగాలతో జీవిస్తూనే ఉన్నాడు.. ఒకనాడు అతడు కృష్ణుని సన్నిధిలో. ఉండగా , కొందరు భక్త్తులు శ్రీకృష్ణ విగ్రహం సౌందర్యం గురించి స్తుతిస్తూ.. ,,""ఆహా !ఏమా సొగసులు కృష్ణయ్యవి..?ధగధగా మెరిసే ఆ పట్టు పీతాంబరాన్ని చూడండి..! ఆ వజ్రకిరీటం! ,దానిపై మెరిసే నెమలి పింఛమ్,! నుదుట శోభాలీనే ఆ కస్తూరీ తిలకం.,,,! మెరుపులా తళుక్కుమనే కపోలాలు.,!శంఖంలాంటి ఆ కంఠం. ,,చుట్టు వేలాడే కౌస్తుభం ,నవనీతంలాంటి సుకుమారంగా ఆ చేతులు.కుడిచేతిలో వేణువు..,,చేతులకు కంకణాలు ,వ్రేళ్ళకు ఉంగరాలు.. ఎంత బావున్నాయో చూడండి ! అదిగో నడుముకు స్వర్ణఒడ్డాణం ఆ. పాద కమలాల పై జీరాడే బంగారు మంజీరాలను చూడండి..చూడ్డానికి ఈ రెండు కళ్ళు చాలడం లేదు.. కృష్ణభగవాణుని మంగళకరమైన నీలమేఘశ్యాముని , అందమైన విగ్రహాన్ని ఎంత చూసినా కూడా తనివితీరకుండా ఉంది..!".కృష్ణుడు నిజంగా దిగివచ్చి మన ఎదుట సాక్షాత్కరిస్తున్నాడా అనిపిస్తోంది కదూ !.."".అంటూ వాళ్ళు అనుకుంటూ ఉంటే ఈ భక్తునికి అయోమయం లో పడ్డాడు..వారు చెపుతున్న అలంకరణ లు అతడి కళ్ళకు కనపడటం లేదు. కానీ వారి మాటలు అతడిని చాలా బాధిస్తున్నాయి..! మనసును తీవ్రంగా వేదిస్తున్నాయి..కూడా ! ఇదేమిటి ? వారందరికీ కనిపిస్తున్న ఆ కృష్ణ సౌందర్య అలంకరణ తనకెందుకు కనిపించడం లేదు.. ? తన దృష్టి దోషమా ? తనలో ఏదైనా లోపమా ? .ఎదో దోషం ఉంది !..తాను ఒక పాపిని కావచ్చును !అందుకే కన్నయ్య రూపలావణ్యాలు ,అందరికి ఎదుట కనపడుతున్నా ,తాను చూడలేక పోతున్నాడు !,,తన కళ్ళకి విగ్రహం లానే తోస్తున్నది.మరి వారికి అదే అలా అంత మనోహరంగా ,మనోజ్ఞంగా అగుపిస్తోంది ? ఎందుకు ? ఎందుకు ? అయ్యో ! ఇన్నాళ్లు ,ఇన్నేళ్లు ,నా జీవితం కృష్ణప్రేమ లో గడిపానే !.. కన్నయ్య పూజలో ,సేవలో ,దర్శనంలో ,అర్చన భాగ్యంలో జన్మ పండిందని సంతోషించానే..! ఎంత దౌర్భాగ్యం నాది.! ఇప్పుడేం చేయాలి. ?! ఇక నేను ,, .ఏ ముఖం పెట్టుకొని క్రిష్ణయ్యను దర్శించను..? నా పాపానికి ,నిష్కృతి ఉందా.?.! నేను చేసిన అంత మహాపరాధము ఏమిటి..?ఎలా తెలియాలి నా తప్పు ? ఎవర్ని అడగాలి. ?.నా భక్తిలో లోపం ఉందా ?.నా భావనలో ,నడకలో ,స్వామి సేవనం లో చిత్తశుద్ధిని కోల్పోయానా..? ఏమిటి నా గతి..?! అంటూ విలపించసాగాడు.. ఏడుస్తూ. పిచ్చివాని లా యమునా తీరానికి పరుగు పరుగునా వెళ్ళాడు.