Sunday, April 14, 2019

రామాయణం ఎందుకు చదవాలి ?

" రామాయణం ఎందుకు చదవాలి ,,?" ఈ ప్రశ్న మనం  తరుచూ  వేసుకోవడం  ఉత్తమ లక్షణం,! మన బ్రతుకు ఎలా ఉండాలో , కుటుంబం లో ,సమాజం లో వ్యక్తిగతంగా కూడా ఆదర్శం గా ఉండటానికి , రామాయణం  అర్హత లు, అవశ్యకత లను సూచిస్తోంది, శ్రీరాముడు మానవుడుగా జన్మించడం, కేవలం రావణా ది రాక్షసుల సంహారాని కి మాత్రమే కాదు,, అతడు మనం ధర్మబద్ధంగా జీవితం గ డిపడాని కి తన నడవడి ద్వారాి  మార్గదర్శనం చేశాడు,! రాముడు సాక్షాత్తు విష్ణువే,! సందేహం లేదు ! కాని ఎక్కడ కూడా తాను "దైవాంశ సంభూతుడు" అని ప్రకటించలేదు, సాధారణ మనిషి లా , సామాన్య జీవితం గడిపాడు, మనలాగే  10 నెలలు తల్లీ గర్భంలో ఉండి , వచ్చాడు, ఏ మహత్తులు చూపలేదు, కృష్ణుని లా! సహజంగా మనిషికి ఉండే సుఖము. దుఖము, కోపము, ఈర్ష్య,, అహంకార మమకారాలు ఉండే కుటుంబ సభ్యుల మధ్య ఉంటూ ధృఢ చిత్తంతో, చెదరని చిరునవ్వు తో, అకుంఠిత విశ్వాసం తో, పెద్దవారి పట్ల వినయ విధేయతలతో, గురువులా పట్ల శ్రద్ధాభక్తులతో ,, సకల గునాభిరాముడై , జగదభి రాముడై, సీతా మనోభి రాము డై, అయోధ్యా పురవాసులకే గాక, అటు వానరులకు ఇటు రాక్షస జాతికి ఆరాధ్య దైవంగా భాసిల్లి,యుగయుగాల కూ దర్మావ తారుడుగా , ఆపదో ద్దారకుడుగా , సంసార భవ సాగర తారకుడిగా, , మానవజాతికి సంక్రమించిన మహోన్నత సుందర దివ్యమంగళ. విగ్రహ దర్శనం తో మనలను తరింపజేస్తున్నాడు శ్రీరామ చంద్ర ప్రభువు ! మనం విద్యార్జన చేస్తున్నట్టే రాముడు కూడా . గురువు వద్ద విద్య, ,అభ్యసించాడు గురుకులం లో,,, అలాగే యుక్తవయసులో , పెద్దవారి సమ్మతితో, వేదమంత్రాల సాక్షిగా సీతతో వివాహం, జరిగింది, పాపం  అడవిలో కష్టాలు, ప్రారంభం,! దుష్ట రావణుడి వల్ల ,అపహరింపబడిన భార్య కోసం  కన్నీరు మున్నీరుగా ఎడవడం,! మన ఇంటిలో వలెనే రాముడికి  కుటుంబంలో ఇబ్బందులు, మానసిక సంఘర్షణకు లోనూ కావడం, తలి దండ్రులకు సోదరులకు  దూరం కావడం , ఎందరో అభిమానుల తో బాటు అడుగడుగునా శత్రువులు భయపెట్టడం ,, సీత ను కోల్పోయిదీనుడి వలె , అడవిలో పిచ్చిగా తిరగడం చెట్టుకు గుట్టకు విలపిస్తూ ఉండటం, ఇంకా ఎన్నో అవమానాలు ,! భరింపరాని  అపనిందలు!, అడవిలో క్రూర రాక్షస సంచారం తో బాటు ,, వారి సహవాసం ,!ఒకటి కాదు, రెండు కాదు, 14సంవత్సరాలు కఠిన వనవాస దీక!్ష, భార్యతో సహా బ్రహ్మచర్య వ్రతం,! నారచీరలు, !ముని వేషం,! కంద మూలాలు ఆకులు అలముల ఆహారం !నేలపై శయనం, !చన్నీటి స్నానం! చక్రవర్తి కావాల్సిన వాడు కూడా, విధి విధానానికి తల ఒగ్గి,,, ఇవి తన గతజన్మ కర్మ ఫలితాలు గా ,అనుభవించాడు , స్థితప్రజ్ఞత తో, బంధాలకు అనుబంధాలకు తావు ఇవ్వకుండా, గీతలో చెప్పినట్టుగా, కర్తవ్య నిర్వహణ ను నిబద్దత తో నిర్వర్తించాడు , సీతా రాముడు,, అందుకే, పురుషులు రాముని ధర్మ నిరతను , స్త్రీలు సీతా మహాసాధ్వి ,,, పతివ్రతా ధర్మం ద్వారా ఒక మంచి కూతురు, భార్య, కోడలు,, వదిన,, ధర్మాచరణ లో నిష్ట, అనురక్తి,, భర్త అనురాగం పై ఇల్లాలు కు ఉండాల్సిన అచంచల విశ్వాసం కూడా  నేర్చుకొని ఆచరింప దగిన దర్మాలే ! వారు పడినవి, సగటు మనిషి పడే కష్టాలే, !