Friday, April 19, 2019

దైవాన్ని ఎలా గుర్తించడం

దైవాన్ని ఎలా గుర్తించడం,,? అన్నది మనల్ని నిరంతరం వేదించే పరి ప్రశ్న  !! మన చుట్టూరా ఉంటూ మనలో శక్తినీ, చైతన్యాన్ని అనునిత్యం నింపుతూ, సకల ప్రాణికోటి మనుగడకు ఆధారం అవుతూ, వాని జీవన చర్యలను నిర్వహిస్తూ, నియంత్రిస్తూ, మనలో అంతర్యామిగా వెలుగుతూ, తాను మాత్రం సాక్షిగా, ఏమీ కానట్టుగా, ఏమీ చేయనట్టుగా జగన్నాటకం సాగిస్తున్న పరమాత్మను  మనం ఎలా గుర్తించాలి? ఉన్నాడు అన్నది నిజం ! కాని , ఎలా ఉంటాడో,ఎక్కడెక్కడ ఏ రూపంలో, ఉంటాడో తెలియదు,! ఇలా ఉంటాడని వేదాలు కానీ, వేయిపడగల ఆదిశేషువు గానీ బ్రహ్మాది దేవతలు చెప్పలేక పోయారు,! ఉన్నాడు అంటే ఉంటాడు,! ఆయన అనంతుడు,! విశ్వరూపుడు,, !నిరాకార నిర్గుణ సచ్చిదానంద ఘన స్వరూపుడు,, !అలాంటి దేవా దిదేవుని రూప గుణ వైభవా లు మహా కవులకు మహా గాయకులకు, ఋషులకు,బ్రహ్మజ్ఞా నులకు కూడా ఎన్నతరంగాని  పరాందాముని సామాన్యు లు పట్టగలరా , ?కనిపెట్ట గలరా!? కాని, పరమాత్మ ఉనికిని మాత్రం  మనం జాగ్రత్తగా ఆత్మావలోకనం చేస్తూ  పసిగట్టగలం,,! ఉదయం లేచామంటే, అర్థం, దైవం కరుణించి మన అయువుకు ఒక రోజును పొడిగించింది అన్నమాట, !ఆరోగ్యంగా సంతోషంగా ఉత్సాహంగా దైనందిన కార్యక్రమాలు చేస్తున్నామని  అనుకుంటే,, అదంతా పరమేశ్వరుని దయ, అని అర్థం కదా !  ప్రభాత వేళ లో వీచే చల్లని పిల్లగాలులు, ఆ గోవిందుని దయ .! బంగారు రంగుల సూర్యభగవానుని  అరుణ కిరణాలు మనల్ని దీవిస్తు న్న భగవంతుని అపార కృపామృత ధార గాక,మరేముంటుంది ! పైన నీలాకాశం, పరిసరాలు పచ్చగా, పూలతో, చెట్లతో, గలగలా పారే సెలయేటి జలదారాలతో పునీతం అవుతూ పులకించి, పరవశించే ప్రకృతి సోయగాలు, ఇదంతా  ఆ సర్వాంతర్యామి చలువ వల్లనే కదా,!, సూర్యోదయం తో జగతికి నవొదయమ్, !ప్రాణులకు శుభోదయం,,! ఎవరీ జగత్తును ఇంత గొప్ప వైభవంగా క్షణ క్షణం మారుతున్న రంగు రంగుల వినూత్న చిత్రకళా రచనా ప్రతిభా పటిమతో  అద్భుత కళా నైపుణ్యం తో,నడిపించగల రు,,, ఆ జగదీశ్వ రుడు  తప్ప,?? ఇ తరులకు  అది సాధ్యమా,,,? అందంగా లేత లేటచివురుతాకులను ,, గులాబీ, మల్లె, బంతి చేమంతి, లాంటి సువాసనా భరిత పరిమళ సుగంధ సువాసనల వెదజల్లు పుష్పాల సౌరభం ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని అనుగ్రహం కాకపోతే, జగతి లో ఈ  తరగని, అందాలు ఎలా వస్తున్నా యో మనలాంటి అల్పులకు సామాన్యులకు  ఊహించ తరమా,? , అందుకే  ""చూడగలిగే కన్నులు ""ఉంటే, దర్శించే తపన, ఆర్ద్రత, భక్తి శ్రద్ధలు అంతరంగంలో కదలాడుతూ ఉంటే, నారాయణుని అంతటా, మనలో కూడా భావిస్తూ, అనుభవించ వచ్చును.!! ఆ బ్రహ్మాండనాయకుని గుర్తించాలని అనుకుంటే,, అతని నామ రూప గుణ గణాలు, స్మరిస్తే, భజిస్తే, పూజిస్తే, సేవిస్తే, భావిస్తే, ఆరాధిస్తే, చాలు, స్వామి  నీ అంతరంగంలో కొలువై ఉంటాడు, !ఇన్ని మాటలెందుకు,? ,నారాయణుడు మనలో ఉంటే నే ప్రాణం ఉన్న శరీర దారులం!, లేదా శవాలమే కదా,, !అనుక్షణం లోన ఉండి ,వెంట ఉండి  ,జననం నుండి మరణం వరకు తోడు ఉండి,మనల్ని  నడిపించేది ఆ అచ్యుతుడే .. కదా! అందుచేత,పరమాత్మను అంతర్యామి గా గుర్తించే యోగ్యతను , స్ఫూర్తిని,కరునించమని కోరుకుందాం ! ఎంత విశ్వాస మో , అంత ఫలితం కదా,,, అందువల్ల చేసే ప్రతీ పనీ, స్వామి దయవల్ల జరుగుతోంది,, కర్తవ్యం మనవంతు,, కాపాడుట అతనివంతు ! నమ్ము చెడ్డవాడు లేడు, అందుకే నమ్ము తూ పరిపూర్ణ విశ్వాసంతో విడవకుండా మరవకుండ భావిస్తూ జన్మను తరింపజేసు కొందాం,,, పుణ్యాత్ములు, పురాణ పురుషులు నడిచిన త్రోవలో నడుద్దాం,, మాటలో మనసులో, మమతల లో శ్రీకృష్ణా భగవానుని చరణారవిందాల ఆశ్రయం  కోరుకుందాం,! ఎదలో, హృదీలో, మదిలో,, బ్రహ్మానందాన్ని కలిగించే భక్తవత్సలుడు,నందనందనుని,, యశోదా కృష్ణుని మనసారా,కొలుచుకుందాం ,, జన్మను పావనం చేసుకుందాం,, హరే కృష్ణ! హరే కృష్ణా   !!!స్వస్తి!

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...