అందులో పడి చావాలని కూడా అనుకున్నాడు.!.కానీ.తాను ఏ తప్పు చేస్తే ఇంత ఘోరమైన శిక్ష తనకు విదిిస్తున్నాడో , అదే కృష్ణుని అడిగి తెలుసుకోవాలని వెనుదిరిగాడు .,చివరిసారిగా క్రిష్ణయ్యను చూడాలని నిర్ణయించుకున్నాడుఆ బృందావనవిహారుడు. భక్తజనమందారుడు.,అయిన ఆ నవనీతాచోరుని దర్శనం కోసం కృతనిశ్చయంతో తిరిగి వెళ్తున్నాడు ఆ కృష్ణ భక్తుడు ! ఈ సారి కృష్ణుణ్ణి ,అందరూ చూడగలిగే అద్భుతమైన వేష ధారణలో తాను చూడలేక పోతే. ఇక యమునా నదిలో మరణమే శరణము ..! జీవితాన్ని చాలించడం తప్ప వేరే గతి లేదు కదా !"" అనుకుంటూ ,మనసులో మదనపడుతూ , దీనాతిదీనంగా క్రిష్ణయ్యను వేడుకోవడం ప్రారంభించాడు. ! "కృష్ణా! నీవు నన్ను మరిచావా.? నీ సన్నిధిలో నిరంతరం నిలుస్తూ.,,. ఇదే నా పాలిట పెన్నిధి !"అని ఇన్నేళ్లు తలిచానే.! నిన్నే కొలిచానే.! నీవే సర్వస్వంగా భావించానే!..నీ కృప లేని జీవితం నిష్ఫలం కదా. !నీవు లేని బ్రతుకు వ్యర్టం కదా..! ఏ అర్థము , పరమార్థము కానరాని నా జీవితానికి ముగింపు పలుకుతావో.?. నీ అనుగ్రహం తో బ్రతికించి నీ సేవలో తరింపజేస్తావో..? స్వామీ.!. నీదే భారము!..నీవే గతి.!నీకే శరణు.!.రాదమ్మా.!. నీవైనా చెప్పారాదా!. రాధాకృష్ణులు ఒకటే అంటారు కదా.!. నీవు చెబితేనే గాని నీ కృష్ణుడు దయ చూపడు అంటారు గదా!.. ఇది నిజమే అయితే కృష్ణుని కరుణ ను నాపై కొంచెం వర్షించమని చెప్పు..! రాధమ్మతల్లీ ! దయామయి. ! ఈ దీనునిపై దయజూడమని ,,నీ గోపాలకృష్ణుని దివ్యదర్శనం కోసం అలమటిస్తున్న ఈ పేదవాడికి , నీవైనా దారి చూపలేవా ? ఒక్కసారి నా మొరను వినమని నీవైనా చెప్పరాదా .అమ్మా ! "అంటూ రోదిస్తూ,విలపిస్తూ , క్రిష్ణాలయం దారిలో వెళ్తున్నాడు.. ఇంతలో తన కాళ్ళను ఎవరో గట్టిగా పట్టినట్టు అనిపించింది. కిందకు చూస్తే ఒక కుష్ఠురోగి ! ఒళ్ళంతా పుండ్లు. రక్తము.! చూడటానికి అసహ్యంగా ,భరింపలేని దుర్వాసన తో , బక్కిచిక్కిన దేహము.తో కళ్ళనిండా నీళ్లతో దుఃఖిస్తూ , ఎన్నాళ్లనుండో ఆలయం ప్రాంగణంలో ఉంటూన్న బిచ్చగాడు ఆర్తితో ఆవేదనతో అడుగుతూ కనిపించాడు ..!" అయ్యా ! మిమ్మల్ని రోజూ చూస్తున్నాను. ,మీరు అనునిత్యం కృష్ణదర్శనం కోసం ఎన్నో ఏళ్ళు ఇలా ఇదే దారిలో వెళ్తుండటం..! నాకు భరింపలేని ఈ భయంకరమైన కుష్టువ్యాధితో ప్రతిరోజూ ప్రతిక్షణం నరకబాధను అనుభవిస్తున్నాను. శ్రీకృష్ణుని ఆలయ సన్నిధిలో లోనికి రాలేని దౌర్భాగ్యం నాది. ! నేరుగా కృష్ణ స్వామిని నా బాధను వివరించి ఈ దుర్భరమైన బాధ నుండి విముక్తుణ్ణి .