Tuesday, April 16, 2019

సాయి దత్త భగవానుడు

April 16
సాయి దత్త భగవానుడు 24 ప్రాణులను గురువులుగా స్వీకరించడం , మనకు తెలిసిందే, పక్షులు, క్రిమి కీటకాలు, జంతువులు, చెట్లూ, ప్రకృతి, ఇలా ఆయనకి , అవి తమ జీవితాలను సక్రమంగా,నడిపే సహజమైన గుణం ఒక గుణపాఠం బోధిస్తూ ఉంది కానీ ఆ జాబితా లో మనిషికి స్థానం దక్కలేదు, ఎందుకంటే అతడికి ఉన్న అహంకార మమకారాలు జ్ఞాన పిపాస లకు అతడిని దూరం చేస్తున్నాయి, , ఇలాంటి దురభిమానం లేని జంతువు , కుక్క ఒకటి!  అందు కే శునకం , దత్త మహాశయులకు  ఒక బోధ గురువు, అయ్యింది ,, విచిత్రంగా !  తనకు ఇంత  పిరికేడంత అన్నం పెట్టిన యజమాని పట్ల , ఆ కుక్క చూపే విశ్వాసం, తో, అతడికి గురువు అయ్యింది,, ఇతడి సంరక్షణ తన బాధ్యతగా, ప్రాణం పోయినా సరే, ఆ ఇల్లు విడిచి వెల్లకుండా కాపలాదారు లా 24 గంటలు ఆ యజమాని ఇంటికి కావ లి కాస్తు, ఇంటిచుట్టూ , తిరుగుతూ ఉంటుంది. , అలాంటి విశ్వాసం, నమ్మకం , కృతజ్ఞతా, దేవుని పట్ల మానవ జాతికి ఉండటం లేదు,, మనిషికి జన్మతో బాటు,  ప్రకృతి  సంపదలు,, బందువులు బలగం , అస్తి ఐశ్వర్యం, విజ్ఞానం మేధస్సు, మాట్లాడే శక్తి, ఆలోచించే వివేక జ్ఞానం, మంచి చెడూ, పాపం పుణ్యం, సత్యం ధర్మం, వివేచనా శక్తి,, ఆనందంగా అనుభవంచడానికి వనరులు,, సూర్యునితో శక్తి, చంద్రునితో ఆయువు , ఆరోగ్యము, ఇలా జననం నుండి మరణం వరకు ఉపయోగించి సంతోషకరమైన జీవితం గడపడానికి భగవంతుడు తన అనంతమైన కృపచే అనంతమైన ఆనందాన్ని ఎన్నో సమకూర్చి మనిషికి అందిస్తూనే ఉన్నాడు,, అలా తనకు  ఇన్ని చేస్తున్న  అన్నదాత, ప్రాణా దాత జీవన దాత, జ్ఞాన దాత, అయిన ఆ సర్వాంతర్యామి కి ఈ మనిషి ఎన్ని సేవలు, పూజలు , భజనలు , యజ్ఞాలు యాగాలు,చేసినా ఆ పరమాత్ముని కృపకు బదులు చెప్పే సామర్ట్యం కలిగినా ? , అతడు ఇచ్చిన వాటితోనే అతడికి మహా ప్రసాదంగా , నైవేద్యంగా ఇవ్వడానికి ఈ మనిషికి చేతులు వచ్చేనా ! మనసు కలుగేనా ! తీరిక , ఓపిక ఉండే నా,, అసలు ఆ మార్గంలో ఆలోచించే ప్రయత్నం చేసేనా ! ప్రతిరోజూ ఉదయం లేవగానే, తనకు విశ్రాంతి అనే నిద్ర ను పరమ ఔషదంగా అనుగ్రహిం చి, తిరిగి నూతన ఉత్సాహంతో పని చేసే శక్తిని, ఆరోగ్యాన్ని, అదృష్టాన్ని ప్రసాదించిన ఆ పరందామునికి కృతజ్ఞతా పూర్వకంగా తన రెండు చేతులూ పైకెత్తి, తూరుపు కొండల్లో ఉదయించే ఆ కర్మసాక్షి,సూర్యభగవానునికి , భక్తి వినయ పూర్వక నమస్కారాలు పెట్టేనా,,? దోసిలి తో నీళ్ళు తీసుకొని,, ప్రత్యక్షంగా రోజూ ఆగుపించే ఆ ఆదిదేవుని కి అర్ఘ్యం సమర్పయామి అని ఇన్ని నీళ్ళు విడిచేనా,, తాను అనుభవించే ఈ మానవ జీవితం అతడి ప్రసాదం, భోగ భాగ్యాలు అతడు ఇచ్చిన వైభవాలు మరి కుక్క తన యజమానికి  చూపిస్తున్న  విశ్వాసం తన యజమాని పట్ల తాను ప్రదర్శించే ది అతడు ఇచ్చిన సొమ్మును అతడికే ఇవ్వడానికి ఇంత ఏడుపు ఎందుకు,,? తీరేదెప్పుడు, జ్ఞానోదయం కలుగేదెప్పుడు ,,, అందుకే మనిషి కంటే కుక్క నయం,,,! బుద్ధి లేని కుక్కని నమ్మవచ్చు ను,, కాని విజ్ఞానం కలిగిన మనిషిని నమ్మలేము కదా,, ఎక్కడ?, ఎప్పుడు,,?, అలాంటి