Wednesday, January 2, 2019

నిద్ర అంటే ఏమిటి ?

Dec 26, 2018
నిద్ర అంటే ఏమిటి ? చక్కని చిక్కని ప్రశ్న .! ప్రతీ ప్రాణికి అనుభవం లో ఉన్న  చిక్కు ప్రశ్న ! నేను నాది. అనే అస్తిత్వం కోల్పోయే నిద్రావస్థలో శరీరాన్ని కూడా త్యాగం చేస్తున్న బహు చిత్రమైన  దేహావస్థ ! 24 గంటల్లో 3వ వంతు చొప్పున  ఇలా  హాయిగా అదమరచి నిద్ర పోడానికి ,,జీవిత కాలంలో సుమారుగా. మూడవ వంతు ఖర్చు అవుతోంది..నిద్ర అంటే విశ్రాంతి.. దేహానికా. మనసుకా అన్నది మరో చిక్కు ప్రశ్న.. !  నిద్ర అనే ఆనందాన్ని భగవన్తుడు అనుగ్రహించాడు కనుకనే జీవిత కాలం పొడిగింప బడి సంతోషాన్ని సంతృప్తిని పొందుతున్నాము.. నిద్ర కు నిర్వచనం ఒక్కటే.. బాహ్యములో ఇందాక చూసిన వస్తువులను గుర్తించలేక పోవడమే నిద్ర ! నిద్రించిన వారికి బయట లోకంతో సంబంధమే లేకుండా పోతోంది.. ఒక్కోసారి అదే శాశ్వత నిద్రకావచ్చును.. ఒక్క రాత్రి యందే కాదు.. ఎప్పుడు ఎక్కడ ఎంతసేపు నిద్రించినా కూడా బయట ప్రపంచం తో సంబంధాలు కట్ !  అందరికి అంతే.!  ఇప్పుడు అసలు ప్రశ్న వేసుకుందాం ! మనలో ఆత్మ ఉందా.. దేవుడు అంతర్యామి రూపంలో ఉన్నాడా.. అనే ప్రశ్నలకు ఉన్నాడు అని సమాదానం చెబుతాం.. ఆత్మను దేవుడిని చూడగలమా.. అంటే చూడలేము అని అంటాము.. అవే కాదు కామము క్రోధము మోహము ఈర్ష్యా. అహంకార మమకారాలు కూడా ఇదే దేహంలో కాపురం ఉంటున్నాయి.. వీటిని చూడగలమా  అంటే.. మళ్ళీ చూడలేము అని జవాబు చెప్పవలసి వస్తోంది.. వీటిని రాత్రి చూడలేము పగలు చూడలేము... మరి చూడలేని దేహావస్థను నిద్రపోవడం అంటున్నాం కదా. మరి మన జాగృతావస్థ ను అంటే పగలు అంతా మేల్కొని ఉండే  దేహఅవస్థ ను  నిద్రలో ఉన్నట్టే అనవచ్చును కదా... అందుకే నిద్ర అనే పదానికి అజ్ఞానం అవిద్య అని చెప్పుకోవడం సరియైన నిర్వచనం అవుతోంది.! అజ్ఞానాంధకారాన్ని రూపుమాపాలంటే నారాయణ మంత్ర జపం చేయాలి. అనగా పరమాత్మ ను స్మరించాలి.. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, భక్త సులభుడు. సర్వాంతర్యామి ,పూర్ణుడు సృష్టి స్థితి లయ కర్త విశ్వాంతరాత్ముడు ,జగదీశ్వరుడు అయిన   ఆ పరందాముని ఆశ్రయించడం వలన పరమాత్ముని కి దగ్గర కావచ్చును. చుట్టూరా మనల్ని ఆకర్షించి వశపరచుకునే ప్రకృతి శక్తిని దైవారాధన వల్లనే ఎదురించగలం.  ఈ చిత్తశుద్ధి కలగకపోతే ,రాత్రే కాదు ,పగలే కాదు ,,జీవితమంతా నిద్రావస్థలో గడపాల్సి వస్తుంది...లేదంటే, ప్రకృతి లోని విషయాలతో విషాన్ని చిమ్ముతూ ఇంకా ఇంకా అజ్ఞానాంధకారాన్ని పెంచుతూ ,.  ఎప్పుడూ జనన మరణ వలయాలలో  త్రిప్పుతూనే ఉంటుంది . , మనలో ఉండి మనలను నడిపిస్తున్న అంతర్యామిని జీవాత్మను చక్కని జ్ఞానమార్గంలో నడిపించుకుందాం. నిద్రపోకుండా అంటే. నారాయణ నామ వైభవాన్ని మరవకుండా అంటూ., సత్సంగము తో  చక్కని భావ సంపదతో పరమాత్ముని తో అనుబంధం ఏర్పరచు కుందాం.. మనలో ఉన్న జ్ఞానాన్ని పండించుకొంటూ పరమేశ్వరుని అనునిత్యం ,అనవరతం స్మరించుదాం  ఉత్కృష్టమైన మానవజన్మ ను సార్ధకం చేసుకుందాం..  నందనందనుని మరవకుండా విడవకుండా ఉండే ప్రజ్ఞని ,వివేకాన్ని ,ప్రసాదించమని  దేవదేవుని ,వేణుగోపాలుని, అపద్భాందవుని వేడుకుందాం. శరణు నారాయణా. వాసుదేవా..అంతర్యామి.. నటన సూత్రధారీ.. శరణు శరణు శరణు

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...