చేయమని వేసుకునే ప్రాప్తం నాకు లేదు.. జనావాసం నుండి నిర్దాక్షిన్యంగా వెలివేయబడ్డ నిర్భాగ్యుడిని నేను ! కానీ మీరు నిత్యం మరవకుండా విడవకుండా రోజూ తప్పకుండా శ్రీకృష్ణదర్శనం చేస్తున్న పుణ్యాత్ములు.మీరు ! మహానుభావులు.!. అయ్యా !ఒక్కసారి నన్ను దీవించండి!.నీ చల్లని చేతిని నా తలపై మోపండి !.అయ్యా ! కృష్ణుడు ఇలా మీ రూపంలో ,నన్ను దయచూపుతాడని నేను నమ్ముతున్నాను.. !""అంటూ ప్రాధేయపడుతున్న ఆ నిర్భాగ్యుడిని చూస్తూ..బాధతో కళ్ళవెంట అశ్రువులు రాల్చాడు ఈ భక్తుడు !.. ""నాయనా !నీకంటే మహాపాపిని నేను!..ఏ విధంగా నీకు ఏ దారితెలియని చీకటి బ్రతుకు దాపురించిందో. అంతకంటే దిక్కుతోచని దుస్థితి నాది!" నీవంటున్నట్టుగా ..నేను భక్తుణ్ణి కాదు! .నాకు ఏ మహిమలు లేవు! నేను నీవంటి సాధారణమైన మనిషిని మాత్రమే ! . దయచేసి నన్ను పోనివ్వు.! ఈ రోజు ఆటో ఇటో ఈ కృష్ణయ్య ను అడిగి తేల్చుకుంటాను !నాయనా నేను..నీకంటే దీనస్తితిలో ఉన్నాను .సుమా !""అంటూ బాధతో అతడి పట్టు నుండి విడిపించు కొనేందుకు ప్రయత్నించాడు !..కానీ ,ఆ కుష్ఠురోగి వినలేదు. ,""అయ్యా! ఒక్కసారి మీ నోటితో అనండి ! చాలు ! నాకు బాధనుకలిగించే ఈ భయంకరమైన కుష్టువ్యాధి పోతుందని ! కృష్ణుడు మీ రూపంలో వచ్చి నాకు ఇలా బుద్దిని పుట్టించి మిమ్మల్ని ఆశ్రయించమని అనుకున్నాడేమో. ? ఎవరికి తెలుసు ? ఇన్నాళ్లూ అడగలేదు మిమ్మల్ని ! ఇప్పుడు ప్రార్థిస్తూ చేతులు జోడిస్తూ ఒక్కసారి నన్ను దయజూపి అనుగ్రహించమని వేడుకుంటున్నాను .. స్వామీ నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు గాక లేదు ! అయ్యా కనికరించండి !"అంటూ ఏడుస్తూ ,తన కన్నీళ్ళతో భక్తుని పాదాలు తడుపుతూ , విడవకుండా ఇంకా గట్టిగా పట్టాడు.! ఇక ఈభక్తునికి తనమీద తనకే జాలి కలిగింది. నీకు నా పై ఉన్న నమ్మకం వమ్ము కాకుండా చూసే భారం బాధ్యత ,అదిగో ! ఆ నల్లనయ్యది !నాది కాదు..! నాకూ ,నీకూ ,సర్వప్రాణి కోటికి ప్రాణాధారము ఆ శ్రీకృష్ణ పరమాత్మ నే ! ,"" సరే.. !ఆదిగో ! ఆ కృష్ణుని మీద ఆన ! నీవు ఆరోగ్యవంతుడౌ తావు !".