జంతువులు దత్త భగవానుని కి గురువులై అతడి కృపకు నోచుకున్నాయి ,, నాలుగు వేదాలు, నాలుగు శునకాల రూపంలో, అతడి చుట్టూ పరిభ్రమిస్తూ, సేవిస్తూ, తరిస్తాయి, ఇలా మనిషి దృష్టి లో, చీ చీ పాడుకుక్క అని మనిషిచే చీద రింప బడే, శునకం, భగవంతుని దృష్టిలో, ఉదారమైన ఉన్నత స్థానాన్ని సంపాదించి జాతికి గౌరవాన్ని తెచ్చి పెడుతున్నాయి,, అయినా, పరమాత్మ కరుణించి, మనిషికి అద్భుతమైన రెండు వరాలను సద్వినియోగం చేసుకొని, తరించడానికి ఇచ్చాడు, ఒకటి మాట్లాడే శక్తి, రెండవది, ఆత్మజ్ఞానం,, విశ్వంలో అణువణువు నిండి ఉన్న పరమేశ్వరుని వైభవాన్ని గుర్తిస్తూ,నోటితో  , అంటూ, సకల ప్రాణికోటి లో దర్శిస్తూ, లోనున్న ఆత్మ జ్ఞానం తో అంతర్యామిగా శరీరం అంతటా ఉండి వెలుగుతూ, జీవాత్మకు, పరమాత్ముని అనుసంధానం చేస్తూ, బ్రతుకును పండించడు, మహా భాగ్యం గా భావిస్తూ జీవిస్తూ, అనుక్షణం, అనవర తం, అనుదినం, ఆత్మ సాక్షాత్కారము చేసుకునే అవకాశం భగవంతుడు మానవ జాతికి అనుగ్రహించాడు, మనిషి కూడా రెండు కాళ్ళ జంతువే అవుతాడు,, నీళ్లలో చేప వలె అనుక్షణం  అప్రమత్తంగా   ఉంటూ,ప్రమాదాలను అరికట్టాలి, వనం లో స్వేచ్చగా సంచరించే జింక మృత్యువు ఏ వైపు నుండి సమీపిస్తున్న  దొ అన్న ప్రాణభయం తో, జాగ్రత్తగా   ఉంటుంది, చెట్టు నిస్వార్ధంగా తన కర్రతో బాటు, పూలు, కాయలు పండ్లు, అన్నీ తనకోసం ఉంచుకోకుండా, ఇతరులకు పంచివేస్తు  ఉదారత ను చాటుతూ ఉంటుంది,, నదీ నదాలు తమ స్వచ్చమైన తీయని జలాలతో పంటలు పండిస్తూ, ప్రాణికోటికి జీవనాధారంగా నిలుస్తోంది.. అలా అన్నింటిలో  దైవాన్ని గుర్తించే అవకాశం వినియోగించు కొకపో తే, మనిషికి ఉన్న జ్ఞానం వ్యర్టం అవుతోంది కదా ,! అందుకే  మనసున్న మనిషిగా , మూడవ కన్ను,, జ్ఞాననేత్రం తో, ఉన్న  అంతటా ఉన్న,సర్వాంతర్యామి నీ దర్శిస్తూ, దైవం పట్ల విశ్వాసాన్ని, శునకం లా ప్రకటించాలి,!, ఏదో ఒకటి ఎప్పుడూ,వదిరే ఈ నరం లేని నాలుకతో, నియంత్రిస్తూ ,మంచిని మాత్రమే మాట్లా డాలి,! తిట్లూ, దుర్భాషలు, కోపం, రాక్షసత్వం లాంటి ఘోరమైన శబ్దాలు రాకుండా, హరినామ సంకీర్తన, లతో, సత్వ గుణ ప్రధానంగా వాడుకోవాలి,,! సృష్టిలోని ""జంతువులు , సకల ప్రాణికోటి సమానం "" అని భావించే దైవీ భావన కలగాలి,!, అన్ని ప్రాణులలో దైవాన్ని చూడ గలగాలి,! నారాయణా,! పరమేశ్వరా,! మాలో ఉన్న అహంకార మమకారాల ను నియంత్రించే శక్తి నీ అనుగ్రహించు, స్వామీ ! నిన్ను గుర్తించే యోగ్యతను మాలో  పెంచు,, తండ్రీ! తమ ధర్మాన్ని , జీవన శైలిని తూ చా తప్పకుండా పాటిస్తూ జీవించే జంతువుల వలె, మానవు డు కూడా  ఎందుకు బ్రతుకు తున్నాడో, బ్రతుకు పరమార్థం తెలుసుకోకుండా,,, అసలు తాను ఎవరో, ఎక్కడినుండి వచ్చి ఎక్కడికి పోతున్నాడో, ఆత్మ పరిశీలన చేయకుండా యాంత్రికంగా ,, జీవితం గడుపుతూ ఉండటం  గమనార్హం . దేవాదిదేవా, అల్పులం అజ్ఞానులం అ మాయకులం తెలిసీ తెలియకండా చేసిన అప రాధాలను దయతో , క్షమించు; స్వామీ  !శరణు ,! శరణు! శరణు!""హరే కృష్ణ హరే కృష్ణా. !"

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...