కాని  తేడా ఒకటే ఉంది, !అదే జ్ఞానం,; మనిషికి ఉండే మూడవ నేత్రం జ్ఞాననేత్రం దానితో రాముడు, వశిష్ట విశ్వామిత్ర, ఋషుల వద్ద వేద, అస్త్ర విద్యలు క్షుణ్ణంగా నేర్వడం, రావణాసురుడు లాంటి బ్రహ్మవేత్త, మహా శివ భక్తుని ఎదుర్కోడానికి అవసరమైన  అసాధారణ బ్రహ్మచర్య దీక్ష, అడవుల్లో తిరుగుతూ, కష్టాలు ఎన్ని ఎదురైనా అద్భుతమైన ఆత్మ స్థైర్యాన్ని  , ఆత్మ విశ్వాసాన్ని  మానసిక శారీరిక మనో బలాన్ని పెంపొందించు కున్నాడు రాముడు,,! పరోపకార , శరణాగత వత్సల, ధర్మం తో సుగ్రీవుడు లాంటి వానరులను, విభీషణుడు లాంటి రాక్షసుని, జటాయువు వంటి పక్షులను కూడా కటాక్షించాడు , "రామో దర్మవాన్ విగ్రహ!", అలా  రాముని సుగుణాలను మనం కొన్నింటినైన ఆచరించవచ్చును , రామునిపై  చూపే భరత లక్ష్మణ శత్రగ్నుల  అవ్యాజమైన అద్భుతమైన సోదర ప్రేమ, మనకు అన్వయించి  జీవితం ఆనంద మయం చేసుకోవచ్చు ను, తండ్రీ తల్లులపై  రామునికి కల  భక్తి, ప్రేమ , గురి, విశ్వాసం మనలో సరి చూసుకోవచ్చు ను ,, భార్యా భర్తల అనుబంధం సీతారాముల జీవన విధానం చూసి నిత్య జీవితంలో ఆచరించ వచ్చును,, !సుగ్రీవునితో మిత్ర ధర్మం!, హనుమ తో ఆత్మ బంధుత్వం,! విభీషణుడు కి సహాయకుడిగా , ఇలా ఒక మంచి  భర్త ,!అన్నయ్య, ! పుత్రుడు ,! స్నేహితుడు,! గురువు, అల్లుడూ,, సహచరుడు, నాయకుడు, వీరుడు, జ్ఞాని,, దైర్య పరాక్రమ శాలి, ధర్మాత్ముడు, సత్య నిష్ట కలవాడు, వేదశాస్త్ర సమ్మతమగు ఆచరణ పద్ధతులు, చేసేవాడు, సమర్థుడు, ఇలా  మనిషికి కష్టాలు వచ్చినపుడు, ధర్మం తప్పకుండా, మాట పోకుండా,, సమాజ హితంగా, రాముడు ప్రదర్శిం చిన  ఎన్నో రకాల అద్భుతమైన పనులను మనం కొంతలో కొంత అయినా అమలు చేసుకోవచ్చును,, శాస్త్రాన్ని వేద వాక్యాన్ని  రాముడు తూ చా తప్పకుండా పాటించాడు, ధర్మం యొక్క విశిష్టత గురించి అందరకు చెప్పాడు కూడా,,,! ఒక  నరుడి గా తండ్రీ కే కాకుండా, జటాయువు పక్షికి 12 రోజులు  శ్రాద్దా ది కర్మలు చేయడం, వాలిని కూ ల్చి అతడి కొడుకు అంగదుడు చే, రావణుడి కి విభీషణుడు చే శాస్త్ర ప్రకారం పిండ ప్రధానాలు చేయించడం  చూస్తే శాస్త్ర విధానాల పై రామునికి గల అపారమైన విశ్వాసం, చూపుతూ, మనం కూడా మన పితృదేవతలకు  అంత్యేశ్టి లాంటి కర్మ కాండలు నిర్వహించి వారికి సద్గతులు కల్పించడానికి మన వంతు ధర్మాన్ని ఆచరిం చాలి అని శ్రీరాము నీ ఆచరణ నడవడి శీలం, చరిత్ర, రామాయణం చదివి తే , అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ! అందుచేత , మనకు ఉన్న జ్ఞానం తో దైవభక్తి నీ అలవర్చుకుందాం ,,! రాముని గూర్చి తెలుసుకుందాం !, అలా మన బ్రతుకును ధన్యం చేసుకుందాం ! దేవుడిచ్చిన ఈ  మాట్లాడే శక్తితో నిత్యం రామ నామ స్మరణం చేద్దాం,!, అంతా రామమయం !ఈ జగమంతా రామమయం!" అన్న అనిర్వచనీయ మైన ఆధ్యాత్మిక అనుభూతి నీ, రామాయణం వింటూ  స్వంతం చేసుకుందాం!  జై శ్రీరామ్ ,! శ్రీరామ్ జయరామ్ జయ జయ రామ్ ,! స్వస్తి !"""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...