అంటూ అతడి తలపై చేయి ఉంచి దీవిస్తూ వెనక్కి చూడకుండా ,తొందర పడుతూ ,శ్రీ కృష్ణదర్శన లాలసతో, ఆవేదనతో,ఆరాటంతో ,స్వామిని చూడాలన్న తపనతో ముందుకు సాగాడు.. ఆ భక్తుడు ! కానీ , అతడికి తెలియదు.ఆ కుష్ఠురోగి స్వస్థత పొందాడు అని.!తన పుణ్యఫలం వలన అతడు సంపూర్ణంగా కోలుకుని, ఆరోగ్యం కలిగింది అని..! ""తాను విశ్వసించిన కృష్ణానుగ్రహమ్ "వలననే ఆ రోగికి ఆనందం తో బాటు శ్రీకృష్ణ భక్తిని అందించాడని ,అతడికి తెలీదు ! ఈ భక్తుడు నేరుగా కృష్ణవిగ్రహం ముందు నిలుచున్నాడు. ! ఎదుట శ్రీకృష్ణ భగవానుని సాక్షాత్కారం తో పులకించి పోయాడు.. తాను చూస్తోంది కలా ? నిజమా ? తన కళ్ళను తానే నమ్మలేకపొతున్నాడు. ఇప్పుడు ,అతడికి తాను నమ్మి కొలిచిన ఇష్టదైవం , ""శ్రీకృష్ణభగవానుని సురుచిర దరహాస సుందర దివ్య మంగళ కరమైన లావణ్యరూపం ""ప్రత్యక్షంగా దేదీప్యమానంగా అగుపించింది. !ఆనందం పాలపొంగులా వెల్లివిరిసింది !.ఆనందభాష్పాలు కళ్ళవెంబడి కట్టలు తెంచుకొని రాసాగాయి-!వెంటనే కృష్ణుని పాదాలపై బడి పరమానంద హృదయంతో ప్రణమిల్లాడు ! అతడి ప్రగాఢమైన భక్తి తత్పరతకు మెచ్చి కృష్ణుడు విగ్రహం నుండి సచ్చిదానంద ఘన స్వరూపంతో కదలి వచ్చాడు కృష్ణుడు. తన భక్తుడిని రెండు చేతులతో పైకి లేవనెత్తి దగ్గరకు తీసుకొని .సముదాయించాడు ! ". స్వామీ !నాకు ఇన్నాళ్లు మీ ఈ అలౌకిక దివ్యమంగళ సుందర విగ్రహ దర్శనం ఎందుకు ఇవ్వలేదు ? అంటూ ఆర్తితో అలపిస్తున్న తన ప్రియభక్తుడిని ఓదారుస్తూ. అతడి కంట జాలువారుతున్న కన్నేటిధారలను తన చేతితో తుడుస్తూ , చిరునవ్వుతో ఇలా జవాబు చెప్పాడు.!. చూడూ!. నీవు నీ జీవితంలో నన్ను త్రికరణ శుద్దిగా నన్ను సేవించావు. అది నాకు పరమానందాన్ని కలిగించింది సుమా ! అదే భావంతో నన్నే స్మరిస్తూ. నీ గుండెను గుడిగా జేస్తూ అందులో నారూపమే ప్రతిష్టించి ".నీవే నేను ""గా భావించి అమితమైన అత్మానందం పొందావు ! ఇంతగొప్పగా నన్ను ఆరాధించావు ,కదా ,నన్ను ! కానీ నీకోసంగానీ ,నీవారి కోసం గానీ , ఎప్పుడూ ఏదీ కోరుకుండా. నిష్కామంగా కేవలం నా ప్రేమతో జీవించావు..నిజంగా నాకే సిగ్గేసింది సుమా. నన్ను తప్ప మరేమీ కోరని నీకు నీకు ఏమివ్వాలో తెలియక నీవు కోరక ,,..ఏ మొఖం తో నీఎదుట నిలబడను చెప్పు !!? అందుకే నీకు కనపడలేక పోయాను అంతే ! కానీ నీ భక్తి విశ్వాసంలో ఏ పొరబాటు లేదు ! తప్పు నీది కాదు నాది !..