Tuesday, July 23, 2019

అనుకోని సంఘటన

Jul 12, 2019

ఒక అనుకోని సంఘటన జరిగింది నాకు మొన్న ఉదయం కరీంనగర్ లో,!! అదీ, సూర్యునికి అర్ఘ్యం, ప్రతీ రోజు లాగానే,, పితృ తర్పణము చేస్తుండగా.  !" ఎవరికి చెప్పలేదు కాని ఇరుగు పొరుగు వాసులకు మాత్రమే తెలుసు,!! ఈశాన్య మూల లో ఉన్న 20 ఏళ్ల క్రితం నాటి,నీటి సంప్, పై గల సిమెంట్ బి ల్ల మూ ల పై నా కాలు పెట్టడం, అది  చిత్రంగా కదిలి, నేను సంప్ లోకి జారడం, బిల్ల కు వ్యతిరేకంగా ఉన్న మూల నా కుడి చెంప కు తాకి, క్రమంగా కుడి ప్రక్కన జారుతూ, సం ప్ లోకి దిగబడటం,, ఇదంతా, కేవలం ,రెండు సెకండ్ లలో అనుకోకుండా నాకు జరిగిన ప్రమాదం!! , ఫలితం ,, నా కుడి చెంప పై గాటు!, కుడి ప్రక్కన గాయం .;.అదృష్టవశాత్తు ఆ బిల్ల కాలిపై పడలేదు ! , తలకు, నడుముకి, చేతికి, తాకలేదు!, ఎక్కడా,ఫ్రాక్చర్ కాలేదు!, ఏక్సిడెంట్ అంటే ఇలా ,, అనుకోకుండా జరిగేది కదా;!!, ఇది, అలానే అయ్యింది ! ఆ దెబ్బకు , సున్నిత భాగం అయిన చెంప వాచింది కొంచెం ఆ నొప్పికి,!!; కుడి ప్రక్క కొంచెం గీరుకు పోయింది, కూడా!!, బంధువు ఫ్యామిలీ డాక్టర్ వద్ద treatment! తీసుకున్నాను,,! ఇప్పుడు చాలా తగ్గింది, నొప్పి,వాపు,! అంతా. పరమేశ్వరుని దయ కరుణ కదా.! .ఎవరి వల్ల, జరిగింది,! ఏమిటీ కారణం! అలా ఎలా అయ్యింది. లాంటి ప్రశ్నలకు జవాబు లేదు!  , ఇది విష్ణు మాయ అంటే, శివ లీల !! తలచినదే జరిగితే దైవం ఎందుకు చెప్పండి ! అలా అని ,,,జరిగినదే అదే పనిగా తలచితే, మనసుకు శాంతి ఉండదు కదా ! నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు ?" అంటూ 5 నిముషాల పాటు , ఒక చిన్న పిల్లాడిలా నా బావ మరిది కళ్లనీరు పెడుతుంటే,,, నాకు కూడా పొంగిన దుఖం తో బాటు,,,ఆహా!, ఇంతగా తనచే ప్రేమింప బడుతున్న నేను ఎంత భాగ్య శాలిని,? అను కొంటూ ఇంత గొప్ప అనుబంధం ప్రసాదించిన పరమాత్మ కు బదులుగా ఏమివ్వగలను అనుకుంటూ,, నేను కూడా లోన దాగిన దుఖాన్ని, బాధని తనతో పంచుకున్నాను !,,నా బిడ్డ కూడా అంది, "నాకు చెప్ప వద్దా నానా,,? నేను వచ్చే దాన్ని కదా,!""!!అని ; ఏడుస్తూ అడిగింది!. నిజమే చెప్పాలి,! కాని చెప్పలేక పోయాను, దైర్యం చాల లేదు, నాకు ! ఏదో పెద్ద గండం తప్పింది అని , పనులు చేసుకుంటూ ఉన్నాను, ఎందుకు బాధను పంచి వారిని బాధ పెట్టడం,! ముఖ్యంగా, దగ్గర వాళ్ళ కంటే, దూరంగా ఉన్నవారికీ కాస్తా ఎక్కువగా రంధి, ఉంటుంది కదా,; అనిపించి ఎవరికి చెప్పలేదు, నానా,!!,, మనవారు అందరూ సున్నిత హృదయులు,! బాధ పడితే, బాధ పెడితే ఎలా,??, కొన్ని మానసిక బాధలు, ;మరి కొన్ని దేహ బాధలు,;, బాధల ను చాలెంజ్ చేయడానికి ఎప్పుడూ రెఢీ గా ఉండటం ఉత్తమ లక్షణం కదా ! విధిగా చేయాల్సిన పనులకు  ఇబ్బంది కలుగకుండా చూడాలి కదా,! చిన్న గానో, పెద్దగా నో బాధలు లేని వారెవరు మరి!;, దేహ దారులకు ఈ బాధలు అనేవి ఎవరికీ తప్పవు  కూడా!, ఎవరి బాధలు వారికే గొప్పవి,,!! చిన్న వయసు లోనే  భర్తను కోల్పోయిన "వసు""ను అడిగాను ,,"నీ బాధ పెద్దదా, నాదా ?"" అంటే జీవం లేని చిన్న నవ్వు నవ్వింది.! పాపం,! అది పెద్ద గీత, నాది బహు చిన్నది కదా ! అయినా, నా చిన్న తనంలో పడిన నా కష్టాలు లేదా బాధల ముందు ఇది ఏపాటి ది?? ఇదిగో,! ఇలాంటి క్లిష్ట సమయాల్లో నే అత్మ స్థైర్యం, గుండె నిబ్బరం, మనో బలం,, చూపాల్సి ఉంటుంది,! గమ్మత్తు ఏమిటంటే, ఆ శక్తిని ఇచ్చేవాడు కూడా ,వాడే, !ఆ పై వా డే !!! అందుకే, బుద్ధిమంతులు, భక్తులు, జ్ఞానులు, కష్టాలను ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటారు కదా!!, అది నేరుగా దైవానికి దగ్గర చేరుస్తుంది,! నిజానికి ఏ మనిషి కైన, ప్రాణ భయాన్ని మించిన భయం, లేదా కష్టం, బాధలు ఉండవు !! కృష్ణయ్య తోడు ఉండగా, బాధ పడటం దండగ కదా !; హరే కృష్ణ హరే కృష్ణా !!""

No comments:

మహాదేవ అంటేనే చాలు

June 20, 2022 "" మహాదేవ _నమో నమః _!"" _&&&&&-___&&&-&&&_ _ మహే శా _! పాప విన...