ఇక ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటావా. ? ఇందాక నీవు ఆలయం బయట కుష్టువ్యాధితో బాధపడుతున్న కుష్ఠురోగి కి ,,ఇన్నాళ్లు కష్టపడి నీవు సంపాదించిన పుణ్యము ధారపోసి అతడిని పునర్జీవితుడిని ,,సంపూర్ణ,ఆరోగ్యవంతుడిగా చేశావే ! నీ అచంచలమైన భక్తికి అవ్యాజమైన నీ ప్రేమ కు కదిలి వచ్చాను . ,నిష్కామంగా నన్ను ఆరాధించే నీ భక్తిప్రపత్తుల వలననే నన్ను ప్రత్యక్షంగా ఇలా దర్శించే మహాభాగ్యాన్ని పొందగలుగు తున్నావు సుమా ! నేను పెట్టిన పరీక్షలో నెగ్గావు. ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా ,ఇలా కృష్ణభక్తిని విడవకుండా కృష్ణప్రేమ తో,జీవించి. నన్ను మెప్పించి రప్పించి దర్షింప జేసుకొని తరించావు !... తనకంటూ ఏమీ కోరకుండా ఇతరుల యోగక్షేమాలకోసం నీలాంటి భక్తులుచేసే ప్రార్థన నిజమైన నిష్కామ భక్తిని సూచిస్తుంది !. నీ ఈ నిశ్చలమైన కృష్ణ ప్రేమ కృష్ణ భక్తులకు మార్గదర్శనం కాగలదు. ! మానవజన్మ ను సార్ధకం చేయగలదు ! నీ జీవన్ముక్తి తో నీవు నా పరందామాన్ని చేరగలవు .. ! జయం ! శుభం !" అంటూ దీవించి అంతర్ధానం అయ్యాడు శ్రీకృష్ణ పరందాముడు ! భక్తుడు తన భాగ్యానికి శ్రీకృష్ణ సందర్శన సౌలభ్యానికి సంతోషిస్తూ ,కన్నయ్య లీలలను వేనోళ్ళ పొగుడుతూ, ఆ కృష్ణభక్తుడు తన శేషజీవితాన్ని శ్రీకృష్ణ చరణ కమలాల సేవకు అంకితం చేస్తూ ,తరించాడు ! . జై శ్రీకృష్ణ !జైజై శ్రీకృష్ణ ! జై శ్రీ రాధే ! జై శ్రీ కృష్ణ ! గోపాలకృష్ణ భగవానుని కీ జై ! సర్వే జనాః సుఖినోభవంతు ! స్వస్తి !!
Wednesday, January 2, 2019
శ్రీకృష్ణ భక్తుడు
Subscribe to:
Post Comments (Atom)
మహాదేవ అంటేనే చాలు
June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...
-
Jul 17, 2019 Dallas నిన్న మంగళవారం, డల్లాస్ నగరంలో, మధ్యాహ్నం హనుమాన్ దేవాలయం లో, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ భక్తులకు దర్...
-
Mar 20, 2019 రామాయణం మహాకావ్యం అయ్యింది కేవలం త్యాగధనుల జీవన విధానం వల్లనే..! ముఖ్యంగా అయోధ్యా కాండ లో కైకేయి నుండి ఈ త్యాగ గుణాన్ని గమనించ...
-
Feb 18, 2020 ""నిజమైన శత్రువు !" _______&______ "మనలో నిరంతరం ,కనపడ కుండా , ఉంటూ , ఆరోగ్యం ,అనందం ,ప్రశాంతత లేకు...
No comments:
Post a Comment